March 25th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On March 25th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates March 25th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌.. ఎప్పటికప్పుటి సమాచారం

Published Mon, Mar 25 2024 7:04 AM | Last Updated on Mon, Mar 25 2024 9:25 PM

AP Elections 2024: Political News Round Up March 25th 2024 Telugu - Sakshi

AP Elections & Political March 25th Latest News Telugu..

9:10PM, March 25th 2024

పశ్చిమ గోదావరి జిల్లా: 

ఉండిలో ఇప్పటివరకు ఒక లెక్క సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినాక మరో లెక్క:
పీవీఎల్‌ నరసింహ రాజు,  ఉండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

  • పేదలకు సంక్షేమాన్ని చేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్‌
  • పేదలందరూ సీఎం జగన్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు
  • ఆక్వా రైతుల్ని  జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు
  • జోన్ పరిధిని 10 ఎకరాల లోపు రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నారు
  • శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి వాలంటీర్నీ స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు అనడాన్ని ఖండిస్తున్నాం
  • ఇవాళ ఏ పేద గడపని అడిగిన వాలంటీర్ల వల్లే సంక్షేమం వస్తుందని చెబుతున్నారు
  • సీఎం జగన్‌ గొప్ప ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు
  • నూటికి 90 శాతం అర్హులైన వారికికి పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ల  వల్లేసాధ్యం
  • పేదవారికి ఏ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు
  • ఏ పథకానికి అర్హత ఉందో తెలుసుకుని సచివాలయాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు వాలంటీర్లు
  • ప్రపంచమంతా వాలంటరీ వ్యవస్థను అభినందిస్తుంతే ప్రతిపక్షాల బురద చల్లాలని చూస్తున్నారు
  • వాలంటీర్లను తమ కుటుంబంలో సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారు
  • ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరడం ఖాయం.
  • నర్సాపురం పార్లమెంట్లో బీసీ మహిళను ఎంపీ గా నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్‌
  • చంద్రబాబుటీడీపీ  బీసీల పార్టీ అని వారిని మోసం చేశాడు
  • బీసీ, ఎస్టీ, ఎస్టీ వెనకబడిన వర్గాలన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నాయి
  • పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయాలనే పక్కనపెట్టి చంద్రబాబుకు పెంపుడు కుక్కలాగా మారాడు
  • చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నుంచో మంటే నుంచుంటున్నాడు
  • పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు

7: 05PM, March 25th 2024

విశాఖ:

వాలంటీర్లను టెర్రరిస్ట్ లన్న బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: అవంతి శ్రీనివాస్

  • వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు
  • ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు..
  • కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు
  • వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు
  • గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించిపరిచే విధంగా మాట్లాడారు
  • టీడీపీ నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి

6: 20PM, March 25th 2024

ఏపీకి పురంధేశ్వరి నమ్మకద్రోహం చేశారు : సుంకర పద్మశ్రీ

  • పురంధేశ్వరిని తూ.గో జిల్లాలో ప్రజలు తిరగనివ్వొద్దు
  • పురంధేశ్వరికి రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్సే
  •  సోనియా పురంధేశ్వరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు
  • ఆస్తులు కాపాడుకోవడానికి పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్‌ను మోసం చేశారు
  • ప్రత్యేక హోదా, విభజన హామీలపై హామీ ఇచ్చాకే పురంధేశ్వరి మాట్లాడాలి
     

6:18 PM, March 25th 2024

గుంటూరు
మంద కృష్ణ ఏపీలో మాదిగలను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేశాడు
నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ 

  • ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం మంద కృష్ణకు అలవాటు
  • ఈ నెల 30న మంద కృష్ణ నిర్వహించే సభను అడ్డుకుంటాం 
  • ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగల వాటా కోసం మంద కృష్ణ ఎప్పుడూ పోరాటం చేయలేదు
     

6:15 PM, March 25th 2024

విజయవాడ
పురంధేశ్వరి అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల సమావేశం 

  • హాజరు కానున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు
  • నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఏపీ బీజేపీ
     

6:12 PM, March 25th 2024

జనసేనలో తెగని విజయవాడ వెస్ట్ పంచాయితీ

  • టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష
  • దీక్ష ముగిసినా టికెట్ పై ఇంకా రాని క్లారిటీ
  • నాకు సీటు ఇవ్వకపోతే కూటమికే నష్టం
  • 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేశారు
  • నేను పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నా - ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా
     

6:10 PM, March 25th 2024

బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే పదానికి అసలైన నిర్వచనం వైఎస్ జగన్ : వంగా గీత 

  • నా మీద నమ్మకంతోనే పిఠాపురం సీటు ఇచ్చారుజనం  మనసులో జగన్, మా పిఠాపురం ప్రజల మనసులో నేనున్నాను
  • పిఠాపురంలో మా విజయం తధ్యం
  • నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ నేను వారి కుటుంబ సభ్యురాలినే
  • కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది
  • నాకు మళ్లీ పిఠాపురంలో సేవ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు
  • స్థానిక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాం
  • స్కూల్స్, హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేశాం
  • ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురం పీఠం నాదే - కోర్టులు, పోలీస్ స్టేషన్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించాం
  • వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు
     

6:08 PM, March 25th 2024

బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ

  • ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి
  • ఎన్డీఏ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేస్తామన్న మంద కృష్ణ మాదిగ

6:05 PM, March 25th 2024

కాకినాడ:

జనసేనలో మహిళలకు గౌరవం లేదు
జనసేన మాజీ రాష్ట్ర కార్యకదర్శి పోలసపల్లి సరోజ

  • జనసేనలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను.
  • పవన్ చెప్పే సిద్దాంతాలు..ఆశయాలు పేపర్ మీదకే పరిమితం
  • పవన్ చుట్టూ ఒక కాపు కోటరీ ఉంది.
  • ఆ కోటరీ పవన్ కలవనివ్వరూ
  • జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్
  • జనసేన కాపుల పార్టీయే కాదు..కమ్మవారి పార్టీ కూడా
  • జనసేనలొ బిసి నాయకులకు విలువ లేదు.
  • జనసేన 21 సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు
  • అందుకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాను.

5:08 PM, March 25th 2024

అనకాపల్లి జిల్లా:

 టీడీపీలో మంటలు

  •  మాజీ మంత్రి బండారు  సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత
  •  పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని నిరసన
  •  టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు 
  • పెందుర్తి  టికెట్ విషయంలో  చంద్రబాబు లోకేష్ మోసం  చేశారని ఆగ్రహం
  • చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ  నినాదాలు

5:01 PM, March 25th 2024

శ్రీ సత్యసాయి జిల్లా:

హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో టీడీపీ నేతల దౌర్జన్యం

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నేతలు
  • వైఎస్సార్‌సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
  • చిలమత్తూరు లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా గొడవ

4:33 PM, March 25th 2024

YSRCP: మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్

  • బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్
  • 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్‌
  • మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్
  • 1:30కి బస్సుయాత్ర ప్రారంభం
  • వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర
  • సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్
  • అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్
  • ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత

3:57 PM, March 25th 2024

శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే కలమట ఫైర్ 

  • కొత్తూరు మండలం నివగాంలో అనుచరులతో సమావేశం
  • జిల్లా టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ
  • పాతపట్నం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి
  • సానుకూల నిర్ణయం రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా
  • ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను
  • వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేశారు
  • నాపై తప్పుడు నివేదికలు అధిష్టానానికి పంపించి జిల్లా నేతలు టికెట్ దక్కకుండా చేశారు: కలమట

నాకు టికెట్ రాకపోవడంతో ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు: ఎంపీ జీవీఎల్ 

  • నిస్వార్ధంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృథాగా పోదు
  • భవిష్యత్ లో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా : ఎంపీ జీవీఎల్

అమరావతి
రేపు బీజేపీ పదాధికారుల సమావేశం 

  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  •  మిత్రపక్షాలతో సమన్వయంపై సమావేశంలో చర్చ
  • నేతలు, కేడర్ కు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ అధినాయకత్వం

కడప:
బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు

  • టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ పట్టు
  • టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సురేష్ పోస్ట్

కృష్ణా :
అవనిగడ్డలో పీక్స్ కు టీడీపీ, జనసేన పొత్తు పంచాయితీ

  • టికెట్ జనసేనకు ఇవ్వడంతో మండలి బుద్ధ ప్రసాద్ వర్గం తీవ్ర అభ్యంతరం
  • సాయంత్రంలోపు మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్
  • సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమంటున్న బుద్ధ ప్రసాద్ వర్గం
  • మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు

3:48 PM, March 25th 2024

కృష్ణాజిల్లా: 

చంద్రబాబు బాటలోనే పవన్‌

  • సర్వేల పేరుతో ఆశావాహులను, క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ 
  • అవనిగడ్డ జనసేన అభ్యర్ధి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే
  • బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, వికుర్తి శ్రీనివాస్ పేరుతో సార్వే 
  • ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే నిర్వహిచడంతో అయోమయంలో జనసేన శ్రేణులు
  • పవన్ కళ్యాణ్ సర్వేలతో రగిలిపోతున్న అవనిగడ్డ టీడీపీ కార్యకర్తలు

3:18 PM, March 25th 2024

ఏపీ బీజేపీ లిస్టు రెడీ.!

  • రెండు రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
  • గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును
  • ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి
  • వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం
  • రాజమండ్రి నుంచి బీజేపీ ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి

3:05 PM, March 25th 2024

చిత్తూరు జిల్లా:

టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖముఖీ సమావేశమైన చంద్రబాబు
  • టీడీపీకి ఓటేస్తేనే  మగవారిని ఇంట్లోకి రానీయండి.. అన్నం పెట్టొద్దు అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు

2:43 PM, March 25th 2024

పిఠాపురంపై పవన్‌లో పెరుగుతున్న ఆందోళన

  • సీన్‌ సితార అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు
  • టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పడవంటున్న జనసేన కార్యకర్తలు
  • కాపులు కూడా ఓట్లేయడం కష్టమంటున్న పార్టీ నేతలు
  • పిఠాపురంలో గెలవాలంటే ఏం చేయాలి? పవన్‌కళ్యాణ్‌ సమాలోచనలు
  • నిన్న మంగళగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ సమావేశం 
  • ఈసారికి హెల్ప్‌ చేయండి, ఎలాగొలా గెలుస్తానంటూ వర్మకు బుజ్జగింపులు
  • పవన్‌ సూచన మేరకు ఇవాళ వర్మతో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి ఉదయ శ్రీనివాస్ భేటీ 
  • పరిస్థితి ఇలాగే ఉంటే కాకినాడ ఎంపీకి పోటీ చేయడం మంచిదని సన్నిహితుల సూచనలు

2:35 PM, March 25th 2024

టీడీపీకి షాక్ ఇస్తున్న అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు

  • రాజంపేట పార్లమెంట్ పరిధిలో మూకూమ్మడిగా ప్రచారం ఆపేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
  • పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆయా ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు
  • రాష్ట్రంలోనే... రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం, బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండటంతో ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు.
  • ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి పల్లెలో తీవ్ర ప్రభావం..
  • బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం.

2:25 PM, March 25th 2024

సోషల్ మీడియా శాడిజనికి గీతాంజలి బలి: కోన వెంకట్

  • ఒక పవిత్ర ఆత్మను చంపేశారు 
  • సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టింనే 
  • చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది 
  • వీలైతే కొత్త చట్టాలను తేవాలి 
  • ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారు 
  • జనాన్ని భయపెడుతున్నారు 
  • ప్రముఖ సినిమా రచయిత, ప్రొడ్యూసర్, దర్శకుడు కోన వెంకట్
  • తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్‌

2:21 PM, March 25th 2024
అవనిగడ్డలో తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ నేతలు

  • పొత్తుల్లో జనసేనకు అవనిగడ్డ సీటు కేటాయించడం పై తీవ్ర అసంతృప్తి 
  • అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ 
  • మండలి బుద్ధప్రసాద్ ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ క్యాడర్ 
  • బుద్ధప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకు సహకరించేది లేదు : అవనిగడ్డ టీడీపీ క్యాడర్
  • జనసేనకు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డ క్యాండెట్ ను ఓడిస్తాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్
  • నలభైయేళ్లుగా పార్టీ జెండా మోశాం.. తొలిసారి మాకు బాధకలుగుతోంది : అవనిగడ్డ టీడీపీ క్యాడర్
  • బుద్ధప్రసాద్ ను ఇండిపెండెంట్ గా పోటీచేయించి గెలిపించుకుంటాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్
  • సీటు మాకే వస్తుందని ఎంతగానో ఆశించాం : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • మండలి బుద్ధప్రసాద్ కు సీటు దక్కక పోవడం మమ్మల్ని బాధించింది: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • అవనిగడ్డ సీటు విషయంలో చంద్రబాబు మరోమారు పునరాలోచించుకోవాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • నెలరోజుల నుంచి సీటు పై నాన్చుతూనే ఉన్నారు : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • మా ఆవేదనను అధిష్టానం గుర్తించాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • సీటు మాకెందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • జనసేనకు అనిగడ్డ సీటు ఇస్తున్నామని ఇంతవరకూ మాకు చెప్పలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • నిన్న జనసేన జాబితా ప్రకటనతోనే మాకు తెలిసింది : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు
  • సీటు విషయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు

2:16 PM, March 25th 2024
నో టికెట్‌.. జీవీఎల్‌ వీడియో సందేశం

  • విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జీవీఎల్‌ వీడియో సందేశం
  • విశాఖ సీటు నాకు రానందుకు విశాఖ వాసులు చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారు
  • విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉంది
  • గత మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని‌ కలిగించింది
  • విశాఖలో పోటీచేయడానికి అవకాశం రాని సంగతి మీకు తెలిసిందే
  • ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశా
  • విశాఖ అభివృద్దికి మనం కలిసి చేసిన సేవ వృదా అయిందని భావించద్దు
  • ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదు
  • జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ
  • ప్రజాసేవ, విశాఖ అభివృద్ది ఒక‌ కమిట్ మెంట్ తో చేసేవి
  • త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తా
  • విశాఖ అభివృద్దే ధ్యేయంగా కార్యకర్తలంతా కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుందాం
  • విశాఖ అభివృద్దే లక్ష్యం
  • విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తా

1:52 PM, March 25th 2024
తిరుపతి టికెట్‌ పంచాయితీ.. సుగుణమ్మ కంటతడి

  • తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు 
  • టికెట్ దక్కలేదని కంటతడి పెట్టిన సుగుణమ్మ
  • అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా: సుగుణమ్మ
  • తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరం: సుగుణమ్మ
  • చంద్రబాబు చేపించిన సర్వేలు ఏమయ్యాయి?: సుగుణమ్మ
  • టికెట్ జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి: సుగుణమ్మ
  • బయటి వ్యక్తులకు ఎన్నికల్లో మద్దతు తెలపలేం: సుగుణమ్మ
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి చర్చించాలి : సుగుణమ్మ
  • ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. కేడర్ అంగీకరించడం లేదు: సుగుణమ్మ

1:46 PM, March 25th 2024
ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి డేట్‌ ఫిక్స్‌

  • వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం
  • రాష్ట్రంలో పర్యటించనున్న జాతీయ అగ్ర నేతలు
  • బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్‌ షోలు
  • రాజమండ్రి నుంచి  ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి


1:35 PM, March 25th 2024
ఏపీలో పెండింగ్ సీట్లపై కూటమిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ 

  • ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో పెట్టిన కూటమి 
  • 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ 
  • టీడీపీ -7, జనసేన - 3
  • పెండింగ్ - 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో కూటమి 
  • విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం 
  • విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు
  • తెరమీదకు కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు 
  • శ్రీకాకుళం, అనకాపల్లి, స్థానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయింపు 
  • ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాలకు గానూ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ 
  • మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారా? 
  • దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు ఖరారు కానీ టీడీపీ అభ్యర్థులు 
  • జనసేన నుంచి పెండింగ్ లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు.

1:20 PM, March 25th 2024
కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ 

  • కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించారు
  • కాపులు రోడెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడు
  • ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదు.
  • కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు.
  • ఇవాళ పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేశారు.
  • పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడటం భాధాకరంగా ఉంది.
  • ఓటర్లు ఈ విషయం గమనించమని కోరుతున్నాను.
  • జనసేన బలోపేతానికి ఫలితం ఆశించకుండా పని చేయాలనుకున్నాను
  • 70-80 సీట్లు.. సగ కాలం ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేనకు చెప్పాను.
  • దీని పై పవన్ స్పందన ఎక్కడా రాలేదు.
  • ఇనుప ముక్కను నీటిలో నాన బెడితే ఏలా ఉంటుందో.. అలా పవన్ కాలయాపణ చేశారు.
     

1:05 PM, March 25th 2024
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్

  • చంద్రబాబు గారి మ్యానిప్యులేషన్ల గురించి తెలియందెవరికి?
  • సీటు కావాలంటే వందకోట్లు చెల్లించాలి
  • ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు
  • అది ఏడు కోట్లా, 20 కోట్లా స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు
  • బుకాయింపులు వద్దు.
  • చంద్రబాబు గారి హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబ్తారు వొంటేరూ..

12:55 PM, March 25th 2024
ముఖ్యనేతలతో పురంధేశ్వరి సమావేశం 

  • పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ
  • ప్రచార షెడ్యూల్‌పై ఏపీ ముఖ్య నాయకులతో చర్చ  
  • ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 
  • నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన 
  • బీజేపీ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాక 
  • వచ్చే నెల ఐదో తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం 
  • రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి

12:40 PM, March 25th 2024
బాబు, సుజానా చౌదరిపై కేశినేని నాని ఫైర్‌

  • విజయవాడ వెస్ట్ బీజేపీ సీటుపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ 
  • పరోక్షంగా సుజనా చౌదరిని కౌంటర్ చేసిన కేశినేని నాని 
  • వెస్ట్‌లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్‌పై పెద్ద కుట్ర జరుగుతోంది
  • మొన్నటి వరకూ జనసేనకే వెస్ట్ టిక్కెట్ అన్నారు 
  • ఇప్పుడు బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ఒక ధనికుడిని తీసుకొస్తున్నారు
  • పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్న నియోజకవర్గం 
  • సీఎం జగన్‌ ఒక కార్యకర్తగా ఎదిగిన ఆసిఫ్‌కు టిక్కెట్ ఇచ్చారు 
  • మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్‌లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారు 
  • ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు నిజంగా ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీనే 
  •  చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారు 
  • కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఎందుకు తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి 
  • ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వ్యవస్థలను మేనేజ్‌ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారు
  • డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారు 
  • మేనేజ్‌మెంట్‌తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు
     

12:20 PM, March 25th 2024
పొత్తులో సీటు చిచ్చు..

  • అవనిగడ్డలో చిచ్చురాజేసిన సీటు పంచాయతీ 
  • పొత్తుల్లో జనసేనకు దక్కనున్న అవనిగడ్డ సీటు 
  • తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అవనిగడ్డ టీడీపీ కేడర్‌
  • అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ 
  • మండలి బుద్ధప్రసాద్‌ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ కేడర్‌
  • భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమైన అవనిగడ్డ టీడీపీ కేడర్‌
  • మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు

12:00 PM, March 25th 2024
రఘురామకు బీజేపీ కౌంటర్‌

  • రఘురామకృష్ణంరాజు విమర్శలపై బీజేపీ కౌంటర్
  • బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌కు నో ఛాన్స్‌ 
  • జాబితాలో పేరు లేకపోవడంలో ఆశ్చర్యమేముందన్న బీజేపీ సీనియర్‌ నేత లక్ష్మీపతి రాజా
  • ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా అంటూ సెటైర్లు
  • వారిపై జాలిచూపే పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి?
  • ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై అక్కసు వెళ్లగక్కిన రఘురామకృష్ణంరాజు
  • తనకి నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ బీజేపీపై విమర్శలు. 
     

11:36 AM, March 25th 2024 
పవన్‌పై నమ్మకం ఉంది: పోతిన మహేష్‌
 

  • విజయవాడ వెస్ట్‌లో తేలని టికెట్‌ పంచాయితీ
  • జనసేన తరఫున పట్టువీడని పోతిన మహేష్‌
  • కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం: మహేష్‌
  • ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా: మహేష్‌
  • పవన్‌పై నమ్మకం ఉంది: మహేష్‌
  • నాకు టికెట్‌ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు: మహేష్‌

11:03 AM, March 25th 2024
కుప్పంలో భారీగా మద్యం పట్టివేత?

  • చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీ మద్యం పట్టివేత 
  • కర్ణాటక నుండి  గుడుపల్లి మండలం సోడిగానీపల్లి కి తరలిస్తున్న మద్యం స్వాధీనం 
  • ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాపెట్టేందుకు  ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారుల అంచనా 
  • రూ. 6లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసున్న పోలీసులు 
  • ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్న SEB పోలీసులు

10:47 AM, March 25th 2024
బాబు ఎగస్ట్రా సీటు ఇస్తారా?

  • రసదయకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజకీయం
  • అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొన్ని చోట్ల తెగని పంచాయితీ
  • భీమిలి లేదా విశాఖ సౌత్ సీటు అడుగుతున్న బీజేపీ నేత మాధవ్
  • టీడీపీ నుంచి భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
  • జనసేన నుంచి దక్షిణ విశాఖ ఆశిస్తున్న వంశీ యాదవ్‌
  • వంశీ యాదవ్‌కు సీట్లు ఇవ్వొద్దని జనసేన శ్రేణుల ఆందోళనలు
  • ఇవాళో, రేపో చంద్రబాబును కలవనున్న మాధవ్
  • సీట్లు సర్దుబాటులో భాగంగా బీజేపీకి మరొక సీటు అదనంగా అడగనున్న మాధవ్
  • ఇచ్చేది అనుమానమే అంటున్న రాజకీయ వర్గాలు

10:02 AM, March 25th 2024
27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం 

  • ‘ప్రజాగళం’ పేరుతో సన్నాహాలు 
  • రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటన 
  • 27న చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభం
  • 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారు 
  • 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌లో ప్రచారం
  • 28న రాప్తాడు, శింగనమల, కదిరి,  29న శ్రీశైలం, నందికొ­ట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న 
  • కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ప్రచారం

09:38 AM, March 25th 2024
చివరకు బండారు ఇలా..  

  • పెందుర్తి టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్య­నారాయణమూర్తి
  • టికెట్‌ దక్కకపోవడంతో మనోవేదన 
  • తీవ్ర అస్వ­స్థతకు గురై ఆస్పత్రిలో చేరిక 
  • షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోవడం వల్ల పల్స్‌ రేటు గణనీయంగా పడిపోయిందన్న డాక్టర్లు 
  • కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన బండారు.. మూడో లిస్ట్‌లోనూ నో టికెట్‌ 
  • పెందుర్తి టికెట్‌ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పంచకర్ల రమేష్‌ బాబుకు కేటాయింపు 
  • బండారుకు పలువురు టీడీపీ నేతల పరామర్శ 
  • మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ

09:27 AM, March 25th 2024
అద్దెకు మరో జనసేన కార్యాలయం

  • జెండా ఎత్తేసిన మరో జనసేన కార్యాయలం
  • నంద్యాల జిల్లా డోన్‌ మండలం ఉడు­ములపాడు గ్రామంలో ఆఫీస్‌కు తాళం 
  • పట్టుమని 30 రోజులు గడవకముందే ‘అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డు 
  • మొన్నీమధ్యే ఉత్తరాంధ్రలో ఇలాంటి పరిస్థితి
  • మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టులెట్‌ బోర్టు 
  • కార్యాలయాలు నిర్వహించే స్తోమత లేనప్పుడు ఎందుకీ ఆర్భాటాలు అని నిలదీస్తున్న జనసేన నేతలు! 

09:10 AM, March 25th 2024
పవన్‌.. మరీ ఇంత దుర్మార్గమా? 

  • ధనసేన చేతిలో జనసేన నేతలు దగా
  • అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ
  • 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన
  • డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్
  • 18 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్
  • మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని జనసేన
  • అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్
  • శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్
  • మొత్తం 18 సీట్ల లో 12 సీట్లు  ఓసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్
  • భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇచ్చిన పవన్ కళ్యాణ్
  • జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేసిన పవన్ 
  • జనసేన లో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన పవన్ 
  • జనసేన వీర మహిళలు ఎవ్వరు పోటీ కి పనికిరారని తేల్చిన పవన్ 
  • బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్,  పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ ,  రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ.. పవన్‌ హ్యాండ్‌ ఇచ్చిన లిస్ట్‌ పెద్దదే

08:40 AM, March 25th 2024
సీ-విజిల్‌ యాప్‌.. అనంతలో 29 మంది సస్పెండ్‌ 

  • ఎన్నికల కోడ్ అమలులో భాగంగా గా సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 168 ఫిర్యాదులు 
  • విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు ప్రకటించిన కలెక్టర్‌ గౌతమి
  • ఇప్పటిదాకా రూ. 16.94 లక్షల స్వాధీనం
  • నిబంధనలు పాటించని 29 మందిని సస్పెండ్
     

08:30 AM, March 25th 2024
గీత టికెట్‌పై గిరిజన సంఘాల్లో అసంతృప్తి

  • అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఇచ్చిన బీజేపీ
  • పురందేశ్వరి తన స్వలాభం కోసమే గీతకు టికెట్ ఇప్పించారనే ఆరోపణ
  • 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత
  • గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 
  • 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసిన గీత
  • గత విశాఖ ఎంపీ ఎన్నికల్లో కేవలం 1159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత
  • గత ఎన్నికల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత
  • ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి బీజేపీ టికెట్ కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత
  • కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపు పై స్థానిక గిరిజన వర్గాల్లో అసంతృప్తి

08:12 AM, March 25th 2024
నేడు రామచంద్రపురానికి ఎంపీ మిథున్‌రెడ్డి

  • కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
  • తోట త్రిమూర్తులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మిథున్‌
  • పిల్లి సూర్యప్రకాష్‌కు తన అనుచరులు సపోర్ట్‌ చేయాలని సమావేశం

07:45 AM, March 25th 2024
మేమంతా సిద్ధం.. తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

  • వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం యాత్రకు అంతా సిద్ధం
  • మరో మరో 48 గంటల్లో వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం
  • ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ నుండి ప్రారంభం కానున్న బస్సుయాత్ర
  • రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న యాత్ర
  • జగన్ బస్సుయాత్రతో ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్
  • తొలిరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ
  • తొలి బస్సుయాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి
  • బస్సుయాత్రతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో మరింత జోష్

07:28AM, March 25th 2024
నేడు కుప్పానికి చంద్రబాబు

  • సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటన
  • రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న నారా చంద్రబాబు నాయుడు
  • కుప్పం సెంటర్‌లో ఇవాళ ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ
  • సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
  • రేపు హంద్రినీవా పరిశీలన
  • 27 నుంచి ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
  • ప్రతీరోజూ నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు

07:26AM, March 25th 2024
ఎమ్మెల్యే సీట్లలోనూ ఇంతేనా?.. బీజేపీ సీనియర్ల ఆవేదన

  • బీజేపీ జాబితాలో సీనియర్లకి దక్కని అవకాశం
  • ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశమివ్వడానికి సీనియర్ల గొంతుకోసారంటూ విమర్సలు
  • జీవీఎల్‌, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,గారపాటి చౌదరి, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లే ఇవ్వని అధిష్టానం
  • ఎంపీ రేసులో చివరి వరకు ప్రయత్నించినా నిరాశే
  • చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రల వల్లే సీనియర్లకి అవకాశం దక్కలేదంటున్న బీజేపీ వర్గాలు
  • కాంగ్రెస్కి బాండ్ల రూపంలో రూ. 30 కోట్లు విరాళమిచ్చిన సీఎం రమేష్‌కి అనకాపల్లి ఎంపీ టికెట్‌
  • కడపకి చెందిన సీఎం రమేష్ కి అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లు ఆగ్రహం
  • సీఎం రమేష్కి టిక్కెట్ అంటే.. టీడీపీకి కేటాయించినట్లేనంటున్న బీజేపీ నేతలు
  • బ్యాంకులని బురిడీ కొట్టిన కేసులతో పాటు.. ఎస్టీ కాదని కోర్టులో కేసులు నడుస్తున్న‌ కొత్తపల్లి గీతకి అరకు పార్లమెంట్
  • నాలుగు దశాబ్దాలకి పైగా బీజేపీకి సేవలందించిన సోము వీర్రాజుని కాదని రాజమండ్రి నుంచి స్ధానికేతురాలైన పురందేశ్వరికి అవకాశం
  • నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకి బీజేపీ చెక్
  • ఢిల్లీలో ఉండి 15 రోజులగా ప్రయత్నించినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని బీజేపీ అధిష్టానం
  • రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం సీనియర్ల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న వైనం 
  • బీజేపీలో చేరిన వెంటనే వరప్రసాద్కి తిరుపతి టిక్కెట్
  • ఒకటి రెండు రోజులలో పది అసెంబ్లీ స్ధానాల జాబితా ప్రకటించనున్న బీజేపీ
  • ఎమ్మెల్యే జాబితాలోనూ ఇతర పార్టీ నేతలకే ఎక్కువ ఛాన్స్

07:04AM, March 25th 2024
ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’

  • అధికార వైఎస్సార్‌సీపీ భారీ ఎన్నికల ప్రచారం
  • మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్‌ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర
  • ఎల్లుండి (మార్చి 27 నుంచి) ఇడుపులపాయ నుంచి మొదలు
  • సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ
  • చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంతో పాటు పాలనతో సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో సీఎం జగన్‌
  • పార్లమెంటరీ స్థానాల పరిధిలో బహిరంగ సభలు
  • ఉదయం ప్రజలతో మమేకం.. సాయంత్రం పబ్లిక్‌ మీటింగ్‌
  • పబ్లిక్‌ ఇంటెరాక్షన్‌లో ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ

06:57AM, March 25th 2024
18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు

  • అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్‌ స్థానాలు పెండింగ్‌
  • రెండు లోక్‌సభ స్థానాల్లో కాకినాడకు ఇప్పటికే అభ్యర్థి ఖరారు 
  • తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్‌
  • అమిత్‌ షా చెబితే ఎంపీగా తాను పోటీ చేస్తానన్న పవన్‌
  • కాకినాడలో తాను ఎంపీగా పోటీ చేసి.. పిఠాపురం నుంచి ఉదయ్‌ పోటీ చేస్తాడని స్పష్టీకరణ


06:52AM, March 25th 2024
లోకేష్‌ ఎక్కడికెళ్లినా.. 

  • ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌కు చుక్కలు
  • ఎక్కడికెళ్లినా ప్రజల నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం
  • అధికారంలో ఉండగా ఏం చేశారు?.. కరోనా టైంలో ఏమైపోయారు? అంటూ నిలదీస్తున్న మంగళగిరి వాసులు
  • లోకేశ్‌ ప్రచారంలో ఇదీ పరిస్థితి 
  • సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం
  • ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా
  • చివరకు అపార్ట్‌మెంట్లలో ప్రచారానికే పరిమితమైన లోకేష్‌
  • మంగళగిరిలో టీడీపీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన?
  • ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ 
  • ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి    
  • అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం   

06:48AM, March 25th 2024
ఏపీ బీజేపీకి ఇలాంటి పరిస్థితా?

  • వలసలకే సీట్లా?..
  • ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు 
  • ఆరు స్థానాల్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే 
  • కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్‌కు తిరుపతి సీటు 
  • కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్‌ పోటీ 
  • ఈ మధ్యే చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట 
  • పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు 
  • నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు
  • సీనియర్లలో తీవ్ర ఆవేదన
  • వలస నేతలకు సీట్లు ఇప్పించడంలో చంద్రబాబు కీ రోల్‌
  • బాబును నమ్ముకున్న రఘురామ రాజు మాత్రం హ్యాండ్‌

06:35AM, March 25th 2024
బాబుకి బుద్ధి చెప్పి తీరతా: గొంప కృష్ణ

  • ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణని నిండా ముంచిన చంద్రబాబు
  • శృంగవరపుకోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆశచూపి అమెరికా నుంచి పిలిపించిన చంద్రబాబు
  • టీడీపీ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టించిన నారా లోకేష్‌
  • బాబు, లోకేష్‌ను నమ్మి అమెరికా నుంచి వస్తే కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారంటూ గొంప కృష్ణ ఆవేదన
  • రానున్న ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బాబుకి బుద్ధి చెప్తానని శపథం!

06:30AM, March 25th 2024
టీడీపీ.. ఆ 31 స్థానాల్లోనూ గందరగోళమే 

  • 30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు
  • సీట్లు రాక పలుచోట్ల రెబల్స్‌గా మారిన తెలుగు తమ్ముళ్లు
  • వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు
  • ఎంత సర్ది చెప్పినా టికెట్‌ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు
  • పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం
  • పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే 
  • రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్‌ దక్కని దేవినేని ఉమ
  • ఏలూరు ఎంపీ టికెట్‌పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ
  • గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement