మెదక్లో భూవివాదం : పోలీసులపై దాడి
మెదక్లో భూవివాదం : పోలీసులపై దాడి
Published Tue, Aug 30 2016 9:18 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
మెదక్ : మెదక్ జిల్లాలో పోలీసులపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. శివంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండాలో మంగళవారం తెల్లవారు జామున భూవివాదంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
సమాచారం అందుకున్న తూప్రాన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌బాబు 40 మంది పోలీసులతో తండాకు వెళ్లారు. గొడవపడుతున్న ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఇరువర్గాలు పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వెల్దుర్తి ఏఎస్‌ఐ శివకుమార్, నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు చెందిన రెండు బొలేరో వాహనాలు, ద్విచక్రవాహనాలకు ఇరువర్గాలు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులపై దాడిచేసిన తండావాసులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. గాయపడిన పోలీసులను మెరుగైవ చికిత్సకోసం హైదరాబాద్‌కు తరిలించారు.
Advertisement
Advertisement