ఏప్రిల్‌ 05.. ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024: AP Political News In Telugu On April 5th Updates | Sakshi
Sakshi News home page

April 5th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Fri, Apr 5 2024 7:00 AM | Last Updated on Fri, Apr 5 2024 9:23 PM

AP Elections 2024: AP Political News Telugu April 5th Updates - Sakshi

AP Political News And Election News April 5th Telugu Updates

09:23 PM, ఏప్రిల్‌ 05 2024
ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆగ్రహం

  • తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్
  • ఈనాడు చీఫ్ ఎడిటర్‌కి లేఖ రాసిన సీఎస్‌
  • ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం
  • సీఎస్ జవహర్‌రెడ్డి ఎలక్షన్ కమిషన్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం
  • అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్‌
  • తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి
  • లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్
  • ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు?
  • ఐపీఎస్ అధికారులు ఏసిఆర్‌లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం
  • రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది
  • ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ
  • రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది
  • అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి
  • అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం
  • ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు
  • అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు
  • తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి
  • లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్‌

09:09 PM, ఏప్రిల్‌ 05 2024
పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్

  • ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం
  • ఐపీఎస్‌లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం 
  • ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం
  • క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం
  • తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్‌ల సంఘం

08:14 PM, ఏప్రిల్‌ 05 2024
పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా?
  • చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు
  • షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు
  • దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు
  • వైఎస్సార్‌ మరణం తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది
  • అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు
  • కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది
  • షర్మిల మాటలకు పొంతన లేదు
  • సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్‌ కూడా నిన్ను క్షమించడు
  • నారా లోకేష్‌కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి
  • మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి.
  • పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు
  • ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్‌సీపీ
  • నారా లోకేష్‌కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్‌ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్.
  • టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు

05:59 PM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ

  • కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు
  • తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం
  • విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు
  • కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు
  • వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు
  • షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు
  • వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? 
  • ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు
  • చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది 
  • అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు
  • కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి?
  • చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు
  • ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు
  • రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్
  • రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా?
  • విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా?
  • ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా?
  • ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు
  • ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది
  • తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు
  • ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు
  • తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు
  • ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు
  • ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు
  • చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు
  • చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు
  • మీ యూటర్న్‌ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి 
  • వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు
  • షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
  • ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు
  • ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి 
  • ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి
  • ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు
  • షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం
  • కచ్చితంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

05:01 PM, ఏప్రిల్‌ 05 2024
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేప‌టి షెడ్యూల్‌ 

  • బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్‌ 6) షెడ్యూల్‌
  • ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌
  • కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు
  • అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు
  • సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.

04:53 PM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ

  • చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు
  • చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్  వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన
  • మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు  ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు
  • ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్
  • మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన

03:45 PM, ఏప్రిల్‌ 05 2024
గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి

  • ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌కు దేవుడు
  • చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు
  • చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు.
  • వాలంటీర్ల సేవలను సైతం చూసి  చంద్రబాబు ఓర్వలేకపోయారు.
  • నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు
  • వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు
  • ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్‌ను చంపేశారు
  • చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు
  • చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చాడు
  • రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు
  • పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు లొంగదీసుకున్నారు

02:02 PM, ఏప్రిల్‌ 05 2024
అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు
 

  • టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు
  • సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు
  • ట్విట్టర్, ఫేస్ బుక్  ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు
  • టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన  వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
  • కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా


01:45 PM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబుపై ఫైర్‌.. టీడీపీ మీటింగ్‌లో తిట్ల పురాణం

  • చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
  • ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ
  • పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస
  • మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు 
  • ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు
  • సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ  ఒకరి పై నొకరు తిట్ల పురాణం


1:15 PM, ఏప్రిల్‌ 05 2024
విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్‌

  • మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది
  • అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా
  • కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా
  • రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను
  • స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా
  • స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను
  • ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను
  • కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా

12:30 PM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబుకు నిరసన సెగ

  • టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
  • చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు
  • పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు
  • నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే  కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన
  • బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన
  • పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు

11:43 AM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత

  • వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో  మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు
  • డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్
  • వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్..
  • కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే
  • అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం
  • చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు
  • పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....?
  • జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది
  • దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు
  • కొవ్వూరులో టిడిపి  వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు....
  • కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...?
  •  దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం...
  • కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు
  •  దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు
  • స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు
  • భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం
  • ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి
  • జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు
  • వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ
  • కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి
  • వైఎఎస్సార్‌సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు
  • ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు
  • చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు
  • గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు
  • సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు
  • మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను
  • టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు
  • ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు
  • పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం
  • ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు
  • టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు

తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు
 

11:03 AM, ఏప్రిల్‌ 05 2024
సీఎం రమేష్‌ ఓ అహంకారి:  ఎమ్మెల్యే ధర్మశ్రీ

  • అనకాపల్లిలో సీఎం రమేష్‌ రౌడీయిజం
  • తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన 
  • తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
  • ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
  • ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు
  • సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు 
  • సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు
  • సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
  • తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా

10:52 AM, ఏప్రిల్‌ 05 2024
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి

  • మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
  • రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం
  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్
  • ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు
  • కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు
  • కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి
  • గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం
  • ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం
  • చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం
  • ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు
  • ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం
  • కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు
  • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు

పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు

10:34 AM, ఏప్రిల్‌ 05 2024
ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా 

  • టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది
  • అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు
  • స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు
  • పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా
  • ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా?  అని స్థానిక ప్రజలు వాపోతున్నారు
  • రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు

దేవినేని అవినాష్ వ్యాఖ్యలు

10:02 AM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల

  • ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది
  • పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది
  • వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు
  • నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు
  • ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు
  • తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు
  • ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం

చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు

09:37 AM, ఏప్రిల్‌ 05 2024
వేర్‌ ఈజ్‌ లోకేషం?

  • ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం
  • తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు
  • శంఖరావాలకు సైతం బ్రేక్‌ ఇచ్చిన లోకేష్‌
  • పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం
  • మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం
  • దీంతో.. లోకేష్‌ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు
  • అపార్ట్‌మెంట్‌లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్‌
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు
  • సోషల్‌ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు

09:09 AM, ఏప్రిల్‌ 05 2024
టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి

  • 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు
  • జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. 
  • వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం..
  • చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు  తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది..
  • వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు..
  • అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం..
  • రేపటి(ఏప్రిల్‌ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది
  • ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతారు..
  • సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్‌ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది

నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు

09:02 AM, ఏప్రిల్‌ 05 2024
ఇవాళ బస్సు యాత్రకు విరామం

  • నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర
  • నేడు సీఎం జగన్‌ బస్సు యాత్రకు విరామం
  • బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్‌ 
  • రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్‌
  • ఇప్పటికే వైఎస్సార్‌ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర
  • ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం
  • ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్‌ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
  • రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్‌
  • నెల్లూరు బైపాస్‌ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర
  • రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్‌
     

08:47 AM, ఏప్రిల్‌ 05 2024
విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు

  • నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
  • విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం
  • టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్‌సీపీలోకి
  • తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి

08:27 AM, ఏప్రిల్‌ 05 2024
నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. 

  • నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన
  • ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
  • స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్‌

08:06 AM, ఏప్రిల్‌ 05 2024
రఘురామ కొత్త రాగం

  • నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం
  • కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ
  • సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు
  • తాజాగా రఘురామ కొత్త రాగం
  • టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన 
  • నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది.
  • ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి.
  • పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ.
  • అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక.
  • చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య 
  • నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు

07:42AM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్
  • రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
  • రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
  • చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు
  • బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్
  • చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు

07:15AM, ఏప్రిల్‌ 05 2024
మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే

  • చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే.
  • జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు.
  • టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు
  • అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కే
  • గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్‌
  • టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్‌
  • బుద్ధ ప్రసాద్‌కు టికెట్‌ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి
  • రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు
  • మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్‌
  • యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
  • బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్‌కు టికెట్‌
  • మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్‌ అరవ శ్రీధర్‌
  • పవన్‌ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు
  • ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం?

07:06AM, ఏప్రిల్‌ 05 2024
అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం

  • అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం
  • టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు
  • జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం 
  • తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు
  • నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం
  • అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్
  • సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు
  • ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు
  • అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్
  • పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు
  • ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం

06:54AM, ఏప్రిల్‌ 05 2024
నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

  • నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం
  • రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి
  • రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి
  • పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ
  • సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు
  • టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం
  • బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్‌
  • నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు
  • కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ
  • జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ
  • మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత


06:49AM, ఏప్రిల్‌ 05 2024
తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్‌ ట్వీట్‌

  • తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర
  • గురువారం సీఎం జగన్‌ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం
  • సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని
  • ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్‌
  • పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్‌
  • నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్‌
  • పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్‌
  • 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్‌
  • ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్‌
  • తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్‌
  • తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్‌
  • పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్‌
  • పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్‌
  • 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్‌
  • 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్‌
  • జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్‌
  • చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్‌
  • ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్‌
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్‌
  • చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్‌
  • చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్‌
  • జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్‌
  • మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్‌

06:40AM, ఏప్రిల్‌ 05 2024
చంద్రబాబుకి ఈసీ నోటీసులు

  • సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు
  • గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
  • మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు 
  • ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు
  • ఈసీకి వైఎస్సార్‌సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు
  • ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు
  • 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం

06:30AM, ఏప్రిల్‌ 05 2024
చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP

  • ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో?
  • రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం.
  • వలంటీర్‌ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం
  • నెగిటివ్ కామెంట్స్‌కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియో‌స్‌కి చాట్ ఆప్షన్‌ను మాయం చేసిన టీడీపీ
  • అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు
  • సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement