
వరాలే వరాలు
ఎన్నికల రుతువులో ఓటరే దేవుడు. అతడిని ప్రసన్నం చేసుకుంటేనే ఓట్లు కురిసేది. అందు కే పార్టీలన్నీ ఓటర్లపై వరాల వర్షం కురిపి స్తుంటాయి.
పన్యాల జగన్నాథ దాసు
ఎన్నికల రుతువులో ఓటరే దేవుడు. అతడిని ప్రసన్నం చేసుకుంటేనే ఓట్లు కురిసేది. అందు కే పార్టీలన్నీ ఓటర్లపై వరాల వర్షం కురిపి స్తుంటాయి. సుప్రీంకోర్టు చొరవతో ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల పుణ్యమా ఇకపై మేనిఫెస్టోలో ప్రకటించే ఉచిత హామీల హేతుబద్ధతను, వాటి అమ లుకు అవసరమైన ఆర్థిక వనరుల లభ్యత తదితరాలను పార్టీలు విధిగా వివరించాల్సిం దే. అయినా సరే, శతకోటి దరిద్రాలకు అనం తకోటి ఉపాయాలు. ఎన్నికల ప్రవర్తన నియ మావళి రాకముందే పార్టీలు జాగ్రత్త పడ్డాయి. యూపీఏ సర్కారు సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 9 నుంచి 12కు పెంచింది. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు ఓటర్లపై విసిరిన వరాల వలలు ఇవీ...
ఉత్తరప్రదేశ్
అభివృద్ధి పథకాల్లో ముస్లింలకు 20 శాతం రిజర్వేషన్, పదో తరగతి పాసైన ముస్లిం బాలికలకు రూ.20 వేల నగదు వంటి పథకాలను యూపీ సర్కారు ప్రకటించింది. 1.71 లక్షల మంది విద్యా వాలంటీర్లను క్రమబద్ధీకరించింది.
పశ్చిమబెంగాల్
రాష్ట్రంలోని 30 వేల మంది ఇమామ్‌లకు రూ.2,500 స్టైపండ్, మారుమూల ప్రాంతాల్లోని బాలికలకు రూ.25 వేల చెల్లింపు పథకాలను మవత ప్రభుత్వం ప్రారంభించింది.
మధ్యప్రదేశ్
అధికార బీజేపీ బీపీఎల్ కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను ప్రకటించింది
గ్రామీణ బాలికలకు రూ.220 కోట్లతో ఉచిత సైకిళ్ల పంపిణీ పథకాన్ని ప్రకటించింది
వరద పరిహారాన్ని రూ.6 వేల నుంచి ఏకంగా రూ.70 వేలకు పెంచింది
బీపీఎల్ కుటుంబాలు, రైతులకు చెందిన రూ.1,700 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేసింది
సీనియర్ సిటిజన్లకు తీర్థయాత్రల కోసం రూ.70 కోట్లు ప్రకటించింది
ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు రూ.3కు కిలో గోధుమలు, రూ.4.50కు కిలో బియ్యం చొప్పున 20 కిలోల తిండి గింజలిస్తామని ప్రకటించింది
‘లాడ్లీ లక్ష్మి యోజన’ కింద ఆడపిల్లలు గల పేద కుటుంబాలకు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన కుటుంబాలకు రూ.30 వేల కోట్ల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లను ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్
అధికార బీజేపీ మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా లక్ష లాప్‌టాప్‌లు, గ్రామీణ బాలికలకు ఉచిత సైకిళ్ల పథకం ప్రకటించింది
బీపీఎల్ కుటుంబాలకు కిలో రూపాయి బియ్యం, ఇతర కుటుంబాలకు కిలో రూ.7.50కు గోధుమలు, కిలో రూ.9.30కి బియ్యం ప్రకటించింది
గిరిజనులకు కిలో రూ.5కు శనగపప్పు
రైతులకు ఏటా 7,500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించింది.
60 ఏళ్లు పైబడ్డ జర్నలిస్టులకు నెలకు రూ.5 వేల పింఛను పథకాన్ని ప్రకటించింది.
రాజస్థాన్
బీపీఎల్ కుటుంబాలకు రూపాయికి కిలో గోధుమలు, ఇళ్ల నిర్మాణానికి రూ.1,400 కోట్లను అధికార కాంగ్రెస్ ప్రకటించింది
ప్రభుత్వాసుపత్రులు, వైద్య కేంద్రాల్లో ఉచిత ఆరోగ్య సేవలు, పరీక్షలు, మందులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సౌకర్యాన్ని ప్రకటించింది
ప్రతి ఒక్కరికీ ఉచిత సీఎఫ్‌ఎల్ బల్బులు, 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన 50 వేల మందికి ఉచిత లాప్‌టాప్‌లు, 8వ తరగతిలో ర్యాంకులు సాధించిన 3.5లక్షల విద్యార్థులకు టాబ్లెట్ పీసీలను, బాలికలకు ఉచిత సైకిళ్లను ప్రకటించింది.
12వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించిన మైనారిటీ వర్గాల బాలికలకు గేర్లు లేని స్కూటర్ల పంపిణీ పథకాలు ప్రకటించింది
ఉచితంగా చీరలు, దుప్పట్లు పంపిణీకి రూ.600 కోట్లు కేటాయించింది
ఢిల్లీ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ సర్కారు ఏకంగా 895 అనధికారిక కాలనీలను 2012 సెప్టెంబర్ నాటికే క్రమబద్ధీకరించింది. మరో 1,200 పైగా అనధికారిక కాలనీల క్రమబద్ధీకర ణకు రంగం సిద్ధం చేసింది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.5 లక్షల రుణాలు, 3.50 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమాని కి రూ.5 కోట్లు ప్రకటిం చింది. అయినా ఓటమి పాలైంది.
తమిళ పార్టీల తీరే వేరు...
ఓటర్లకు ‘ఉచిత’ తాయిలాలను ఎర వేయడంలో తమిళనాడు పార్టీల తీరే వేరు. బియ్యం మొదలుకుని బంగారం దాకా ఎడాపెడా ‘ఉచిత’ కానుకలు కురిపిం చడం వాటికి పరిపాటి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే ‘ఉచిత’ వరాల ప్రకటనలో పోటీపడ్డాయి. కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే సర్కారు కలర్ టీవీలు సహా పలు ‘ఉచిత’ పథకాలు ప్రకటించింది. వాటి వల్ల ప్రజలపై రూ.15 వేల తలసరి రుణభారం పడుతుం దంటూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విమర్శించారు. ఆమె మాత్రం అంత కంటే ఉదారంగా ‘ఉచిత’ కానుకలు ప్రకటించారు. పేద యువతుల పెళ్లిళ్లకు మంగళ సూత్రాల కోసం 4 గ్రాముల బంగారం, రూ.25 వేల నగదు, ప్రతి మహిళకు ఫ్యాను, మిక్సీ, గ్రైండర్, బీపీఎల్ కుటుంబాలకు కిలో రూపాయి చొప్పున ప్రతి నెలా 20 కిలోల బియ్యం ప్రకటించారు. కారుచౌకగా అల్పాహారం, భోజనం అందించేందుకు ‘అమ్మ క్యాం టీన్’ పథకం ప్రకటించారు. తమిళనాడు 2013-14 వార్షిక బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లయితే, అందులో సబ్సిడీ భారమే దాదాపు రూ.33 వేల కోట్లు!