సాక్షి, నంద్యాల జిల్లా: అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు.. మళ్లీ పాత పాటే పాడారు. గురువారం.. శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు.. ‘‘నేను ఎన్నో హామీలిచ్చాను.. కానీ ఖజానా ఖాళీగా ఉంది. డబ్బులు లేవు.. ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి డ్రామాకు తెరలేపారు.
చంద్రబాబు హామీలు అమలు చేసేవి కావని తేలిపోగా, కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే.. వేలం పాట మాదిరిగా ప్రకటించిన హామీలు మరోసారి మాయ చేసేందుకేనని ప్రజలకు అర్థమవుతోంది. 2014లో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో మాయం కావడం ఖాయమంటున్నారు. జనాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. తల్లికి వందనం, రైతులకు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఉచిత పంటల బీమా ఇలా ఎన్నో పథకాలకు ఇంకా డబ్బులు వేయలేని కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఎంత తప్పు చేశామో తెలుసుకుంటున్న ఓటర్లు.. జగన్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబువి బూటకపు మాటలేనని.. సూపర్ సిక్స్ హామీలన్నీ నీటి మూటలేనని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమైంది.
కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేసింది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment