వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఏపీదే అగ్రస్థానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పల్లె రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న సమయంలో ఐటీ ఎగుమతులు రూ. 65 వేల కోట్లు ఉందని... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్లో రూ. 1700 కోట్లు ఉందని తెలిపారు.
విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానమవుతుందని పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు.