AP Elections & Political March 26th Latest News Telugu..
06:40 PM, March 26th 2024
తాడేపల్లి :
వైఎస్సార్‌సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు
- సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు
- పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు)
- కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ
- గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి)
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్
06:17 PM, March 26th 2024
తాడేపల్లి :
- సీఎం వైఎస్ జగన్ సమక్షంలోవైఎస్సార్‌సీపీలో చేరిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
06:05 PM, March 26th 2024
అమరావతి:
ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- పత్రికల్లో ప్రజల అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేయాలని కోరాం
- నిత్యం వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతూ వార్తలు రాస్తున్న విధానంపై ఫిర్యాదు చేసాం
- 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళేముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సవరించాలని కోరాం
- పాంప్లెట్స్ పంచేందుకు అనుమతి తీసుకోవాలని నిబంధనను సవరించాలని కోరాం
- బ్రాండింగ్, హోర్డింగ్స్, పార్టీ ఆఫీసుల్లో ప్రచార ప్రకటనలపై నిబంధనలపై మరోసారి పునరాలోచించాలని కోరాం
- అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెల్లాం
05:50 PM, March 26th 2024
విజయవాడ:
బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే చంద్రబాబుకు తెలుసు: రాయన భాగ్యలక్ష్మి, మేయర్
- విజయవాడను అభివృద్ధి చేసి చూపించారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
- జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మేం భాగస్వామ్యులైనందుకు ఆనందంగా ఉంది
- సీఎం జగన్.. బీసీలకు పెద్ద పీట వేశారనడానికి నేనే ఉదాహరణ
- ఒక బిసీ మహుళనైన నన్ను విజయవాడకు మేయర్ చేశారు
- విజయవాడ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం
చంద్రబాబు తన బినామీలను మా పై పోటీ పెడుతున్నాడు
- సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు
- వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నా పై వెస్ట్ లో పోటీకి దించుతున్నారు
- పశ్చిమనియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి అడ్డా
- రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తాం
- ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అధికప్రాధాన్యత ఇస్తున్నారు
- చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు
-షేక్ ఆసిఫ్, విజయవాడ వెస్ట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
05:40 PM, March 26th 2024
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా):
టీడీపీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు
- వాలంటీర్లపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- నిష్పక్షపాతంగా గౌరవవేతనం తీసుకుంటూ ప్రభుత్వం తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అని బొజ్జల సుధీర్ మాట్లాడడం చాలా దారుణం.
- అలా మాట్లాడనికి అసలు మనిషినా, పశువునా?
- బొజ్జల సుధీర్ బేషరతుగా వాలంటీర్లకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
05:30 PM, March 26th 2024
తాడేపల్లి :
వైఎస్సార్‌సీపీలో చేరిన సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు
- పార్టీలో చేరిన వారిలో వేనాటి రామచంద్రారెడ్డి(సూళ్లురుపేట), మస్తాన్ యాదవ్(వెంకటగిరి)
- మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు
- వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
05:25 PM, March 26th 2024
వైఎస్సార్‌సీపీ చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య
- సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య
05:20 PM, March 26th 2024
ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరోసీటు అదనంగా కోరుతున్న బీజేపీ
- రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కావాలని బీజేపీ పట్టు
- రెండు సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమిరా అంటున్న టీడీపీ
- మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్
05:18 PM, March 26th 2024
టీడీపీని వీడే యోచనలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు
- ఏలూరు ఎంపీ టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వడంతో మాగంటి బాబు అసంతృప్తి
- మాగంటి బాబు పార్టీ మారతాడని ప్రచారం
05:15 PM, March 26th 2024
పల్నాడు :
పెదకూరపాడు టీడీపీ నేత కంచేటి సాయిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- అమరావతిలో వైఎస్సార్‌సీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సాయి అరెస్ట్
- సత్తెనపల్లి పీఎస్ కు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, కార్యకర్తలు
- సత్తెనపల్లి కోర్టు దగ్గర పోలీస్ బందోబస్తు
05:13 PM, March 26th 2024
ఏలూరు :
నారా భువనేశ్వరి పర్యటనలో ఉద్రిక్తత
- నారా భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది
- టికెట్లు రాని కొందరు గొడవ చేసే అవకాశం ఉందని అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది
- టీడీపీ కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి మధ్య తోపులాట
05:12 PM, March 26th 2024
AP:
ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం
- ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి
- బీజేపీ శ్రేణులకు కేంద్రం పెద్దల దిశానిర్దేశం
05:11 PM, March 26th 2024
అమరావతి :
- రాజకీయ పార్టీల నేతలతో సమావేశంc కానున్న ఈసీ
- ఎన్నికల నియమ నిబంధనలపై పార్టీల నేతలతో చర్చించనున్న ఈసీ
04:45 PM, March 26th 2024
బుజ్జగింపు చర్యలు.. పార్టీ పదవులతో ఎర
- సీట్లు ఇవ్వలేని అసెంబ్లీ ఆశావహులకు పార్టీ పదవులు ఇస్తున్న టీడీపీ
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం.
- పార్టీ జాతీయప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్.
- విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జి
- హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు.
- పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్,మన్నె సుబ్బారెడ్డి,కొవ్వలి రామ్మోహన్ నాయుడు.
- పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు,వాసురెడ్డి ఏసుదాసు నియామకం
03:41 PM, March 26th 2024
రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే
- హైదరాబాద్ లో హల్‌చల్ చేసిన రఘురామ మనుషులు
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అభిమానులు పూజలు
- బీజేపీ మోసం చేసింది, టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్
03:39 PM, March 26th 2024
కర్నూలు :
కలకలం రేపుతున్న ఆడియో రికార్డు
- ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు
- రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామన్న బీజేపీ నేత
- పురందేశ్వరికి రూ.3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత ప్రతిపాదన
- పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ
02:51 PM, March 26th 2024
విజయవాడ:
వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం: దేవినేని అవినాష్
- వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నాం
- టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు
- చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి
- పది సంవత్సరం అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు
- నియోజకవర్గంలో కుట్ర రాజకీయాల కు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా
- తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
- రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక
- ఎన్టీఆర్ హయంలో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా?
- చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడింది
02:49 PM, March 26th 2024
టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఆగ్రహం
- వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం
- టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు
- చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి
02:34 PM, March 26th 2024
అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు
- ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే
- కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడు
- మాడుగుల వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర్లి అనురాధ
- ఈర్లి అనురాధ.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూతురు
01:47 PM, March 26th 2024
వలంటీర్లపై చంద్రబాబు,పవన్ పగ పెట్టారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- గ్రామ వలంటీర్ల వలనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి.
- కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వలంటీర్లు సేవలందిచారు
- వలంటీర్లను టెర్రెరిస్ట్‌లతో పోల్చడాన్ని ఖండిస్తున్నాము
- గ్రామ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పగ పెట్టారు
- సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి
- వలంటీర్లపై కక్ష పెట్టుకున్నారు
- గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు
- వైఎస్సార్‌సీపీ ఎవ్వరికి భయపడదు
- ఎవరికి ఎవరు భయపడుతున్నారో గమనించాలి
- సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు
- విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపి నిర్ణయించుకుంది
- స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపిలో ఈ పార్టీలు ఎందుకు కలిసాయి?
- చంద్రబాబు ఎప్పుడైనా పిల్లలు చదువులు కోసం ఆలోచన చేసారా?
- రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది
01:47 PM, March 26th 2024
టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ
- వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన టీడీపీ నేత సుధీర్‌రెడ్డి
- రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వాలంటీర్లు, లబ్ధిదారులు
- సర్వత్రార వ్యతిరేకత రావడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలు
- సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు
- వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు బీరాలు
01:31 PM, March 26th 2024
ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు
- ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ
- రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు
- సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన
- పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ
- కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ
- పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో .
- పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
- బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి
01:26 PM, March 26th 2024
నాకే టికెట్ ఎగ్గొట్టిన బాబు పోలవరం కడతానంటే నమ్ముతారా?: రఘురామ
- చంద్రబాబుకు రఘురామ టికెట్ డిమాండ్
- బీజేపీ అధిష్టానం ఉద్దేశ్యాలు తేడాగా ఉన్నాయి
- ఏపీ బీజేపీని నడిపిస్తుంది ఎవరో నాకు తెలుసు
- కేంద్ర బీజేపీని నడిపిస్తున్నది కూడా వారేనా?
- బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా?
- నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి
- చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా?
- నాకు సీటు ఇవ్వలేని వాడు (చంద్రబాబు) రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు? :
- రాష్ట్రానికి చంద్రబాబు ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? : రఘురామకృష్ణరాజు
01:16 PM, March 26th 2024
విజయవాడ: బీజేపీ పదాదికారుల సమావేశానికి సీనియర్లు దూరం
- సమావేశానికి హాజరుకాని సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ తదితరులు
- పదాదికారుల సమావేశానికి సీనియర్లు గైర్హాజరుపై బీజేపీలో చర్చ
- ఎంపీ టిక్కెట్లు రాకపోవడంపై సీనియర్ల అలక
12:28 PM, March 26th 2024
కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్
- అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న టీడీపీ శ్రేణులు
- మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
- మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం
- రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయం
- టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు,పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన అవనిగడ్డ మండలం టీడీపీ శ్రేణులు
- జనసేనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానం
12:25 PM, March 26th 2024
ఉద్యోగులపై ప్రతిపక్షాల అభాండాలు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి
- ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం
- ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత
- రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు
- వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు
- శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- కరోనా సమయంలో సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లో దాకున్నాడు
- కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు
- లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు
- పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్
- ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు
- లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు
- ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది
- కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి
- ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు
- ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్‌ది
- ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు
- దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం
- ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్‌ను తప్పకుండా ఉపయోగించుకోవాలి
- వెల్ఫేర్ స్కీమ్స్‌లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి
12:19 PM, March 26th 2024
తిరుపతి టీడీపీ పార్టీ నేతలు రహస్య సమావేశం
- తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పై చర్చ
- ఏకమైన తిరుపతి టీడీపీ ముఖ్య నేతలు
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- తిరుపతి టీడీపీ నేత జే.బి.శ్రీనివాసులు ఇంట్లో సమావేశమైన నేతలు
- అధినేత చంద్రబాబు నాయుడు తో మరోసారి తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు
- కుప్పం రావాలని మాజీ సుగుణమ్మ కు పిలుపు ఇచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మాటను ఖాతరు చేయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
12:01 PM, March 26th 2024
వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం: మార్గాని భరత్
- జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు
- అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం
- తెలుగుదేశం పార్టీ జిహాది పార్టీ
- ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి?
- నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబ
- నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు
- అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు
- ఓటమిని అంగీకరించలేని పనికిమాలిన వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలవుతుండగా తప్పుడు కరపత్రాలు నాపై ఎలా పంచుతున్నారు.. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే
- మోరంపూడి ఫ్లైఓవర్ పనులకు నా స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను
- నాపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసు పై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నాను
- నేను అభివృద్ధి చేసిన ప్రతి ప్రాంతంలో నాపై తప్పుడు కరపత్రాలు పంచుతున్నారు
- ఆదిరెడ్డి వాసు.. పిరికిపందలా వ్యవహరించుకు.
- దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కో..
- ఐదేళ్లు నీ భార్య ఎమ్మెల్యేగా ఉంది.. రాజమండ్రికి మీరు ఏం చేశారు?
- ప్రజలను నమ్మించి మోసం చేసిన వారిని పొలిటికల్ తీవ్స్ అంటారు
- 2014 నుంచి 19 వరకు ఓట్లు వేయించుకుని ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ప్రజలను నమ్మించి, మోసం చేశారు
11:24 AM, March 26th 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ కూటమి అభ్యర్థులు ఎంపికపై విమర్శలు
- చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు చేసిన వారికి ఏ విధంగా సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు
- 40 ఎకరాల భూకబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ
- సీఎం రమేష్‌పై 450 కోట్ల రూపాయల చీటింగ్ కేసు
- బ్యాంకులకు 47 కోట్లు రుణాలు ఎగవేసిన కొత్తపల్లి గీత
- బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు జైలు శిక్ష
- బీజేపీ పార్టీలో అవినీతిపరులు తప్పితే మంచివారికి చోటు లేదని ప్రశ్నిస్తున్న నేతలు
11:19 AM, March 26th 2024
అనపర్తి టీడీపీలో కలకలం
- అనపర్తి అభ్యర్థిగా గతంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు
- అనపర్తి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అనపర్తి టీడీపీ కార్యకర్తలు
- ఎన్నికల ప్రచారం నిలిపివేసిన టీడీపీ క్యాడర్
- మూకుమ్మడిగా దిగువ స్థాయి కేడర్ అంతా రాజీనామాలు చేసి జోన్ -2 ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేత
11:17 AM, March 26th 2024
టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.. మంత్రి పెద్దిరెడ్డి
- టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి
- వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది
- కానీ టీడీపీ వలంటీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం
- వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు
- గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు
- టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు
- నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు
- టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది
- ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు
- కేవలం తమ స్వార్థం కోసం వాలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది
11:03 AM, March 26th 2024
అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు
- ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ
- ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన
- ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం
10:05 AM, March 26th 2024
వలంటీర్లు ఉగ్రవాదులు కాదు.. సేవా సైనికులు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
- వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు
- వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా..?
- గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది
- వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నారు..
- వారంటే చంద్రబాబుకు చులకన
- అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు.
- సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి..
09:26 AM, March 26th 2024
మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత
- పెందుర్తిలో కొనసాగుతున్న నిరసనలు
- పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని డిమాండ్
- టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు
- పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం
- చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
- బండారు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి తండ్రీకొడుకులే కారణమంటూ మండిపాటు
- బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిక
09:22 AM, March 26th 2024
విశాఖ సౌత్ సీటుపై పవన్ కల్యాణ్ యూ టర్న్..?
- వంశీకే సీటు అంటూ హామీ ఇచ్చిన పవన్
- ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన వంశీ
- నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వంశీ
- చివరి నిమిషంలో జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు..
- ఆందోళనలో వంశీ వర్గీయులు..
- వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు
- వంశీ పై వ్యతిరేకతతోనే సౌత్ సీటు పెండింగ్ లో పెట్టారనే చర్చ
- మరో వైపు విశాఖ సౌత్ లేదా భీమిలి ఆశిస్తున్న బీజేపీ నేత మాధవ్
- జరుగుతున్న పరిణామాలతో అయోమయంలో జనసేన క్యాడర్
09:13 AM, March 26th 2024
టీడీపీ నేత సుధీర్ రెడ్డి మనీషా .. పశువా ?: వెల్లంపల్లి శ్రీనివాస్
- వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- వలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు
- గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు
- వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటివారు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదు
- చంద్రబాబు మాటమీద నిలబడడు
- వలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటూ గతంలో హేళన చేసారు
- ఇటీవల వలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారు
- టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారు
- ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదు
08:56 AM, March 26th 2024
పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు
- ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు
- ఒక పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించిన జనసేన
- 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంపై తేలని పంచాయతీ
08:36 AM, March 26th 2024
కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన
- కుప్పం నియోజకవర్గం ప్రజల్ని ఆకట్టుకోని చంద్రబాబు బహిరంగసభ
- చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలు
- టీడీపీకి ఓటు వేయకపోతే మగవాళ్ళను ఇంట్లోకి రానివ్వదంటూ మహిళల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు
- కుప్పంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు
- చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి ఇంటికి ప్రచారం చేసినా పట్టించుకోని కుప్పం ప్రజలు
- కుప్పంలో 33 వేల దొంగ ఓట్లు తొలగింపుతో చంద్రబాబు వెన్నులో వణుకు
08:31 AM, March 26th 2024
జనసేనలో తేలని టికెట్ల పంచాయితీ
- జనసేనలో తేలని అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం టిక్కెట్ల పంచాయితీ
- మచిలీపట్నం ఎంపీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న వల్లభనేని బాలశౌరి
- ఇటీవల జనసేనలో చేరిన బాలశౌరి
- నిన్నటి వరకూ తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న బాలశౌరి
- తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి కొత్తపేరు
- మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలనలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పేరు
- బండారు పేరు పరిశీలనతో ఎంపీ టిక్కెట్ పై ఆందోళనలో బాలశౌరి
- అవనిగడ్డలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్న పవన్
- బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లతో సర్వేలు చేయిస్తున్న పవన్
- ఐవీఆర్ఎస్ సర్వేలతో అయోమయంలో జనసేన క్యాడర్
08:26 AM, March 26th 2024
సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్
- ధర్మవరం టికెట్ కోసం వర్గపోరు
- మధ్యేమార్గంగా రేసులోకి మరోపేరు
- ధర్మవరం అసెంబ్లీ సీటుపై వీడని పీటముడి
- రేసులోకి సత్యకుమార్!
- ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు
- ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు
- సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు.
- ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం
08:13 AM, March 26th 2024
మోదీతో జగన్ ది ప్రభుత్వ సంబంధమే: సజ్జల రామకృష్ణారెడ్డి
- కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో అనుబంధం
- బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది
- ఎన్డీఏతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం
- ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం
- నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్
- చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం
- గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నాం
- 87శాతం మందికి సంక్షేమం అందించాం
- ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే
- ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది
- ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50 శాతం లోపే
- పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదు
- పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది
- అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా?
- రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ లేదు
- రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు
- షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు
- రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు
- ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు
07:52 AM, March 26th 2024
30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం
- పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రారంభం
- మూడు విడతలుగా ప్రచారం
- రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి
- పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి
- టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు
07:21 AM, March 26th 2024
‘శవా’లెత్తిపోతున్న టీడీపీ
వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు
ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం
నల్లమాడ మండలంలో అమర్‌నాథ్‌రెడ్డి అనే వ్యక్తి హత్య
టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం
చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్
07:15 AM, March 26th 2024
‘దేశం’లో కమలం కల్లోలం
- ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ
- తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
- సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక
- పలువురు టీడీపీ నేతల రాజీనామా
- రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్‌చార్జి సుజయ్ కృష్ణకు అందజేత
- అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు
07:02 AM, March 26th 2024
ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం
- రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్
- రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు
- అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే
- సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం
- ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం
- రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు
- 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి
- 33 శాసనసభ, 4 లోక్‌సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే
- ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్
- కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు
06:50 AM, March 26th 2024
రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’..
- ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
- రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం
- వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం
- వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ
- 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర
- ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర
- సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర
- బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం
- ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ
- సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు... మరోసారి చారిత్రక విజయం సాధించడమే లక్ష్యంగా "మేమంతా సిద్ధం" పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి భారీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం @ysjagan. #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JR8BXV6rqe
— YSR Congress Party (@YSRCParty) March 25, 2024
06:47 AM, March 26th 2024
ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం
- పెండింగ్‌లో పెట్టిన స్థానాలపై గందరగోళం
- పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే
- పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ
- టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి
- బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు
- గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట
- రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం
- దర్శి, అనంతపురం అర్బన్‌లో అభ్యర్థుల కోసం పాట్లు
- 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే
06:43 AM, March 26th 2024
వెన్నుపోటు పొడుస్తారా?
- టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం
- తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు
- మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటివ్వాలంటున్న బీజేపీ నేతలు
- 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు
- చివరికి కాంగ్రెస్‌తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి
- మరోవైపు.. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విష ప్రచారం
- టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment