kattamuru
-
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు మృతి
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూర్ హైవే ముత్యాలమ్మ గూడెం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌జామ్‌లో లారీ మరొక కారును ఢీకొట్టింది. దీంతో మరో కారులో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం మృతుల సంఖ్య అయిదుకు చేరింది. చనిపోయిన ఐదుగురిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా హైవేపై ట్రాఫిక్ జామ్‌ను కట్టంగూర్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. -
మహిళ ప్రోద్బలంతోనే సారా ఇన్ఫార్మర్ హత్య
పెద్దాపురం : ఎక్సైజ్ శాఖకు ఇ¯ŒSఫార్మర్‌గా వ్యవరిస్తున్నాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు 52 ఏళ్ళ ఉండవల్లి సత్యనారాయణను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పథక రచన చేసినది ఓ మహిళ కావడం విశేషం. వివరాలను పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, సిఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్లు ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. కట్టమూరు గ్రామానికి చెందిన ఉండవల్లి సత్యన్నారాయణ (52) గ్రామంలో సారా విక్రయాలు జరుగుతున్నాయంటూ తరచూ ఎక్సైజ్ అధికారులకు సమాచారమిస్తూ గ్రామానికి చెందిన చిట్టూరి లక్ష్మి, చింతాకుల సత్తిబాబు, రాయుడు వీరబాబులను వేధించేవాడు. దీంతో విసుగు చెందిన లక్ష్మి వారిరువురుతో పాటు హరిజనపేటకు చెందిన బలిపే అర్జు¯ŒSతో కలిపి సత్యనారాయణను హతమార్చాలని పథకం పన్నారు. దీంతో గత నెల 31వ తేదీ రాత్రి సత్యన్నారాయణను పార్టీ చేసుకుందాం రమ్మని ఫో¯ŒS చేసి ఘటనా స్థలానికి తీసుకువెళ్లి వెనుక నుంచి రాడ్‌తో బలంగా కొట్టి చంపి, పక్కనే ఉన్న క్వారీ గోతిలో కప్పేశారు. అలాగే అతడి బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్సై వై.సతీష్ కేసు దర్యాప్తు ప్రారంభించగా గ్రామానికి చెందిన సారా నిందితులపై అనుమానంతో విచారించగా అసలు మిస్టరీని వివరించినట్లు డీఎస్పీ రాజశేఖరరావు తెలిపారు. వారిపై ఎక్సైజ్ కేసులున్నాయని, ముద్దాయిలుగా ఉన్న వీరు సారా విక్రయాలకు అడ్డుపడుతున్నాడన్న అక్కస్సుతోనే హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారం రోజుల్లో కేసును ఛేదించిన సీఐ వీరయ్యగౌడ్, ఎస్ఐలు సతీష్, ఏసుబాబు, వలీ, హెచ్‌సిలు వై.కృష్ణ, కుమార్, గణేష్, భూషణంరెడ్డి, శ్రీనివాసరావు, జయకుమార్, విజయ్‌లను అభినందిస్తూ జిల్లా ఎస్పీ వారికి రివార్డులు ప్రకటించారు. -
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
కట్టమూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం క్వారీ గోతుల్లో పాతి పెట్టిన సారా వ్యాపారులు నిందితుల సమాచారంతో మృతదేహం వెలికితీత కట్టమూరు(పెద్దాపురం): గత ఏడాది ఆఖరి రోజు... నూతన సంవత్సరం పార్టీలో మునిగితేలదామంటూ పార్టీకని పిలిచి వ్యక్తిపై ఉన్న అక్కసుతో దారుణ హత్యకు పాల్పడిన సంఘటన పెద్దాపురం మండలంలో కట్టమూరులో జరిగింది. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కథనం వివరాల్లోకి వెళ్తే.. ఎక్సైజ్, పలు శాఖల అధికారులకు ఇ¯ŒSఫార్మర్‌గా ఉంటూ సారా వ్యాపారుల సమాచారం ఇస్తున్నాడన్న అక్కస్సుతో కట్టమూరు గ్రామానికి చెందిన ఉండవల్లి సత్యనారాయణ (52) అలి యాస్ సారా చౌదరిని అదే గ్రామానికి చెందిన సారా వ్యాపారులు దారుణంగా క్వారీ గోతుల్లో పాతి పెట్టి, బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. గత నెల 31వ తేదీ రాత్రి సత్యనారాయణను పార్టీ చేసుకుందాం రమ్మని అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు ఫో¯ŒS చేసి రప్పించారు. పథకం ప్రకారం స్థానిక హోప్ విలేజ్ వెనుక ఉన్న క్వారీ గోతుల్లో ప్రశాంతంగా ఉంటుందంటూ అందరూ కలసి అక్కడ మద్యం తాగారు. వెనుక నుంచి ఓ వ్యక్తి రాడ్‌తో బలంగా కొట్టి ముగ్గురు కలసి పక్కనే ఉన్న క్వారీ గోతుల వరకు లాక్కునివెళ్లి అక్కడ పాతి పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతుడి బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. తన భర్త ఇంటికి రాలేదని ఎదురుచూస్తున్న భార్య సత్యవతి రెండో తేదీన తన భర్త సత్యనారాయణ కనబడడం లేదని ఫిర్యాదు చేయడంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ వై.సతీష్ కేసు నమోదు చేసారు. డీఎస్పీ రాజశేఖరరావు ఆదేశాల మేరకు సీఐ దర్యాప్తులో భాగంగా సారా వ్యాపారులను విచారిం చారు. దీంతో ముగ్గురు వ్యక్తులు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. శనివారం గ్రామంలో పాతిపెట్టి్టన ప్రాంతానికి వెళ్లి తహసీల్దార్ గోగుల వరహాలయ్య, డీఎస్పీ, సీఐ, ఎస్సై మృతదేహాన్ని వెలికి తీసారు. అలాగే చెరువులో పడేసిన బైక్‌ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని శవ పంచనామా నిర్వహించారు. సత్యనారాయణకు భార్యతో పాటు కుమార్తె, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. -
పోలీసులపై టిడిపి కార్యకర్తల దాడి
-
పోలీసులపై టిడిపి కార్యకర్తల దాడి
గుంటూరు: జిల్లాలో అనేక గ్రామాలలో టిడిపి నేతల, కార్యకర్తల దౌర్జన్యం కొనసాగుతోంది. వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై దాడి, ఏజంట్ల కిడ్నాప్ చేయడమే కాకుండా పోలీసులపై కూడా దాడి చేస్తున్నారు. సత్తెనపల్లి మండలం కట్టమూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ సిపి ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. రొంపిచర్ల మండలం గోగులపాడులో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ నేతలు రిగ్గింగుకు పాల్పడుతున్నారు.