అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య | men murder issue | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

Published Sat, Jan 7 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

men murder issue

  • కట్టమూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
  • క్వారీ గోతుల్లో పాతి పెట్టిన సారా వ్యాపారులు
  • నిందితుల సమాచారంతో మృతదేహం వెలికితీత
  • కట్టమూరు(పెద్దాపురం):
    గత ఏడాది ఆఖరి రోజు... నూతన సంవత్సరం పార్టీలో మునిగితేలదామంటూ పార్టీకని పిలిచి  వ్యక్తిపై ఉన్న అక్కసుతో దారుణ హత్యకు పాల్పడిన  సంఘటన పెద్దాపురం మండలంలో కట్టమూరులో జరిగింది. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కథనం వివరాల్లోకి వెళ్తే.. ఎక్సైజ్, పలు శాఖల అధికారులకు ఇ¯ŒSఫార్మర్‌గా ఉంటూ సారా వ్యాపారుల సమాచారం ఇస్తున్నాడన్న అక్కస్సుతో కట్టమూరు గ్రామానికి చెందిన ఉండవల్లి సత్యనారాయణ (52) అలి యాస్‌ సారా చౌదరిని అదే గ్రామానికి చెందిన సారా వ్యాపారులు దారుణంగా క్వారీ గోతుల్లో పాతి పెట్టి, బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. గత నెల 31వ తేదీ రాత్రి సత్యనారాయణను పార్టీ చేసుకుందాం రమ్మని అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు ఫో¯ŒS చేసి రప్పించారు. పథకం ప్రకారం  స్థానిక హోప్‌ విలేజ్‌ వెనుక ఉన్న క్వారీ గోతుల్లో ప్రశాంతంగా ఉంటుందంటూ అందరూ కలసి అక్కడ మద్యం తాగారు. వెనుక నుంచి ఓ వ్యక్తి రాడ్‌తో బలంగా కొట్టి ముగ్గురు కలసి పక్కనే ఉన్న క్వారీ గోతుల వరకు లాక్కునివెళ్లి అక్కడ పాతి పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతుడి బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. తన భర్త ఇంటికి రాలేదని ఎదురుచూస్తున్న భార్య సత్యవతి రెండో తేదీన తన భర్త సత్యనారాయణ కనబడడం లేదని ఫిర్యాదు చేయడంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వై.సతీష్‌ కేసు నమోదు చేసారు. డీఎస్పీ రాజశేఖరరావు ఆదేశాల మేరకు సీఐ దర్యాప్తులో భాగంగా సారా వ్యాపారులను విచారిం చారు. దీంతో ముగ్గురు వ్యక్తులు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. శనివారం గ్రామంలో పాతిపెట్టి్టన ప్రాంతానికి వెళ్లి తహసీల్దార్‌ గోగుల వరహాలయ్య, డీఎస్పీ, సీఐ, ఎస్సై మృతదేహాన్ని వెలికి తీసారు. అలాగే చెరువులో పడేసిన బైక్‌ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని శవ పంచనామా నిర్వహించారు. సత్యనారాయణకు భార్యతో పాటు కుమార్తె, అల్లుడు, మనుమరాలు ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement