Land Purchase
-
పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్‌పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్‌ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్‌లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌లో 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. -
కర్నాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్రను మొదలుపెట్టారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలకోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని ఆరోపించారు. హైటెక్ సిటీ వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు 15 ఎకరాలను రాసిచ్చినట్టు చెప్పుకొచ్చారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చుపెడ్డుతున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని అడిగారు. ఈ విషయంపై దేశంలో ఉన్న అన్ని రాజకీయల పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్ అవినీతిని వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు రేవంత్. -
స్కామ్ సొమ్ముతో భూముల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.64.5 కోట్ల కుంభకోణంపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డబ్బుల్లో అధిక మొత్తం కాజేసినట్లు ఆరోపణలున్న ప్రధాన సూత్రధారి సాయికుమార్ వివాదాస్పద భూములు ఖరీదు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయనే ఈ పని చేసినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు అరెస్టు అయిన 14 మందిలో 9 మందిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్, ఎఫ్‌డీల విత్‌డ్రాలో దళారులుగా వ్యవహరించిన సాయికుమార్, నందూరి వెంకట రమణ, వెంకటేశ్వర్రావు, సోమశేఖర్లతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్ బ్రాంచ్ మాజీ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మజ, మెహినుద్దీన్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీపీ మనోజ్‌కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిపి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. 34 ఎకరాలు, 3 ప్లాట్లు.. ప్రధాన నిందితుడు సాయికుమార్ స్కామ్‌లో తన వాటాగా రూ. 20 కోట్లకుపైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు. ఇతను రూ.5 కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌లో 34 ఎకరాల వివాదాస్పద భూము లు కొనుగోలు చేశాడని, ఆ భూముల పత్రాలను కొందరి వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. ఇవి తక్కువ ధరకు రావడంతో పాటు భవిష్యత్తులో తాను అరెస్టు అయినప్పటికీ ఈ భూములను పోలీసులు స్వాధీనం చేసుకోలేరనే ఇలా చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన వెంకటరమణ కొండాపూర్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్నంలో సుమారు రూ.6.5 కోట్లు వెచ్చించి మూడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందించనున్నట్లు సమాచారం.ఈ కుంభకోణంలో మరికొందరు నిందితుల ప్రమే యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చందానగర్ కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వేగంగా ఈడీ విచారణ తెలుగు అకాడమీలో కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను శుక్రవారమే కోర్టు అనుమతితో తీసుకున్న ఈడీ, శనివారం చంచల్‌గూడ జైల్లో అకాడమీ ఇన్చార్జి అకౌంటెంట్ రమేశ్‌ను ప్రశ్నించింది. బ్యాంక్ ఎఫ్‌డీల నుంచి డ్రా చేసిన డబ్బును ఎవరెవరు, ఎంతెంత తీసుకున్నారు.. తమ వాటాగా తీసుకున్న డబ్బులను ఏం చేశారన్న అంశాలపై కూపీ లాగినట్టు తెలిసింది. కాగా, ఈడీ దర్యాప్తు బృందం సోమవారం బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కెనరా బ్యాంక్‌తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రశ్నించి ఎఫ్డీ సొమ్మును ఎక్కడికి తరలించారన్న సంగతిని రాబట్టాలని భావిస్తోంది. అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సాయికుమార్ తన వాటాగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడన్న అంశాలను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడీ ప్రయత్నిస్తోంది. మరో పక్క ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు వారి వాటాగా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యుల ద్వారా మళ్లించినట్టు సీసీఎస్ తన దర్యాప్తులో స్పష్టంచేసింది. ఆ డబ్బులను హవాలామార్గాల్లో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మేనేజర్లతోపాటు మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. -
పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ
పెదకాకాని : పెదకాకాని మండలంలోని అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. నంబూరు గ్రామ శివార్లలో అగ్రిగోల్డ్ ప్రతినిధులు 2010లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ డీఎస్పీ రామారావు సిబ్బందితో శనివారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ ప్రతినిధులు నంబూరులో సర్వే నంబర్ 175బీలో 2.10 ఎకరాలు, 178లో ఎకరం చొప్పున మొత్తం 3.10 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ భూమిలో 1.60 ఎకరాలను 2014లో వెర్టెక్స్ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారని, అలానే 1.50 ఎకరాలను బొంతు శ్రీనివాసరెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారని గుర్తించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా వివాదాల్లో ఉన్నప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా చెల్లుతాయన్న అంశంపై చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించి బహిరంగ వేలం వేస్తామని సీఐడీ డీఎస్పీ రామారావు చెప్పారు. -
స్టాంపులు దొరకట్లేదు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు కొరత ఏర్పడింది. రూ. 50, 100 విలువైన స్టాంపులు చాలా చోట్ల దొరకడంలేదు. దీనివల్ల స్థిరాస్తుల కొనుగోలు ఒప్పందాలు, ఎంవోయూలు, వివిధ ధ్రువీకరణ, అఫిడవిట్లు, నోటరీలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొరతవల్ల బైట ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ స్టాంపులు తెచ్చుకోవాలని, అయితే ఆ సంస్థకు గత సర్కారు రూ. 17 కోట్ల బకాయి పడినందున సమస్య ఏర్పడిందని సమాచారం. పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ సంస్థకు బకాయిలు విడుదల చేయడంతోపాటు రూ. 115 కోట్లకు స్టాంపులకు ఇండెంట్ పంపించారు. ప్రత్యామ్నాయ మార్గాలున్నా.... గతంలో స్థిరాస్తుల కొనుగోలు, తనఖా ఒప్పందాలకు ఎంత రుసుమైతే అంత చెల్లించి స్టాంపులు కొనుగోలు చేసి దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కాలక్రమంలో స్టాంపుల బదులు ఆన్‌లైన్‌లోనూ, బ్యాంకుల్లో చలానా రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించి రూ. 100ల స్టాంప్ పేపర్‌పై దస్తావేజు (మొదటి పేజీ) రాయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫీజు మొత్తం చెల్లించి తెల్లకాగితాలపై ఫ్రాంక్లిన్ మిషన్‌తో ముద్రలు కూడా వేయించుకోవచ్చు. అయితే స్టాంపు పేపర్లపై దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికే చట్టబద్ధత, భద్రత ఉంటుందనే అపోహ ప్రజల్లో ఉంది. దాంతో ఎక్కువ మంది రూ. 100ల స్టాంప్ పేపర్‌పైనే దస్తావేజులు రాయించుకుంటున్నారు. దాంతో వీటికి డిమాండ్ ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు : ఐజీ స్టాంపుల కొరత లేకపోయినా ఉన్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. ఎక్కడో కొన్ని సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కొరత ఉంటే జిల్లాలోని ఇతర ఆఫీసుల నుంచి పంపించే ఏర్పాటు చేశామని, ఎక్కడా కొరత లేకుండా సర్దుబాటు చేయాలని డీఐజీలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ’సాక్షి’కి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రకాల స్టాంపులు మొత్తం 2.08 కోట్లు ఉన్నాయని, వీటి విలువ రూ. 56.50 కోట్లని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పెద్దనోట్ల రద్దు విషయం వారికి ముందే తెలుసు
పట్నా: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసేముందు బిహార్ బీజేపీ శాఖ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిందని, దీనిపై విచారణ చేయించాలని ఆ రాష్ట్ర అధికార పార్టీలు జేడీయూ, ఆర్జేడీలు డిమాండ్ చేశాయి. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను బీజేపీ కొనుగోలు చేసిందని శుక్రవారం ఆ పార్టీల నేతలు ఆరోపించారు. అక్టోబరు చివరి, నవంబర్ మొదటి వారంలో బీజేపీ ఈ భూములను కొనుగోలు చేసిందని చెప్పారు. బిహార్‌లోని 25 జిల్లాల్లో బీజేపీ భూములు కొనుగోలు చేసిందని స్థానిక హిందీ న్యూస్ ఛానెల్ నిన్న ఓ కథనాన్ని ప్రసారం చేసింది. పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం భూములు కొనుగోలు చేసిందని, ఇందులో బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియాకి ప్రమేయముందని ఆరోపించింది. పాతనోట్లను రద్దు చేయడానికి ముందు బీజేపీ బ్లాక్ మనీతో పెద్ద ఎత్తున భూములు కొనుక్కుందని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర ఆరోపించారు. దీన్నిబట్టి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం బీజేపీ నాయకులకు ముందే తెలుసని అన్నారు. దీనిపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేడీయూ నేత నీరజ్ కుమార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కాగా భూముల కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ఆఫీసుల నిర్మాణం కోసం బీజేపీ తరఫున ఈ భూములు కొన్నామని చౌరాసియా చెప్పారు. -
ఒకరిద్దరు మంత్రులు భూమి కొన్నారు
అంతకుమించి ఏ తప్పూ చేయలేదు: మంత్రి పల్లె అనంతపురం సెంట్రల్: రాజధానిలో ఒకరిద్దరు మంత్రులు వారి స్తోమత మేరకు భూమి కొనుగోలు చేశారని, అంతకుమించి ఏ తప్పూ చేయలేదని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘మా అధినేత కానీ, మంత్రులు గానీ ఏ తప్పూ చేయరు. బినామీలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా ఉంటుంది’ అని వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాజధానిలో తనకంటూ నివాసముండాలనే ఉద్దేశంతో భూమి కొనుగోలు చేసి, పెద్ద కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్‌కు సిద్ధమని, ఉరవకొండలోనైనా, అమరావతిలోనైనా చర్చకు రావాలని సూచించారు. -
పాలమూరు ప్రాజెక్టు భూములు పారదర్శకంగా కొనుగోలు
- రైతులతో గ్రామసభలు నిర్వహించాకే నిర్ణయం - జిల్లా కలెక్టర్ శ్రీదేవి మహబూబ్‌నగర్ టౌన్: పాలమూరు ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమిని రైతుల నుంచి పారదర్శకంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమయ్యే భూమిని డీపీఆర్ నివేదిక ఆధారంగా కొనుగోలు చేయాలన్నారు. ఆ భూములకు సంబంధించిన రైతులతో పలుమార్లు గ్రామసభలు నిర్వహించి, వారిని చైతన్య పరిచాకే కొనుగోలు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్ట్ పనులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే జిల్లాలోని 11నియోజకవర్గాల ప్రజలకు లబ్ధిచేకూరుతుందన్నారు. అదే విధంగా ఆయకట్టు పరిధిలోని అన్ని గ్రామాలకు తాగునీటి సదుపాయం కలుగుతుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పునరావాస పనులు ప్రాజెక్ట్ నిర్మాణంలో భూముల్ని కోల్పోయే వారికి కల్పించే పునరావాస పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. వారికి ఆలస్యం చేయకుండా పరిహారం చెల్లించాలన్నారు. ఈ విషయంలో అధికారులందరూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రాజెక్ట్ నిర్మాణపు పనుల్ని ప్రారంభించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి ఎం.రాంకిషన్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, సర్వేల్యాండ్ ఏడీ శ్రీనివాస్, ఆర్డీఓలు దేవేందర్ రెడ్డి, రాంచందర్, పార్థసారధి, మోహన్ గౌడ్‌తోపాటు, తహశీల్దార్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.