'హామీలు అమలు చేయనివాడు మగాడే కాదు' | General Secretary of the National Women's Federation fires on ap cm | Sakshi
Sakshi News home page

'హామీలు అమలు చేయనివాడు మగాడే కాదు'

Published Fri, Jan 8 2016 1:31 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

'హామీలు అమలు చేయనివాడు మగాడే కాదు' - Sakshi

'హామీలు అమలు చేయనివాడు మగాడే కాదు'

విజయవాడ: కేరళలో ఒక మనిషి హామీ ఇస్తే అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే మనిషిగానే కాదు అసలు మగాడిగానే భావించరని ఏపీ సీఎం చంద్రబాబు నుద్దేశించి జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిరాజా ఘాటుగా విమర్శించారు. ఆదాయం కోసం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సుకు దేశంలోని 27 మహిళా సంఘాలు హాజరయ్యాయి. ఈ సదస్సులో పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ..జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement