సాక్షి, మంచిర్యాల: మంచిర్యాలక్రైం: ఓ పోలీస్ ఆఫీసర్ బాధ్యతలు విస్మరించి మద్యంమత్తులో వీరంగం సృష్టించారు. బ్లూకోల్ట్స్ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్ మండలం వేంపల్లికి చెందిన ఆవుల తిరుపతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి మంచిర్యాలలో రోడ్డుపై కారు ఆపి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ హల్‌చల్ చేశారు.
దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించగా బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఉస్మాన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన తిరుపతి మరింత రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు. ‘‘నేను బెజ్జంకి ఎస్‌ఐని. మీరు ఆఫ్ట్రాల్ కానిస్టేబుళ్లు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’అని బెదిరించారు. కానిస్టేబుళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వారివద్ద ఉన్న ట్యాబ్‌ను, సెల్‌ఫోన్ ఎస్‌ఐ లాక్కుని నేలకేసి కొట్టారు. ఉస్మాన్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన హోంగార్డును కొట్టారు. దీంతో మరింత మంది పోలీసులు రావడంతో తిరుపతి పారి పోయారు. బుధవారం తిరుపతితోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment