ఏపీ ప్రజల కష్టాలకు కాంగ్రెస్సే కారణం: పల్లె
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టభద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాయశక్తులా కృషి చేస్తారన్నారు.