promises
-
కోతలే తప్ప చేతలు లేవు
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. ఆశచూపి వెన్నుపోటు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
కొత్త ఏడాదిలో... ఇలా చేద్దాం!
న్యూ ఇయర్‌ను ‘హ్యాపీ’గా మలచుకునే మార్గాలు కాలం ఒక మాయాజాలం. కళ్లముందే కరిగిపోతుంది. ఒడిసిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా వేలి సందుల గుండా ఇట్టే జారిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది చూస్తుండగానే కరిగిపోయింది. తీపి, చేదు అనుభవాలను మిగిల్చి 2024 చరిత్ర పుటల్లోకి జారుకుంది. కొత్త ఆశలను, సరికొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2025 వచ్చేసింది. బద్ధకం వదిలించుకుంటామని, ఇంకోటని, మరోటని... ఇలా న్యూ ఇయర్ అంటేనే ఎన్నో తీర్మానాలు, మనకు మనమే చేసుకునే వాగ్దానాలు. ఇటు చేసే పనిని, అటు ఈదే సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటిల్లిపాదితో పాటు మన ఆరోగ్యమూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించేయాలి. కొత్త అభిరుచులు పెంచుకోవాలి. మొత్తమ్మీద వీలైనన్ని ఆనందమయ క్షణాలను ఒడిసిపట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా ఉండే ఆశలే. ఇవన్నీ తీరి 2025 ఆసాంతం హాయిగా సాగేందుకు ఏమేం చేయాలంటే..!ఆందోళనకు చెక్ ఆధునిక జీవన విధానం పుణ్యమా అని అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎవరికైనా ఉండేవే. కానీ రోజులో చాలాభాగం ఆందోళన మధ్యే గడుస్తోందంటే మాత్రం డేంజరే. కాస్త ఆగి, అర్థం చేసుకునే లోపే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోతుంటుంది. కనుక మనసును కుంగదీసే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిష్పాక్షికంగా మదింపు చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారానికోసారి కొంత సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రథమ కోపం వంటివేమైనా పెరుగుతున్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. ఆ లక్షణాలు కనిపిస్తే మొదట్లోనేవదిలించుకోవాలి. లేదంటే ఆఫీసులోనూ, ఇంట్లోనూ లేనిపోని సమస్యలు నెత్తిన పడటం ఖాయం. లేదంటే నచ్చనిది, ఊహించనిది జరిగితే వెంటనే అరిచేసి అవతలి వారిని గాయపరచడం లాంటివి పెరిగిపోతాయి. ఇది సంబంధాలను సరిచేయలేనంతగా దెబ్బ తీస్తుందని గుర్తుంచుకోవాలి. అది ఆఫీసైనా కావచ్చు, ఇల్లయినా కావచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మనమూ మనుషులమే గనుక ఎప్పుడైనా నోరు జారవచ్చు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరే చొరవ తీసుకోండి. అవసరమైతే అవతలి వారికి సారీ చెప్పినా తప్పు లేదు. అది మీకు నామర్దా అని అస్సలు అనుకోవద్దు. అవతలి వారి దృష్టిలో వ్యక్తిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుసుకోండి. మంచి సావాసం మీకన్నా తెలివైన వారితో, మంచివారితో వీలైనంత ఎక్కువగా గడపండి. తెలివైనవారి సాహచర్యంలో తెలియకుండానే బోలెడు విషయాలు నేర్చుకుంటారు. మంచివారు ఆచరించి చూపే జీవిత విలువలు మనకు దారి చూపే దీపాలవుతాయి. వాటిని ఎంతగా అలవర్చుకుంటే అహంకారం వంటి అవలక్షణాలు అంతగా అణగుతాయి. మానసిక ప్రశాంతతకు, నిజమైన తృప్తికి బాటలు పడతాయి. బద్ధకానికి బై బై బద్ధకాన్ని వదలించుకుందాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీన్ని న్యూ ఇయర్ తీర్మానాల చిట్టాకు పరిమితం చేయకండి. ఈ క్షణం నుంచే ఆచరణలో పెట్టండి. దీన్నొక్కదాన్ని దూరం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైనట్టేనని గుర్తుంచుకోండి. మెదడును ఖాళీగా ఉంచకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. వృత్తి సంబంధ నైపుణ్యాలను మెరుగుపెట్టుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్నీ అమాంతంగా పెంచేస్తుంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అటు బద్ధకమూ వదులుతుంది. ఇటు చక్కని ఐడియాలూ పుట్టుకొస్తాయి. రెండిందాలా లాభమే. ఇతరులకు సాయపడదాం ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం వల్ల కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదు. అది ఎన్ని వేలు, లక్షలు ఖర్చు చేసినా దొరికేది కాదు. మనకిష్టమైన వారికి సాయపడటం పెద్ద విషయమేమీ కాదు. మీకిష్టం లేని వారికి అవసరాల్లో సాయపడితే మనిíÙగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇతరుల్లోని మంచిని గుర్తించడం, అభినందించడం అలవాటుగా మార్చుకుంటే మన సాన్నిధ్యాన్ని అంతా ఇష్టపడతారు. పరిష్కారాలు సూచిద్దాం ఎప్పుడూ సమస్యలను ఎత్తిచూపడం కాదు. అది అందరూ చేసేదే. ఇంతకాలంగా మనమూ చేస్తూ వస్తున్నదే. వాటికి ఆచరణసాధ్యమైన పరిష్కారాలను సూచించే ధోరణి అలవర్చుకుందాం. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మనల్ని అందరికీ అత్యంత ఇషు్టలను చేస్తుందిది. ముఖ్యంగా ఆఫీసుల్లో మేనేజర్ వంటి పొజిషన్లలో ఉంటే ఈ ఒక్క అలవాటుతో సహోద్యోగులందరి మనసూ ఇట్టే గెలుచుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి వాళ్లకు సలహాలివ్వడమే గాక ఎప్పటికప్పుడు తోడు నిలిస్తే వాళ్లకూ బాగుంటుంది. మనకూ తృప్తిగా ఉంటుంది. సంస్థా లాభపడుతుంది. అలా ఆల్ హ్యాపీసే. చిన్న విజయాలనూ ఆస్వాదిద్దాం విజయం సాపేక్షం. దానికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనమిస్తారు. భారీ లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే విజయానందం గొప్పదే. కానీ దాని కోసమని ఆనందాన్ని అప్పటిదాకా వాయిదా వేసుకోవడమెందుకు? ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సాఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చు కుందాం. అప్పుడిక ప్రతి రోజూ పండుగే. ఆత్మానందమూ ముఖ్యమే వ్యక్తిగత, వృత్తిగత, సాంసారిక సంతృప్తి చా లా ముఖ్యమే. కానీ ఆత్మానందం వీటన్నింటి కంటే విలువైనది. దాన్ని పొందేందుకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నం మొ దలు పెడదాం.అంటే ఎకాయెకిన కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేసి తీరాలని కాదు. ఏ కవిత్వం, సంగీతం వంటివాటితో లోపలి ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టవచ్చు. నేనెవరిని అనే మూలాలోచన అంటూ ఒకటి మనసులో ఒక పక్కన సాగుతూ ఉంటే చాలు. ఆత్మాన్వేషణకు క్రమంగా బాటలు అవే పడతాయి. చివరగా, వీలైనంతగా నవ్వండి. మానసికంగా అది కలిగించే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదని ఎన్నెన్నో అధ్యయనాలు ముక్త కంఠంతో తేల్చాయి. మొహంపై చిరునవ్వు చెరగని వారికి ప్రతి క్షణమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం?! ఈ క్షణమే రంగంలోకి దిగుదాం. బద్ధకాన్ని వదిలించుకుందాం. మనల్ని మనం నిత్యం సానబట్టుకుంటూ సాగుదాం. 2025ను మన జీవితంలోకెల్లా అత్యంత ఆనందమయమైన ఏడాదిగా మలచుకుందాం. అవసరాలకే జై కోర్కెలకు, కనీస అవసరాలకు చాలా తేడా ఉంది. ఆశలు అనంతమే గానీ ఆర్జన ఎప్పుడూ పరిమితమే. ఇదొక్కటి గుర్తుంచుకుంటే అవసరాలు, సౌకర్యాలు, ఆడంబరాలకు మధ్య స్పష్టమైన గీత గీయగలం. వేటిని తీర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, వేటిని వదిలించుకోవాలో తేల్చుకోవ డం తేలికవుతుంది. చాలా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకోని అవసరాల కోసం కొంత మొత్తం కూడా పక్కన పెట్టుకోగలుగుతాం. ఆర్థిక ప్రశాంతత ఎంత బావుంటుందో అనుభవంలోకి వస్తుంది.బంధాలే ముఖ్యం చిన్న పొరపాట్లకు బంధాలు తెంచుకునేదాకా వెళ్లకండి. ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. అవతలివాళ్లు కూడా మనలాగే మామూలు మనుషులేనని, అప్పుడప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారని గుర్తుంచుకుంటే చాలు. క్షమించే గుణాన్ని పెంచుకుంటే ప్రపంచమంతా మరింత అందంగా మారుతుంది. ఎప్పుడో జరిగిన అవమానాలను, చేదు సంఘటనలను మనసులో మోయకండి. ఆ భారం నానారకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సహోద్యోగులు కీలకం తిండీ, నిద్రా తదితరాలకు పోగా మన జీవితంలో మిగిలే నాణ్యమైన సమయంలో అత్యధిక భాగం గడిపేది కలిసి పనిచేసే సహోద్యోగులతోనే. వారితో సత్సంబంధాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. చిన్నాచితకా కారణాలతో సహోద్యోగులతో కీచులాటలకు దిగకండి. అందుకోసం అవసరమైతే మీరే కాస్త తగ్గండి. తప్పేమీ లేదు. చక్కని పని వాతావరణం మన మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో అవసరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీల వర్షం
-
పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్‌ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనంరెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కడప : ‘ఎన్నికల ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివర్లో జమిలి ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేశామని వెళ్లగలుగుతారా? వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇలా ఇంట్లో ఎవరినీ వదిలి పెట్టకుండా ఆశ పెట్టారు. ఇప్పుడు వారంతా మా డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కలిసికట్టుగా పని చేద్దాం జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనల్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఇబ్బందులు పెట్టినా, కొంత ఓపిక పట్టండి. మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి. తప్పకుండా సాయం చేస్తారు. నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మేము జిల్లాలో చూసుకుంటాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించండంటూ మీరంతా నాకు అండగా ఒక్కతాటిపై నిలవాలి. ప్రజాపక్షమై గళమెత్తుదాం మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందనుకోలేదు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన సాగిస్తున్నారు. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్లేదు.. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోంది. హామీలు, సమస్యలపై ప్రజాపక్షమై గళమెత్తుదాం. ఇప్పటికే రైతు ధర్నా చేశాం. ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం చేయనున్నాం. జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల తరుఫున మరో కార్యక్రమం చేయాల్సి ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాను. అన్ని జిల్లాల్లో పర్యటిస్తాను. వైఎస్సార్‌కు నివాళులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి.. మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అరి్పంచారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు.. ఓపెన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్, భారతి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబీకులు.. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ సురేష్ బాబు, మాజీ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గంగుల బిజేంద్రనాథరెడ్డి, సుదీర్‌రెడ్డి.. వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
‘భరోసా’ గంగపాలు!
పంపాన వరప్రసాదరావు బాపట్ల జిల్లా వాడరేవు నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : కూటమి పార్టీల నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక ఇలా మొండిచెయ్యి చూపుతారని అనుకోలేదని గంగపుత్రులు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా వాడరేవు గ్రామంలో ఏ గడపకు వెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు వేట నిషేధ సమయంలోనే ఏటా రూ.10 వేల చొప్పున మత్స్యకార భరోసా వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్నెల్లలో తమకు ఎలాంటి సాయం అందించలేదని వాపోతున్నారు. 8 వేలకుపైగా జనాభా ఉన్న ఒక్క వాడరేవు గ్రామంలోనే 2,035 మంది మత్స్యకారులు ఐదేళ్లలో రూ.6.30 కోట్లు మత్స్యకార భరోసాగా అందుకున్నారు. ఈ ఏడాది గ్రామంలో 1,450 మంది అర్హత పొందగా ఆర్నెల్లుగా వేట నిషేధ భృతి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖలు రాసినా, కలసి విన్నవించినా పట్టించుకోలేదంటూ గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇప్పట్లో ఇవ్వలేమని తాజాగా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భరోసా ఇవ్వకుండా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఎందుకని నిలదీస్తున్నారు. ఐదేళ్లలో రూ.538 కోట్లు..వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలతో పాటు రూ.2 వేలు నగదు ఇస్తుండగా చంద్రబాబు హయాంలో నిత్యావసరాలను నిలిపివేసి రూ.4 వేలు చొప్పున వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో.. ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పాదయాత్ర హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఏటా వేట నిషేధ గడువు ముగిసేలోగా అర్హుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా తెప్పలు, ఇతర సంప్రదాయ నావలపై వేటకు వెళ్లే వారికి సైతం సాయాన్ని అందచేశారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 1.23 లక్షల మందికి రూ.538 కోట్ల మేర మత్స్యకార భరోసాతో లబ్ధి చేకూర్చారు.ఈసీకి కూటమి నేతల ఫిర్యాదుతో..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ ఏడాది కూడా మే 2వ తేదీ నుంచి అర్హులను గుర్తించి జాబితాలను సిద్ధం చేసింది. 2023–24లో 1.23 లక్షల మంది అర్హత పొందగా 2024–25లో 1.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం మత్స్యకార భృతిని జమ చేసేందుకు ఈసీ అనుమతించలేదు. అనంతరం ఎన్నికల హామీ మేరకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.260.26 కోట్లు కావాలని మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఐదేళ్లలో వివిధ పథకాలతో లబ్ధి ఇలా..మత్స్యకారులకు లీటర్ డీజిల్‌పై సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా సగటున 23 వేల బోట్లకు రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో తొలి మూడేళ్లలో 460 బోట్లకు, తర్వాత రెండేళ్లకు 1,100 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలి ఏడాదే మెకనైజ్డ్, మోటరైజ్డ్తోపాటు సంప్రదాయ బోట్లు కలిపి 14,229 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చారు. గరిష్టంగా 2023–24లో 23,209 బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ ఇచ్చారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఐదేళ్లలో 175 మందికి రూ.17.71 కోట్ల పరిహారాన్ని అందించింది. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4,913 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ (గెయిల్) పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.485.58 కోట్లు చొప్పున అందచేసి తోడుగా నిలిచింది.రూ.5 లక్షల అప్పు తీర్చిన ‘ఆసరా’.. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన సూరాడ ఎల్లయ్యమ్మ భర్త మత్స్యకారుడు కాగా ఆమె చేపలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఐదేళ్లపాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఏటా రూ.10 వేలు చొప్పున జమయ్యాయి. ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘంలో ఉన్న రూ.5 లక్షల అప్పు అణా పైసలతో సహా మాఫీ అయ్యింది. వారి కుమారుడు కాకినాడలో ఎమ్మెస్సీ చదువుతుండగా కుమార్తె డిగ్రీ చదువుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన అందాయి. ఎల్లయ్యమ్మ మామ పింఛన్ పొందుతుండగా ఆమె అత్త వైఎస్సార్ చేయూత కింద నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున లబ్ధి పొందింది. జగనన్న పాలనలో లబ్ధి పొందని మత్స్యకార కుటుంబం లేదు.. చంద్రబాబు పాలనలో ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని ఎల్లయ్యమ్మ చెబుతోంది. నేను బతికున్నానంటే జగన్ బాబు చలవే.. మైలు సంజీవ్ 40 ఏళ్లుగా చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయనకు గత ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందింది. కుమార్తెకు అమ్మ ఒడి వచ్చింది. పొదుపు సంఘంలో ఆయన భార్య అప్పు మాఫీ అయ్యింది. సంజీవ్ అమ్మకు చేయూత వచ్చింది. నాలుగేళ్ల క్రితం సంజీవ్‌కు గుండెపోటు రావడంతో వలంటీర్ ధైర్యం చెప్పి ఆరోగ్యశ్రీ కార్డుతో గుంటూరు ఆస్పత్రికి పంపించాడు. రూ.4 లక్షలు ఖరీదైన బైపాస్ సర్జరీని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించారు. డిశ్చార్జీ అనంతరం ఇంటికి పంపేటప్పుడు చేతికి డబ్బులిచ్చి పంపారు. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు. నేను ఇప్పుడిలా బతికి ఉన్నానంటే జగన్ బాబు చలవే అంటూ సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు వచ్చి ఆర్నెళ్లు అవుతున్నా వేట సాయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.ఐదేళ్లూ అందుకున్నా.. మా తాతముత్తాల నుంచి చేపల వేటే జీవనాధారం. 20 ఏళ్లుగా వేటకు వెళ్తున్నా. జగన్ పాలనలో ఐదేళ్లూ మత్స్యకార భరోసా అందుకున్నా. మా పిల్లలకు అమ్మఒడి, అమ్మకు చేయూత వచ్చింది. నా భార్యకు పొదుపు సంఘంలో అప్పు మాఫీ అయింది. రేషన్ కూడా ఇంటికే వచ్చేది. వలంటీర్ల వల్ల గడప దాటాల్సిన అవసరం లేకుండా అన్నీ అందేవి. ఇప్పుడు ఏ పని కావాలన్నా వేట మానుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఓపక్క వేటకు వెళ్తే సరైన చేపలు పడడం లేదు. మరోవైపు వేట నిషేధ భృతి ఇవ్వడం లేదు. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.పోలయ్య, వాడరేవు, బాపట్ల జిల్లాహామీని నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం... వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతున్నా హామీని నెరవేర్చలేదు. బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగానే ఈసీ అనుమతితో అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఇప్పుడు మత్స్యకార భరోసాని ఎగ్గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడంతో తీరని అన్యాయం జరుగుతోంది. ఇచి్చన హామీని నిలబెట్టుకోకుంటే మత్స్యకారుల తరపున ఉద్యమిస్తాం. – కొండూరు అనీల్‌బాబు, మాజీ ఆప్కాఫ్ చైర్మన్ -
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్ చేసే కాగ్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్ ఓవర్ అకౌంట్స్) పదే పదే అబద్ధాలా? ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్ ఓవర్ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం. ఇలా సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. మేమిచ్చినవీ ఊడగొట్టారుమెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు. ఆర్థిక విధ్వంస కారుడు బాబే..» ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితికి మించి 2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.» చంద్రబాబు హయాంలో కోవిడ్ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) తక్కువగానే ఉంది. నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. » నాన్ గ్యారంటీ అప్పులు బడ్జెట్లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది. » చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్‌తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్‌తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. అదే 2019–24 మధ్య కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది. మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్‌కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్‌కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 2023–24లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు. మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం. పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది. 32.79 లక్షల మందికి ఉద్యోగాలు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది. మేనిఫెస్టోతో మోసం..చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్‌ను ఉపయోగించారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లలో అతి చిన్న అంశాలు! కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. ఇవన్నీ సూపర్ సిక్స్‌లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే! రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్‌కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా? -
విశాఖలో ఆశ వర్కర్ల నిరసనలు..లోకేష్ గాలి తీసేసిన ఆశావర్కర్
-
నా ఆలోచనలతో సంపద సృష్టిస్తా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ‘అన్ని వర్గాల వారిలో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బీఎం షరతులున్నాయి. అమ్మడానికి ఆస్తులు కూడా లేవు’.. అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హామీలు అమలుచేయడానికి డబ్బుల్లేవుగానీ, తన దగ్గర కొత్త ఆలోచనలున్నాయని చెప్పారు. వాటితో సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారు. బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి నుంచి 21 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఫలితంగా ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడతామని.. ఇందులో భాగంగా ఆరు కొత్త పాలసీలను ప్రకటించామని సీఎం చెప్పారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పాలనతో ప్రభుత్వంలోని అన్ని శాఖలు అస్తవ్యస్థంగా మారాయని, వివిధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. ఇది ఉత్తమ బడ్జెట్.. రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని.. ఇది ఎంతో ఉత్తమ బడ్జెట్ అని చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేరుస్తూ అదనపు హామీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అమరావతిని పట్టాలెక్కించామని.. గోదావరి, పెన్నా, వంశధార నదుల అనుసంధానానికీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సంక్రాంతిలోపు రహదారులపై గుంతలన్నింటినీ పూడుస్తామని.. నూతన మద్యం పాలసీ అమలుతో రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్లన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని.. ప్రజలు కూడా తమ జీవితాలు ఎలా మారాయో చర్చించుకోవాలన్నారు. భూములు అమ్ముకుంటే రాజధాని నిర్మాణం పూర్తి.. ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే అవసరంలేదని తాను గతంలో చాలా సందర్భాల్లో చెప్పానన్నారు. ఇక్కడ 10 వేల ఎకరాల భూమి ఉందని.. దీనిని అమ్ముకుంటే దశల వారీగా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆడబిడ్డల రక్షణ కోసం తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని.. సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెడితే వారు ఏ పార్టీ వారైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. డిసెంబరులోగా పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఇసుక విధానంపై మా ఎమ్మెల్యేలే అసహనంతో ఉన్నారు.. సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 వేల కోట్లు గ్రాంటా అప్పా అనే సందేహాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. అప్పులపై ఆధారపడితే రాష్ట్రం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో 80 శాతం మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారని.. అదే బాబు పాలనలో చేసిన అప్పుల్లో 40 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చుచేశారని పయ్యావుల చెప్పారు. నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని.. అయితే, దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంతేకాక, చాలా జిల్లాల్లో సమస్యలు ఉన్నట్లు తమ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తంచేస్తున్నారని పయ్యావుల సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇసుక పాలసీలో ప్రభుత్వానికి మంచిపేరు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల కళ్లుగప్పటం... రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా రెడ్‌బుక్ అమలుతో దృష్టి మళ్లింపు రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం శాసనసభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు.సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నట్లుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున భృతి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు, రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వయసు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాలను సైతం డైవర్షన్ రాజకీయాలకే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు, శాంతి భద్రతల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు.. ఇప్పుడే కొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్లు, వాటిపైనే చర్చించాలనే వైఖరితో ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల మైనర్ బాలికలు అత్యాచారాలు, హత్యలకు గురి కావడం నుంచి దృష్టి మళ్లించడమే లక్ష్యంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని సన్నద్ధమైనట్లు సమాచారం. మరోపక్క సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బడ్జెట్ సమావేశాల్లో గత సర్కారుపై ఆరోపణలు, నిందలు మోపేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీ కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సూపర్ సిక్స్ హామీ కింద స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. దీని గురించి కూడా సర్కారు నోరు విప్పడం లేదు. ఏటా రైతన్నలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్నారు. ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వరకు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయాన్ని ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వీటి అమలు గురించి ప్రస్తావించకుండా డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ పధకాలకు కేటాయింపులు ఉంటాయో లేదో నేడు తేలనుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.శాసన సభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమల రావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌తో ఆదివారం సమీక్షించారు. -
కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ చూసుకొని ఎన్నికల హామీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బడ్జెట్‌ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?చదవండి: కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది: మోదీ ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి.అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది!. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌరనీయులైన ఖర్గే గారు..గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..?కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా?బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..?ఆరు గ్యారంటీలతో… https://t.co/XcHhFGnDkN— KTR (@KTRBRS) November 1, 2024 -
కాంగ్రెస్ రంగు బయటపడింది: మోదీ
ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. బడ్జెట్‌కు మించి గ్యారంటీలు ఇవ్వొద్దంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హామీలు ఇవ్వడమే సులభమే అయినప్పటికీ వాటిని అమలు చేయడం కష్టం, అసాధ్యమన్న సంగతి కాంగ్రెస్‌కు తెలుసని పేర్కొన్నారు. అమలు చేయలేమని తెలిసినప్పటికీ హామీలు, గ్యారంటీల పేరిట ఆ పార్టీ ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఒక గ్యారంటీని రద్దు చేయాలని చూస్తు న్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. తెలంగాణలో రుణ మాఫీ కోసం రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాలకు పేదలు, రైతులు, యువత, మహిళలు తీవ్రంగా నష్టపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హరియాణా ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను తిరస్కరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే అధ్వాన్న పరిపాలనకు, దిగజారిన ఆర్థిక వ్యవస్థకు, వనరుల లూటీకి ఓటు వేసినట్లేనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే హామీలు అమలు కాకపోవడమే కాదు, ఉన్న పథకాలు సైతం రద్దవుతాయని విమర్శించారు. కాంగ్రెస్ సంస్కృతి అయిన బూటకపు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్ప అదే పాతకాలం నాటి బోగస్ హామీలను కాదని తేల్చిచెప్పారు. -
బాబు మాటలు నేతి బీర చందమే!
బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్‌పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అరిష్టం అవుతుంది!తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా, నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా 2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం అరిష్టం కాదట? జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
హామీలిచ్చా.. అప్పులున్నాయిగా..
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలిచ్చానని, కానీ, రాష్ట్రానికి ఉన్న రూ.10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కులాన్ని అధ్యయనం చేస్తున్నానని, వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నానని అన్నారు. ఆయన శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. అడవి తల్లికి ఆదివాసీ చీరను సమర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశ ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశానని చెప్పారు. దేశంలోని ప్రతి షాపులో అరకు కాఫీ అమ్మేలా చేస్తానన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుతోందని, గిరిజనుల్లో మాత్రం సంతానం పెరగడం శుభపరిణామమని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఏజెన్సీలో డోలీ మోతలు విచారకరమని అన్నారు. డీఎస్సీకి పోటీ పడే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. లంబసింగిలో మ్యూజియం, పాడేరులో మెడికల్ కళాశాల రూ.500 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు. పాడేరులో రూ.10 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తామని, కుళాయి ద్వారా నీళ్లు అందిస్తామని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపించారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సుడిగాలిలో జగన్ కొట్టుకుపోయాడని, ఇక తిరిగి రాడని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో తెచ్చిన 16 పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ద్వారా మీ భూములను దోచుకోవాలని చూశారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు కసరత్తుఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీచేసే విషయంపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆ జిల్లా నేతలతోపాటు పలువురు పార్టీ సీనియర్లతో మాట్లాడారు. పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలు చెప్పిన లెక్కల ప్రకారం గెలవడానికి సరిపోయే సంఖ్య లేదని తెలిసింది. అందుకే అభ్యర్థిని ఖరారు చేయకుండా సాగదీస్తున్నట్లు సమాచారం. పోటీ చేయాల్సివస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. -
చంద్రబాబు నోట మళ్లీ పాత పాట
సాక్షి, నంద్యాల జిల్లా: అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు.. మళ్లీ పాత పాటే పాడారు. గురువారం.. శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు.. ‘‘నేను ఎన్నో హామీలిచ్చాను.. కానీ ఖజానా ఖాళీగా ఉంది. డబ్బులు లేవు.. ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి డ్రామాకు తెరలేపారు.చంద్రబాబు హామీలు అమలు చేసేవి కావని తేలిపోగా, కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే.. వేలం పాట మాదిరిగా ప్రకటించిన హామీలు మరోసారి మాయ చేసేందుకేనని ప్రజలకు అర్థమవుతోంది. 2014లో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో మాయం కావడం ఖాయమంటున్నారు. జనాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. తల్లికి వందనం, రైతులకు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఉచిత పంటల బీమా ఇలా ఎన్నో పథకాలకు ఇంకా డబ్బులు వేయలేని కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఎంత తప్పు చేశామో తెలుసుకుంటున్న ఓటర్లు.. జగన్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబువి బూటకపు మాటలేనని.. సూపర్ సిక్స్ హామీలన్నీ నీటి మూటలేనని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమైంది.కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేసింది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూర్చింది. -
చంద్రబాబూ.. ఆ మాటలు ఏమయ్యాయి?: రవిచంద్రా రెడ్డి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం మూడు వారాల్లోనే పది వేల కోట్ల అప్పులు చేసిందని.. సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబు అధికారంలోకి వచ్చారు.. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రా రెడ్డి.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను బాబు పక్కనపెట్టారు.. వాలంటీర్లకు పది వేల రూపాయల ఇస్తామన్న మాట ఏమైంది? అని మండిపడ్డారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు?.రైతులకు నిధులు ఏ తేదీన విడుదల చేస్తారో చెప్పాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల వ్యాపారాలు, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాడులు పక్కనపెట్టి, సంపద సృష్టిపైన దృష్టి పెట్టండి. టీడీపీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
గొంతు నొక్కేస్తున్నారు..
ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారు. కానీ వీళ్లందరూ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్లు గొంతు పట్టుకుని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు.. నా అక్కచెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులనే అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా – మంగళగిరి సభలో సీఎం జగన్నేను ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని ఎందుకు అంటానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాహాటంగా ‘‘నా..’’ అని పిలుచుకుంటూ వారిపై ప్రేమ చూపించినప్పుడు ఆయా సామాజిక వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలనే తపనతోనే మీ బిడ్డ ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు.– కడప సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, కడప: ‘మీరంతా ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే 57 నెలలకే మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు! వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే జగన్‌కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కి రెండు నెలలైంది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్లు నొక్కినా ఎక్కడ అక్కచెల్లెమ్మలకు డబ్బులు వెళ్లిపోతాయో, ఎక్కడ జగన్‌ను వాళ్లంతా మంచివాడు అని అనుకుంటారేమోనని అది కూడా అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ పథకాల డబ్బులు అందాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ కోర్టుకు వెళ్తున్నాడంటే ఈ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచన చేయండి. బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కట్టి మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు, వైఎస్సార్ జిల్లా కడపలోని వన్‌టౌన్ సమీపాన మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. విశ్వసనీయతతో అడుగులు..మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మరోవైపు మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. ఏ రోజూ కులమతాలు చూడలేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత 59 నెలల కాలంలో 130సార్లు బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. 1.30 లక్షల మంది నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేసే సంస్కృతికి తెర దించి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. విశ్వసనీయతకు అర్థం చెప్పాం మన మేనిఫెస్టోను గడపగడపకూ పంపించి మీరే టిక్ పెట్టాలని కోరుతూ అక్కచెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకున్నాం. మేనిఫెస్టోకి విశ్వసనీయత తెచ్చిన ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? మచ్చుకు కొన్ని గడగడా చెబుతా..మన ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలు మచ్చుకు కొన్ని గడగడా చెబుతా. ‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచి టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన లాంటి వినూత్న పథకాలు, కార్యక్రమాలు గతంలో ఉన్నాయా? ఉన్నత విద్య అభ్యసిస్తున్న 93 శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో లబ్ధి చేకూరుస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలలో భాగస్వామ్యం చేయడం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్ లాంటివి మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు కావా? ఈ రోజు ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న పిల్లవాడు 2035లో ఐబీ సర్టిఫికెట్తో పదో తరగతి పాస్ అవుతాడు. ఆ తర్వాత ఏ హార్వర్డ్ నుంచో, ఎల్ఎస్సీ, స్టాన్పర్డ్ నుంచో, ఏంఐటీ నుంచో సర్టిఫికెట్ కోర్సులతో డిగ్రీ పట్టా తీసుకుంటాడు. ఆ పిల్లవాడు అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతున్నా. పేదల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ వేస్తున్న అడుగులు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆలోచన చేయండి. విప్లవాత్మక పథకాలు, సేవలు..నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు వారి పేరిటే ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. 22లక్షల గృహ నిర్మాణాలను సైతం చేపట్టాం. అక్కచెల్లెమ్మల బాగు కోసం ఇంతగా తపించిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు అందడం గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచితంగా పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి కార్యక్రమాలు గతంలో జరిగాయా?స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లాయర్ల కోసం లా నేస్తం పథకాలను తెచ్చాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కూడా ఇస్తున్నాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యంపై ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60–70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మలకు భద్రతగా గ్రామంలోనే మహిళా పోలీసు, దిశ యాప్ లాంటివి తీసుకొచ్చాం. 14 ఏళ్ల పాటు పరిపాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ముస్లింలకు మీ జగన్ ఇస్తున్న మాట...బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో జత కట్టి ఎన్డీఏలో కొనసాగుతూ మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తున్నాడు. ఇంత మోసాలు, ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా? ఆరు నూరైనా సరే ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్, మీ వైఎస్సార్ బిడ్డ ఇస్తున్న మాట. మరి చంద్రబాబుకు ప్రధాని మోదీ సమక్షంలో ఇదే మాట చెప్పే దైర్యముందా?వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా కూడా చంద్రబాబు ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నాడు? మైనారిటీ రిజర్వేషన్లు అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అర్థం కావటానికి మీ అందరి సమక్షంలో ఒక విషయం చెబుతున్నా. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కాదు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయటం లేదు. పఠాన్లు, సయ్యద్‌లు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడటం ధర్మమేనా? రాజకీయాల కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా? ఎట్టి పరిస్థితిలోనూ ఈ 4శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగుతాయి. ఇవే కాదు.. ఎన్ఆర్సీ, సీఏఏతో సహా ఏ విషయంలోనైనా మైనారిటీల మనోభావాలు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు అండగా ఉంటాం. డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, నా మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, నా మైనారిటీ సోదరికి శాసన మండలి ఉపాధ్యక్షురాలి పదవులు ఇచ్చి గౌరవించాం. మైనారిటీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం మొదలు ప్రతి సందర్భంలోనూ సముచిత స్థానం కల్పించాం. ఆ దివంగత నేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఆయన బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి 7 ఎమ్మెల్యే స్థానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా 4శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్లయ్యింది. మన అభ్యర్థులను దీవించండిమంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాష, కడప ఎంపీగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీలతో గెలిపించాలని కోరుతున్నా. మీ బిడ్డ ఎన్నికల కోసం ఏదీ చేయలేదు..వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే... అవ్వాతాతలకు మొన్నటి వరకు ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు! మీ బిడ్డ చేసిందేదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏదీ ఎన్నికలకు రెండు నెలల ముందు, మూడు నెలల ముందు చేసిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా ముందే కేలండర్ ప్రకటించి ఇదిగో ఈ నెలలో రైతుభరోసా, అమ్మఒడి, చేయూత ఇస్తామని చెప్పి క్రమం తప్పకుండా ఐదేళ్లుగా అందించాడు. సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. ఛీటర్ అంటాం. దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మేనిఫెస్టో అంటూ అందమైన హామీలిచ్చి మన జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? పట్టపగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు.మంగళగిరి బీసీలదేమంగళగిరి సీటు బీసీలది.. వెనుకబడిన వర్గాలది. గతంలో నేను ఆర్కేకు ఇచ్చా. ఈసారి మాత్రం మనం ఈ సీటును త్యాగం చేయాలని ఆర్కేకు చెప్పా. మనం బీసీలకు సీటు ఇస్తే... అటువైపు∙వాళ్లంతా డబ్బు మూటలతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా చంద్రబాబు ఎక్కడా బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన దగ్గర బాగా డబ్బులున్నాయి. అందుకుని ఓటుకు రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. ఆయన డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి.అదంతా మన దగ్గర దోచేసిన సొమ్మే. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేయండి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల భవిష్యత్, తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన వైద్యం మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 2014 బాబు విఫల హామీల్లో ముఖ్యమైనవి» రూ.87,612కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? రూ.14,205కోట్ల పొదుపు రుణాల్లో ఒక్క రూపాయి మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? మంగళగిరి, నగరిలో ఎవరికైనా కనిపిసున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. » అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని చిలకలూరిపేటలో ఉన్న కళామందిర్ సెంటర్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కైకలూరులో ఉన్న తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని పిఠాపురంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
మోసాల బాబు మరో అబద్ధం..
సాక్షి, అమరావతి: నిజం చెప్పకపోవడం.. మాటమీద నిలబడకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం. అందుకే ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీసారి అలవోకగా ఎడాపెడా హామీలిచ్చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటివి ఎన్నో ప్రకటించారు. అందులో మూడ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ‘స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు’ అన్న ఓ అబద్ధపు హామీ కూడా ఇలాంటిదే. నిజానికి.. ఇది ఏ విధంగా చూసినా ఆచరణ సాధ్యంకాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ స్థాయిలో రాష్ట్రంలోని 82.29 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో భారీ మొత్తాన్నే ఈ ఒక్క పథకానికే ఖర్చుచేయాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని వారు వట్టి మాటగా కొట్టిపడేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో చెబుతూ ఏటా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) కింద నివేదికను అందజేస్తుంటాయి. దీని ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో 1–10 తరగతుల్లో 71,77,637 మంది, ఇంటర్మీడియట్లో 10,52,221 మంది కలిపి మొత్తం 82,29,858 మంది విద్యార్థులున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి అక్షరాలా రూ.1,23,44,78,70,000లు అవసరమవుతుంది. సులభంగా చెప్పాలంటే రూ.1,234 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఏటా అమ్మఒడి కింద రూ.6,452 కోట్లు ఖర్చుచేస్తుండగా, దీనికి రెండింతలు ఇస్తానని చంద్రబాబు అలవోకగా ఓ అందమైన అబద్ధపు హామీని ఇచ్చిపడేశారు. ప్రభుత్వ విద్యపై చంద్రబాబు కక్ష.. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు చంద్రబాబునాయుడు కొమ్ముకాశారు. 2014–19 మధ్య సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని, వాటిని కల్పించే పరిస్థితి లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ప్రకటించారు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం ఒక ఎత్తయితే.. 117 జీఓను రద్దుచేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు విద్యకు దూరం కావడం ఖాయం. ఇక గతంలో ఒక స్కూలుకు మంజూరైన పోస్టులను పిల్లలున్నా లేకున్నా కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ, జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం బడిలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నేపథ్యంలో.. తక్కువ విద్యార్థులు, ఎక్కువమంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ఎక్కువ విద్యార్థులున్న స్కూలుకు వారిని బదిలీ చేసేందుకు వీలుగా 2022 జూన్‌లో జీఓ–117 తీసుకొచ్చింది. దీంతో పోస్టులను రద్దుచేయకుండా అదనపు ఉపాధ్యాయులను ఎక్కువమంది పిల్లలున్న స్కూలుకు బదిలీ చేయవచ్చు. పేద విద్యార్థులకు ఎంతో మేలుచేసిన ఈ జీఓను ఉపాధ్యాయ వర్గాలూ స్వాగతించాయి. ఫలితంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులోకి వచ్చారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 117 జీఓను రద్దుచేస్తే.. ప్రభుత్వ విద్య నాశనం కావడంతో పాటు, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసేందుకు ఆస్కారం ఉంది.జగన్ సర్కారులో విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం2019లో ప్రభుత్వం ఏర్పాటుచేశాక సీఎం జగన్ ప్రభుత్వ విద్యపై దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్వాడీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం కరిక్యులమ్‌లో మార్పులు చేశారు. ఉదా.. » ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తేవడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రభుత్వం ఉచితంగా అందించింది. » ప్రతి పేదింటి బిడ్డను బడికి పంపించాలని, ఇలా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసింది. » విద్యార్థి తప్పనిసరిగా బడిలో ఉండేలా చూసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. » కోవిడ్ రెండేళ్లు మినహా మిగిలిన సంవత్సరాల్లో హాజరును పరిగణనలోకి తీసుకుని నాలుగు పర్యాయాలు రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేసింది.సగటున ఏటా రూ.6,452 కోట్లు జమ ఈ పథకం కింద 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021–22లో 42,62,419 మందికి రూ.6,393.6 కోట్లు, 2022–23 విద్యా సంవత్సరంలో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.9 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.25,809.50 కోట్లు అందించింది. అంటే.. సగటున ఏడాదికి రూ.6,452.37 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే, 2024 మేని ఫెస్టోలో రూ.15వేల అమ్మఒడి మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలుచేయనుంది. కానీ, చంద్రబాబు మాత్రం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఇస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. -
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్‌కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్‌ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
2014లో చంద్రబాబు హామీలేంటి? చేసిన మోసాలేంటి?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెబుతారు. హామీలిచ్చి మోసం చేయడంలో ఆయన్ను మించినవారు లేరని దేశమంతా చెప్పుకుంటారు. వర్తమాన భారత రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసపూరిత నేత మరొకరు లేరని అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. 2014 ఎన్నికలపుడు 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో టీడీపీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే మాయం చేశారు. మళ్ళీ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మాయం చేసిన నాటి మేనిఫెస్టోకి కొత్తగా పచ్చ రంగులేసి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తడానికి నానాపాట్లు పడుతున్నారు. చంద్రబాబు అంటేనే దగా, మోసం, కుట్ర, వెన్నుపోట్లు అని అందిరికీ తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తారు, ఏ స్థాయికైనా దిగజారతారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని భ్రమల్లో ముంచుతారు. ఎలాగూ అమలు చేసేది లేదు కనుక ఎటువంటి హామీలైనా ఇచ్చేస్తారు. అలాగే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన తొలి ఎన్నికల్లో 50 పేజీలతో కూడిన రంగు రంగుల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో 600కు పైగా హామీలిచ్చారు. ఒకవైపు బీజేపీని మరోవైపు పవన్‌కల్యాణ్‌ను పెట్టుకుని ప్రచారం చేసుకుని.. అతికష్టం మీద చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే తన మేనిఫెస్టోను ప్రజలు గుర్తు చేసుకోకూడదని, చదివి ప్రశ్నించకూడదని టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. ఇదీ చంద్రబాబు ఘనత. చెప్పేవాడు చంద్రాబాబు అయితే..వినేవాళ్ళు వెర్రివాళ్ళని ఆయన అనుకుంటారు. అందుకే పదేళ్ళనాడు ఇచ్చిన హామీలు ఎవరికి గుర్తుంటాయిలే..అసలు మేనిఫెస్టోనే మాయం చేశాం కదా..అవి ఎవరికీ తెలియవులే అనుకుని..మరోసారి అంతకంటే ఎక్కువగా..అంతకుమించి అన్నట్లుగా హామీలు గుప్పిస్తున్నారు. ఆనాడు అమలు చేయని హామీల్ని ఈసారి అధికారంలోకి వస్తే గొప్పగా అమలు చేస్తానంటూ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అప్పటిమాదిరిగానే..ఈసారి కూడా ఒకవైపు కమలం పార్టీని మరోవైపు పవన్ పార్టీని వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్నవాటికంటే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నట్లు ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయ్యారు చంద్రబాబు. అసలు 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల గురించి వివరంగా చూద్దాం. 50 పేజీల మేనిఫెస్టోలో 11వ పేజీ నుంచి 45వ పేజీ వరకు వందలకొద్దీ హామీలు కనిపిస్తాయి. సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా..ప్రతి ఒక్కరి మీదా హామీల సునామీతో విరుచుకుపడ్డారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో రైతులంతా నానా కష్టాలు పడ్డారు గనుక అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ మీదే తొలి సంతకం చేస్తానని కూడా చెప్పారు. అయితే 87వేల కోట్లకు పైగా ఉన్న వ్యవసాయ రుణాల్ని పంచ పాండవులు మంచం కోళ్ళ సామెతలా 20 వేల కోట్లకు మాత్రమే రద్దు అర్హత ఉందని తేల్చారు. అదీ ఐదు సంవత్సరాల్లో రద్దు చేస్తామని ప్రకటించారు. నాలుగు విడతలు బ్యాంకులకు చెల్లించి ఐదో విడత చెల్లించకుండానే రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రుణాలు రద్దు కాకపోవడంతో వడ్డీలు మరింతగా పెరిగి లక్షలాది మంది భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు. రుణమాఫీ అనేది మోసపూరిత హామీగా చంద్రబాబు రుజువు చేసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ గురించి అడిగిన స్వయం సహాయక బృందాల మహిళలను చంద్రబాబు బెదిరించారు. డ్వాక్రా సంఘాల రుణాలు ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదు. ఇంటికి దగ్గరలోనే ఉన్న మద్యం బెల్ట్ షాపుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ద్వారా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కాని 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కటి కూడా రద్దు కాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలిప్పిస్తామంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు విజయవంతంగా మర్చిపోయారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఒక్కరికి కూడా 30 వేలు కాదు కదా..30 రూపాయలు కూడా ఇవ్వలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఫోన్ ఇవ్వలేదు. పేద కుటుంబాలకు సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇస్తామన్నారు. తన పార్టీ గుర్తు విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క విద్యార్థినికి కూడా సైకిల్ ఇవ్వలేదు. కాలేజ్ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్స్ ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో 8వ తరగతి నుంచే ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ పాఠాలు లోడ్ చేసిన ట్యాబ్స్ ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఉద్యోగ మిత్ర పథకం కింద ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ యువతీ యువకులకు వెయ్యి నుంచి రెండు వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని నాలుగున్నరేళ్ళు కళ్ళు మూసుకుని సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కొద్ది మంది టీడీపీ కార్యకర్తలైన యువతీ, యువకులకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారు. 60 నెలల పాటు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని కేవలం మూడు నెలల పాటు కొద్ది మందికి ఇచ్చి...ఇచ్చేశానంటూ డప్పు కొట్టుకున్నారు చంద్రబాబు. మైనారిటీల కోసం విశాఖ, విజయవాడ, రేణిగుంట ప్రాంతాల్లో మూడు హజ్ హౌజ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఒక్క చోట కూడా వాటి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక కమిషన్ నియమించి బీసీ వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి రిజర్వేషన్లు ఇవ్వకపోగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా హింసించి, అవమానించారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క చోట కూడా అందుకు పూనుకోలేదు. సమాజంలోని ప్రతి వర్గానికీ బోలెడు హామీలిచ్చారు. బీసీ కులాలన్నిటికి నిర్దిష్టమైన హామీలు కురిపించారు చంద్రబాబు. బీసీల అభివృద్ధే తన ధ్యేయమని ప్రచారం చేసుకున్నారు. కాని ఏ ఒక్కరికీ ఎటువంటి సాయమూ చేయలేదు. పైగా చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరకట్ట మీద అక్రమంగా నివసిస్తున్న ఆయన నివాసానికి నాయూ బ్రాహ్మణులు సమస్యలు పరిష్కారం కోసం వస్తే..వారి తోకలు కత్తిరిస్తానంటూ మీడియా ముందే హూంకరించారు. వారిని దారుణంగా అవమానించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి..ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా...వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంటి స్థలాలిస్తుంటే అనేక వందల ప్రాంతాల్లో కేసులు వేసి పేదల్ని నానారకాలుగా హింసించిన దుష్ట చరిత్ర చంద్రబాబుది. అన్ని ఆటంకాలు అధిగమించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి, దాదాపు సగానికిపైగా పేదలకు ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ఓడ రేవులు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ సముద్రంలో కలిసిపోయింది. ఒక్క పోర్టుకు కూడా పనులు ప్రారంభించకపోగా...పోర్టుల విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకుని కేంద్రం ఇస్తానన్నదాన్ని కూడా కాలదన్నారు చంద్రబాబు. కాని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మరో పది ఫిషింగ్ హార్బర్లు కూడా జగన్ నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీటి పథకం కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయి చంద్రబాబు మోసాల చిట్టాలో చేరిపోయంది. ఈ విధంగా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే నారా చంద్రబాబునాయుడు...2014లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలూగానూ చేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారు. మళ్లీ ఈసారి కూడా అంతకంటే భారీ హామీలిస్తూ, వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నీ అమలు చేస్తానని నమ్మించే కుట్రలకు తెర తీస్తున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అయితే..అప నమ్మకానికి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ప్రజలందరికీ తెలుసు. అందుకే వైఎస్ జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నపుడు నువ్వు వచ్చి కొత్తగా మాకు చేసేదేంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా? -
Lok Sabha election 2024: అలవిగాని హామీలు
‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు... బీరు, బంగారం, రూ.10 లక్షలు వనితా రౌత్. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు. కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్ దావూద్ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు! చంద్ర యాత్ర 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ మదురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన శరవణన్ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన. రైతును పెళ్లాడితే.. రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన. బాల్య వివాహాలకు రైట్ రైట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు. మునుగోడును అమెరికా చేస్తా తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన. ప్రపంచవ్యాప్తంగానూ... 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ న్యూ గింగ్రిచ్ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన! ► అవే ఎన్నికల్లో వెర్మిన్ సుప్రీమ్ అనే ఆరి్టస్ట్ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు. ► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు ఏకంగా 822 ఇళ్లన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉచిత కరెంటు.. కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలు ఇవే..
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు తన ఆరు వాగ్దానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుంచారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటివి వీటిలో ఉన్నాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ప్రతిపక్షాల మెగా ర్యాలీలో ఎన్నికల వాగ్దానాలతో కూడిన కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు ఇవే.. అంతరాయం లేని విద్యుత్ ఉచిత కరెంటు విప్లవాత్మక విద్య యూనివర్సల్ హెల్త్‌కేర్ రైతులకు గిట్టుబాటు ధరలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా “ప్రియమైన భారతీయులారా, మీరందరికీ నా శుభాకాంక్షలు. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. దేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. మన దేశానికి అన్నీ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. దేశం గురించి ఆలోచించడానికి ఇక్కడ నాకు చాలా సమయం దొరికింది. భారతమాత బాధలో ఉంది. పిల్లలకు మంచి చదువులు ఉండడం లేదు. ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.