ఒకరిద్దరు మంత్రులు భూమి కొన్నారు | one two ministers land purchase in Capital | Sakshi
Sakshi News home page

ఒకరిద్దరు మంత్రులు భూమి కొన్నారు

Published Sat, Mar 5 2016 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

ఒకరిద్దరు మంత్రులు భూమి కొన్నారు

ఒకరిద్దరు మంత్రులు భూమి కొన్నారు

అంతకుమించి ఏ తప్పూ చేయలేదు: మంత్రి పల్లె
అనంతపురం సెంట్రల్: రాజధానిలో ఒకరిద్దరు మంత్రులు వారి స్తోమత మేరకు భూమి కొనుగోలు చేశారని, అంతకుమించి ఏ తప్పూ చేయలేదని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘మా అధినేత కానీ, మంత్రులు గానీ ఏ తప్పూ చేయరు. బినామీలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా ఉంటుంది’ అని వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాజధానిలో తనకంటూ నివాసముండాలనే ఉద్దేశంతో భూమి కొనుగోలు చేసి, పెద్ద కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్‌కు సిద్ధమని, ఉరవకొండలోనైనా, అమరావతిలోనైనా చర్చకు రావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement