సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం మూడు వారాల్లోనే పది వేల కోట్ల అప్పులు చేసిందని.. సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబు అధికారంలోకి వచ్చారు.. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రా రెడ్డి.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను బాబు పక్కనపెట్టారు.. వాలంటీర్లకు పది వేల రూపాయల ఇస్తామన్న మాట ఏమైంది? అని మండిపడ్డారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు?.రైతులకు నిధులు ఏ తేదీన విడుదల చేస్తారో చెప్పాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తల వ్యాపారాలు, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాడులు పక్కనపెట్టి, సంపద సృష్టిపైన దృష్టి పెట్టండి. టీడీపీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని రవిచంద్రారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment