ఏప్రిల్‌ 06: ఏపీ ఎన్నికల సమాచారం | AP Elections 2024: Political News In Telugu On April 6th Updates | Sakshi
Sakshi News home page

April 6th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Sat, Apr 6 2024 7:22 AM | Last Updated on Sat, Apr 6 2024 9:08 PM

ap-elections-2024-ap-political-news-telugu-april-6th-updates - Sakshi

April 6th AP Elections 2024 News Political Updates

09:06 PM, April 06 2024
షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్

  • తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసు​కోవాలి
  • ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి
  • జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో
  • పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు
  • జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి
  • ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి
  • తెలంగాణాలో వైఎస్సార్‌ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో..
  • తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి
  • కాంగ్రెస్‌ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే
  • వైఎస్సార్‌ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం
  • తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం
  • కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది

06:25 PM, April 06 2024
అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్‌

  • కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది
  • మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.?
  • మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి
  • ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు
  • పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు
  • పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు
  • మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది
  • జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?
  • అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.!
  • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు
  • బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు
  • ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది
  • బాబు తన మేనిఫెస్టోలో  ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు
  • మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ?
  • చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ?
  • మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.!
  • ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా
  • రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం
  • మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం
  • ఇంటింటికి  పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం
  • లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం
  • నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం
  • వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ?
  • చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా
  • ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు
  • బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు
  • పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా?
  • నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు
  • సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం
  • ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం
  • మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం
  • అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం
  • ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం
  • 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా
  • మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి
  • పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి
  • మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి
  • ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది
  • ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి
  • 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు
  • చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు
  • చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే
  • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ?
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ?
  • ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా?
  • ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ?
  • ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ?
  • రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ?
  • సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ?
  • ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ?

04:42 PM, April 06 2024
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

  • అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు
  • చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి
  • చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు
  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం

04:28 PM, April 06 2024
‘మార్గదర్శి’ పై కేసు నమోదు

  • ద్వారక‌ ‌ పోలీస్‌ స్టేషన్‌లో 188 సెక్షన్ల కింద కేసు
  • ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు
  • ఎన్నికల అధికారులు, ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీం ఫిర్యాదు మేరకు కేసు
  • మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్న పోలీసులు
  • మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను  పై కేసు నమోదు

03:14 PM, April 06 2024
ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు 

  • బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు
  • విశాఖ టికెట్ జీవీఎల్‌కు ఇవ్వాలని కోరిన నేతలు
  • విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన
  • జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు

01:45 PM, April 06 2024
అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి

  • సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్‌లో దాచిన మద్యం పట్టివేత
  • మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా
  • గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ

01:30 PM, April 06 2024
పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం
ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ
మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం

01:25 PM, April 06 2024
రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు 

  • పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
  • సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన
  • చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు
  • ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు

01:20 PM, April 06 2024
చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్

  • చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య

01:15 PM, April 06 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు 

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
  • అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు

12:58 PM, April 06 2024
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు
  • ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు
  • 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు
  • వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు
  • పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు
  • ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు
  • చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు

12:42 PM, April 06 2024
వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు

  • రబ్బరు చెప్పులు వేసుకున్న  వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్‌ మోసం చేశాడు 
  • చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు
  • బీజేపీలో ఉన్న  ఒక్క కాపుకి కూడా చంద్రబాబు  సీటు లేకుండా చేశాడు
  • పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు
  • కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది
  • 31 సీట్లు కాపు లకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చారు
  • బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు
  • అందుకే.. కాపులంతా సీఎం జగన్‌ వెంటే ఉన్నారు

ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు

12:02 PM, April 06 2024
ప్రతీ పేదోడి గుండెల్లో జగన్‌: గుడివాడ అమర్నాథ్‌

  • ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు
  • అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే!
  • మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు
  • సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు
  • సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది
  • సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్
  • సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? 
  • సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు..
  • పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు
  • సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే
  • కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు
  • అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను
  • వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి
  • అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు
  • సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా


 

11:55 AM, April 06 2024
షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్‌రెడ్డి

  • కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు 
  • స్పందించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు 
  • ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా 
  • ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది
  • మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు
  • తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు
  • అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా 
  • మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని
  • కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి
  • మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి

11:49 AM, April 06 2024
టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి

  • సీఎం రమేష్‌ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు
  • సీఎం రమేష్‌ మార్క్‌ రౌడీయిజం మనకు కావాలా?
  • సీఎం రమేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
  • రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట​ కూడా టీడీపీ ఖాళీ అవుతుంది
  • ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది

10:55AM, April 06 2024
కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా?

  • టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం
  • బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్‌
  • నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ
  • మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు?
     

10:37AM, April 06 2024
విశాఖలో జీవీఎల్‌ పోస్టర్ల కలకలం

  • విశాఖలో బీజేపీ నేత జీవీఎల్‌ పేరిట పోస్టర్లు 
  • జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు
  • విశాఖ ఎంపీ సీటు జీవీఎల్‌కే కేటాయించాలంటూ సందేశాలు
  • విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్‌ గళం వినిపించారని.. ఆయనకే టికెట్‌ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు 
  • పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు
  • విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్‌
  • నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం

09:48AM, April 06 2024
ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్‌

  • విజయవాడ పటమట లంక 14వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం
  • ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని,  తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్
  • నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని
  • స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని
  • జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని
  • నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని
  • చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని
  • మేము మాటలు వ్యక్తుల  కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని
  • టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు  సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని

  • రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్
  • స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్
  • అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్
  • నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్
  • రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్
  • ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్
  •  ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్


09:15AM, April 06 2024
చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు

  • నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
  • ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జగన్‌కు స్వాగతం పలికేందుకు సిద్ధం
  • జై జగన్‌ అంటూ.. వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు

08:27AM, April 06 2024
నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్‌ ట్వీట్‌

  • నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • సాయంత్రం కావలిలో వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ
  • ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్‌ సక్సెస్‌

07:54AM, April 06 2024
రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్‌ ప్రారంభం

  • నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన
  • బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించనున్న పురందేశ్వరి
  • రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి
  • నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం
  • ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి

07:32AM, April 06 2024
ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం

  • పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • క్రొసూర్‌, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు

07:17AM, April 06 2024
చుక్కాని లేని జనసేనాని

  • విభజిత ఆంధ్రప్రదేశ్‌కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు.
  • ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్‌ కల్యాణ్‌
  • కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు 
  • బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు
  • మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్‌ 
  • తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం 
  • ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు 
  • చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్‌ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు
  • పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్‌పై

07:04AM, April 06 2024
నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర

  • తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ
  • నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్‌ భేటీ
  • ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర
  • అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టిన వైనం
  • పేదలే స్టార్‌క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్‌
  • పాలనపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్‌
  • మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన
  • ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్‌

06:45AM, April 06 2024
షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా

  • కడపలో పీసీసీ చీఫ్‌ షర్మిల ఎన్నికల ప్రచారం
  • షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • ఈలోపు తొందరపడి అవినాష్‌రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 
  • ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా 

బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు


06:30AM, April 06 2024
ఎల్లో మీడియాపై ఐపీఎస్‌ ఆఫీసర్‌ అసోషియేషన్‌ సీరియస్‌

  • చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
  • పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల వార్నింగ్‌
  • ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి 
  • ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు 
  • దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం 
  • అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం 
  • ‘వీళ్లా ఐపీఎస్‌లు’ కథనంపై మండిపడ్డ చీఫ్‌ సెక్రటరీ..  పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ 
  • తమ కౌంటర్‌ను ‘ఈనాడు’ బ్యానర్‌గా వెయ్యాలని డిమాండ్‌.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల అసంతృప్తి 
  • ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం 
  • రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు 
  • ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? 
  • ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం 
  • ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు  సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్‌.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement