
30 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఆమెను వెంటాడింది. ఐస్‌లాండ్ మహిళా మంత్రి ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ చివరికి తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గతంలో పదహారేళ్ల అస్ముండ్సన్ అనే బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారామె. ఈ విషయంపై ఆ దేశంలో తీవ్ర వివాదం చెలరేగింది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె తన తప్పులను కూడా అంగీకరించారు.
ఐస్‌లాండ్ విద్యా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ మూడు దశాబ్దాల క్రితం ఆమె ఒక మతపరమైన వర్గానికి కౌన్సిలర్‌గా వ్యవహరించారు. అయితే, ఆ సమయంలో ఓ బాలుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.
కాగా, ఐస్‌లాండ్ చట్టాల ప్రకారం.. ఒక మైనర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు. అలాంటివారికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ వ్యవహారంపై అస్ముండ్సన్ బంధువు ఒకరు దేశ ప్రధానికి తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment