
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటించింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు. తాజాగా రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ఈరోజు (ఫిబ్రవరి20)న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్లోంది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.
రేఖ గుప్తా (50) హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. రేఖ గుప్తా(Rekha Gupta) కుటుంబం 1976 సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా. రేఖ గుప్తా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆప్‌కు చెందిన వందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు.
రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపిక కావడంపై బీజేపీ నేత ప్రవేశ్ వర్మ హర్షం వ్యక్తి చేశారు.
ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment