TPCC Revanth Reddy Political Allegations Against CM KCR - Sakshi
Sakshi News home page

కర్నాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్‌: రేవంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Mon, Apr 10 2023 5:57 PM | Last Updated on Mon, Apr 10 2023 6:25 PM

TPCC Revanth Reddy Political Allegations Against CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అలాగే, కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

కాగా, రేవంత్‌ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్రను మొదలుపెట్టారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలకోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని ఆరోపించారు. 

హైటెక్‌ సిటీ వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు 15 ఎకరాలను రాసిచ్చినట్టు చెప్పుకొచ్చారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్‌ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్‌ వందలాది కోట్లు ఖర్చుపెడ్డుతున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు ఎంత? అని అడిగారు. ఈ విషయంపై దేశంలో ఉన్న అ‍న్ని రాజకీయల పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్‌ అవినీతిని వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు రేవంత్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement