ఏకంగా జగన్‌ ఓటుకే ఎసరు పెట్టారు! | Some body Has Applied Form7 For YS Jagan Mohan Reddy To Remove His Vote | Sakshi
Sakshi News home page

ఏకంగా జగన్‌ ఓటుకే ఎసరు పెట్టారు!

Published Tue, Mar 12 2019 10:02 PM | Last Updated on Wed, Mar 13 2019 7:08 AM

Some body Has Applied Form7 For YS Jagan Mohan Reddy To Remove His Vote - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో మరో అక్రమం బయటపడింది. టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టింది. అక్రమార్కులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు మీద ఫారం-7 దరఖాస్తు చేశారు. సాధారణంగా తమకు ఉన్న ఓటును తొలగించాలని ఓటరు ఎన్నికల అధికారికి ఫారం-7 ద్వారా దరఖాస్తు చేస్తారు. వైఎస్ జగన్‌ విషయంలో కూడా ఆయనకే తెలియకుండా టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు.

ఒక మొబైల్‌ నుంచి ఈ దరఖాస్తు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ అక్రమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సమస్య పెద్దదిగా మారుతుందని భావించి బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. స్థానిక తహసీల్దార్‌ ఈ ఘటనపై పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్‌ జగన్‌కు తెలియకుండానే దరఖాస్తు చేసినట్లు విచారణలో తేలిందని తహసీల్దార్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement