
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు.
ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపు
రేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్
పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగం
మంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలు
రవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖ
కపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్
ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలు
పంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ
Comments
Please login to add a commentAdd a comment