
సాక్షి, విజయనగరం: తమను అడ్డుకున్న ఎస్‌ఐతో గొడవకు దిగారు ఇద్దరు యువకులు. జనం రద్దీ ఎక్కువగా ఉన్నచోట బైక్‌ని అతివేగంగా నడపడమే కాకుండా.. వారించిన ఎస్‌ఐపై దాడి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం చోటుచేసుకుంది. పాచిపెంట ఎస్‌ఐ రమణపై దాడి చేసిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తున్న వారిని వారించినందుకు ఆయనపై యువకులు దాడికి దిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment