attack on police
-
అంతు చూస్తారట!
75 ఏళ్ల ముసలాయన, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు మాట్లాడుతున్న మాటలు వినండి. అధికారం ఇస్తే ఏం చేస్తారో వీళ్ల నోటితో వీళ్లే చెప్పారు. తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట.. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట.. మట్టుబెడతాడట.. ఉగ్రరూపం చూపిస్తాడట.. ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట! ఇదీ ఈ పెద్దమనిషి నైజం. ఇలాంటి ఆయన కోసం ఆయన దత్తపుత్రుడు పరుగెడుతున్నాడు. ఈ పెద్దమనిషికి ఏనాడైనా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఉందా? ఫలానా పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేం రాజకీయం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: ‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అలా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే గొడవలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాత్రలు, సభల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నిజంగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ‘వారు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేశారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. ఎక్కడికక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న వారి పట్ల మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. శవ రాజకీయాలు చేస్తున్నారు. ♦ మొన్న అంగళ్లులో చంద్రబాబు తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించారు. మళ్లీ పుంగనూరులో ఒక రూటుకు అనుమతి తీసుకొని ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు మీకు అనుమతి లేదని, అక్కడ అధికార పార్టీవాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు. ♦ దీంతో చంద్రబాబు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాళ్ల క్యాడర్‌ను రెచ్చగొట్టి 47 మంది పోలీసులను గాయపరిచారు. ఒక పోలీసు సోదరుడికి కన్ను కూడా పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన ♦ ఈ పెద్దమనిషి చంద్రబాబు మనస్తత్వం చూడండి. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి వారిని నానా ఇబ్బందులకు గురిచేశాడు. బీసీల తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నిలువునా దగా చేశాడు. ♦ మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొన్న విషయం గుర్తుకు తెస్తున్నా. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఏ రోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు. ♦ అక్కచెల్లెమ్మలను సైతం మోసం చేశాడు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అగౌరవ పరిచాడు. ఇటువంటి పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టకుని ఊదరగొడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే ♦ 2014కు ముందు ఈయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశాడు. రూ.85,712 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, చేయకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. ♦ రూ.14,207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. చివరకు చదువుకుంటున్న పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను లేదా ఉపాధి కల్పిస్తాను అని నిస్సిగ్గుగా అబద్ధాల వాగ్దానాలు చేశాడు. లేదంటే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ రూ.2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ ఏటా రూ.24 వేలు అలా ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మోసం చేశాడు. ♦ మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే అధికారం కావాలి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. నాడు, నేడు అదే బడ్జెట్.. ♦ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మారాడు. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావాలని ప్రయత్నం చేశాడు. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని ఆలోచించండి. ♦ మీ బిడ్డ మీ కోసం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఈ నాలుగేళ్లలో ఇంతటి సంక్షేమాభివృద్ధిని ఏనాడైనా చూశామా? చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా? నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా ఇచ్చారా? ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేశాడా? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలంటే కూడా వద్దన్న చరిత్ర ఆయనది. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు మాత్రం ఇంగ్లిష్ మీడియం కావాలి. ♦ చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించడం ఎప్పుడైనా చేశారా? ఇలా చేయలేకపోయిన ఈ 75 ఏళ్ల ముసలాయన వాటిని అడ్డుకోవడంలో మాత్రం ముందుంటారు. దత్తపుత్రులు ఎందుకిలా పరుగెడుతున్నాడంటే ఆయన సీఎం కావడానికి కాదట. ఈ ముసలాయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికట. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా? ♦ మీకు మంచి చేయడానికి వస్తున్న వలంటీర్లను కూడా వదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయ, మీ దీవెనలనే. మీకు మంచి జరిగి ఉంటే నాకు మద్దతివ్వండి. అమలాపురంలో మూడు వంతెనలకు రూ.10 కోట్లు అమలాపురంలో మూడు పాత బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిని పునర్ నిర్మించాలని మంత్రి విశ్వరూప్ అడిగారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం.. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం.. అని విశ్వరూప్ చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్‌ను, లేదా అతని కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను బాగా తిరిగి ఏం పనులు కావాలో చెప్పాలన్నాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. -
పోలీసులే ఫస్ట్ టార్గెట్!
సాక్షి, అమరావతి/ చిత్తూరు రూరల్/ నెట్వర్క్:‘చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా బందోబస్తు విధులు నిర్వహించడానికి మేం వచ్చాం. మా అధికారులు, సహోద్యోగులం అంతా బందోబస్తు విధుల్లో ఉన్నాం. ఇంతలో దూరం నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మావైపు దూసుకువచ్చారు. అసలు వాళ్లు ఎందుకు అంత ఆగ్రహంతో వస్తున్నారో.. ఏం చేయడానికి వస్తున్నారో కూడా మాకు ఎవరికీ అర్థం కాలేదు. ఏమిటి విషయం అని మేము ఆలోచించే లోగానే వాళ్లు రాళ్లతో మాపై దాడులు చేయడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు, పదునైన వస్తువులు పోలీసులపై విసరడం మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా తయారైంది. నా ముందు ఉన్న డీఎస్పీ తలకు ఓ రాయి వచ్చి తగలడంతో రక్తం బొటబొటా కారింది. మా ఎస్.ఐ మేడంపై రాళ్లు, కర్రలు విసరడంతో ఆమె గాయపడ్డారు. ఇంతలోనే నా తల వెనుక భాగాన ఓ రాయి గట్టిగా తగిలింది. కానీ నేను హెల్మెట్ ధరించి ఉండటంతో ఏమీ కాలేదు. తలతిప్పి వెనక్కు చూశాను. నా హెల్మెట్ గ్రిల్స్ మధ్య ఉన్న ఖాళీ నుంచి ఒక రాయి దూసుకొచ్చి బలంగా కంటిపై తగిలింది. దాంతో అమ్మా అని గట్టిగా అరచి నేను కుప్పకూలిపోయాను. రాళ్ల దెబ్బలతో నా ముఖం మొత్తం రక్తసిక్తం అయ్యింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పరీక్షించిన వైద్యులు ఒక కంటికి చూపు పోయిందని చెప్పారు. మరో కంటి చూపు కూడా కోల్పోవచ్చని డాక్టర్లు అంటున్నారు’ అని కానిస్టేబుల్ రణధీర్ ఆవేదనగా చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా శుక్రవారం టీడీపీ కుట్ర పూరితంగా ముందస్తు పన్నాగంతో పోలీసులపై జరిపిన దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన రణధీర్ ఆ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చిత్తూరులో మంగళవారం మీడియాకు వివరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు టీడీపీ నేతలు ఎంత కుట్రపూరితంగా వ్యవహరించారన్నది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ముందస్తు కుట్రే.. రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో టీడీపీ ఆందోళనలో కూరుకుపోయింది. దాంతో ఆయన పర్యటనలకు లేని ఇమేజ్ తీసుకు వచ్చేందుకు అల్లర్ల కుట్రకు పథక రచన చేసింది. ఇందులో భాగంగా పుంగనూరు వద్ద భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రౌడీ మూకలను ముందుగానే తెప్పించారు. పుంగనూరు బైపాస్ నుంచి వెళ్లేందుకు ముందుగా టీడీపీ నేతలు అనుమతి కోరితే పోలీసులు సమ్మతించారు. అందుకే బైపాస్ రోడ్డులో తగిన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు ప్రవేశించేటట్టుగా చేయాలని టీడీపీ నేతలు భావించారు. అలా పుంగనూరు పట్టణంలో పర్యటన సందర్భంగా భారీ ఎత్తున అల్లర్లు సృష్టించాలన్నది వారి పన్నాగం. ముందస్తు అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు పర్యటనను పోలీసులు అనుమతించకపోతే బైపాస్ రోడ్డు వద్దే విధ్వంసకాండ సృష్టించాలని కూడా ప్లాన్ బి రెడీ చేసుకున్నారు. అందుకోసమే భారీ సంఖ్యలో అల్లరి మూకలను బైపాస్ రోడ్డు వద్ద ముందుగానే మోహరించారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ ఇక పుంగనూరు బైపాస్కు సమీపిస్తుందనగానే టీడీపీ రౌడీలు రంగంలోకి దిగారు. బందోబస్తు విధుల కోసం అక్కడ ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై హఠాత్తుగా రాళ్లతో దాడి చేశారు. సాధారణంగా పోలీసులు అనుమతి లేకుండా మోహరించిన వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో కొంత వాగ్వాదం, తోపులాటల అనంతరం పరిస్థితి అదుపు తప్పితే కొందరు పోలీసులకు ఎదురుదిరిగే అవకాశం ఉంటుంది. కానీ పుంగనూరులో అందుకు విరుద్ధంగా టీడీపీ మూకలు కుట్రపూరితంగా పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగించడం గమనార్హం. శాంతియుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక్కసారిగా రెండు వేల మందికి పైగా ఉన్న టీడీపీ అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. పోలీసుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే.. కవ్వింపు చర్యలు లేకుండానే.. టీడీపీ గూండాలు పోలీసులపై భారీ ఎత్తున రాళ్లదాడికి తెగబడి బీభత్సం సృష్టించారు. ఈ పచ్చ మూకల దాడిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కానిస్టేబుల్ రణధీర్ కంటి చూపు కోల్పోవడం బాధాకరం. రణధీర్‌కు అండగా ప్రభుత్వం టీడీపీ గూండాల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ రణధీర్‌కు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఈ దారుణానికి బాధ్యులెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ బాధిత కానిస్టేబుల్ రణధీర్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం ప్రకటించింది. ఆయనకు మినిస్టీరియల్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. రణధీర్కే కాదు యావత్ పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, శాసనసభలో ప్రభుత్వ విప్ జి. శ్రీకాంత్‌రెడ్డి తదితరులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు అంతగా బరితెగించి పోలీసులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చిత్తూరులో మంగళవారం పర్యటించారు. కానిస్టేబుల్ రణధీర్‌ను పరామర్శించారు. మెరుగైన వైద్యంతో పాటు అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రణధీర్ కుటుంబానికి అండగా ఉంటాం పుంగనూరు రాళ్ల దాడిలో గాయపడ్డ రణధీర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్ సగిలి షణ్మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అల్లరి మూకల దాడిలో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కంటి చూపు పొగొట్టుకున్నారని, మరో కన్ను కూడా చూపును కోల్పోవచ్చని వైద్యులు చెప్పారన్నారు. దాతల సాయంతో అతనికి మళ్లీ కంటి చూపు తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. రణధీర్‌కు కంటి చూపు పోవడంపై కొందరు విష ప్రచారం చేస్తుండటం తగదన్నారు. అల్లరి మూకలను కట్టడి చేయడంలో పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. పోలీసు శాఖ నిత్యం నిష్పక్షపాతంగా పనిచేస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పని చేస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ సాయం మరువలేను ఆ రోజు జరిగిన ఘటన ఇంకా నా మదిలో తిరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజు డాక్టర్ వచ్చి ‘నల్లగుడ్డు, తెల్ల గుడ్డు చెదిరిపోయింది. నీకు ఒక కన్ను జీవితాంతం కనబడదు’ అని చెప్పగానే కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అయ్యింది. మా అమ్మా నాన్నకు ఏం చెప్పాలో తెలియలేదు. కట్టుకున్న భార్యకి చెప్పే ధైర్యం ఉన్నా.. ఆరో తరగతి, రెండో తరగతి చదువే నా పిల్లలకు ఏం చెప్పాలని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా. కన్ను పోయిన నాకు పోలీసు ఉద్యోగం ఉంటాదో ఊడతాదో తెలియలేదు. ఆ సమయంలో చాలా భయమేసింది. నా బాధను ‘సాక్షి’ పత్రిక తప్ప మరే పేపర్ రాయలేదు. నేను పోలీసుని. రాజకీయ కార్యకర్తను కాదు. నాకు జరిగిన అన్యాయం ఎందుకు రాయలేదో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు సీఎం జగన్ సార్ నా గురించి ఆరా తీసి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ప్రకటించారు. నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసులో మినిస్టీరియల్ స్టాఫ్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. రాష్ట్ర మొత్తం నాకు అండగా నిలబడిందని సంతోషంగా ఉండాది. ఇది చాలు. – రణధీర్, కంటి చూపు కోల్పోయిన కానిస్టేబుల్ దాడులు చేయించింది బాబే పుంగనూరులో దాడులు చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబే. బాబుకు కుట్ర రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. పుంగనూరులో ఆయనలోని టెర్రరిజాన్ని చూపించాడు. రాష్ట్రంలో మరిన్ని అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నారు. పుంగనూరు దాడులపై చంద్రబాబుపై ఏ–1గా కేసు నమోదు చేయాలి. – నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుపై రౌడీషీట్ తెరవాలి పుంగనూరులో హింసాత్మక ఘటనకు సూత్రధారి చంద్రబాబే. ఆయనపై రౌడీషీట్ తెరవాలి. పుంగనూరులో టీడీపీ వాళ్లు రెక్కీ నిర్వహించి, ఎవరెవరు ఏ విధంగా దాడులు జరపాలో స్కెచ్ వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని దుర్మార్గమైన దాడి ఇది. ఈ దాడిలో పోలీసులను చంపాలనుకోవడం దుర్మార్గం. 40 మందికి పైగా పోలీసుల రక్తం కళ్ల చూశారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున చంద్రబాబును ఉపేక్షించకూడదు. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీడీపీ నేతలూ.. బాబును నమ్మొద్దు పుంగనూరులో హింసకు ప్రధాన కారకుడు ప్రతిపక్షనేత చంద్రబాబే. ఈ కేసులో ఆయన్ను ఏ–1గా చేర్చి రౌడీషీట్ తెరవాలి. ప్రాజెక్టుల యాత్ర పేరిట చంద్రబాబు.. టీడీపీ గూండాలు, రౌడీలతో ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. అల్లర్లు సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, ఆ కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాజకీయంగా వాడుకోవాలన్నది చంద్రబాబు పన్నాగం. ఇలాంటి వ్యక్తి కోసం టీడీపీ కార్యకర్తలు బలికావద్దు. బాబును నమ్మకండి. కందుకూరులో ఇరుకు సందులో మీటింగ్ పెట్టి 8 మంది చనిపోవడానికి కారకుడైన బాబు గురించి ఎవరికి తెలియదు? – గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ 72 మందికి రిమాండ్ పరారీలో కీలక సూత్రధారి చల్లా బాబు పుంగనూరు (చిత్తూరు జిల్లా): పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి ఘటనలో 72 మంది నిందితులను సోమవారం రాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తూ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సింధు ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ర్యాష్ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన కౌన్సిలర్ కొడుకు.. కానిస్టేబుల్‌పైనే దాడి!
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు వాహనదారులు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. జరిమానాలు విధించినా ఏ మాత్రం మారడం లేదు. అంతేకాదు, తాజాగా కొందరు పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏకంగా ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలంలో అస్తంపట్టి పోలీసు స్టేషన్లో అశోక్(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, తన డ్యూటీ ముగియడంతో అశోక్ బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఓ చోట ముగ్గురు వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అశోక్‌కు కనిపించారు. దీంతో, అశోక్ వారి బైక్‌ను ఫాలో అయ్యి ఓ చోట ఆపాడు. అనంతరం, వారిని ఎందుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారంటూ నిలదీశాడు. ఈ సందర్భంగా రెచ్చాఇపోయిన యువకులు.. కానిస్టేబుల్ అశోక్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం, సివిల్ డ్రెస్‌లో ఉన్న అశోక్‌పై దాడి చేశారు. ముగ్గురు యువకులతో పాటు అక్కడే ఉన్న వారి మరో ఇద్దరు అనుచరులు కూడా అశోక్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో, దాడి నుంచి తేరుకున్న అశోక్.. వారిలో నలుగురిని పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులను అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌గా గుర్తించారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పారిపోయిన ఐదో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కౌన్సిలర్ సదాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ అని పోలీసులు తెలిపారు. Pulled up for rash driving, 5 thrash off-duty cop in Tamil Nadu's Salem | Video pic.twitter.com/Mw7aAcXGtg — Times No1 (@no1_times) October 29, 2022 -
మద్యం మత్తులో ఎస్సై వీరంగం.. స్నేహితులతో కలిసి పోలీసులపై దాడి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాలక్రైం: ఓ పోలీస్ ఆఫీసర్ బాధ్యతలు విస్మరించి మద్యంమత్తులో వీరంగం సృష్టించారు. బ్లూకోల్ట్స్ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్ మండలం వేంపల్లికి చెందిన ఆవుల తిరుపతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి మంచిర్యాలలో రోడ్డుపై కారు ఆపి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ హల్చల్ చేశారు. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించగా బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఉస్మాన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన తిరుపతి మరింత రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు. ‘‘నేను బెజ్జంకి ఎస్ఐని. మీరు ఆఫ్ట్రాల్ కానిస్టేబుళ్లు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’అని బెదిరించారు. కానిస్టేబుళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వారివద్ద ఉన్న ట్యాబ్‌ను, సెల్‌ఫోన్ ఎస్ఐ లాక్కుని నేలకేసి కొట్టారు. ఉస్మాన్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన హోంగార్డును కొట్టారు. దీంతో మరింత మంది పోలీసులు రావడంతో తిరుపతి పారి పోయారు. బుధవారం తిరుపతితోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
మహేష్ బ్యాంక్ కేసు.. సినీ ఫక్కీలో భారీ చేజ్.. 2 కి.మీ. వెంటాడి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సూత్రధారులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో కనిపెట్టారు. సోమవారం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రత్యేక బృందంపై దాడికి దిగాడు. అతికష్టమ్మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో సహా మొత్తం నలుగురిని పట్టుకున్న పోలీసులు సిటీకి తరలిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహేష్ బ్యాంక్ సొమ్ము తొలుత 4 ఖాతాల్లోకి బదిలీ అయింది. ఆపై వాటి నుంచి ఢిల్లీ, బెంగళూర్, కేరళ సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 128 ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కాజేశారు. సూత్రధారులతో పాటు ఈ ఖాతాదారులనూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూర్‌లో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌తో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీలో గాలించిన స్పెషల్ టీమ్ పూజాకపూర్, అనిల్‌మాలిక్, సుస్మితలను అరెస్టు చేసింది. రెండు కిలోమీటర్లు వెంటాడి... పట్టుబడిన వారి ప్రాథమిక విచారణ నేపథ్యంలో కొందరు దళారుల ద్వారా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సూత్రధారులకు అందించామని బయటపెట్టారు. తమకు 10 నుంచి 15 శాతం చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కేరళల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎవ్వరూ చిక్కకపోయినా.. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం మాత్రం ముగ్గురు ఖాతాదారులతో పాటు దళారిగా వ్యవహరించిన ఓ నైజీరియన్‌ను గుర్తించింది. వారిని పట్టుకున్న పోలీసులు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. హఠాత్తుగా అతను పోలీసులపై ఎదురుతిరిగాడు. పిడిగుద్దులు కురిపిస్తూ అతడి ఫ్లాట్ నుంచి బయటకు పరుగుతీశాడు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆ వీధుల్లో అతడి కోసం భారీ ఛేజింగ్ చేశారు. దాదాపు 2 కి.మీ. వెంటాడి అదుపులోకి తీసుకోగలిగారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు సైతం మరికొందరు ఖాతాదారులను పట్టుకున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీ సహా ఇతర సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోంది. -
మందు కొట్టేసి.. ఆపై పోలీసులను కొట్టేసి..
శంషాబాద్: మద్యం, గంజాయి మత్తులో ఓ నేపాలీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీస్‌స్టేషన్‌లో బీభత్సం సృష్టించాడు. పోలీసులంతా పాకిస్తాన్ ఏజెంట్లంటూ రెచ్చిపోయాడు. ఓ కానిస్టేబుల్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. మరో కానిస్టేబుల్ వద్ద నుంచి లాఠీ లాక్కుని కనిపించిన పోలీసులందరినీ కొట్టాడు. దాదాపు గంటన్నర పాటు హల్చల్ చేసిన కమల్ ఆపై స్టేషన్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి లేచిన తర్వాత కూడా అదేవిధంగా ప్రవర్తించాడు. వివరాలిలా ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్లో పనిచేస్తూ.. ఇరవై ఐదేళ్ల కమల్ పాయా అనే నేపాలీ శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం 6.30 సమయంలో మద్యం, గంజాయి మత్తులో జోగుతూ చొక్కా కూడా లేకుండా స్టేషన్ వద్దకు వచ్చాడు. లోపలికి ప్రవేశిస్తూ మెట్లపై పడిపోయాడు. అది చూసిన పోలీసు సిబ్బంది లేపి సహకరించడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్క ఉదుటున ఠాణాలోకి ప్రవేశించిన పాయా.. పోలీసులను హిందీలో అసభ్య పదజాలంతో దూషిస్తూ వీరంగం వేశాడు. సిబ్బందిపై దాడికి దిగాడు. శారీరకంగా బలిష్టంగా ఉన్న అతన్ని అదుపు చేసి, స్టేషన్ బయటకు తీసుకువెళ్లడానికి పోలీసులు ఆపసోపాలు పడ్డారు. బీఏసీ కౌంట్ 450 స్టేషన్ ఆవరణలోకి వెళ్లాక కొద్దిసేపు ఆగిన కమల్ మరోసారి పోలీసులపై చేయిచేసుకున్నాడు. మరో సారి ఠాణాలోకి చొరబడి అసభ్య పదజాలంతో పోలీసులను దూషించాడు. తర్వాత అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి లేచి.. తాను శంషాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉంటున్నానని, తనను పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొడుతున్నారంటూ అరవడం మొదలుపెట్టాడు. అతన్ని కష్టమ్మీద పట్టుకున్న పోలీసులు యంత్రంతో శ్వాస పరీక్షించగా.. బీఏసీ కౌంట్ 450 వచ్చింది. దీంతో అతడిని స్టేషన్లోనే ఉంచి యజమానికి సమాచారమిచ్చారు. మద్యంతో పాటు గంజాయి కూడా సేవించడం వల్లే అలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేశారు. -
ఎస్ఐపై యువకుల దాడి
సాక్షి, విజయనగరం: తమను అడ్డుకున్న ఎస్ఐతో గొడవకు దిగారు ఇద్దరు యువకులు. జనం రద్దీ ఎక్కువగా ఉన్నచోట బైక్‌ని అతివేగంగా నడపడమే కాకుండా.. వారించిన ఎస్ఐపై దాడి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం చోటుచేసుకుంది. పాచిపెంట ఎస్ఐ రమణపై దాడి చేసిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తున్న వారిని వారించినందుకు ఆయనపై యువకులు దాడికి దిగినట్లు తెలిపారు. -
సింగ్ కోలుకున్నారు.. చాలా హ్యాపీ
చండీగఢ్: కరోనా మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడిన సాహస సబ్ఇన్స్పెక్టర్ హర్జీత్ సింగ్ పూర్తిగా కోలుకున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. హర్జీత్ సింగ్ చేయి మునుపటిలా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఏప్రిల్ 12న నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికారు. ఆయనను వెంటనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్)కు తరలించగా వైద్య బృందం హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించింది. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘రెండు వారాలుగా పీజీఐఎంఈఆర్‌లో చికిత్స పొందుతున్న హర్జీత్ సింగ్ కోలుకున్నారు. వైద్యులు ఎంతో శ్రమించి ఆయన చేతిని తిరిగి అతికించారు. జీఐఎంఈఆర్ వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు. హర్జీత్ సింగ్ ఇప్పుడు చేయిని మళ్లీ కదలించగలుతున్నార’ని సీఎం అమరీందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. హర్జీత్ సింగ్ వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. కాగా, తాజా సమాచారం ప్రకారం పంజాబ్‌లో ఇప్పటివరకు 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. 71 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం) Sharing latest video of braveheart frontline #Coronawarrior, Sub-Inspector Harjeet Singh whose hand was amputated at Patiala Mandi two weeks ago. All thanks to dedication and hardwork of PGI staff, Harjeet's hand has started regaining movements, watch here. #PunjabFightsCorona pic.twitter.com/duM2qCp5fB — CMO Punjab (@CMOPb) April 27, 2020 -
ఏఎస్ఐ చేయి నరికేశారు!
చండీగఢ్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ముఠా ఇదేమని ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి చేయి తెగిపోగా మరో ముగ్గురు పోలీసులు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కొందరు నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. పోలీసులు వారిని పాస్‌లు చూపించాలని కోరగా బారికేడ్లపైకి వాహనాన్ని నడిపారు. అడ్డుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) హర్జీత్ సింగ్ చేతిని తమ వద్ద ఉన్న కత్తితో నరికారు. మార్కెట్ అధికారితోపాటు మరో ముగ్గురు పోలీసులను కూడా గాయపర్చారు. పోలీసులు వెంబడించగా దుండగులు అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని బల్బేర్ గ్రామంలోని గురుద్వారాలో దాక్కున్నారు. ఈలోగా గాయపడిన హర్జీత్ సింగ్‌ను, తెగిన చేయి సహా అధికారులు చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)కు తరలించారు. నిహంగ్‌ల ముఠా గురుద్వారాలో దాగిన విషయం తెలిసిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. లోపలున్న మహిళలు, చిన్నారులకు హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగిపోవాలని హెచ్చరించినా దుండగులు వినకుండా గ్యాస్ సిలిండర్లతో గురుద్వారాను పేల్చి వేస్తామని బెదిరించడంతోపాటు పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకా>ల్పుల్లో ఆ ముఠాలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన ముఠాలోని ఐదుగురు, ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, కత్తులు, మత్తు కోసం వాడే గసగసాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పీజీఐఎంఈఆర్లోని వైద్య బృందం ఏఎస్సై హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. హర్జీత్ సింగ్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
తప్పతాగి ఖాకీలపైనే..
పనాజీ : తప్పతాగి హైవేపై రచ్చ చేస్తోన్న తాగుబోతులను మందలించిన పోలీసులపైనే మందుబాబులు వీరంగం వేసిన ఘటన గోవా లో వెలుగు చూసింది. దక్షిణ గోవా జిల్లా కుంకోలిం ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులకు గాయాయల్యాయి. నిందితులు పోలీస్ వాహనంపైనా దాడిచేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. కుంకోలిం గ్రామంలోని హైవే వద్ద కొందరు వ్యక్తులు అతిగా ప్రవర్తిస్తున్నారని సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు పోలీస్ బృందాన్ని పంపామని ఎస్పీ అరవింద్ గవాస్ చెప్పారు. ఘటనా స్ధలానికి పోలీసులు చేరుకోగానే తప్పతాగిన నిందితులు ఖాకీలపైనే భౌతిక దాడికి దిగారని ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని, పోలీస్ వాహనంపైనా వారు దాడికి తెగబడ్డారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
ఎస్ఐ పైకే కారు ఎక్కించబోయారు
కుత్బుల్లాపూర్: ముగ్గురు దొంగలు.. కారు కొట్టే శారు.. నగలషాప్‌లో దొంగతనానికి ప్లాన్ చేశారు.. ఇంతలో ఎస్ఐ అక్కడికి రావడంతో ఆయనపైకే కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. తర్వాత కారుతో పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దూలపల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. దూలపల్లి నుంచి దుండిగల్ మార్గంలో దుండిగల్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే పేట్ బషీరాబాద్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సంతోష్‌కు సమాచారమిచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి చేరుకున్న డీఐ సంతోష్, ఎస్ఐ శేఖర్‌రెడ్డి కలిసి ఆ కారు (మారుతీ సుజుకీ ఏకో టీఎస్10ఈజీ 7029) దగ్గరకు వెళ్లారు. ఇంతలో అందులోని వ్యక్తులు ఒక్కసారిగా కారు స్టార్ట్ చేసి ఎస్ఐ మీదకు పోనివ్వడంతో అతను కిందపడిపోయారు. పోలీసులు కింద పడిపోయిన ఎస్ఐను లేవదీసి కారును వెంబడించారు. వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి దూలపల్లి ఫారెస్ట్ రోడ్డు సమీపంలో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అందులోని ముగ్గురు కారు వదిలేసి ఫారెస్ట్ ప్రాంతంలోకి పరారయ్యారు. దీంతో జీడిమెట్ల, పేట్ బషీరాబాద్, దుండిగల్ పోలీసులను అప్రమత్తం చేశారు.కారులో మారణాయుధాలు.. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పరిశీలించగా గ్యాస్ కట్టర్, గడ్డపార, షటర్లు లేపే సామగ్రితో పాటు మారణాయుధాలు లభించాయి. కారు నిలిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తే సమీపంలో ఉన్న ధనేష్ జ్యువెలరీ దుకాణంలో దొంగతానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ మహేశ్ కేసు నమోదు చేశారు. చోరీకి యత్నం.. దొంగలు ఉపయోగించిన వాహనాన్ని అదే రోజు రాత్రి అల్వాల్ పీఎస్ పరిధిలో దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అదే పోలీస్‌స్టేష¯Œ పరిధిలో ఏటీఎం, జ్యువెలరీ దుకాణాల్లో చోరీ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దొంగలించిన వాహనం సికింద్రా బాద్ తిరుమలగిరిలోని సుభాష్‌నగర్‌కు చెందిన పొన్నాల వెంకటేశ్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
గొడవ ఆపడానికి వెళ్లిన పోలీసులపై దాడి
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాపు ఘాట్ వద్ద ఇరు వర్గాల మధ్య గొడవ జరగుతుండగా.. ఇద్దరు పోలీసులు ఆపడానికి వెళ్లారు. అయితే అక్కడున్నవారు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో లంగర్‌హౌస్ పీఎస్‌కు చెందిన హోంగార్డ్ ఆమేర్‌కు, నార్సింగి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
యాదాద్రి జిల్లా పోలీసులపై గిరిజనుల దాడి
-
రక్షక భటులం.. రక్షించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ నేతల ప్రతాపం నానాటికీ శృతి మించుతోంది. టీడీపీ నాయకుల దౌర్జనాలకు నాలుగో సింహం నలిగిపోతోంది. అయ్యా.. బాబూ.. పోలీసోళ్లం కాపాడండి అని వేడుకునే దుస్థితి దాపురించింది. రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కమిషనర్ నుంచి కానిస్టేబుల్‌పై వరకూ అధికార టీడీపీ నేతల బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామంటే దౌర్జన్యం.. చట్ట వ్యతిరేక చర్యలు వద్దంటే దాడులు. అసాంఘీక కార్యకలాపాలు ఆపాలని కోరితే ఆగ్రహం.. ఇలా తెలుగుదేశం పార్టీ నాయకలు పోలీసులపై రెచ్చిపోతున్నారు. రక్షక భటులని పిలిపించుకునే తమకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని పోలీసులు మదన పడుతున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మంగళవారం ఇద్దరు టీడీపీ నేతలు కానిస్టేబుల్‌ను కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా టీడీపీ ఆఫీస్ ఆపరేటర్ యుగంధర్ నాయుడు, అతడి తండ్రి చంద్రశేఖర్ నాయుడు మండల కేంద్రమైన పెనుమూరులో ఓ స్థలం వివాదంలో కానిస్టేబుల్ రమేష్‌ను నడిరోడ్డుపైనే కర్రలతో కొట్టారు. పోలీసులైతే ఏం పీకుతార్రా అంటూ దాడికి దిగారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ఈ నెల 18వ తేదీన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ ఆములూరులో కోడి పందేలను అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై వీరేంద్రబాబు, కానిస్టేబుళ్లపై పందేల నిర్వాహకులైన స్థానిక టీడీపీ నేతలు కుర్చీలతో కొట్టారు. అదేరోజు విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెంలో అశ్లీల నృత్యాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై ఆదినారాయణరెడ్డి, పోలీసు సిబ్బందిని టీడీపీ నేతలు కరణం శ్రీనివాసరావు తదితరులు దాడి చేసి కొట్టారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎస్సై ఆదినారాయణరెడ్డి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. పోలీసు జీపునకు టీడీపీ నాయకులు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం అనంతపురంలో మట్కా మాఫియా పోలీసులపై దాడి చేసింది. పోలీసు జీపును కూడా తగలబెట్టడం సంచలనం రేపింది. ఈ మట్కా మాఫియాను నడిపిస్తున్నది తెలుగుదేశం పార్టీ నేతలేనని పోలీసులకు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి. పోలీసులే బాధితులు అధికార పార్టీ నేతల దాడుల్లో పోలీసులే బాధితులుగా మారుతున్నారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన సంఘటనలపై ఇప్పటికీ పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. తమపై దాడులకు దిగుతున్న అధికారం పక్షం తీరుపై పోలీసు శాఖలో పలువురు మండిపడుతున్నారు. తాము చెప్పిన తప్పుడు పనులు చేయలేదనే ఉక్రోషంతో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు సీనియర్ ట్రాన్సుపోర్టు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేశారు. బాలసుబ్రహ్మణ్యం విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న దేవరపల్లి ఏఎస్ఐ జె.పాపారావుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడి దాడిచేసి కొట్టడంతో బాధితుడు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దెందులూరు నియోజకవర్గంలో ఒక కానిస్టేబుల్‌ను ఇంటికి వెళ్లి మరీ చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా కొట్టారు. కొల్లేరు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేస్తున్న చింతమనేనిని అడ్డుకున్నందుకు ఫారెస్టు అధికారులపై దాడి చేసి కొట్టారు.అయినా చర్యలు లేవు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్, రైటర్‌ను నిర్బంధించి దుర్భాషలాడిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మరో ఎనిమిది మందిపై తప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకునే సాహసం చేయలేకపోయారు. నెల్లూరులో సీఐని తాట తీస్తానంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుర్భాషలాడినా చర్యలు లేవు. -
జైల్లో పెడతానంటావా?.. నా వెనుక టీడీపీ ఉంది
సాక్షి, చిత్తూరు: అధికారంలో ఉన్నామన్న అహంకారమో లేక తమను ఎదురించి అడ్డు చెప్పేదెవరనుకుంటున్నారో ఏమో కానీ టీడీపీ నేతల, సానుభూతిపరుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. సామాన్య ప్రజలపైనే కాకుండా ఏకంగా పోలీసులపై బరితెగించి దౌర్జన్యానికి, దాడులకు పాల్పడుతున్నారు. మొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి బాబ్జి పోలీసులపై దౌర్జన్యానికి దిగిన వార్త మరువకముందే మరో ఘటన టీడీపీ అధినేత సొంత జిల్లాలో చోటుచేసుకుంది. తన కొడుకు టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడనే అండతో ఏకంగా కానిస్టేబుల్‌పైనే దాడికి దిగాడు ఓ తండ్రి. ఈ ఘటన చిత్రూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పెనుమూరులో నివసిస్తున్న చంద్రశేఖర్ నాయుడు కొడుకు యుగంధర్ జిల్లా టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. వీరికి సంబంధించిన స్థల వివాదం కోర్టులో ఉంది. దీంతో ఈ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టరాదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ చంద్రశేఖర్ నాయుడు ఆ స్థలంలో పనులు చేపట్టాడు. స్థానికులు అందించిన సమాచారంతో వివాదస్పద స్థలం వద్దకు చేరుకున్న కానిస్టేబుల్.. కోర్టు పరిధిలోని స్థలంలో పనులు చేపట్టడం నేరమని చంద్రశేఖర్ నాయుడుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తనకే అడ్డు చెబుతావా అన్ని కానిస్టేబుల్‌ను దూషిస్తూ కర్రతో దాడికి దిగాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీనిపై కానిస్టేబుల్ ఎస్ఐకి ఫిర్యాదు చేయగా.. విషయం తెలుసుకున్న యుగంధర్ ఎస్ఐకి ఫోన్ చేసి తన తండ్రిపై కేసు పెట్టవద్దని హుకుం జారీ చేశాడు. ఇక చేసేదేమి లేక కానిస్టేబుల్‌కు ఎస్ఐ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. -
పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఏపీలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. వారికి ఎవరైనా అడ్డుచెప్పినా, ఎదురుతిరిగినా, ప్రశ్నించినా దాడికి దిగటం టీడీపీ నాయకులకు సర్వసాధారణంగా మారింది. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏకంగా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఏలూరు టౌన్ హాల్లో లక్షల రూపాయల్లో జూదం ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. దీంతో చిర్రెత్తుకుపోయిన బడేటి బాబ్జి హాల్ వద్దకు చేరుకుని పోలీసులపై విరుచకుపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే తీరుతో ఒక్కసారిగా విస్తుతపోయిన పోలీసుల సర్దిచెప్పె ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే వినలేదు. అయితే గత ఏడాది రెండు సార్లు దాడి చేశామని, లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. -
ఏలూరులో పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
-
ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేశారు
తాడిపత్రి అర్బన్: కడప టూటౌన్ సీఐ హమీద్, పోలీసు సిబ్బందిని మట్కా మాఫియా సభ్యులు ఇంట్లోకి లాక్కెళ్లి నిర్బంధించి దాడి చేశారని అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సీఐ సురేంద్రరెడ్డి, ఎస్ఐ శ్రీధర్, రాఘవరెడ్డిలు 11 మంది నిందితులను కొత్త మసీదు టీచర్స్ కాలనీలో సోమవారం అరెస్టు చేశారన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మట్కా కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐ హమీద్ సిబ్బందితో కలసి ఆదివారం తాడిపత్రికి వచ్చారన్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులు మట్కా కేసుకు సంబంధించి రషీద్ తండ్రి ఉస్మాన్‌ను ఆరాతీస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడి వారి వాహనానికి నిప్పుపెట్టిన కేసులో ప్రధాన నిందితులైన రషీద్, ఇతని సోదరులు నౌషాద్, బషీర్, అనుచరులు రజాక్, షేక్షావలి అలియాస్ చోటు, జాన్సన్, ఇలియాజ్ బాషా, గజ్జల అర్జున్, వేటూరి శివకుమార్, షేక్‌ఖాజా, ఇండ్ల వంశీకృష్ణ, మసూద్లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో రషీద్‌పై గతంలో రెండు బైండోవర్ కేసులు, రెండు మట్కా కేసులు మరో రెండు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు ఉన్నాయన్నారు. మిగిలిన వారిపైనా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన సీఐ హమీద్ మాట్లాడలేని స్థితిలో ఉండటంతో గాయపడిన మరో కానిస్టేబుల్ నరేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు తాడిపత్రిలో కేసు నమోదు చేశామన్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేశామన్నారు. ఈ దాడిలో దాదాపు 15 నుంచి 25మంది వరకు పాల్గొన్నట్లు తెలస్తోందన్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. -
పోలీసులపై జేసీ వర్గీయుల దాడి కేసులో హైడ్రామా
సాక్షి, అనంతపురం : కడప పోలీసులపై జేసీ వర్గీయుల దాడి కేసులో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనపై దాడి జరిగిందని సీఐ హమీద్ వాంగ్మూలం ఇచ్చినప్పటికి.. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. రైడ్ చేశాక ఎమ్మెల్యే జేసీతో మాట్లాడాలని నిందితుడు రషీద్ తనకు ఫోన్ ఇచ్చాడని.. అందుకు తాను నిరాకరించటంతో రషీద్ స్వయంగా జేసీతో మాట్లాడి.. ఆయన ఆదేశాలతోనే తనపై దాడి చేశారని సీఐ హమీద్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ వాంగ్మూలాన్ని పోలీసులు పక్కన పెట్టేశారు. కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా జేసీ వర్గీయులకే కేసు పరిమితం చేశారు. సీఐ, కానిస్టేబుళ్లతో మాట్లాడేందుకు మీడియాకు అనుమతులు నిరాకరించారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి మాట్లాడుతూ.. సీఐ హమీద్ ఖాన్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులపై జరిగిన దాడి ఘటనలోనూ రాజకీయాలు సరికాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగటం సరికాదని హితవుపలికారు. జేసీ వర్గీయుల దాడిలో గాయపడి కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడప పోలీసులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పరామర్శించారు. -
హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వివాదం
లక్నో : కన్వార్ యాత్ర చేస్తున్న శివభక్తులపై యూపీ పోలీసు ఉన్నతాధికారులు పూల వర్షం కురిపించడంపై పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మీరట్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ) ప్రశాంత్ కుమార్, మీరట్ కమీషనర్ అనిత మెశ్రమ్‌లతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు శివభక్తులకు స్వాగతం పలుకుతూ హెలికాఫ్టర్ నుంచి పూలు చల్లారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులు ఇలా ఎలా వ్యవహరిస్తారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక వర్గానికి అనుకూలంగా పోలీసుల ప్రవర్తన ఉందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో ఏడీజీ ప్రశాంత్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దీనిలో ఎటువంటి మతపరమైన కోణం లేదని వివరణ ఇచ్చారు. కన్వార్ యాత్ర చేపట్టిన శివ భక్తులకు స్వాగతం పలకడానికే పూలు చల్లినట్టు తెలిపారు. తమ వ్యవస్థ ప్రతి వర్గాన్ని గౌరవిస్తుందని పేర్కొన్నారు. అలాగే రంజాన్, బక్రీద్, జైన్ పండుగల్లో తాము పాలుపంచుకుంటామని అన్నారు. పోలీసు వాహనంపై భక్తుల దాడి కన్వార్ యాత్ర చేపట్టిన కొందరు శివభక్తులు ఇటీవల ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో ఓ కారుపై దాడి చేశారు. వారు దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇందుకు సంబంధించి విమర్శలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే మరి కొందరు శివభక్తులు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేశారు. కర్రలతో ఆ వాహనం అద్దాలను పగులకొట్టారు. పోలీసులు వారించినప్పటికీ లాభం లేకపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అయినా కొందరు పోలీసు వాహనం వెంట పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కన్వార్ యాత్ర : శివభక్తులు ప్రతి ఏడాది శ్రావణమాసంలో కన్వార్ యాత్ర చేపడతారు. ఈ యాత్రలో భాగంగా శివ భక్తులు హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి లాంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి సేకరించిన గంగా జలాలను తమతో పాటు తీసుకెళ్తారు. ఆ పవిత్ర జలంతో తమ ప్రాంతంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. -
వివాదస్పదంగా మారిన యూపీ పోలీసుల చర్య
-
శివ భక్తుల దాడులు
-
కంచరపాలెంలో తాగుబోతుల హల్చల్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మద్యం సేవించి మత్తు తలకెక్కిన కొందరు బర్మా క్యాంపు సమీపంలోని దివ్య వైన్ షాపు వద్ద తీవ్ర రాద్ధాంతం చేశారు. చుట్టు పక్కల వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా బుధవారం సంచలనం రేపింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి బర్మా క్యాంప్ వద్ద రవి, గణేష్ అనే యువకులు బుధవారం సాయంత్రం తాగిన మైకంలో హల్చల్ చేశారు. దీంతో ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు రక్షక్ వాహనంలో వెళ్తే... వారిపై కూడా గణేస్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయాడు. రవిని పట్టుకోగా శరీరంపై కొన్ని దెబ్బలు ఉండడంతో చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన గణేష్ కోసం గాలిస్తున్నారు. రవి బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, గణేష్ కప్పరాడకు చెందినవాడని గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జమ్మూ కశ్మీర్లో ఉగ్ర పంజా..
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీస్ గార్డ్ పోస్ట్‌పై సాయుధ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు ఉగ్రవాదుల బృందం పోలీస్ పోస్ట్‌పై కాల్పులకు తెగబడటంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు. అనంతరం ఉగ్ర బృందం ఘటనాస్థలం నుంచి పరారయినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు అనంతనాగ్ జిల్లాలోని సదర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరినపిన గ్రనేడ్ దాడిలో పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఈ రెండు దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైన భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. -
పోలీసులపై దాడికి యత్నం
సూర్యాపేటరూరల్ : భార్యాభర్తల పంచాయితీ విషయంలో పోలీసులపై దాడికి యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్‌తో సూర్యాపేట మండలం య ర్కారం ఆవాసం దుబ్బతండాకు చెందిన లీలావతికు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సం తానం. అయితే కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడంటూ భర్త బాలు నాయక్‌పై భార్య లీలావతి మూడు రోజుల క్రితం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విషయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గాను ఎస్ఐ శ్రీనువాస్ ఇరువర్గాలను గురువారం స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌కు వస్తూనే పోలీసులపై ఆగ్రహం..? మిర్యాలగూడ నుంచి బాలునాయక్, అతని తమ్ముడు రమేష్‌తో పాటు మరి కొందరు బంధువులు స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు వస్తూనే బాలునాయక్ తమ్ముడు రమేష్ తాను డీజీపీ వద్ద డ్రైవర్‌గా పని చేస్తానని, కేసు విషయంలో నువ్వు ఎంత తీసుకుని మమ్ముల్ని పిలిపించావని ఎస్ఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. స్టేషన్లో ఉన్న పోలీసులు బాలునాయక్, రమేష్‌లను సముదాయించి స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాలునాయక్, రమేష్‌తో పాటు వచ్చిన బంధువులు అందరూ కలిసి పోలీసులపై దాడి చేసే యత్నించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దాడికి యత్నించిన వారు మద్యంతాగి ఉండడంతో పోలీసులు సముదాయించినా వినలేదు. భార్య బంధువుల ప్రతిఘటనతో.. అయితే బాలునాయక్ బంధువులు పోలీసులపై దాడికి యత్నిస్తున్న తీరును చూసి అవాక్కౖన లీలావతి బంధువులు ప్రతిఘటించి వెంబడించా రు. దీంతో బాలునాయక్ బంధువులు పరారీ కావడంతో గొడవ సద్దుమణిగింది. బాలునాయక్, బంధువులను సముదాయించే సమయంలో హోంగార్డు జానకిరాములు కిందపడిపోయాడు. ఆరుగురిపై కేసు నమోదు.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురిపై కేసు న మోదు చేసినట్లు సూర్యాపేట వన్‌టౌన్ ఎస్ఐ క్రాం తికుమార్ తెలిపారు. కేసు నమోదైన వారిలో రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్, రమేష్, రా జేశ్వరి, రమావత్ శాంతి, వినోద, కవిత ఉన్నారు. స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న ఘర్షణ గురించి తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు స్టేషన్‌కు వచ్చారు. ఘర్షణ జరిగిన సంఘటన గురించి సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ శ్రీని వాస్‌ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్‌లపై దాడి చేసే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు.