టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం
Jul 21 2016 1:01 AM | Updated on Oct 3 2018 6:52 PM
అర్వపల్లి : టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని కల్లబొల్లి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఏఒక్క హామీ నెరవేర్చడం లేదన్నారు. విద్యావలంటీర్ల వ్యవస్థను తీసుకవచ్చి రేషనలైజేషన్ పేరుతో కొత్త జిల్లాలను లింక్‌పెడుతూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చెప్పారు. సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్, దాసరి సోమయ్య, కోటమర్తి శ్రీనివాస్, మెరుగు వెంకన్న, వీరేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement