
గుంటూరు, సాక్షి: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయ్యిందని.. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్సార్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు.
మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయింది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది. వైఎస్సార్ మీద అంత మమకారం ఉంటే.. ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?.

.. కడపలో బై ఎలక్షన్ వస్తుందని ఎల్లోమీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని పట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడే కూర్చుని ఉంటారని అనడం విడ్డూరం. మహబూబ్ నగర్ గెలిపించుకోలేని రేవంత్.. కడపలో షర్మిలను గెలిపిస్తాడంట. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే విభజననష్టం. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు?..
.. వైఎస్సార్ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ అంతకుమించి చేశారు. ప్రజల గుండెల్లో జగన్ గొప్పగా ఉన్నారు. ఎన్నికల్లో జరిగిన మాయాజాలం గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయినా దాని గురించి ప్రస్తుతం మేము మాట్లాడదల్చుచుకోలేదు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి పొత్తుల కోసం వెంపర్లాడలేదు. మేము పొత్తు లు పెట్టుకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ప్రజాపోరాటాలు చేస్తాం అని రవిచంద్రారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment