AP Elections & Political March 27th Latest News Telugu..
9:04 PM, March 27th 2024
చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్
- 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం
- నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం
- ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది
- ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు
- వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు
- హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు
- పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి
- దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం
- నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా
- చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు
- మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది
- చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి
- తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై
- చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్
- ఈనాడు పేపర్‌ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది
- చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు.
- వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు
- నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు
- అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు
- ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం
- ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం
- రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు
- పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
7:06 PM, March 27th 2024
పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి
- హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి.
- లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతా: పరిపూర్ణానంద
- ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు.
- పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించా
6:06 PM, March 27th 2024
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
- అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్.
- మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని.
- ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్.
- మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్.
- విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్.
- మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు.
- ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్
5:06 PM, March 27th 2024
‘మేము సిద్దం’ బస్సు యాత్రకు గ్రామగ్రామాన ప్రజల బ్రహ్మరథం
- తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం
- ప్రతి గ్రామానా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
- వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం
- జనసంద్రంగా మారిన యర్రగుంట్ల
- గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యం
- ప్రొద్దుటూరుకు భారీగా చేరుకున్న ప్రజలు
4:58 PM, March 27th 2024
కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- కడప పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- వీరపునాయునిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- కాసేపట్లో యర్రగుంట్ల మీదగా ప్రొద్దుటూరు చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- ప్రొద్దుటూరు బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్
4:34 PM, March 27th 2024
అధికారంలో వస్తే మద్యం ధరలు తగ్గిస్తాం.. ప్రజాగళం సభలో చంద్రబాబు
- నగరి ప్రజాగళం సభలో చంద్రబాబు
- ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు
3:55 PM, March 27th 2024
చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
- అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు
- చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు
- జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు
- అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు
- ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు
- మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు
- వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం
- వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు
- వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది
- వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు
- చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు
- ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు
- ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు
- చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
- ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు
- జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు
3:39 PM, March 27th 2024
నెల్లూరు సిటీలో నారాయణ చేసిన అభివృద్ధి ఓ బూటకం
- మాజీ మంత్రి నారాయణపై వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్ది ఫైర్
- నెల్లూరు సిటిలో నారాయణ చేసిన అభివృద్ధి బూటకం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో నారాయణ.. హడ్కొ ద్వారా 11 శాతం వడ్డీతో 90 శాతం అప్పు తీసుకొచ్చారు.. టీడీపీ ప్రభుత్వం నుంచి సాయం శున్యం
- 830 కోట్లు అప్పు తీసుకుని పనులు కూడా పూర్తి చేయలేని అసమర్ధుడు పొంగూరు నారాయణ.
- 2019లో కేంద్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు, రాష్ట్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ ఉన్న సమయంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు..
- స్మార్ట్ సిటీ జాబితాలో నెల్లూరుని చేర్చి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా నెల్లూరు అభివృద్ధి జరిగేది
- రాజకీయాలకు నారాయణ సరిపోరు.. ఆయనోక అపరిచితుడు.. పని ఉంటే ఒకలా.. పని లేకపోతే మరోలా ప్రవర్తిస్తారు
- రూ 1100 కోట్లతో కేవలం రెండేళ్లలో పెన్నా నది.. సర్వేపల్లి కాలువ రిటైన్ వాల్స్.. పెన్నాపై కొత్త వంతెన వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధి
- నెల్లూరు జిల్లా అభివృద్ధి.. 2007,2008,2009లో వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి మొదలైంది.
3:29 PM, March 27th 2024
‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
- ఈ చిత్రాన్ని లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
- స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం
- వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరణ
- దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
- ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉన్న సినిమా చర్యలు కోరిన లేళ్ల
- తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
1:25 PM, March 27th 2024
ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు
- ఎమ్మెల్సీ ఇందూకురి రఘురాజుపై అనర్హత పిటిషన్
- ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
- శాసనమండలి చైర్మన్‌కి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ విప్ పాలవలస విక్రాంత్
1:20 PM, March 27th 2024
సీఎం జగన్ చేతల్లో చూపించే వ్యక్తి: మంత్రి విశ్వరూప్
- సీఎం జగన్ దేశంలోనే ఎక్కడలేని అత్యుత్తమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అభ్యర్థుల విషయంలో పాటించారు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేశారు
- ఇప్పటివరకు మాటలు చెప్పే నేతలే తప్ప సీఎం జగన్ చేసినట్టు చేతల్లో చూపించే నేతలు దేశంలో లేరు
- సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష
- అమలాపురంలో నియోజకవర్గంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
- ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ కామెంట్స్..
- ప్రతి నియోజకవర్గంలోనూ సీఎం జగన్‌ను జనం అభ్యర్థిగా చూస్తున్నారు
- ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం
1:00 PM, March 27th 2024
చంద్రబాబు, లోకేష్‌కు కొడాలి నాని సవాల్..
- గుడివాడలో ఐదోసారి నేను గెలవబోతున్నాను.
- ఎన్నికల ముందు నన్ను ఓడిచేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారు
- ఎంత మంది వచ్చినా వైఎస్సార్‌సీపీ తరపున హ్యాట్రిక్ కొడతాను.
- గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు.
- నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌కు ఇదే నా సవాల్
- చంద్రబాబు, లోకేష్ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి
- టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది
- నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని.. పూటకో వ్యక్తిని తెచ్చే బ్రతుకులు టీడీపీవి.
- ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చినవాడిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు
- వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు
- చంద్రబాబు ఎంత 420 వ్యక్తి అనేది చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు
- చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు
- ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే.
- గుడివాడలో గెలిచేది నేనే.
- మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది
- మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం
12:45 PM, March 27th 2024
మేమంతా సిద్ధం యాత్ర.. పచ్చ మందలో టెన్షన్!
- మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలకు మధ్యకు సీఎం జగన్.
- సీఎం జగన్ యాత్రలో పచ్చ మందలో టెన్షన్!
జగనన్న మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/29WsfAYt6w
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
12:30 PM, March 27th 2024
లోకేష్ నుంచి అంతే ఆశించగలం: వైవీ సుబ్బారెడ్డి
- సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ వెళ్తే దానికి రాద్దాంతం చేస్తున్నారు
- వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే.
- అందుకే ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తుంది.
- దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్‌కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం.
- బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్‌లకు టికెట్లు ఇచ్చారు.
- వీరికి టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి.
- వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పించింది.
- ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం.
12:10 PM, March 27th 2024
కూటమికి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్
- చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కాడు.
- బోండా ఉమ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్‌కు ఏం చేశారో చెప్పాలి.
- చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు.
- గతంలో నరేంద్ర మోదీ చంద్రబాబుని పెద్ద దొంగ అన్నారు.
- టీడీపీ-జనసేన-బీజేపీ ముగ్గురు దొంగలే.
- సీఎం జగన్‌కు రాష్ట్రంలో జన బలం ఉంది.
11:41 AM, March 27th 2024
ప్రజాగళం.. పలమనేరు బయల్దేరిన చంద్రబాబు
- నేటి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఎన్నికల ప్రచారం
- ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత
- పలమనేరు నుంచి ప్రజాగళం ప్రారంభం
- రోజుకి నాలుగు నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించిన టీడీపీ
- కాసేపటి కిందట కుప్పం నుంచి పలమనేరుకు బయల్దేరిన చంద్రబాబు
11:20 AM, March 27th 2024
కుప్పంలో చంద్రబాబు ఓటమి ఫిక్స్..
- చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదం.
- కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్.
- తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చూలు పెడుతున్నారు.
- చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడడు.
- గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం.
- మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు.
- చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు.
- వైఎస్సార్‌సీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారు.
- టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా?
- చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్ళే పాల్గొన్నారు.
- వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం.
- రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.
- కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇచ్చాము.
- చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది.
- కోర్టును శాసించే హక్కు మాకు లేదూ.
- చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
- కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు?
- చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.
- కుప్పంలో చంద్రబాబు అన్ని వర్గాలను అణగతొక్కారు.
- చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గానికి ఒక్క సీటు అయినా కేటాయించారా?.
11:00 AM, March 27th 2024
టీడీపీ, చంద్రబాబకు దేవినేని అవినాష్ కౌంటర్..
- నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే.
- స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వేసినవి కావా?
- కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం జగన్.
- కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు.
- టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతాం
- కాపు కళ్యాణమండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నాం
- టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు
- స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారు
- ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారు
- తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచు కోటను బద్దలకొడతాం
- నియోజకవర్గంలో బత్తిన రాముతో కలిసి ప్రజల ముందుకు వెళ్తాం
- జనసేన అధినేత పవన్‌ను సైతం చంద్రబాబు మోసం చేశారు
- జనసేన పార్టీపై చంద్రబాబు ఆదిపత్యాన్ని సహించలేకే వైసీపీకి వచ్చానని బత్తిన రాము తెలిపారు
- నియోజవర్గ సీనియర్ నాయకులు యలమంచిలి రవి, బత్తిన రాముతో కలిసి కుటుంబ సభ్యుల్లా నియోజకవర్గంలో పర్యటిస్తాం
- మంచి మెజారిటీతో సీటు గెలిచి ముఖ్యమంత్రి జగన్‌కు బహుమతిగా ఇస్తాం
10:30 AM, March 27th 2024
కూటమికి అభ్యర్థి కరువు..
- అనపర్తిలో కూటమికి అభ్యర్థి కరువు
- అభ్యర్థులు దొరక్క అనపర్తి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్న కూటమి నేతలు.
- బీజేపీ తరఫున అనపర్తిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు లేరు.
- దీంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూటమి నాయకులు
10:00 AM, March 27th 2024
ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్..
- ప్రొద్దుటూరులో మేము సిద్ధం సభ ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు
- ఫ్లెక్సీలను చించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాచమల్లు
- ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచమల్లు.
- సీఎం సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు చించేశారు.
- సభా కార్యక్రమాలను ఆటంకం కలిగే విధంగా ప్రయత్నం చేయడం దుర్మార్గం.
- దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
- వైఎస్సార్‌సీపీ నాయకులను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదంటూ టీడీపీ అభ్యర్ది వరదరాజులరెడ్డి సొదరుడు రాఘవరెడ్డి బెదిరిస్తున్నాడు.
- దీనిపై కూడా ఎన్నికల కమిషన్ కూడా విచారణ చేయాలి.
8:45 AM, March 27th 2024
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ వెంటే ప్రజలు
- నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- జగనన్న వెంట నడిచేందుకు ప్రజలంతా సిద్ధం.
- సీఎం జగన్ రాక కోసం వేచిచూస్తున్న ప్రజలు.
ఎన్నికల సమరానికి తెరతీస్తూ నేడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం🔥#MemanthaSiddham #YSJaganAgain#VoteForFan pic.twitter.com/CTGG2ovhZd
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra.
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW
8:00 AM, March 27th 2024
టీడీపీ, జనసేనకు షాక్
- కోడూరు మండలంలో టీడీపీ, జనసేనకు షాక్
- టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన పది కుటుంబాలు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
- సింహాద్రి రమేష్ బాబు కామెంట్స్..
- పేదలకు ఉపయోగపడే వ్యవస్థలపై చంద్రబాబు నిత్యం విషం చిమ్ముతున్నారు
- శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి గ్రామ వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అని చెప్పటం టీడీపీ తీరుకు నిదర్శనం
- గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారు
- చంద్రబాబుని, పవన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- రాష్ట్ర ప్రజలు జగనన్నకు మద్దతు పలుకుతున్నారు.
- పేదల కోసం చేపట్టిన పనులు అమలు చేసి సీఎం జగన్ సఫలీకృతుడయ్యారు
- సీఎం జగన్ మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు
7:30 AM, March 27th 2024
బాబు, పవన్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఫైర్
- వాలంటీర్లపై టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణం
- వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై భరత్ సీరియస్
- చంద్రబాబు, లోకేష్, పవన్ చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు.
ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై @JaiTDP నేతలు కత్తి కట్టడం దారుణం@ncbn, @naralokesh, @PawanKalyan చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు
— YSR Congress Party (@YSRCParty) March 26, 2024
-రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్#YSJaganDevelopsAP#APVolunteers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/ctYANQ5pu0
7:15 AM, March 27th 2024
నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర..
- ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం.
- ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం
- తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ
- వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర
- ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
- అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి
- రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్
- ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర
- నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహణ
- రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ
- సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు
- 58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు
- 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు
- ఇప్పుడు మళ్లీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం
- మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి
- 99% హామీల అమలు, సుపరి పాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత
- 175 శాసనసభ, 25 ఎంపీ సీట్లు లక్ష్యంగా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్
7:00 AM, March 27th 2024
ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు
- ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ
- రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు
- సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన
- పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ
- కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ
- పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో .
- పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
- బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి
6:45 AM, March 27th 2024
దిక్కుతోచని ‘కూటమి’!
- పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన ఒంగోలు పార్లమెంట్ స్థానం
- అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు.. బీసీ నేతకు బాబు హ్యాండ్
- మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం
- వారికిస్తే మోదీ ఆగ్రహిస్తారన్న సందిగ్ధంలో టీడీపీ అధినేత
- ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి
6:30 AM, March 27th 2024
టీడీపీలో తిరుగుబాటు..
- అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్‌కు ఇవ్వకపోవడంతో నిరసన
- పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతల రాజీనామా
- మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖలు
- పెందుర్తిలో పంచకర్లకు బండారు అనుచరుల సహాయ నిరాకరణ
- టీడీపీ తీరుపై జనసేన నేతల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment