అంతు చూస్తారట! | AP CM YS Jagan Public Meeting at Amalapuram | Sakshi
Sakshi News home page

అంతు చూస్తారట!

Published Sat, Aug 12 2023 4:17 AM | Last Updated on Sat, Aug 12 2023 7:30 PM

AP CM YS Jagan Public Meeting at Amalapuram - Sakshi

75 ఏళ్ల ముసలాయన, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు మాట్లాడు­తున్న మాటలు వినండి. అధికారం ఇస్తే ఏం చేస్తారో వీళ్ల నోటితో వీళ్లే చెప్పారు. తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట.. తనకు గిట్టని వారి  అంతు చూస్తాడట.. మట్టుబెడతాడట.. ఉగ్రరూపం చూపిస్తాడట.. ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట! ఇదీ ఈ పెద్దమనిషి నైజం. ఇలాంటి ఆయన కోసం ఆయన దత్తపుత్రుడు పరుగెడు­తున్నాడు. ఈ పెద్దమనిషికి ఏనాడైనా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఉందా? ఫలానా పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేం రాజకీయం? – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: ‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అలా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే గొడవలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాత్ర­లు, సభల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పు­లు చెరి­గారు.

అమలాపురంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నిజంగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ‘వారు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబ­ద్ధాలు చెబుతున్నారు.

ప్రతి రోజూ మోసాలు చేస్తా­రు. మీటింగులు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడు­తున్నారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేశారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. ఎక్కడికక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న వారి పట్ల మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

శవ రాజకీయాలు చేస్తున్నారు. 
మొన్న అంగళ్లులో చంద్రబాబు తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించారు. మళ్లీ పుంగ­నూరులో ఒక రూటుకు అనుమతి తీసుకొని ఆ రూ­ట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీ­సులు మీకు అనుమతి లేదని, అక్కడ అధి­కార పార్టీవాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటు­న్నారు, లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ వస్తుందని చెప్పారు.

♦ దీంతో చంద్రబాబు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాళ్ల క్యాడర్‌ను రెచ్చగొట్టి 47 మంది పోలీసులను గాయపరిచారు. ఒక పోలీసు సోద­రుడికి కన్ను కూడా పోగొట్టాడు. కారణం గొడ­వలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన

ఈ పెద్దమనిషి చంద్రబాబు మనస్తత్వం చూడండి. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి వారిని నానా ఇబ్బందులకు గురిచేశాడు. బీసీల తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నిలువునా దగా చేశాడు.

 మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొన్న విషయం గుర్తుకు తెస్తున్నా. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఏ రోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు.

అక్కచెల్లెమ్మలను సైతం మోసం చేశాడు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అగౌరవ పరిచాడు. ఇటువంటి పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టకుని ఊదరగొడుతున్నాడు. 

నోరు తెరిస్తే అబద్ధాలే
 2014కు ముందు ఈయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగా­రం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావా­లట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణా­లు మాఫీ కావాలంటే బాబు రావాలట. నిరుద్యో­గులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశాడు. రూ.85,712 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, చేయకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. 

 రూ.14,207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. చివరకు చదువుకుంటున్న పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను లేదా ఉపాధి కల్పిస్తాను అని నిస్సిగ్గుగా అబద్ధాల వాగ్దానాలు చేశాడు. లేదంటే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ రూ.2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ ఏటా రూ.24 వేలు అలా ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మోసం చేశాడు. 

మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపు­త్రు­డు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడా­నికి, తినుకోవడానికి మాత్రమే అధికారం కావా­లి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్‌ అవుతుంది.

నాడు, నేడు అదే బడ్జెట్‌..    
 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటి­కన్నా ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మారాడు. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వా­లేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావా­లని ప్రయత్నం చేశాడు. మీ బిడ్డ ఎలా చేయ­గలుగుతున్నాడు. అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని ఆలోచించండి.

మీ బిడ్డ మీ కోసం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఈ నాలు­గేళ్లలో ఇంతటి సంక్షేమాభివృద్ధిని ఏనాడైనా చూశామా? చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా? నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ­లకు రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా ఇచ్చారా? ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచన చేశాడా? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవాలంటే కూడా వద్దన్న చరిత్ర ఆయనది. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు మాత్రం ఇంగ్లిష్‌ మీడియం కావాలి. 

చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించడం ఎప్పుడైనా చేశారా? ఇలా చేయలేకపోయిన ఈ 75 ఏళ్ల ముసలాయన వాటిని అడ్డుకోవడంలో మాత్రం ముందుంటారు. దత్తపుత్రులు ఎందుకిలా పరుగెడుతున్నాడంటే ఆయన సీఎం కావడానికి కాదట. ఈ ముసలాయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికట. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా? 

మీకు మంచి చేయడానికి వస్తున్న వలంటీర్లను కూడా వదలకుండా ఎంత దారుణంగా మాట్లా­డారు. రాబోయే రోజుల్లో వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి.  మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయ, మీ దీవెనలనే. మీకు మంచి జరిగి ఉంటే నాకు మద్దతివ్వండి.

అమలాపురంలో మూడు వంతెనలకు రూ.10 కోట్లు 
అమలాపురంలో మూడు పాత బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిని పునర్‌ నిర్మించాలని మంత్రి విశ్వరూప్‌ అడిగారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం.. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం.. అని విశ్వరూప్‌ చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్‌ను, లేదా అతని కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ను బాగా తిరిగి ఏం పనులు కావాలో చెప్పాలన్నాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ధి చేయడా­నికి మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement