
పోలీసులపై టిడిపి కార్యకర్తల దాడి
గుంటూరు: జిల్లాలో అనేక గ్రామాలలో టిడిపి నేతల, కార్యకర్తల దౌర్జన్యం కొనసాగుతోంది. వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై దాడి, ఏజంట్ల కిడ్నాప్ చేయడమే కాకుండా పోలీసులపై కూడా దాడి చేస్తున్నారు. సత్తెనపల్లి మండలం కట్టమూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు.
రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ సిపి ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. రొంపిచర్ల మండలం గోగులపాడులో వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ నేతలు రిగ్గింగుకు పాల్పడుతున్నారు.