deadbody
-
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
కారులో మృతదేహం కంగారు పడ్డ జనం
-
101 ఏళ్ల తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన కుమారుడు.. 18 నెలలుగా
అమ్‌స్టర్‌డ్యామ్: నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచాడు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇతడు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇతను కూడా వృద్ధుడే కావడం గమనార్హం. వయసు 82 ఎళ్లు. ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. అయితే తన తండ్రిని చాలా మిస్ అవుతానని, ఆయనతో మాట్లాడలేకుండా తాను ఉండలేని కుమారుడు బదులిచ్చాడు. అందుకే మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి రోజు ఆయనతో మాట్లాడుతున్నానని, ఫలితంగా మరోధైర్యాన్ని పొందుతున్నానని తెలిపాడు. అయితే తండ్రి ఎలా చనిపోయాడు అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన మృతికి సంబంధించి కుమారుడిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి చెప్పడంతో ఫ్లాట్‌కు వచ్చి చెక్ చేసినట్లు వివరించారు. కాగా.. ఈయన తండ్రి చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్నాడని, తరచూ ఆస్పత్రికి కూడా వెళ్తారని పొరుగింటి వారు చెప్పారు. మరోవైపు కుమారుడి వయసు కూడా 82 ఏళ్లు కావడంతో అతను సరిగ్గా నడవలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు. ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా ఉందని, వస్తువులు కూడా సరిగ్గా సర్దుకోలేదని పేర్కొన్నారు. ముందు ఇల్లు సర్దుకోవాలని అతనికి వారం రోజులు గడువు ఇచ్చారు. అతను స్వతహాగా తన పనులు చేసుకునే స్థితిలో ఉన్నట్లు కూడా కన్పించడం లేదని, ఇతరుల సాయం కావాల్సి వస్తుందేమోనని పోలీసులు చెప్పారు. వారం రోజుల తర్వాత విచారణ కొనసాగిస్తామన్నారు. కాగా.. నెదర్లాండ్స్‌లో 2015లో కూడా ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని రెండేళ్లపాటు ఫ్రిజ్లోనే దాచాడు. ఆమెకు వచ్చే పింఛను కోసం ఇలా చేశాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకడంతో రూ.36 లక్షలు (40వేల యూరోలు) జరిమానా చెల్లించాడు. చదవండి: నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే! -
చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన జరిగింది. కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లిన కెవిన్ డార్మోడీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను కన్పించకపోవడానికి ముందు అరుపులు, కేకలు విన్పించినట్లు అక్కడున్న వాళ్లు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అతనికోసం సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. అయితే కెవిన్ అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ రాక్షస మొసళ్లను గుర్తించారు అధికారులు. అవేమైనా అతడ్ని చంపి తిని ఉంటాయా అనే అనుమానంతో వాటిని షూట్ చేశారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్ల పొడవు ఉండగా.. మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉంది. వీటిలో ఓ మొసలి కడుపులో కెవిన్ మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అతడ్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అని జాలర్లు తెలిపారు. గతంలోనూ ఓ వ్యక్తిని మొసళ్లు చంపాయని వెల్లడించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. కెవిన్ వయసు 65 ఏళ్లు. ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా కాలంగా చేపలు పట్టడం అలవాటని, ఇందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా బాగా తెలుసుని స్నేహితుడు తెలిపాడు. కానీ కెవిన్ ఇలా చనిపోతాడని అసలు ఊహించలేదన్నాడు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే ఇద్దరూ మృతి -
అనుమానాస్పద స్థితిలో భర్త మృతి.. శవంతో 3 రోజులు
సాక్షి, ఖమ్మం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మతిస్థిమితం లేని ఆయన భార్య 3 రోజుల పాటు శవంతోనే ఇంట్లో గడిపింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి భోగి వీరభద్రం (65) కొణిజర్ల మండలం శాంతినగర్‌లో ఇల్లు నిర్మించుకుని భార్యతో ఉంటున్నాడు. రోజూ తల్లిదండ్రుల యోగ క్షేమాలు కనుక్కునే పెద్దకుమారుడు వెంకటకృష్ణ ఈనెల 6వ తేదీ నుంచి ఫోన్ చేస్తున్నా తీయడం లేదు. దీంతో ఆదివారం ఆయన ఇంటికి వచ్చేసరికి తల్లి వరండాలో కనిపించింది. తండ్రి విషయమై ఆరా తీయగా బెడ్రూమ్లో ఉన్నాడని చెప్పింది. వెంకటకృష్ణ వెళ్లి చూడగా తండ్రి వీరభద్రం మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆయన మృతి చెంది 3 రోజులు అవుతున్నట్లు గుర్తించారు. అధిక రక్తపోటుతో కింద పడడంతో తలకు తీవ్ర గాయమై మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. వెంకటకృష్ణ ఫిర్యాదుతో కేసు నమో దు చేశామని కొణిజర్ల ఎస్ఐ శంకరరావు తెలిపారు. -
ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం
-
సంగారెడ్డి ఆస్పత్రిలో దారుణం.. పోలీసుల నిర్లక్ష్యం, 15 రోజులు మార్చురీలోనే
సాక్షి, సంగారెడ్డి: పోలీసులు.. డాక్టర్ల నిర్లక్ష్యంతో 15 రోజులు మార్చురీలోనే ఓ మృతదేహం కుళ్లిపోయింది. చివరకు సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు.. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ పెద్దఎత్తున సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఉదంతం పూర్వాపరాలిలా.. గత నెల 18వ తేదీన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న శ్రీనివాస్(28)కు తీవ్ర గాయాలయ్యాయి. 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. డిసెంబర్ 23న మృతి చెందాడు. వాస్తవానికి 108 సిబ్బంది 18వ తేదీనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా వారు స్పందించకపోవడం.. మృతుడికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మార్చురీకి తరలించారు. దాదాపు పదిహేనురోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడాన్ని గమనించిన అక్కడి ఉద్యోగులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శవాన్ని తరలించే క్రమంలో మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డును పరిశీలించారు. అందులో ఉన్న వివరాల మేరకు మృతుడు ఝరాసంఘం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబసభ్యులు పోలీసుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అదే సమయంలో జిల్లా పరిషత్ జనరల్‌బాడీ సమావేశానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు నినాదాలు చేసుకుంటూ ఆస్పత్రి నుంచి జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని లాఠీచార్జ్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్! బాధ్యులపై చర్యలకు మంత్రి ఆదేశం విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులను సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు, డాక్టర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్‌ను మంత్రి ఆదేశించారు. విచారణ తర్వాత బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు. కాగా, భర్త మృతిపై మంత్రికి విన్నవించుకుందామని వెళుతుంటే అడ్డుకొని కర్కశంగా తన కడుపులో కాలుతో తన్నిందని మృతుడు శ్రీనివాస్ భార్య సంగీత ఓ మహిళా కానిస్టేబుల్, పోలీసుల తీరుపై మండిపడుతూ రోడ్డుపై రోదించిన తీరు కలచివేసింది. శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్టుగా పనిచేస్తూ జీవనం సాగించేవాడని, వారం, పదిహేనురోజులకోసారి షూటింగ్‌ల నుంచి ఇంటికి వచ్చి వెళ్తారని ఆ నమ్మకంతోనే కుటుంబసభ్యులు శ్రీనివాస్ గురించి ఆరా తీయలేదని చెబుతున్నారు. -
కాసేపట్లో నానక్ రామ్ గూడలోని కృష్ణ స్వగృహానికి పార్థీవదేహం
-
మేడ్చల్ జిల్లా : అంబేద్కర్ నగర్ చర్చ్ లో మహిళ మృతదేహం
-
కారులో డ్రైవర్ మృతదేహం.. ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ
సాక్షి, తూర్పుగోదావరి: కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యమైన ఘటనపై ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు వివరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం తన దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అయితే.. రెండు నెలల నుంచి సరిగా పనిలోకి రావడం లేదని చెప్పారు. మద్యం అలవాటు ఉండటంతో ద్విచక్రవాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురైనట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గత రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌కు గురైనట్టు తెలియడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. చికిత్స కోసం కాకినాడ అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని, అతని తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి వచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. సుబ్రమణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకువెళతామని చెప్పడంతో కారులో అపార్ట్మెంట్ వద్దకు పంపించినట్టు వెల్లడించారు. కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్ ఏమన్నారంటే? ‘నిన్న రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితుడు మణికంఠతో కలిసి బయటకు వెళ్ళాడు. రాత్రి 12 గంటల తరువాత సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురై అమృత ఆసుపత్రిలో ఉన్నాడని ఎమ్మెల్సీ అనంతబాబు మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సుబ్రహ్మణ్యం మృతి చెందాడని అమృత ఆసుపత్రి వైద్యులు నిర్ధారించాక బాడీని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్ళారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చదవండి: బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! -
ప్రముఖ నటుడి కుమార్తె భర్త కిడ్నాప్.. అక్కడ డెడ్ బాడీ.. ఏం జరిగింది..?
తిరువొత్తియూరు : మదురైలో కిడ్నాప్‌నకు గురైన ప్రముఖ నటుడి కుమార్తె భర్త చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆస్తుల కోసం హత్య జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. మదురై జిల్లా తల్లాకులం ప్రాంతానికి చెందిన బాల దండాయుధపాణి(50). ఇతని భార్య రాజ్యలక్ష్మి. ఈమె దివంగత ప్రముఖ సినీ నటులు సెందామరైకి ఏకైక కుమార్తె. ఈ క్రమంలో దంపతుల మధ్య ఏర్పడిన విభేదాల వల్ల ఏడేళ్లుగా భార్య నుంచి విడిపోయి బాల దండాయుధపాణి ఒంటరిగా ఉంటున్నారు. మార్చి 13వ తేదీన బాల దండాయుధపాణి అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో సోమవారం రాత్రి బాలదండాయుధపాణి చెన్నైలోని మదురవాయిల్ ఎం.జి.శంకర పాణి వీధిలో ఉన్న రాజ్యలక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
మూసారాంబాగ్: మూసీలో మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతేరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది. చదవండి: గులాబ్ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..! -
మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం
-
అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు
సాక్షి, ఖమ్మం: అనారోగ్యంతో చనిపోయిన ఓ వృద్ధుడిని మోటారు సైకిల్‌పై కూర్చొబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని ఆత్కూరు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ(70)కు సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారుసైకిల్‌పై మధిరకు వస్తున్నాడు. సిరిపురం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. మోటారుసైకిల్‌పై మధిరకు తీసుకెళ్తుండగా.. ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మోటారు సైకిల్‌పైనే మృతి చెందాడు. అంబులెన్సులో తీసుకెళ్దామంటే వేలాది రూపాయలు కిరాయి అడుగుతున్నారని అదే మోటారుసైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లారు. చదవండి: ధోవతి ఫంక్షన్ తెచ్చిన తంటా..∙ 10 మందికి సోకిన కరోనా -
Hyderabad: మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్: మరణించిన వారిని ఇల్లు/ఆస్పత్రి నుంచి శ్మశాన వాటికకు ఉచితంగా తరలించేందుకు అంతిమయాత్ర రథాలను (అంబులెన్స్) ప్రభుత్వం గ్రేటర్లో అందుబాటులోకి తెచ్చింది. వీటిని అవసరమైన వారు సంబంధిత ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు అంబులెన్స్‌ల కోసం సంప్రదించాల్సిన అధికారుల ఫోన్నెంబర్లను మునిసిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ జోన్ల వారీగా వెల్లడించారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సుల వారు భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులతో మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రభుత్వం ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. జోన్ల వారీగా అంబులెన్సుల కోసం సంప్రదించాల్సిన అధికారులు.. వారి ఫోన్ నెంబర్లు ఇలా.. 1. ఎల్బీనగర్ జోన్: కుమార్, సూపరింటెండెంట్(9100091941) ఎన్ వెంకటేశ్, డీటీసీఓ(9701365515) 2. చార్మినార్ జోన్: డి.డి నాయక్, జాయింట్ కమిషనర్(9440585704) ఎస్.బాల్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(9849907742). 3. ఖైరతాబాద్ జోన్: రాకేశ్,ఏఈ(7995009080) 4. కూకట్పల్లి జోన్: చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎంఓహెచ్(7993360308) శ్రీరాములు, డీసీటీఓ(9515050849) 5. శేరిలింగంపల్లి జోన్: జేసీ మల్లారెడ్డి(6309529286) ఎం.రమేశ్‌కుమార్(9989930253) డీవీడీ కంట్రోల్‌రూమ్(9154795942) 6. సికింద్రాబాద్ జోన్: డా.రవీందర్‌గౌడ్, ఏఎంఓహెచ్(7993360302) శంకర్, డీటీసీఓ(9100091948) చదవండి: కిలాడీ భార్య నిర్వాకం.. ప్రియుడి కోసం ఏకంగా.. -
మృతదేహంతో మూడ్రోజులు సహవాసం
నాగర్‌కర్నూల్ : అనారోగ్యంతో చనిపోయిన మహిళ మృతదేహంతో ఓ వ్యక్తి మూడు రోజుల పాటు సహవాసం చేశాడు. అయితే.. మృతదేహాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో చోటు చేసుకుంది. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు కళమ్మను ఇరవై ఏళ్ల క్రితం అవుసలికుంటకు చెందిన శేఖర్‌తో వివాహం జరిపించారు. పది నెలలకే భర్త చనిపోవడంతో కళమ్మకు నాగనూలుకు చెందిన బాలపీరుతో రెండో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నేళ్ల తర్వాత రెండో భర్త కూడా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే.. తండ్రి కృష్ణయ్య ఇటీవల కూతురిని మందలించడంతో అవుసలికుంటలో ఒంటరిగా ఉంటున్న మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వచ్చింది. అప్పటికే అనారోగ్యం పాలైన ఆమె గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ఎక్కడ తనపైకి వస్తుందనే భయంతో లింగస్వామి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. శనివారం గుడిసె ముందు గుంతను తీసి శవాన్ని పూడ్చి పెట్టేందుకు గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కట్టుబాటు: రాత్రంతా శవంతో చలిలోనే
సాక్షి, ఇల్లెందు : బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుల కట్టుబాట్ల పేరుతో తన ఇంటికి రానివ్వకుండా కులపెద్దలు అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు రాత్రంతా శ్మశానవాటికలోనే జాగారం చేసిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం విజయలక్ష్మీనగర్లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయలక్ష్మీనగర్ ఏరియాకు చెందిన శానం వేణుగోపాల్ (56), హైమావతి దంపతులు హైదరాబాద్‌కు పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. వేణు ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వేణు బుధవారం విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆయన స్వస్థలం విజయలక్ష్మీనగర్‌లోని ఇంటికి తీసుకురాగా.. వేణుకు కులంతో సత్సంబంధాలు తెగిపోయాయని, కుల కట్టడి చెల్లించని కారణంగా మృతదేహాన్ని గ్రామంలోకి గానీ, ఇంటికి గానీ తీసుకురావొద్దని కులపెద్దలు ఆంక్షలు విధించారు. దీంతో శ్మశాన వాటికలో గల డంపింగ్ యార్డు షెడ్డులో మృతదేహాన్ని దింపి.. కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా చలిలోనే శవ జాగారం చేశారు. అంత్యక్రియలకు చొరవ చూపిన ప్రజాప్రతినిధులు వేణు మృతదేహాన్ని గ్రామంలోనికి రానివ్వడంలేదన్న సమాచారం అందుకున్న అక్కడి సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సభ్యుడు సురేందర్, ఉప సర్పంచ్ తాండ్ర నాగరాజు, వార్డు సభ్యులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో కుల పెద్దలు తమ బండారం బయటపడుతుందని భావించి మెల్లగా జారుకున్నారు. అనతరం కరోనాతో మృతి చెంది ఉంటాడని భావిచడం వల్లే గ్రామంలోనికి రానివ్వలేదని కులపెద్దలు మాటమార్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. అత్త ఉసురుతీసిన కోడలు ఖిల్లాఘనపురం (వనపర్తి): తరచూ తగాదాలు పెట్టుకుంటోందంటూ ఓ కోడలు గుళికలమందు తాగించి అత్తను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన పెంటమ్మ (67) తన ఒక్కగానొక్క కుమారుడు శేషయ్యకు మంగనూరు వాసి నాగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం చేసింది. సుమారు ఐదేళ్ల క్రితం కుమారుడు మృతి చెందడంతో కోడలు, ఇద్దరు మనవళ్లతో కలిసి జీవిస్తోంది. అయితే కుటుంబ విషయాలపై అత్త తరచూ తగాదాలు పెట్టుకుంటోందని ఆగ్రహించిన నాగమ్మ బుధవారం ఉదయం తన కుమారుడు నరేశ్‌తో ఖిల్లాఘనపురం నుంచి గుళికలమందు తెప్పించింది. అనంతరం నీటిలో కలిపి అత్తకు తాగించింది. పెంటమ్మ వాంతులు చేసుకోవడం చుట్టుపక్కల వారు గమనించి మహబూబ్‌నగర్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై గురువారం మృతురాలి అన్న జుర్రు పెంటయ్య ఫిర్యాదు మేరకు కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘శవాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్ : బిల్లుకడితేనే శవాన్ని అప్పగిస్తామంటూ మొండికేసిన సన్‌షైన్ ఆసుపత్రి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ సైనికుడు రామ్‌కుమార్ శర్మ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఆసుపత్రి చట్టబద్ధంగానే బిల్లులు వేసిందా లేదా అన్నదానిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, ఎక్కువ బిల్లులు వసూలు చేసినట్లుగా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. (తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు) తన తండ్రి శవాన్ని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ మృతుడి కుమారుడు నవీన్‌కుమార్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను రాఖీపౌర్ణమి సందర్భంగా సెలవు దినమైనా న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ హౌస్ మోషన్ రూపంలో సోమవారం అత్యవసరంగా విచారించారు. రామ్‌కుమార్‌శర్మను కరోనాతో గతనెల 24న సన్‌షైన్ ఆసుపత్రిలో చేర్చారని, ఆదివారం (2న) సాయంత్రం 4.40 ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రతాప్ నారాయణ్ సంఘీ నివేదించారు. 8 రోజులకు రూ.8.68 లక్షలు బిల్లు వేశారని, రూ.4 లక్షలు చెల్లించినా మొత్తం డబ్బు కడితేనే శవాన్ని ఇస్తామంటున్నారని తెలిపారు. ఈ మేరకు న్యాయమూర్తి స్పందిస్తూ... అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వెంటనే మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు. -
వివాహితుడు దారుణ హత్య?
చిత్తూరు, మదనపల్లె టౌన్ : ఓ వివాహితుడి∙మృతదేహం కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మృతదేహం పడి ఉన్న తీరు చూస్తుంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కదిరి రైల్వే పోలీసుల కథనం..కురబలకోట మండలం సింగన్నగారిపల్లెకు చెంది న రైతు కృష్ణమూర్తి కుమారుడు కె. ఈశ్వర(35) చిన్న చిన్న వ్యాపారాలు, కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఈశ్వర్ గురువారం ఉదయం మదనపల్లె మండలం, సీటీఎం పంచాయతి అంగళ్లు మార్గంలోని రైలుపట్టాలపై శవమై వెలుగులోకి వచ్చాడు. పశువుల కాపర్లు గుర్తించి సీటీఎం రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కదిరి రైల్వే పోలీసులకు చేరవేశారు. దీంతో రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయి ఉంటే తల, కాళ్లు, చేతులు వేరైనా కనీసం ఎంతో కొంత దూరంలో కనిపించేవని, అయి తే తల, కాళ్లూ, ఒక చేయి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో పక్కాగా ప్లాన్ ప్రకారం ఈశ్వర్‌ను హత్య చేసి, తల, కాళ్లను, చేతిని వేరు చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని రైలుపట్టాలపై పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని అనంతపురం జిల్లాలోని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ సాల్మన్ రాజు తెలి పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదలా ఉంచితే, మృతుడి స్వగ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలోని మృతదేహం వెలుగులోకి రావడం, ఇంటి నుంచి సెల్‌ఫోన్‌తో వెళ్లిన మృతు డి వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో రైల్వే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంత దారుణమా! వైరల్ వీడియో
భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన కుల వివక్ష వికృత రూపానికి అద్దం పట్టిన ఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. బతికి వున్నపుడు ఎలా ఉన్నా..చనిపోయిన వారికి కనీస గౌరవాన్నివ్వడం సమాజంలో ఒక సంస్కారంగా కొనసాగుతూ వస్తోంది. కానీ వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోయిన సందర్భంగా స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొంతమంది పెద్దలు దారుణంగా ప్రవర్తించారు. తమ పొలంలోంచి అతని మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో వేరే గత్యంతరం లేని బంధువులు వంతెనపైనుంచి స్ట్రెచర్ ద్వారా మృతదేహాన్ని కిందికి దించి, అక్కడనుంచి దహన వాటికకు తరలించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన వీడియో పలువురిని విస్మయ పరుస్తోంది. Ugly face of caste system! Everybody deserves a dignifid death! Kuppan, a dalit man died in Vellore. Some dominant caste people objected to carrying his body through their farm land. His body had to be lowered using a stretcher atop a bridge to reach the cremation ground. pic.twitter.com/MqrJGNRc6V — Vibhinna Ideas (@Vibhinnaideas) August 22, 2019 -
అయ్యో.. ఆమెకెంత కష్టం
చుంచుపల్లి (కొత్తగూడెం): బతుకుదెరువు కోసం ఊరుకాని ఊరుకు వచ్చారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిసరాలే వీరి నివాసం. కూలీనాలి చేసుకు ంటూ పొట్టపోసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ మహిళకు పెద్ద కష్టం వచ్చిపడింది. మూడు రోజల క్రితం వడదెబ్బకు గురైన భర్త గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. దీంతో సాయంత్రం ఆరు గంటల వరకు రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే భర్త మృతదేహంతో ఆ అభాగ్యురాలు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చోటు చేసుకుంది. బిహార్ రాష్ట్రంలోని కఠోర్ జిల్లాకు చెందిన ఖలీల్, మిమ్మి దంపతులు కొంతకాలంగా కొత్తగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాత్రికి స్టేషన్ పరిసరాల్లోనే నిద్రించేవారు. ఇటీవల భారీగా పెరిగిన ఎండలతో ఖలీల్ అస్వస్థతకు గురై మూడు రోజులుగా అన్నపానీయాలు మానేశాడు. ఆరోగ్యం క్షీణించి గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు. దీంతో మిమ్మి బిక్కుబిక్కుమంటూ భర్త శవం వద్ద రోదిస్తూ కూర్చుంది. 43 డిగ్రీల ఎండలోనూ ఆమె శవం వద్ద నుంచి కదలలేదు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అక్కడే రోదిస్తూ ఉండిపోయింది. ఖలీల్ కుటుంబానికి కొత్తగూడెంలో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శుక్రవారం మున్సిపల్ సిబ్బందితో అంత్యక్రియలు చేయిస్తామని తెలిపారు. కాగా, మిమ్మి దీనావస్థను చూసిన స్థానిక ఆటోడ్రైవర్లు ఆమెకు రూ.3,500 ఆర్థిక సహాయం అందించారు. ఖలీల్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమెను బిహార్‌లోని వారి బంధువుల వద్దకు తరలిస్తామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. -
మా నాన్న మృతదేహమైనా ఇవ్వండి!
వాషింగ్టన్: టర్కీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో దారుణ హత్యకు గురైన వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ మృతదేహాన్నైనా తమకు ఇవ్వాలని ఆయన కుమారులు సౌదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం భౌతిక కాయాన్నైనా తమకు ఇస్తే పవిత్ర మదీనాలోని స్మశానవాటికలో ఖననం చేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ ఎంబసీలోకి వెళ్లిన ఖషోగ్గీ అప్పటినుంచి అదృశ్యం కావడం, సౌదీ యువరాజుపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు ఆయనను సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఎంబసీలోనే దారణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఖషోగ్గీ మృతదేహాన్ని ముక్కలుగా చేసి, యాసిడ్ లో కరిగించారని ఇటీవల టర్కీ అధికారులను ఉటంకిస్తూ ఒక వార్తాకథనం కూడా వెలువడింది. నెల రోజులకు పైగా అత్యంత వేదనను అనుభవిస్తున్నామని, ఇప్పటికైనా తమ తండ్రి మృతదేహాన్ని ఇవ్వాలని సౌదీ అధికారులను కోరామని ఖషోగ్గీ కుమారులు సలా ఖషోగ్గీ, అబ్దుల్లా ఖషోగ్గీ సోమవారం మీడియాకు తెలిపారు. తమ తండ్రి దేశద్రోహి కాదని, ఆయనకు సౌదీ రాచరిక వ్యవస్థపై నమ్మకం ఉండేదని, అదే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని భావించేవాడని సలా వివరించారు. దోషులందరికీ శిక్ష పడుతుందన్న సౌదీ రాజు హామీని తాము విశ్వసిస్తున్నామన్నారు. -
ఎస్ఐ వంశీధర్ మృతదేహం లభ్యం
-
ఎస్ఐ మృతదేహం లభ్యం
చల్లపల్లి : విజయవాడ-అవనిగడ్డ మార్గంలోని కరకట్టపై ఘంటసాల మండలం పాపవిశానం వద్ద పంటకాలువలో కొట్టుకుపోయిన ఎస్ఐ మృతదేహం ఆదివారం ఉదయం బయటపడింది. చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద మృతదేహం లభ్యమైంది. సుమారు 20 కిలో మీటర్ల దూరం ఎస్ఐ మృతదేహం కొట్టుకుపోయింది. కాలువలో నుంచి వెలికి తీసిన అనంతరం పోస్టుమార్టం చేయడానికి ఎస్ఐ వంశీధర్ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వానికి తరలించారు. వంశీధర్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్ఐగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. శనివారం ఉదయం తల్లితో కలిసి స్వగ్రామం కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్పేట్కు కారులో బయలుదేరిన సమయంలో పాపవినాశనం వద్ద కారు అదుపుతప్పి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న స్థానిక గ్రామస్తులు ఎస్ఐ వంశీధర్ తల్లితో పాటు మరొకరిని కాపాడగలిగారు..కానీ కారు నీళ్లలోకి పూర్తిగా వెళ్లిపోవడంతో ఎస్ఐను కాపాడలేకపోయారు. వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. -
డివైడర్‌పై మృతదేహాల కలకలం
-
కొడుకును హత్యచేసి.. శవాన్ని ముక్కలుగా కోసి!
-
కొడుకును హత్యచేసి.. శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి!
తిరువనంతపురం: కన్నకొడుకునే ఓ తల్లి నిర్దాక్షిణ్యంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం కేరళలో కలకలం రేపింది. పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. కొళ్లాం జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. జితూ జాబ్(14) తన తల్లి జయమోల్తో కలిసి కొళ్లాం జిల్లా నెడుంబనలో నివాసం ఉంటున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న జితూ గత సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కేలు కొనుక్కునేందుకు షాపునకు వెళ్లిన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు జితూ కోసం అన్వేషించగా వారి ఇంటి సమీపంలో మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ముఖం కాలి ఉండటాన్ని గుర్తించారు. అయితే తమకు శత్రువులెవరూ లేరని చెప్పడంతో కుటుంబసభ్యులపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో బుధవారం జితూ కుటుంబాన్ని విచారిస్తుండగా బాలుడి తల్లి చేతికి కాలిన గాయాలున్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా కుమారుడిని తానే హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. సోమవారం తల్లితో గొడవపడ్డ తర్వాత జితూ గొంతునులిమి ఉపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. జితూ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది జయమోల్. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి ముఖానికి నిప్పుపెట్టి కాల్చివేసినట్లు వెల్లడించిందని ఛతన్నూర్ ఎస్ఐ నిజర్ ఏ వివరించారు. హత్య చేసినట్లు అంగీకరించిన నిందితురాలు ఎందుకు హత్య చేసిందో మాత్రం బయటపెట్టడం లేదని సమాచారం. -
ప్రభుత్వాస్పత్రి సిబ్బందా.. మజాకా!
- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - పోస్టుమార్టం చేయకుండానే మృతదేహం అప్పగింత - తర్వాత ఆస్పత్రికి తీసుకురావాలంటూ ఫోన్ - ఒక రోజు ఆలస్యంగా అంత్యక్రియలు - వైద్య సిబ్బంది తీరుపై బంధువుల ఆగ్రహం ఆస్పరి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండానే బంధువులకు అప్పగించి తర్వాత దాన్ని తిరిగి తెప్పించిన కర్నూలు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంపై తీవస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈనెల 6న ఆస్పరికి చెందిన రాళ్లదొడ్డి మాబుసాబ్ పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మాబుసాబ్‌ను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కొలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో వైద్యులు మాబుసాబ్ మృతి చెందినట్లు రశీదు ఇచ్చి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. అనంతరం వారు మృతదేహాన్ని ఆస్పరికి తీసుకొచ్చారు. సమాచారం తెలియడంతో కడచూపు కోసంబంధువులందరూ వచ్చారు. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రి నుంచి మాబుసాబ్ బంధువులకు ఫోన్ వచ్చింది. ‘నాన్ ఎంఎల్సీ కేసు అనుకుని మీకు మృతదేహాన్ని అప్పజెప్పాం. అది ఎంఎల్సీ కేసు. మృతదేహానికి పోస్టుమార్టం చేయాలి తిరిగి కర్నూలుకు తీసుకురండి. వెంటనే పోస్టుమార్టం చేసి పంపుతాం’ అంటూ వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. అయితే ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మంగళవారం పోస్టుమార్టం చేసి మృతేదేహాన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు ఒక రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెల్దుర్తి(కృష్ణగిరి) : వెల్దుర్తి, మాదార్‌పురం గ్రామాల మధ్య రైల్వేట్రాక్ పక్కన గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు డోన్ రైల్వే ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోందన్నారు. దాదాపు వారం రోజుల కిందట సంఘటన జరిగి ఉండవచ్చని, మృతదేహం గుర్తు పట్టడానికి వీలు లేనంతగా తయారైందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని కర్నూలు హెచ్‌సీలు నాగలక్ష్మి, కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
వర్షం కోసం మృతదేహం వెలికితీత
కర్ణాటక: వర్షం కోసం సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి దహనసంస్కారాలు నిర్వహించిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి అణెకట్టకు చెందిన మల్లేగౌడ అనే వృద్ధుడు తొన్ని(చర్మం క్రమంగా తెల్లగా మారిపోవడం) సమస్యతో బాధపడుతూ ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పుడు అతని మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఇటీవల ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు తొన్నితో బాధపడుతూ చనిపోయిన వారిని ఖననం చేయకూడదని, అలా చేసినందువల్లే గ్రామం తీవ్ర వర్షాభావంతో సతమతమవుతోందని చెప్పాడు. దీన్ని నమ్మిన గ్రామస్తులు ఆ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి జ్యోతిష్యుడి సూచన మేరకు దహనం చేశారు. ఇందుకు మల్లేగౌడ కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించారు. -
గుర్తు తెలియని శవం లభ్యం
నంద్యాలవిద్య: నంద్యాల మండల పరిధిలోని నందిపల్లె–నంద్యాల మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఆకుపచ్చ షర్టు, కాకి ప్యాంట్ ధరించి ఉనా్నడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 8522923203కు సంప్రదించాలని కోరారు. -
యువకుడి దారుణహత్య
- మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు - స్థానికేతరుడిగా గుర్తించిన పోలీసులు - నన్నూరు సమీపంలో ఘటన ఓర్వకల్లు : మండల పరిధిలోని నన్నూరు సమీపంలో బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఘటన తీరును బట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. కత్తులతో విచక్షణా రహితంగా నరికి, హత్యానంతరం మృతదేహానికి తగులపెట్టారు. నన్నూరు సమీపంలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలకు కూతవేటు దూరంలో జమాల్‌షా దర్గాకు వెళ్లే దారిలో జాతీయరహదారి పక్కనే గురువారం కాలిపోయిన శవం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగాలపురం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రక్తపు మరకలు, మృతదేహంపై లోతైన గాయాలను బట్టి పోలీసులు హత్యగా గుర్తించారు. వాహనంపై తీసుకొచ్చి తల, మెడ, భుజాలు, పొత్తి కడుపుపై విచక్షణా రహితంగా నరికి చంపేసినట్లు తెలుస్తోంది. తర్వాత పెట్రోల్ పోసి శవానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కాలిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. హతుడు నన్నూరు, మీదివేముల, లొద్దిపల్లె గ్రామాల ప్రాంతానికి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తుండగా పోలీసులు మాత్రం స్థానికేతరుడిగా చెబుతున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందం అక్కడికి చేరుకుని పరిసరాల్లో తనిఖీలు చేశారు. ఆచూకీ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఐసుపెట్టెలో భద్రపరచనున్నట్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నగరంలోని రాయల్ ఎన్ఫీల్డ్ షో రూం సమీపంలో జాతీయ రహదారికి ఎదురుగా ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు. గుండు చేయించుకొని 35 ఏళ్ల వయస్సు, 5.5 అడుగుల ఎత్తు, నల్లని చర్మంతో ఉన్న వ్యక్తి తెలుపు బనియన్, నీలిరంగు పుల్ డ్రాయర్ ధరించాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ సీఐ సెల్ : 9440795514, 08518220093 నంబర్లలో తెలియజేయాలని పోలీసులు కోరారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు మండలం పుల్లూరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల, చేతులను కుక్కలు పీక్కు తినడంతో మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉంది. గ్రామ శివారులోని కోళ్ల బావాపురానికి వెళ్లే రోడ్డులో మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తాలుకా ఎస్ఐ గిరిబాబు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతదేహానికి పురుగులు పట్టి ఉండటంతో సుమారు నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో గ్రామంలో విచారించారు. సుమారు 5.4 అడుగుల ఎత్తు, తెలుపు రంగులో ఉన్న మృతుడు నల్లని ప్యాంటు, నల్లని గీతలు గల తెల్లని ఫుల్‌షర్టు, నల్లని చెప్పులు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 87901 86148 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తాలుకా ఎస్ఐ గిరిబాబు విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
అరటితోటలో గుర్తు తెలియని మృతదేహం
శ్రీనగరం(మహానంది): మహానంది మండలం శ్రీనగరం గ్రామం సమీపంలోని అరటితోటలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపిన వివరాల మేరకు... మృతుడికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండొచ్చు. షర్టుపై జానీ టైలర్, నంద్యాల అని ఉంది. మృతుడి షర్టుజేబులో జపమాల, రెండు ఉంగరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పారవేశారా? అనే కోణంలో ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహంపై అరటిసొరుగు కప్పి ఉంచడంతో స్థానికులు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మూడు రోజులుగా శవా నికి వైద్యం
సాయిసత్య హాస్పిటల్లో వ్యక్తి మృతిపై వివాదం – బంధువుల ఆందోళన – రోగి కుటుంబీకులపై ఆసుపత్రి సిబ్బంది దాడి – ఫర్నిచర్, కారు అద్దాలు ధ్వంసం – కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కర్నూలు(హాస్పిటల్): రోగి చనిపోయి మూడు రోజులైనా శవానికి కర్నూలులోని సాయిసత్య హాస్పిటల్లో వైద్యం చేయడం వివాదానికి దారితీసింది. రోగి బతికి ఉన్నాడని, చికిత్స చేస్తున్నామని చెబుతూ బకాయిపడ్డ మొత్తాన్ని వసూలు చేసుకుని, చివరికి చనిపోయాడని ప్రకటించారు. దీంతో రోగి కుటుంబీకులు ఆందోళనకు దిగి ఆసుపత్రిపై దాడి చేశారు. ఇదే సమయంలో వీరిపై ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడ్డారు. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లి గ్రామానికి చెందిన రమణప్ప(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత నెల 22న ఆయన ఎద్దులు అమ్మేందుకు కర్నూలు జిల్లా డోన్‌కు వెళ్లాడు. తిరిగి ఆటోలో వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆటో బోల్తా పడి ఆయన కాలుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా కర్నూలులోని సాయిసత్య హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. ఎంఆర్ఐ, రక్తపరీక్షలన్నీ చేసి కాలుకు నాలుగు ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని, రూ.1.50లక్షలు ఖర్చు అవుతుందన్నారు. రోగి నెలరోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని తెలిపారు. దీనికి సమ్మతించడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ఆపరేషన్ చేసిన డాక్టర్ హరిప్రసాద్ ఊళ్లో లేరు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేశారని రమణప్ప కుటుంబీకులు తెలిపారు. వారు నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్లే కిడ్నీలు పాడయ్యాయని, ఈ కారణంగా వారం రోజుల నుంచి ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేశారన్నారు. మూడు రోజుల క్రితమే ఓ డాక్టర్ వచ్చి రమణప్ప చనిపోయాడని చెప్పాడని, కానీ ఆసుపత్రి వైద్యులు మాత్రం బతికే ఉన్నాడని చెప్పి మోసపుచ్చారన్నారు. బుధవారం రాత్రి సైతం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి వైద్యం చేశారని, అర్ధరాత్రి దాటాక మరణించాడని ప్రకటించారన్నారు. రూ.1.50లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి మాతో రూ.5లక్షల దాకా ఖర్చు పెట్టించారని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రమణప్ప చనిపోయాడని మేనల్లుడు లక్ష్మన్న విమర్శించారు. ఆసుపత్రిలో ఘర్షణ రమణప్ప మృతిపై బుధవారం రాత్రి నుంచి ఆసుపత్రి సిబ్బంది, రమణప్ప కుటుంబీకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబీకులపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేశారు. ఆగ్రహించిన రమణప్ప కుటుంబీకులు ఆసుపత్రి ఫర్నిచర్, వైద్యుని కారు టైర్లలో గాలి తీశారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ ఆందోళన చేశారు. శవాన్ని క్యాజువాలిటిలో ఉంచి ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షుగర్, టైఫాయిడ్ వల్లే మృతి రమణప్పకు ముందు నుంచి షుగర్ ఉంది. దీనికి తోడు టైఫాయిడ్ వచ్చింది. ఈ రెండింటినీ కంట్రోల్ చేశాం. డిశ్చార్జ్ చేస్తే రెండు రోజులకు ఒకసారి డ్రెస్సింగ్‌కు రావాలంటే ఇబ్బందని, ఇక్కడే ఉంటామన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ కంట్రోల్లో లేక గాయానికి ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిసీమియాగా మారింది. కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల ఐసీయూలో ఏడురోజుల పాటు ఉంచాం. బుధవారం రాత్రి అతనికి ఫిట్స్ కూడా వచ్చాయి. అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశామనడం వాస్తవం కాదు. –డాక్టర్ హరిప్రసాద్, ఆసుపత్రి అధినేత -
చచ్చినా తీరని కష్టం
- శ్మశానానికి వెళ్లేందుకు రహదారి కష్టం - తీవ్ర అవస్థలు పడుతున్న కౌలూరు ఎస్సీ కాలనీవాసులు పాణ్యం: శ్మశాన స్థలం ఉన్నా అక్కడకు వెళ్లేందుకు సరైన దారి సౌకర్యం లేక మండల పరిధిలోని కౌలూరు ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం గ్రామంలోని ప్రేమ్‌కర్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ప్రధాన రోడ్డు నుంచి కానుగల వాగును దాటి శ్మశానానికి తీసుకెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవిలో తప్ప వాగు నిత్యం పారుతుండడంతో దాటి ఎగువగడ్డకు ఎక్కి మృతదేహలను ఖననం చేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ వాగు దగ్గరకు వచ్చే సరికి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కనీసం పది మంది తప్పనిసరి. అదమరిస్తే వాగులో మృతదేహం పడిపోతుంది. చచ్చిన వాడిని తీసుకువెళ్లాలంటే చచ్చేంత పని అవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానుగల వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. -
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
కట్టమూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం క్వారీ గోతుల్లో పాతి పెట్టిన సారా వ్యాపారులు నిందితుల సమాచారంతో మృతదేహం వెలికితీత కట్టమూరు(పెద్దాపురం): గత ఏడాది ఆఖరి రోజు... నూతన సంవత్సరం పార్టీలో మునిగితేలదామంటూ పార్టీకని పిలిచి వ్యక్తిపై ఉన్న అక్కసుతో దారుణ హత్యకు పాల్పడిన సంఘటన పెద్దాపురం మండలంలో కట్టమూరులో జరిగింది. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కథనం వివరాల్లోకి వెళ్తే.. ఎక్సైజ్, పలు శాఖల అధికారులకు ఇ¯ŒSఫార్మర్‌గా ఉంటూ సారా వ్యాపారుల సమాచారం ఇస్తున్నాడన్న అక్కస్సుతో కట్టమూరు గ్రామానికి చెందిన ఉండవల్లి సత్యనారాయణ (52) అలి యాస్ సారా చౌదరిని అదే గ్రామానికి చెందిన సారా వ్యాపారులు దారుణంగా క్వారీ గోతుల్లో పాతి పెట్టి, బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. గత నెల 31వ తేదీ రాత్రి సత్యనారాయణను పార్టీ చేసుకుందాం రమ్మని అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు ఫో¯ŒS చేసి రప్పించారు. పథకం ప్రకారం స్థానిక హోప్ విలేజ్ వెనుక ఉన్న క్వారీ గోతుల్లో ప్రశాంతంగా ఉంటుందంటూ అందరూ కలసి అక్కడ మద్యం తాగారు. వెనుక నుంచి ఓ వ్యక్తి రాడ్‌తో బలంగా కొట్టి ముగ్గురు కలసి పక్కనే ఉన్న క్వారీ గోతుల వరకు లాక్కునివెళ్లి అక్కడ పాతి పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతుడి బైక్‌ను పక్కనే ఉన్న చెరువులో పడేసి పరారయ్యారు. తన భర్త ఇంటికి రాలేదని ఎదురుచూస్తున్న భార్య సత్యవతి రెండో తేదీన తన భర్త సత్యనారాయణ కనబడడం లేదని ఫిర్యాదు చేయడంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ వై.సతీష్ కేసు నమోదు చేసారు. డీఎస్పీ రాజశేఖరరావు ఆదేశాల మేరకు సీఐ దర్యాప్తులో భాగంగా సారా వ్యాపారులను విచారిం చారు. దీంతో ముగ్గురు వ్యక్తులు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. శనివారం గ్రామంలో పాతిపెట్టి్టన ప్రాంతానికి వెళ్లి తహసీల్దార్ గోగుల వరహాలయ్య, డీఎస్పీ, సీఐ, ఎస్సై మృతదేహాన్ని వెలికి తీసారు. అలాగే చెరువులో పడేసిన బైక్‌ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని శవ పంచనామా నిర్వహించారు. సత్యనారాయణకు భార్యతో పాటు కుమార్తె, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. -
మహిళ దారుణ హత్య
– ముందురోజు గొంతుకోసి.. మరుసటి రోజు పెట్రోలు పోసి తగులబెట్టి – పోలీసుల అదుపులో నిందితుడు ? ఆళ్లగడ్డ : అమానుషం..కిరాతకం..ఓ మహిళ గొంతు కోసి..ఆ తరువాత తగులబెట్టారు. ఈ ఘటన ఆళ్లగడ్డ మండలంలో కలకలం రేపింది. బాచేపల్లి తండా సమీపంలోని అడవిలో ఓ మహిళ మృతదేహం తగలబడుతుందని రూరల్ పోలీసులకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సమాచారం అందింది. ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ దస్తగిరిబాబు, ఎస్సై రామయ్యలు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో అక్కడున్న ఆనవాళ్లను పరిశీలించారు. మృతిరాలి చేతికున్న పచ్చబొట్టు, అలాగే మెడలో ఉన్న అంత్రము ఆధారంగా విచారించగా దొరకట్టాల గ్రామానికి చెందిన నారాయణమ్మ (50) గా గుర్తించారు. వివాహేతర సంబంధమే కారణమా? దొరకొట్టాలకు చెందిన నారయణమ్మ, బాచేపల్లితండాకు చెందిన ఆటోడ్రైవర్ నరసింహనాయక్ల కుటుంబాలు కలిసి మెలిసి ఉండేవి. నారాయనమ్మ కొడుకు, కోడలు ఆళ్లగడ్డ పట్టణంలో కాపురం పెట్టారు. అక్కడికి తరుచూ నరసింహనాయక్ కుటుంబం వస్తూపోతూ ఉండేవారు. ఈ క్రమంలో నారయణమ్మ కోడలుతో నరసింహనాయక్‌కు వివాహేతర సంబందం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన నారాయణమ్మ, కుమారుడు నరసింహనాయక్ను ఇంటిదగ్గరకు రానివ్వవద్దని తరుచూ గొడవపడేవారు. గతంతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కాని ఆదివారం నరసింహనాయక్ దొరకొట్టాలకు వెళ్లి.. నారాయణమ్మను మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకుని నగిరిబాయి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి గొంతు కోసి హత్యచేసి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తిరిగి మంగళవారం ఉదయం పెట్రోలు తీసుకుని పోయి మృతదేహంపై పోసి నిప్పు పెట్టాడు. దీంతో మృతదేహం గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. అడవిలోకి వెల్లిన పశులకాపరులు ఏవో మంటలు వస్తున్నాయని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాల వారు, మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు ? మహిళలను నమ్మించి తీసుకుపోయి దారుణ హత్యకు వడిగట్టిన నరసింహనాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో అతనితోపాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారన్న కోనంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
వ్యక్తి మృతదేహం లభ్యం
– మృతుడు షఫీ మాజీ మిస్టర్‌నంద్యాల అవార్డు గ్రహీత – విషాదంలో నడిగడ్డ వాసులు నంద్యాల/బండిఆత్మకూరు: చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు నీటిలో కొట్టుకోపోయిన మహమ్మద్‌షఫీ మృతదేహం మంగళవారం సాయంత్రం బండిఆత్మకూరులో లభ్యమైంది. దీంతో నంద్యాల పట్టణంలోని నడిగడ్డలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే. సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద సోమవారం చేపల వేటకు మహమ్మద్ షఫీ, అతని మిత్రులు వెళ్లారు. షఫీ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోగా అతని కాపాడటానికి వెళ్లిన స్నేహితుడు అంజాద్ మృత్యువాత పడ్డాడు. షఫీ ఆచూకీ మాత్ర లభ్యం కాలేదు. మంగళవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసీ కెనాల్, కుందూ వెంట వెతికారు. వెలుగోడు నుంచి తెప్పించిన పుట్టిలతో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, నంద్యాల రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డి, షఫీ స్నేహితులు గాలించారు. సాయంత్రం బండిఆత్మకూరు వద్ద అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆరు అడుగుల పైగా ఉన్న షఫీ పాతికేళ్ల క్రితమే మిస్టర్ నంద్యాలగా అవార్డు పొందారు. చిన్నప్పటి నుంచివ్యాయామంపై ఆసక్తి ఉండటంతో ఎక్కువ సమయం వ్యాయామ శాలలో గడిపేవాడు. తర్వాత వెయిట్ లిఫ్టర్‌గా, బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొని పలు బహుమతులను సాధించారు. మృతుదికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. -
'బలిమెల'లో మృతదేహం కలకలం
విశాఖపట్నం: ఏవోబీలోని బలిమెల రిజర్వాయర్ లో బయటపడిన మృతదేహం కలకలం రేపింది. తొలుత ఈ మృతదేహం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుది అయి ఉంటుందని భావించారు. దాంతో దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. దానికి తోడు అక్కడకు సమీపంలో మరో రెండు మృతదేహాలు ఉన్నాయని కూడా అన్నారు. స్థానికులు ఈ మృతదేహాలను గమనించి, మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అయితే.. బలిమెల రిజర్వాయర్‌లో కనిపించిన మృతదేహం.. చింతల్పాంగీ గ్రామానికి చెందిన వ్యక్తిదని గుర్తించారు. కుటుంబ కలహాలతో వారం రోజుల క్రితం రిజర్వాయర్‌లో దూకినట్లు స్థానికులు తెలిపారు. దాంతో దీనిపై చెలరేగిన ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఆచూకీ లేకపోవడంతో ఇప్పుడు బయటపడిన మృతదేహం ఆయనదా అనే సందేహాలు సైతం ఒక దశలో వ్యక్తమయ్యాయి. ఎన్కౌంటర్లో ఆర్కే మరణించారా.. తప్పించుకున్నారా, పోలీసులు నిర్బంధించారా అనేది మిస్టరీ మారిన నేపథ్యంలో ఈ మృతదేహం తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే.. చివరకు అది స్థానికుడిదేనని తేలడంతో చిక్కుముడి వీడింది. -
హంద్రీకాలువలో లభ్యమైన యువకుడి మృతదేహం ఆచూకీ లభ్యం
– నరబలి ఇచ్చారని తల్లి ఫిర్యాదు వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువలో మల్లెపల్లె పంపింగ్ స్టేషన్ వద్ద గత ఆదివారం గుర్తుతెలియని యువకుడి, చిన్నారి మృతదేహాలు కొట్టుకువచ్చి తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసందే. విచారణ చేపట్టిన ఎస్ఐ తులసీనాగప్రసాద్ బుధవారం మృతుని ఆచూకీ లభ్యమైనట్లు తెలిపారు. పత్రికల్లో గుర్తుతెలియని మృతదేహాలను వార్త రావడంతో అనుమానం వచ్చిన పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన మృతుని తల్లి నాగమ్మ, బంధువులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మృతుని దుస్తులు చూసి తల్లి నాగమ్మ తన కుమారుడు మాల వెంకటేశ్వర్లుగా(23) గుర్తించింది. డిగ్రీ పూర్తి చేసిన వెంఽకటేశ్వర్లు ఇటీవలే అదే గ్రామస్తుడు రమేష్‌కు చెందిన జేసీబీకి హెల్పర్‌గా నెలక్రితం చేరాడు. కాగా తన కుమారుడిని రమేష్‌తో పాటు జేసీబీ డ్రైవర్ చంద్ర కలిసి జేసీబీ యంత్రానికి నర బలి ఇచ్చారని తల్లి నాగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా విచారణ చేపట్టినట్లు ఎస్ఐ -
హత్య చేసి దిబ్బలో పూడ్చి!
సంధ్యారాణి కేసులో పురోగతి – విచారణలో నేరాన్ని అంగీకరించిన నూర్ అహ్మద్ – పంచలింగాల శివారులో నేర స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు – ఎస్పీ సమక్షంలో నేడు మృతదేహం వెలికితీత కర్నూలు: ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణి(35)ని ప్రియుడు నూర్ అహ్మద్ హత్య చేసినట్లు పోలీసు విచారణలో బయటపడింది. డీఈఓ కార్యాలయంలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిందితుడు ఆళ్లగడ్డ పట్టణంలో స్కూల్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సంధ్యారాణి ఇతని స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. అప్పటి నుంచి అతనితో పరిచయం ఉంది. వారి మధ్యనున్న సాన్నిహిత్యాన్ని అతని భార్య పర్వేజ్ వ్యతిరేకిస్తూ తరచూ గొడవ పడేది. ఈ నేపథ్యంలో ఈనెల 7న సంధ్యారాణి.. నూర్ అహ్మద్ కోసం కర్నూలుకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆయన భార్య, బావమరుదులు, కుటుంబ సభ్యులు విస్టా కారు, మారుతి వ్యాన్‌లో కర్నూలుకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి నూర్ అహ్మద్, తన కుటుంబ సభ్యులు కలసి సంధ్యారాణిని వాహనంలో పంచలింగాల శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఫామ్‌హౌస్ ఉంది. సమీపంలోనే సంధ్యారాణిని హత్య చేసి కసువు దిబ్బలో పూడ్చిపెట్టారు. హతురాలు సోదరి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ జయన్న, ఏఎస్ఐ సురేంద్ర నేతృత్వంలో నూర్ అహ్మద్‌పై నిఘా వేసి రెండు రోజుల క్రితం సాయిబాబా దేవాలయంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి నగర శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లి పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. అడ్డు తొలగించుకునేందుకే ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితునితో పాటు మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు, ఎస్ఐ జయన్న, తాలూకా క్రైం పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నేర స్థలాన్ని సందర్శించారు. సుమారు 10 అడుగుల లోతు గొయ్యి తవ్వి పూడ్చిపెట్టి పేడ కప్పినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. ఎస్పీ ఆకే రవికృష్ణ సమక్షంలో మృతదేహాన్ని గురువారం వెలికి తీయనున్నట్లు సమాచారం. నూర్ అహ్మద్ భార్యతో పాటు బావమరుదులు, మరికొంతమంది కుటుంబసభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు నేరానికి ఉపయోగించిన విస్టా కారు, మారుతి వాహనాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్లో భద్రపరిచారు. సంధ్యారాణిని హత్య చేయడానికి ప్రధాన కారకులెవరు, కారణాలేమిటి, అందుకు ప్రోత్సహించినది ఎవరు తదితర విషయాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. -
నీళ్లట్యాంకులో గుర్తు తెలియని శవం
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు సమీపంలో నీళ్లట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం సమాచారం అందుకున్న కర్నూలు రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు, దూపాడు వీఆర్ఓ బాలన్న సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలోపు ఉంటుంది. శరీరంపై బట్టలు లేవు. 8 అడుగుల నీటి ట్యాంకులో సుమారు 6 వారాల నుంచి 8 వారాలు మృతదేహం ఉండడంతో పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. ట్యాంకులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. ఫోరెన్సిక్ డాక్టర్ శంకర్ నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని వ్యక్తి శవం
అవుకు: స్థానిక రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా కొట్టుకు వచ్చి చిన్న చెరువు తూమ్వద్ద పడినట్లు తెలుస్తోంది. మూడు రోజల క్రితమే మరణించి ఉంటాడని, మృతునికి దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి రిజర్వాయర్ వద్ద పోస్టుమార్టం అనంతరం అంతక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనువాసులు, పురుషోత్తం తెలిపారు. -
మత్తడిలో గల్లంతైన మృతదేహం లభ్యం
నర్సంపేటరూరల్ : మాధన్నపేట మత్తడిలో ఇటీవల గల్లంతైన వ్యక్తి మృతదేహం సమీపంలోని బండరాళ్ల మధ్య చిక్కుకొని బుధవారం కనిపించింది. మండలంలోని మాధన్నపేట చెరువు మత్తడి పోస్తుండగా చేపల పడుతున్న బల్సూకూరి కృష్ణ(28) సెప్టెంబర్ 23న ప్రమాదవశాత్తూ కాలుజారిపడి గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో స్థానికులు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. మత్తడి పోయడం ఆగిపోవడంతో స్థానిక రైతులు అటువైపుగా వెళ్తుండగా బుధవారం మధ్యాహ్నం కృష్ణ మృతదేహం కనిపించింది. దీంతో సీఐ జాన్‌దివాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం బండరాళ్ల మధ్య చిక్కుకోవడంతో బయటకు తేలలేదని సీఐ తెలిపారు. అప్పటికే మృతదేహం మొత్తం అస్తిపంజరంగా మారడంతో మృతదేహానికి పంచానామా నిర్వహించామని సీఐ తెలిపారు. మృతుడుకి భార్య సరోజన, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు... పద మూడు రోజుల తర్వాత కృష్ణ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బండరాళ్ల ఉన్న కృష్ణ మృతదేహాన్ని చూసి వారు రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. కృష్ణ మృతదేహం లభ్యం కావడంతో మాధన్నపేట, నాగురపల్లి, కమలాపురం, ముత్తోజిపేట గ్రామాలకు చెందిన ప్రజలు మత్తడి వద్దకు తరలివచ్చారు. -
కాడిజోల కట్టి... వాగు దాటి
టేకులపల్లి: ఉప్పొంగుతున్న వాగులు.. వంకలు.. ఏజెన్సీవాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. అనారోగ్యం పాలైనా.. ఎవరైనా చనిపోయినా వాగులు దాటించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కర్రకు దుప్పటి కట్టి కాడి జోలలా ఏర్పాటు చేసి శుక్రవారం ఓ మృతదేహాన్ని వాగు దాటించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని మేళ్లమడుగుకు చెందిన వీసం లక్ష్మి(68), రామయ్యలకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పెన్షన్ పై ఆధారపడి జీవిస్తోంది. శుక్రవారం గంగారం పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ తీసుకున్న లక్ష్మి ఫొటో దిగేందుకు గ్రామస్తులతో కలసి కొత్తగూడెం బయలుదేరి వెళ్లింది. అక్కడ ఫొటో దిగిన తర్వాత కొద్దిసేపటికే అనార్యోగంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓ వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని బయలుదేరారు. చింతోని చెలకవాగు వద్ద బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం జరుగుతోంది. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ కర్రకు దుప్పటి కట్టి అందులో మృతదేహం ఉంచి వాగు దాటించారు. ఆపై స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేం దుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గల్లంతైన పవన్ మృతదేహం లభ్యం
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టు కుడి అలుగు వరదనీటి ప్రవాహంలో స్థానిక గండికుంట గల్లంతైన అమరగాని పవన్‌కుమార్ (36) మృతదేహం సోమవారం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు గల్లంతైన పవన్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం 12:55 గంటలకు మండలంలోని అడ్లూరు చెరువు సమీపంలో వరదనీటి కాల్వలో లభించింది. మృతదేహం గుర్తింపు కోసం మూడు రోజులుగా నల్లగొండ డీఎస్పీ సుధాకర్, ఆర్డీఓ వెంకటాచారి నేతృత్వంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పవన్‌కుమార్ మృతదేహాన్ని గండికుంటకు సుమారు కిలోమీటరు దూరంలో అడ్లూరు చెరువు సమీపంలో కాల్వలోని కంపచెట్ల పొదల్లో గుర్తించారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని కర్రల సహాయంతో కాల్వ నుంచి బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసుకురాగానే బాధిత కుటింబీకుల రోదనలు అక్కడకు వచ్చినవారికి కంటతడిపెట్టించాయి. రెస్క్యూటీం, జాలర్ల సహాయంతో... మూడు రోజుల క్రితం వరదనీటిలో గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకి కోసం సోమవారం నాగార్జునసాగర్‌కు చెందిన రెస్క్యూటీంతో గాలింపు చేపట్టారు. ఆక్సిజన్ మాస్క్‌ల సాయంతో గాలింపు చేపట్టినా మొదట ఫలితం కన్పించలేదు. దీంతో వారికి తోడుగా జాలర్లు, పోలీసులు గాలింపు చేపట్టారు. కాల్వలో వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భారీ పొక్లెయిన్‌తో కాల్వకు అడ్డుకట్ట వేసి వరదనీటిని పంటపొలాల్లోకి దారి మళ్లించారు. అనంతరం డీఎస్సీ సుధాకర్ నేతృత్వంలో కాల్వలో నిల్వ ఉన్న నాలుగు అడుగుల లోతు నీటిలో గాలింపు చే పట్టారు. కంప చెట్లపొదల్లో ఉన్న పవన్‌కుమార్ మృతదేహాన్ని మొదట డీఎస్పీ గుర్తించి బయటకు తీశారు. వెంటనే పోలీసులు స్థానికులతో కలిసి కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. నీటిలో నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అందుబాటులో ఏమిలేకపోవడంతో డీఎస్పీ తన శరీరంపై ఉన్న రెయిన్‌కోట్‌ను విడిచి అందులో మృతదేహాన్ని కట్టుకుని బయటకు తీసుకువచ్చారు. స్వయంగా డీఎస్సీ ఎంతో సాహసంతో వరదనీటిలో గాలింపు చేపట్టడంతో పాటు మృతదేహాన్ని గుర్తించడం, రెయిన్‌కోట్‌లో మృతదేహాన్ని తరలించి సహాయక చర్యలకు ఆదర్శంగా నిలిచారు. పరిశీలించిన ఎస్పీ పవన్‌కుమార్ గల్లంతైన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరు, చేపడుతున్న గాలింపు చర్యలు తదితర విషయాలను డీఎస్పీ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి ఎస్పీ సూచించారు. వరద నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో పోలీసులు వరదనీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు గండి కుంట వద్ద కల్వకు అడ్డుగా ఇసుక బస్తాలను వేశారు. అనంతరం భారీ పొక్లెయిన్ సాయంతో కాల్వకు అడ్డుకట్ట వేసి నీటిని పంటపొలాల్లోకి దారిమళ్లించి గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలానికి శాలిగౌరారం, నకిరేకల్, మునగాల మండలాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం జనంతో నిండిపోయింది. గాలింపు చర్యల్లో శాలిగౌరారం, కట్టంగూరు, నార్కట్‌పల్లికి చెందిన పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. -
మృతదేహంతో ఆందోళన
టేకులపల్లి: ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా..టేకులపల్లి పోలీసులు ఏకపక్షంగా వ్యవహ రించడం వల్లనే ఇలా జరిగిందని అతడి బంధువులు ఆరోపిస్తూ..సోమవారం మృతదేహంతో టేకులపల్లి బోడు సెంటర్లో ఆందోâýæన నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయగూడెం గ్రామ పంచాయతీ జేత్యాతండాకు చెందిన లకావత్ అశోక్(21) ఆదివారం రాత్రి పురుగులమందు తాగి, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. గతంలో ఇతను టేకులపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించి, ఈ ఏడాది జులైలో వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని రెండు రోజుల అజ్ఞాతం తర్వాత స్వగ్రామానికి వచ్చారు. పోలీస్ స్టేష¯ŒSలో ఇరువైపుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చాక..యువతి తల్లి దండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. వారు ఇతడితో పెళ్లికి నిరాకరించడంతో..ఇటీవల ఇతను తీవ్ర మనస్తాపానికి గురై..ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి మృతదేహంతో మృతుడి బంధువులు, స్నేహితులు బోడు రోడ్డు సెంటర్లో గంటపాటు రాస్తారోకో చేశారు. టేకులపల్లి ఏఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరించారని, అమ్మాయి తరఫు వారు పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ ఘటన జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. సీఐ సంధిరి సంపత్‌కుమార్, ఎస్ఐ తాటిపాముల సురేష్ ఆందోâýæన వద్దకు చేరుకొని..బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో వారు శాంతించారు. మృతుడి తండ్రి దేవ్‌సింగ్ ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు యువతి తల్లిదండ్రులు, మేనమామ, బంధువులైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేశారు. ఆందోళనలో దేవ్‌సింగ్, జముక్ తదితరులు పాల్గొన్నారు. ఆమెనే ఇంటికి వెళ్తానంది.. మూడు నెలల క్రితం సదరు యువకుడికి, యువతికి పోలీస్ స్టేష¯ŒSలో కౌన్సెలింగ్ ఇచ్చాం. ఆమె తన ఇçష్ట ప్రకారమే తల్లిదండ్రుల వెంట వెళ్లింది. – టి.సురేష్, ఎస్సై, టేకులపల్లి. అతడితో పెళ్లి ఇష్టం లేదు.. లకావత్ అశోక్‌తో పెళ్లి ఇష్టం లేదు. అందుకే తల్లిదండ్రుల వద్దే ఉంటున్నా. గతంలో అతడి ఫ్రెండ్స్, సోదరుడు భయపెట్టి, బలవంతంగా పెళ్లి చేశారు. అందుకే విడిపోయి అమ్మానాన్నలతో వెళ్లా. పోలీస్ స్టేషన్లో చెప్పే మా ఇంటికి వచ్చి ఉంటున్నా. – అశోక్‌తో వీడిన యువతి -
ఎస్సార్బీసీ కాల్వలో వ్యక్తి మృతదేహం
గడివేముల: కొర్రపోలూరు సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. వీఆర్వో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. -
విద్యార్థినుల మృతదేహాలు లభ్యం
ఘంటసాల : ఘంటసాలలోని గుండేరు బెడ్‌రెగ్యులేటర్ వద్ద ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థినుల మునగాల నళినీ, చైతన్య మృతదేహాలు సోమవారం లభించాయి. గుండేరు చూసేందుకు వెళ్లిన మిత్ర బృందంలో నళినీ, చైతన్యలు కాలు జారి పడిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో గల్లంతయ్యారు. ఘంటసాల ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో గజ ఈతగాళ్లు, ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ బి.బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో మొవ్వ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక జాలర్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం చైతన్య మృతదేహం సంఘటన స్థలానికి సమీపంలో లభించగా, మధ్యాహ్నం నళినీ మృతదేహం దాలిపర్రులోని కోళ్లఫారాల వద్ద స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రాంతాన్ని తహసీల్దార్ ఎం.బాబూరావు సందర్శించారు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నేరేడుచర్ల నేరేడుచర్ల మండలం మేడారం వద్ద నాగార్జున్‌సాగర్ ఎడమకాల్వలో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. వివరాలు.. మేడారం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వలో గుర్తుతెలియని శవం కొట్టుకు వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ జి.గోపి సిబ్బందితో కాల్వ వద్దకు వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, శరీరంపై ఉన్న చొక్కాపై మెగా టైలర్స్, ఎస్పీటీ మార్కెట్ నల్లగొండ అని స్టిక్కర్ ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. -
అయ్యో పాపం
– పాడుబడ్డ ఇంట్లో పసికందు మృతదేహం మంత్రాలయం : ఆడబిడ్డ భారమో.. శిశువు ఆకస్మిక మరణమో.. లేక మగ అంహకార పాపమో.. ఏమైనా ఓ తల్లి తనపేగును పంచుకుని పుట్టిన పసికందును పాడుబడ్డ ఇంట చెదారంలో పారవేసింది. అమ్మతనానికి మచ్చను తెచ్చుకునేలా చేసింది. ఈ ఘటన మంత్రాలయం మండలం మాధవరం గ్రామం నడిబొడ్డు ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఆటాడుకుంటుండగా.. ఆర్ఎంపీ నాగరాజు ఇంటి గోడను ఆనుకుని పాడుబడిన ఇంటిలో మృత శిశువు కనిపించింది. దీంతో చిన్నోడు భయపడి అక్కడ పాప ఉందని వీధిలో వారికి చెప్పాడు. వెళ్లిచూడగా మృత శిశువు.. పుట్టిన పసిగుడ్డ నుంచి ఆహార నాళం వేరుచేయలేదు. పసికందును ఇలా పారవేయడం పాపమంటూ స్థానికులు బాధను వెలిబుచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ శ్మశాన వాటికలో మృత శిశువుకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆర్ఎంపీ ఇంటి గోడ చాటునే ఆడ శిశువు మృతదేహం కనబడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే అబార్షన్ చేసి ఉంటాడని కొందరు పేర్కొంటున్నారు. కాన్పు జరగడంలో చనిపోయి ఉంటే పారవేశారేమోనని మరికొందరు చర్చించుకున్నారు. -
ఎడ్వర్డ్ చెరువులో మృతదేహం
భీమవరం టౌన్ : స్థానిక ఎడ్వర్డు చెరువులో ఒక వ్యక్తి మృత దేహాన్ని వన్‌టౌన్ పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఉబ్బిపోయిన మృత దేహాన్ని చెరువులో నుంచి పోలీసులు వెలికితీశారు. మృతుని జేబులో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు, కుటుంబ సభ్యుల ఫొటో, ఇతర పత్రాల ఆధారంగా అతను ఎవరనేది గుర్తిం చారు. వన్‌టౌన్ ఎస్సై కె.సుధాకరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరపల్లి రామకృష్ణ (45) భీమవరం సత్యవతి నగర్లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గతంలో గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం అతని భార్య కువైట్ వెళుతుంటే వద్దని గొడవపడి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం వెళ్లిపోగా రామకృష్ణ మాత్రం భీమవరంలోనే ఉంటున్నాడు. ఇతను కామెర్ల బారిన పడినా మద్యం మానలేదు. అతను పొరపాటున ఎడ్వర్డు చెరువులో పడడం వల్ల మృతి చెందాడా? వేరే కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నామని ఎస్సై చెప్పారు. చెరువులో మృత దేహం రెండు రోజులుగా ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. అతని భార్యకు సమాచారం అందించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
ఒంగోలు : రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం రైల్వేస్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే కె. కోటేశ్వరరెడ్డి (39) ఈ రోజు రైలు కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక పట్టాలు దాటుతుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టేకుమట్ల పాత బ్రిడ్జి కింద మృతదేహాం లభ్యం
మృతదేహానికి తల, చేతులు, కాళ్లు లేని వైనం మూటలో కట్టి వేచినట్లు ఆనవాళ్లు సూర్యాపేటరూరల్: తల, చేతులు, కాళ్లు లేని ఓ మృతదేహాం ఆదివారం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామ సమీపంలోని మూసీవాగు పాత బ్రిడ్జి కింద స్థానికులకు కనిపించింది. స్థానికులు వెంటనే వీఆర్ఓ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 35 నుంచిl40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిని ఎక్కడో హత్య చేసి తల, కాళ్లు, చేతులు నరికి వేసి మిగతా శరీరాన్ని ఓ కవర్లో మూటకట్టి బ్రిడ్జిపై నుంచి వాగులోకి వేశారు. మృతదేహాం నీళ్లల్లో పడకుండా ఓ రాయిపై పడడంతో కవర్ ఊడిపోయింది. 15 నుండి 20 రోజుల క్రితం దీనిని వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట పట్టణ సీఐ మొగిలయ్య సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించారు. వీఆర్ఓ విజయరామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనువాస్‌రెడ్డి తెలిపారు. -
భువనగిరికి చేరిన నయీం మృతదేహం
పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం పోలీసుల ఆధీనంలో గ్యాంగ్‌స్టర్ ఇల్లు మఫ్టీలో అనుమానితుల ఫొటో, వీడియోలు తీసిన పోలీసులు భువనగిరి : మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం మరణంతో నల్లగొండ జిల్లాలోని భువనగిరి పట్టణం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన నÄæూమ్ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం భువనగిరిలోని ఖాజీమహల్లోగా నివాసగృహానికి తీసుకువచ్చారు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలె చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని చూడాలని.. మధ్యాహ్నం 3.07నిమిషాలకు నయీం మృతదేహాన్ని భువనగిరి ఎల్లమ్మగుడి వద్దకు.. 3.09నిమిషాలకు హైదరాబాద్ చౌరస్తా, 3.15 నిమిషాలకు ఇంటి వద్దకు చేరుకుంది. 3.16 నిమిషాలకు అంబులెన్స్ నుంచి ఆయన మృతదేహాన్ని బయటకి తీయడంతో ప్రజలు అంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం అక్కడి చేరుకున్నారు. 2007 తర్వాత నయీంను ఎవరూప్రత్యక్షంగా చూడకపోవడంతో ఆయన మృతదేహాన్ని చూడాలని చాల మంది అక్కడి వచ్చారు. వీరితోపాటు యువకులు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. కాగా నయీం కుటుంబ సభ్యులు ప్రత్యేక టవేరా వాహనంలో అంబులెన్స్ వెనకాలే వచ్చారు. వారంతా మృతదేహాంతో పాటు ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఇతరులను లోపలికి రాకుంండా ఇంటి షెటర్ కిందకు వేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నయీంను చూడడానికి ప్రజలు ఒక్కసారిగా లోపలికి వెళ్లే సమయంలో పోలీసులు ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నయీం ఇంటి వెనుక భాగంలో నుంచి కుటుంబసభ్యులు వచ్చి మీడియాతో మాట్లాడారు. చివరి సారిగా నయీంను అతడి భార్య, అక్క, పిల్లలు చూడాలని వెంటనే పోలీసులు వారిని తీసుకురావాలని, లేకుంటే శవాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు భీష్మించుకు కుర్చున్నారు. డీఎస్పీ మోహన్‌రెడ్డి, సీఐలు శంకర్‌గౌడ్, అర్జునయ్య, రఘువీర్‌రెడ్డిలతో పాటు గుండాల, బొమ్మలరామారం, భువనగిరిటౌన్, భువనగిరిరూరల్, ఆలేరు, బొమ్మలరామారం ఎస్ఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు భువనగిరి పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మెుహరించారు. ఖిలానగర్ నుంచి నల్లగొండ బైపాస్ రోడ్డు వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లగొండ నుంచి ప్రత్యేక పోలీసులను రప్పించారు. సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చారు. మఫ్టీలో వందల మంది పోలీసులు ప్రజల్లో కలిసిపోయారు. అవాంఛనీయ ఘటనలు ఎదురైనా ఎదుర్కోవడానికి రక్షక్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. భువనగిరి–చిట్యాల రోడ్డులో జంపుఖానగూడెం, నల్లగొండ రోడ్డు వద్ద భారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. వివిధ ప్రాంతాల నుంచి నయీం అనుచరుల రాక నయీం అంత్యక్రియలు జరుగుతున్నందున్న పలువురు అనుచరులు పట్టణానికి చేరుకున్నారు. భువనగిరితో పాటు వరంగల్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, అదిలాబాద్, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పలువురు మాజీ నక్సలైట్లు, నయీం ముఠా సభ్యులు ఇక్కడి వచ్చారు. స్థానిక పోలీసులు జనంలో కలిసిపోయి అనుమానితుల ఫొటోలు, వీడియోలు తీశారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత
ధర్మసాగర్ : ధర్మసాగర్ రిజర్వాయర్‌లో గల్లంతైన ఇద్దరిలో కానిస్టేబుల్ పొలుమారి సృజన్(25) మృతదేహం సోమవారం ఉద యం లభ్యమైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ లో ఆదివారం ఇద్దరు గల్లంతు కాగా అందులో పీఈటీ మాచర్ల సునీల్ మృతదేహాన్ని ఆదివా రం రాత్రి వెలికితీశారు. అయితే, చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక జాలర్ల గాలింపు లో సృజన్ మృతదేహం బయటపడగా పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృత్యువులోనూ కలిసే.. ఉజ్వల భవిష్యత్ ఉన్న సృజన్, సునీల్ ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాత పడడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎంజీఎంలో యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక సోమవారం మధ్యాహ్నం వారి స్వగృహాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుండి కలిసి చదువుకుని, మృత్యువులో సైతం వీడిపోని తమ స్నేహితుల మృతదేహాలను చూసిన సహచరులు గుండెలవిసేలా రోదించారు. ఇక జీవిత చరమాంకంలో తమకు అండగా ఉంటారనుకున్న తమ కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. కాగా, కానిస్టేబుల్ పొలిమారి సృజన్ మృతదేహానికి పోలీస్ సిబ్బంది, స్థానిక సెయింట్ మా«థ్యూస్ స్కూల్లో పీఈటీగా పని చేస్తున్న మాచర్ల సునీల్ మృతదేహానికి పాఠశాల సిబ్బంది నివాళులర్పించారు. ఈ మేరకు సాయంత్రం యువకుల మృతదేహాలకు స్థానిక రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
నిన్న మునిగి.. నేడు శవమై..
చెరువులో లభ్యమైన కనకయ్య మృతదేహం వర్గల్: అన్నా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా అంత్యక్రియలు బాగా చేయిండ్రి..అని గురువారం సోదరుడికి ఫోన్లో చెప్పిన జిలకర కనకయ్య(30) అన్నంత పని చేశాడు. జీవితంపై విరక్తి చెందాడో, మరే కారణమోగాని గ్రామ సమీపంలోని పటేల్ చెరువులో జేసీబీ గొయ్యి పక్కన దుస్తులు, చెప్పులు విడిచి అందులో దూకాడు. మండలంలోని ఇప్పలగూడ సమీప పటేల్ చెరువులో శుక్రవారం కనకయ్య గల్లంతైన విషయం తెల్సిందే. రాత్రి వరకు గొయ్యిలో గాలింపు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహం గాలింపు ప్రక్రియను శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం గాలింపులో మృతదేహం లభ్యమైంది. కనకయ్య అన్నంత పని చేస్తడని మేము అనుకోలేదని మృతుడి కుటుంబీకులు బోరుమన్నారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య జ్యోతి పేర్కొంది. మృతుడికి సాయి కిరణ్(9), సాయి తేజ(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కూలీనాలీ పనులతో కాలం వెల్లదీసే కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌కు తరలించినట్లు గౌరారం ఏఎస్సై దేవీదాస్ తెలిపారు. -
నక్కలవాగులో గుర్తు తెలియని శవం
నెల్లూరు : నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలంలోని నక్కలవాగులో గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాగు వద్దకు చేరుకుని... మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతదేహం పురుషుడిదిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
గల్ఫ్ మృతదేహం, గోదూర్, పిప్పెరవేని రాజు gulf, deadbody, pipparavena raju ఇబ్రహీంపట్నం : మండలంలోని గోదూర్ గ్రామానికి చెందిన పిప్పెరవేని రాజు(31) దుబాయ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా మతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తెప్పించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ కాయితీ లావణ్య, ఉపసర్పంచ్ రవితేజ, ఎంపీటీసీ చల్ల పద్మ ఓదార్చారు. మతుడికి భార్య సరిత, పెద్ద కూతురు నందనశ్రీ, చిన్న కూతురు నిఖిల ఉన్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు. -
హతవిధీ.. ఏమిటీ దుస్థితి
రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకొచ్చేందుకు ఒప్పుకోని యజమాని రోడ్డే దిక్కయిన వైనం.. కొత్తపల్లి(జమ్మికుంట రూరల్) : సొంత ఇల్లు లేని పేదవాడు మరణిస్తే ఎన్ని కష్టాలో.. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబీకులు ఓ వైపు దుక్కిస్తుంటే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక బంధువులు సతమతమైన హృదయ విచారకర ఘటన ఇది. చనిపోయినందుకు బాధపడాలో, ఆశ్రయం కోసం వెతకాలో తెలియక ఆ కుటుంబం పడిన వేధన గ్రామస్తులను కలిచి వేసింది. చివరికి ఆ శవానికి రోడ్డే దిక్కయింది. కెనాల్ రోడ్డుపై శవాన్ని ఉంచి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితికి సంబంధించిన వివరాలివి. కర్ణాటక రాష్ట్రంలోని శివమోగం జిల్లా శికారిపూర్ తాలూకా నలవాల్ గ్రామానికి చెందిన హమాలీ కుమార్(36) జీవనోపాధి కోసం 20 యేళ్ల క్రితం జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చాడు. ఇక్కడే వివాహం చేసుకున్నాడు. కుమార్ స్థానిక కూరగాయల మార్కెట్లో 12 యేళ్లుగా హమాలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కూరగాయలు తీసుకువచ్చేందుకు ఆదివారం టాటా ఏస్‌లో వెళ్తుండగా యాదగిరిగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. కుమార్ మృతి వార్త విని కుటుంబీకులు కుప్పకూలారు. బంధువులంతా శోక సంద్రంలో మునిగారు. శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని కొత్తపల్లికి తీసుకువచ్చారు. అయితే మృతుడిది అద్దె ఇల్లు కావడంతో యజమాని శవాన్ని ఇంటి ముందు ఉంచడానికి నిరాకరించాడు. ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో కొత్తపల్లి శివారు ఎస్సారెస్పీ ఉప కాలువ రహదారిపై టెంట్ వేసి శవాన్ని బంధువుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య లత, కుమారుడు శివశంకర్, కూతురు చంద్రకళ ఉన్నారు. ఇలా ఎందరో... సొంత ఇల్లు లేక మృతుల అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించేందుకు అష్టకష్టాల పాలైన వారి సంఖ్య అధికంగానే ఉంది. గతంలోనూ సొంత గూడు లేని నిరుపేదలు మృతి చెందగా కర్మలను వారి కుటుంబసభ్యులు చెట్లు, గుట్టల్లో నిర్వహించుకొన్న సంఘటనలు కోకొల్లలు. ఇటీవల స్వర్ణ కారుడు అనారోగ్యంతో, ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందిన ఘటనల్లోనూ శవాన్ని ఎక్కడికి తరలించాలనే తెలియక రోడ్డుపైనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మిగతా కర్మలకు పాడుబడ్డ ప్రభుత్వ భవనాలు, ఊరు చివర మైదానాల్లో నిర్వహించుకోవాల్సిన దౌర్భగ్య పరిస్థితి. ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న తరహాలోనే ఇల్లు లేని పేదల కోసం ధర్మశాలలు ఏర్పాటు చేసి కర్మకాండలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
మెట్పల్లి : మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం పట్టణంలోని జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిర్వాసితులపై లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ రైసుద్దీన్, ఆకుల ప్రవీణ్, దోమకొండ రమేశ్, పొట్ట ప్రేమ్, కోట అనిల్, బత్తుల దీక్షిత్, సద్దాం, నదీం మోరెపు తేజ ఉన్నారు. నిర్వాసితులపై లాఠీచార్జి అమానుషం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి బోయిని హన్మాండ్లు అన్నారు. సోమవారం మండలంలోని పాతదాంరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీసులు లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మెండిగా వ్యవహరిస్తూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుకోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూ సేకరణ చేయడం దారుణమన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటన స్థానిక నాయకులు ఉన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెల్దుర్తి రూరల్: కర్నూలు రైల్వే పరిధిలోని వెల్దుర్తి మండలం మదార్‌పురం – బింగిదొడ్డి రైల్వేలైన్ మధ్యన శనివారం 30 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు రైల్వే ఎస్ఐ జగన్ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతునికి సంబంధించి వివరాలు లభించలేదన్నారు. మృతుడు నడుస్తున్న రైల్లోంచి కింద పడ్డాడా, లేక మరే ఇతర కారణమా అనే అనుమానంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని కర్నూలు మార్చురీలో ఉంచన్నుట్లు 72 గంటలలో ఎవరైనా సంబంధీకులు రాకపోతే పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాసర : రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వేస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. మృతుడి శరీరంపై ఎరుపు, నలుపు గీతాల చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై మరణించి ఉండగా సిబ్బంది గుర్తించి సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని నిజామాబాద్ రైల్వే ఆస్పత్రికి తరలించినట్లు నట్లు వారు పేర్కొన్నారు. -
వ్యక్తిగత కక్షలతోనా.. మరేదైనా?
►ఉరివేసి.. తగులబెట్టారు ► రహదారికి అరకిలోమీటర్ దూరంలో దారుణం ► లభించని ఆధారాలు.. ► నిందితుల కోసం పోలీస్ వేట ఖమ్మం జిల్లా : చెరుకూరు, ధర్మారం అటవీప్రాంతంతో దారుణం చోటుచేసుకుంది. రహదారికి అరకిలోమీటర్ దూ రంలో గుర్తు తెలియని మృతదేహం పూర్తిగా దహనమై కనిపించింది. ఏమాత్రం గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఈ శవాన్ని మంగళవారం అడవిలో కట్టెలు కొట్టుకుపోవడానికి వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పేరూరు ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాలు.. ‘శవం పూర్తిగా దహనమైంది. ఏమాత్రం ఆనవాళ్లు గుర్తు పట్టలేకుండా ఉంది. ఆడా మగ అనేదికూడా అంచనా వేయడానికి వీల్లేకుండా ఉంది. సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారని భావిస్తున్నాం. ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. వాజేడు, పేరూరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. మనిషిని తగులబెట్టి సుమారు 20 రోజులై ఉంటుందని భావిస్తున్నాం. ఘటనాస్థలిలో లభించిన టార్చిలైట్, చెట్టు కొమ్మకు కాలివున్న లుంగీ గుడ్డ కనిపించాయి. దీనిబట్టి ఉరివేసి తగులబెట్టి ఉంటారని అంచనా వేస్తున్నాం. వ్యక్తిగత కక్షలతోనా? మరేదైనా కారణంతో చంపారా? హత్యకు గురైన వారు స్థానికులా.. మరేదైనా ప్రాంతానికి చెందిన వారా? ఇలా రకరకాల కోణాల్లో విచారణ సాగిస్తున్నాం’ అని ఎస్సై శివప్రసాద్ వివరించారు. నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆయా స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు. ల్యాబ్‌నుంచి రిపోర్టులు వస్తేగానీ ఘటనకు సంబంధించి ఎంతో కొంత స్పష్టత వస్తుందని ఎస్సై వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఫైల్‌ను సీఐ రమణకు అప్పగిస్తామన్నారు. -
అమ్మ లేని లోకంలో ఉండలేను!
తిరుచానూరు(చిత్తూరు జిల్లా): ‘‘చెల్లి, నాన్న నన్ను వదిలి ఎప్పుడో వెళ్లిపోయారు. నాకంటూ ఉన్న ఏకైక బంధం అమ్మ. అనారోగ్యంతో అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్లి పోయింది. ఇక నాకు ఈ లోకంతో పనిలేదు. అందుకే నేను కూడా మా అమ్మ, నాన్న, చెల్లి వెళ్లిన చోటకే వెళ్లిపోతున్నాను’’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్నగర్లో వెలుగుచూసింది. లింగేశ్వర్ నగర్‌కు చెందిన పుష్కరనాథ్ (30) అమ్మ అనురాగం, నాన్న ప్రేమ, చెల్లెలి వాత్సల్యంతో సంతోషంగా జీవించేవాడు. ఏడేళ్ల క్రితం నాన్న, చెల్లెలు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత పుష్కరనాథ్ ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లి మునిరాజమ్మ(54)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిని ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. ఇంటికి తీసుకొచ్చి మందు బిళ్లలు వేయించి పడుకోబెట్టాడు. కాసేపటికే మెలికలు తిరుగుతూ మునిరాజమ్మ మృతి చెందింది. దీంతో మనస్తాపం చెందిన పుష్కరనాథ్ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని చనిపోయాడు. తన ఎస్బీఐ ఖాతాలో రూ.16 వేలు ఉన్నాయని తెలిపాడు. తాను పని చేస్తున్న సంస్థ బీరువాలో ఏటీఎం కార్డు ఉందని, ఆ కార్డు ద్వారా రూ.16 వేలు తీసి అంత్యక్రియలకు వినియోగించాలని అందులో పేర్కొన్నాడు. తన ఆఫీసు తాళాలను సైతం యాజమాన్యానికి అందజేయాలని పేర్కొన్నాడు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో బుధవారం రాత్రి తిరుచానూరు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. తిరుపతి ఈస్టు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ సురేంద్రనాయుడు, ఎస్ఐ చిరంజీవీ సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా తల్లి మృతితో మనస్తాపం చెంది పుష్కరనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగనాథ్ భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి
-
నెల రోజులకు స్వగ్రామానికి మృతదేహం
కరీంనగర్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించిన యువకుడి మృతదేహం దాదాపు నెలరోజులకు స్వగ్రామానికి చేరుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన కర్నాల రాజు(30) సంవత్సరం క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఆయన మృతదేహాం కోసం కుటుంబసభ్యులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రాజు మృతదేహం శుక్రవారం ఇంటికి చేరుకోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందని తెలుస్తుంది. -
మ్యాన్‌హోల్‌లో మృతదేహం
-
'గాంధీ'లో దారుణం: మ్యాన్‌హోల్‌లో మృతదేహం
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక గాంధీ ఆసుపత్రి ఆవరణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి మురుగు నీరు పారే డ్రైనేజీ మ్యాన్ హోల్ లో మృతదేహం పడిఉంది. ఒక వ్యక్తి అందించిన సమాచారంతో సాక్షి ప్రతినిధులు ఈ సంఘటనను ముందుగా వెలుగులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. నిత్యం వేల మంది సంచరించే గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఓ వ్యక్తి ఇలా మ్యాన్ హోల్ లో శవమై కనిపించడం రాష్ట్రంలోని వైద్యశాలల దుస్థితికి అద్దం పడుతున్నదని అక్కడివారు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి హత్యకుగురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని, మృతదేహం విషయం తెలియగానే తాము కూడా ఆశ్చర్యానికి లోనయ్యామని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
స్వగ్రామానికి చేరుకున్న వంశీ మృతదేహం
నల్గొండ(మునగాల): పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన యర్రంశెట్టి వంశీ (19) భౌతిక కాయం ఆదివారం స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని రామలింగాలబండకు చేరింది. స్నేహితులతో కలసి గత శుక్రవారం సరదాగా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ వద్ద డ్యామ్‌కు వెళ్లారు. అందులో ఈతకు దిగగా ముగ్గురు విద్యార్థులు మునిగారు. ఇద్దరు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోగా వంశీ నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రయోజకుడై వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
అనుమానాస్పదరీతిలో వైద్యుడి మృతి
హైదరాబాద్‌లో ఘటన కారులో శవమై కనిపించిన రాఘవేందర్రావు హైదరాబాద్: అనుమానాస్పదరీతిలో ఓ వైద్యుడు కారులో శవమై కనిపించాడు. నగరంలోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన సంచనలం సృష్టించింది. పేట్ బషీరాబాద్‌లోని గేటేడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ రాఘవేందర్రావు(60) గత 12 ఏళ్లుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరారు. సాయంత్రం 6.30 గంటలైనా ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పలువూర్లు ఆయున సెల్‌కు ఫోన్ చేశారు. ఆయన ఫోను తీయుకపోవడంతో పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అమెరికాలో ఉన్న రాఘవేందర్రావు కుమారుడు సుదీప్‌కు సమాచారమిచ్చారు. సుదీప్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో తన తండ్రికి సంబంధించిన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 28 బీఎక్స్ 5675) ఉన్నట్లు గుర్తించి, తల్లి స్వర్ణలతకు చెప్పారు. కుటుంబసభ్యులు హర్షవర్ధన్ కాలనీలో వెతకగా పార్క్ చేసి ఉన్న కారును గుర్తించారు. కారులో రాఘవేందర్రావు మృతి చెంది కనిపించాడు. అతని ముక్కు, చెవి నుంచి రక్తం కారుతూ కనిపించింది. బోయిన్పల్లి పోలీసులకు సమాచారమివ్వగా వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారులో రూ.14,500 నగదు, సెల్‌ఫోన్, మద్యంసీసా, ల్యాప్‌టాప్, కొన్ని మాత్రలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్రరావు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. కడుపులో మత్తు, విషపదార్థాల అనవాళ్లు లేవని చెబుతున్నారు. -
బీఎండబ్ల్యూ కారులో మృతదేహం...
-
పట్టాలపై శవం.. పోలీసుల జగడం
పెంపుడు కుక్కను రైల్వే ట్రాక్ పైకి తీసుకెళ్లి దాని చావుకు కారణమయ్యాడని ఓ వ్యక్తిపై కేసు నమోదయిన సంఘటన ఇప్పుడు హైదరాబాద్‌లో చర్చనీయాంశమైంది. ఇక్కడిలా కుక్క కోసం హైరానా జరగగా.. రైల్వే ట్రాక్‌పై చనిపోయిన మనిషి విషయంలో మాత్రం తీవ్రంగా వాదులాడుకుని దాదాపు ఆరుగంటలపాటు శవాన్ని అలాగే వదిలేశారు ఘనత వహించిన పోలీసులు. ఆ సమయంలో ఆ శవం మీదుగా 17 రైళ్లు రాకపోకలు సాగించాయి. పోలీసుల తీరును, వ్యవస్థల మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని క్విలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హౌరా నుంచి అమృత్సర్ ప్రయాణిస్తోన్న అకల్తక్త్ ఎక్స్‌ప్రెస్ రైలు.. బరేలీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురువారం ఉదయం ఆరు గంటలకు జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన రైలు డ్రైవర్.. బరేలీ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందిచాడు. ఆ మాస్టర్.. జీఆర్పీఎఫ్ బలగాలను పురమాయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీఎఫ్ సిబ్బంది శవాన్ని తొలగిద్దామనే అనుకున్నారు. కానీ.. ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుని స్థానిక సివిల్ పోలీసులకు కబురుపెట్టారు. ట్రాక్ వద్దకు చేరుకున్న సివిల్ పోలీసులు.. 'శవం ట్రాక్ పైన ఉంది కదా.. దానిని మేమెలా స్వాధీనం చేసుకుంటాం? అని కొర్రీ వేశారు. నిజమే. ట్రాక్ నుంచి అటు 30 మీటర్లు, ఇటు 30 మీటర్లు (కొన్నిసార్లు ఈ కొలత మారుతూ ఉంటుంది) రైల్వే శాఖదే. అయితే శవాన్ని తీసుకెళ్లేందుకు తమ వద్ద సరంజామా సిద్ధంగా లేదని, మీరే ఎదో ఒకటి చెయ్యండని సివిల్ పోలీసుల్ని రైల్వే పోలీసులు అడిగారు. వాళ్లేమో 'మా ఉన్నతాధికారుల్ని అడిగి చెప్తాం' అన్నారు. ఇలా వీళ్లు జగడమాడుతుండగానే.. శవం పడి ఉన్న ట్రాక్‌పై నుంచి రైళ్లు వెళుతూ వస్తూనే ఉన్నాయి. దాదాపు ఆరు గంటలు.. అంటే మద్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గానీ పంచాయితీ ఓ కొలిక్కిరాలేదు. చివరికి క్విలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆదేశాలతో యువకుడి శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇప్పటికింకా ఆ యువకుడి ఆచూకీ తెలియరాలేదని, 72 గంటల్లోగా స్పందన రాకుంటే మున్సిపాలిటీ వారితో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ కమ్రూల్ హసన్ చెప్పారు. -
కలెక్టరేట్ వద్ద మృతదేహంతో ధర్నా
కర్నూలు(న్యూ సిటీ): హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని హతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు రాస్తారోకోకు దిగాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యలయం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సురేంద్రను నిన్న కొంతమంది వ్యక్తులు హత్య చేశారు. దీంతో మృతుడి బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు. -
వేగావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం
బోడిగి: విజయనగరం జిల్లా బోడిగి మండలం ఆనవరం గ్రామ సమీపంలో వేగావతి నది సమీపంలోగుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహం గుర్తుపట్టని విధంగా ఉంది. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు హతమార్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
శవాన్ని తీసుకెళ్లమని బెదిరించారు
* పుష్కరఘాట్ వద్ద మృతి చెందిన పురోహితుని పిల్లల ఆవేదన * బాధితకుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు చీపురుపల్లి రూరల్: అంతవరకూ అన్నీ అయిన నాన్న శవంగా ఎదురున్నారు. కొత్త ప్రదేశం, ఎవరూ తెలియని చోటు... ఏం చేయాలో పాలుపోని వయసు వారిది... అయితే వారికి సహాయపడవలసిన ఓ అధికారి బెదిరింపులకు దిగాడు. వెంటనే శవాన్ని తీసుకెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించాడు. దీంతో దిక్కుతోచని వారు తండ్రి మృతదేహంతో అంబులెన్స్‌లోనే స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం దేవరాపొదిలాం చేరుకున్నారు. పుష్కర ఘాట్ తొక్కిసలాట మృతులకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారంగా ప్రకటించింది. అయితే ఆ అధికారి దాష్టీకంతో పురోహితుని పేరు నమోదు అయ్యిందో కాలేదో తెలియని పరిస్థితి నెలకొంది. పుష్కర స్నానం కోసం ఆరవెల్లి వేణుగోపాలశర్మ(45)అనే పురోహితుడు, ఆయన కుమారుడు శరత్, కుమార్తె శ్రీవల్లి రాజమండ్రి వెళ్లారు. మంగళవారం ఉదయం పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో వేణుగోపాలశర్మ మృతిచెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని ఆయన పిల్లలు స్వగ్రామానికి తీసుకువచ్చారు. అక్కడ చోటుచేసుకున్న విషాదకర పరిస్థితులను వారు విలేకరులకు తెలిపారు. ‘మేం పుష్కర ఘాట్‌కు వెళ్లేసరికి ఒక్కసారిగా తోపులాట ప్రారంభమైంది. దీంతో ముగ్గురం విడిపోయాం. రెండు గంటలపాటు ఎవరు ఎక్కడున్నామో తెలియని పరిస్థితి. సద్దుమణిగిన తరువాత చూసే సరికి నాన్న పడిపోయి ఉన్నారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యసిబ్బంది 108లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి చేరే సరికి నాన్న చనిపోయారు. ఏం చేయాలో తెలియదు. ఇంతలో స్థానిక తహసీల్దార్ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకువెళ్లాలని ఆదేశిం చారు. కొత్త ప్రాంతమని కొంత సమయం కావాలని ప్రాధేయపడినా వినిపించుకోకుండా క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు. ఏమి చేయాలో తోచక అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకువచ్చాం’ అని ఆ పిల్లలు రోదిస్తూ తెలిపారు. ఆస్పత్రి అధికారులు మరణధ్రువీకరణ పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. వేణుగోపాలశర్మకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, వలిరెడ్డి శ్రీనువాసలునాయుడు బుధవారం గ్రామంలోనికి వెళ్లి మృతుడి కుటుంబీకులును ఓదార్చారు. ఈ విషయమై పార్టీనేత బొత్స సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్టు స్థానిక నేతలు మజ్జి శ్రీనివాసరావు, యిప్పిలి అనంతం విలేకరులకు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, చంద్రశేఖర్ ఏజేసీని కలిసి వినతిపత్రం అందచేశారు. -
నిందితుడి ఇంటి ముందే శవం పూడ్చివేత
తనకల్లు (అనంతపురం): ఓ యువకుడిని హత్య చేసిన వారిలో పశ్చాత్తాపం కలిగేలా మృతుడి బంధువులు స్పందించారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుని ఇంటి ముందే మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం మోటిచింతమానుతండాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు... ఈ నెల 3న తండాకు చెందిన వేణుగోపాల్ నాయక్‌ను కొందరు వ్యక్తులు హత్య చేసి సీజీ ప్రాజెక్టులో పడేశారు. హత్య విషయం వెలుగులోకి వచ్చిన మరుసటి రోజు అదే తండాకు చెందిన రవీంద్రనాయక్, మల్లికార్జున నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు హత్య చేసినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. దీంతో వేణుగోపాల్‌నాయక్ బంధువులు కోపంతో రగిలిపోయారు. శవాన్ని పోస్టుమార్టమ్ చేసి ఆదివారం తండాకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని నిందితుడు మల్లికార్జున నాయక్ ఇంటి ఎదురుగా సమాధి చేశారు. హత్య చేసిన వారికి నిత్యం ఆ పాపం గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం కలగాలని ఈ విధంగా చేసినట్లు తండా వాసులు చెబుతున్నారు. -
గోనెసంచిలో వ్యక్తి మృతదేహం
-
చంపేసి.. సంచిలో మూటకట్టేసి
రంగారెడ్డి(చేవెళ్ల): దుండగులు ఓ గుర్తుతెలియని వ్యక్తిని చంపి మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి పడేశారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శనివారం ముడిమ్యాల అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముడిమ్యాల అటవీ ప్రాంతంలో శనివారం పశువుల కాపర్లకు ఓ తెలుపురంగు సంచి కనిపించింది. అందులోంచి మనిషి కాళ్లు బయటకు కనిపించాయి. గ్రామ వీఆర్ఓ గోపాల్ సమాచారంతో చేవెళ్ల సీఐ ఉపేందర్, ఎస్ఐలు రాజశేఖర్, ఖలీల్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంచిలో ఓ వ్యక్తి మృతదేహం ముడుచుకొని కనిపించింది. తీవ్ర దుర్వాసన రావడంతో రెండురోజుల క్రితం దుండగులు వ్యక్తిని చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హతుడు దాదాపు 25-30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. దుండగులు యువకుడిని వేరే ప్రాంతంలో హత్య చేసి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై నీలిరంగు జీన్స్ ప్యాంట్, పసుపు రంగు చొక్కా ఉంది. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. మృతదేహం ఉబ్బిపోయి ఉంది. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. గతంలోకూడా ముడిమ్యాల అటవీ ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. హతుడి వివరాలు తెలిస్తే కేసును త్వరగా ఛేదించవచ్చని సీఐ ఉపేందర్ అభిప్రాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. కాగా, ముడిమ్యాల అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహం పడి ఉందనే సమాచారం తెలియడంతో స్థానికులు పెద్దమొత్తంలో గుడిగూడారు. -
సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
తూర్పుగోదావరి(అంతర్వేది): సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం శనివారం లభ్యమైంది. వివరాలు.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (23) మూడు రోజుల క్రితం ఓ పెళ్లికి హాజరయ్యేందుకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి వెళ్లారు. శుక్రవారం స్నేహితులతో కలిసి సమీపంలోని సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్రంలోని వెళ్ళిన పవన్ సుడిగుండం ఉండటంతో గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం పవన్ మృతదేహం లభ్యమైంది. వివాహ వేడుకకని వెళ్ళిన పవన్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం జిల్లా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సంచిలో చిన్నారి మృతదేహం
గుంటూరు టౌన్: గుంటూరు రైల్వే స్టేషన్లో మంగళవారం ఓ సంచి కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో 1వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై అనుమానాస్పద బ్యాగ్ ను గర్తించిన రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా సంచిలో చిన్నారి(నెలల పాప) మృతదేహాం బయటపడింది. ప్రయాణికులు ఎవరైనా సంచిని వదిలివెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్టేషన్ లోని సీసీ పుటేజ్ ను పరిశీలించి సంఘటనపై పూర్తి విచారణ చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. -
తొమ్మిది నెలలు మోసి.. మురుగుగుంతలో విసిరేసి...!
బోధన్ టౌన్ : అమ్మతనం అనేది దేవుడిచ్చిన వరం...అందుకే తొమ్మిది నెలల పాటు బరువనుకోకుండా అమ్మ తన బిడ్డను మోస్తుంది. తొమ్మిది నెలల తర్వాత లోకం చూసే తన బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఎంతో నిష్టంగా ఉంటుంది. కానీ ఆ అమ్మకు ఏం కష్టమొచ్చిందో..లేక తను క్షణికావేశంలో చేసిన తప్పును మొగ్గలోనే తుంచివేయూలనుకుందో ఏమో లోకం చూడని బిడ్డను మురుగుగుంతలో వదిలేసి వెళ్లిపోయింది. పట్టణంలోని శర్బతీకెనాల్లో గురువారం ఉదయం ఓ మగబిడ్డ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. -
గుర్తుతెలియని వ్యక్తి హత్య
అనంతపురం: అనంతరపురం జిల్లా పరిగిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం మండల కేంద్రంలోని నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. అతనిని ఇక్కడకి తీసుకొని వచ్చి హత్య చేశారా?లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని వేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియలేదని, హత్యకు గల కారణాలు సైతం దర్యాప్తులో తేలుతాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
సాయిసింధు మృతదేహానికి పోస్టుమార్టం
నెల్లూరు: అమెరికాలో మృతిచెందిన సాయి సింధు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతిపై అన్ని కోణాల్లో విచారించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింన సంగతి తెలిసిందే. అదనపు కట్నం కోసమే అల్లుడు...తమ కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. -
చెరువులో శవమై తేలిన గుజరాత్ యువకుడు
హైదరాబాద్: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఓ యువకుడు కాప్రా చెరువులో పడి మృతిచెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన రాజేశ్ (22) కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బీజేఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గరం మసాలాలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నాడు. గతనెల 30న కాప్రా చెరువులో స్నానం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం కాప్రా చెరువులో ఓ యువకుడి శవం తేలియాడడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు నీటిపై తేలాడుతున్న శవాన్ని వెలికితీశారు. దాదాపుగా వారం రోజులు అవుతుండటంతో శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. గట్టుపై దొరికిన దుస్తుల ఆధారంగా రాజేశ్‌గా గుర్తించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటరమణ తెలిపారు. -
ఆర్ఎంపీ దారుణ హత్య
సాగర్‌కాల్వ వద్ద మృతదేహం లభ్యం ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం త్రిపూరారం గ్రామానికి చెందిన సూడి రాజశేఖరరెడ్డి(21) అదే మండలానికి చెందిన స్వాతితో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తొమ్మిది నెలలుగా కూసుమంచి మండలం గట్టుసింగారంలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదే గ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం అఖిల్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరు రాజశేఖర్ వద్దకు వచ్చి తాము వరి కోత మిషన్‌పై పనిచేస్తున్నామని, జ్వరం వచ్చిందని ఇంజెక్షన్ చేయించుకుని వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అదే ముగ్గురు రాజశేఖర్ వద్దకు వచ్చి వరి కోతల పని పూర్తికావడంతో తాము తిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. వీడ్కోలు సందర్భంగా పార్టీ చేసుకుందామని అన్నారు. ఈ ప్రతిపాదనను రాజశేఖర్ నిరాకరించాడు. తనకు పని ఉందని, పార్టీ చేసుకునేందుకు రాలేనని చెప్పాడు. దీంతో వెళ్లిపోయిన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని, ఖమ్మంలో తెలిసిన ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు రావాలని రాజశేఖర్‌కు చెప్పాడు. దీంతో రాజశేఖర్ బయల్దేరి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత భార్య ఫోన్ చేసి అడగగా తాను ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. తాను తీసుకెళ్లిన పేషేంట్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కొద్ది సేపట్లోనే బస్సు ఎక్కి ఇంటికి వచ్చేస్తానని అన్నాడు. అయితే రాత్రి తొమ్మిది దాటినా రాజశేఖర్ ఇంటికి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో స్వాతి కంగారుపడిపోయింది. మృతదేహాన్ని గుర్తించారిలా.. సాగర్‌కాల్వ పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉందంటూ కొందరు ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పక్కన బీరుసీసాలతోపాటు తినుబండారాలు ఉన్నాయి. మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. కాల్వ క ట్ట పక్కన ఓ యువకుడి మృతదేహం ఉందని, మృతుడు గడ్డంతో ఉండి టీషర్టు ధరించి ఉన్నాడని గట్టుసింగారం గ్రామస్తులకు తెలిసింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన స్వాతి ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంది. మృతదేహం తన భర్త రాజశేఖర్‌దేనని గుర్తుపట్టి భోరున విలపించింది. ఈ మేరకు సీఐ తిరుపతిరెడ్డి కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
సూట్ కేసులో మృతదేహం
నిజామాబాద్ క్రైం: నగర పరిధిలోని నాగారం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్టపై సూట్‌కేసులో మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పారవేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం ప్రాంతం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఓ సూట్ కేసు పడి ఉంది. ఆ సూట్‌కేసు నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో కాలనీవాసులు కొందరు అనుమానం వచ్చి సూట్‌కేసులో ఏం ఉందోనని తెరిచిచూశారు. సూట్‌కేసులో 35 నుంచి 40 ఏళ్లవయసున్న వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఆనంద్‌కుమార్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నెల రోజుల క్రితం హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్, తెల్లగీతాల షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం ఏ మాత్రం గుర్తు పట్టనంతగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధరామప్ప లోయలో యువకుడి మృతదేహం
శ్రీశైలం: సిద్ధరామప్ప లోయలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు మల్లి అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యువకుడు నిన్న సిద్ధరామప్ప లోయలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పుట్టపర్తిలో విదేశీ మహిళ మృతదేహం లభ్యం
అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తిలో అదృశ్యమైన విదేశీ మహిళ హత్య కేసులో పురోగతి కనిపించింది. కొత్త చెరువు మండలం మంకుంటపల్లి వద్ద ఆస్త్రేలియాకు చెందిన టోని అన్నెలుగెట్ మృతదేహం లభించింది. వాచ్ మెన్ భగవంతుడు టోనిని హత్య చేశాడని, ఈకేసులో ఆతనే కీలక పాత్ర పోషించాడని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడించారు. భగవంతుడికి నాగరాజు, పోతులయ్య సహకరించారని రాజశేఖరబాబు తెలిపారు. ఈ కేసులో పుట్టపర్తి సాయి గౌరి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భగవంతుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
జయచంద్రన్ మృతదేహం లభ్యం.
-
హైదరాబాద్‌కు దేవశిష్ బోస్ మృతదేహం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దేవశిష్ బోస్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం ఉదయం లభ్యమైన దేవశిష్ బోస్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాత్రి తీసుకువచ్చారు. అతని తల్లిదండ్రులు కూడా ఇదే విమానంలో వచ్చారు. మరో నాలుగు మృతదేహాలను సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్‌కు 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. -
‘నన్ను కిడ్నాప్ చేశారు.. ఇవే చివరి మాటలు’
* కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి చివరి మాటలివి * ఖమ్మంలో గతనెల 31న కిడ్నాప్ * కృష్ణానదిలో మరుసటిరోజు రాత్రి మృతదేహం లభ్యం * వ్యాపారంలో గొడవలతోనే హత్య జరిగిందంటున్న కుటుంబసభ్యులు విజయవాడ : ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు.. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవే నా చివరి మాటలు కావచ్చు..’అని ఓ తండ్రి తీవ్ర ఆందోళనతో కుమారుడికి చివరిసారిగా ఫోన్లో చెప్పిన మాటలివి. వ్యాపారంలో గొడవల నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన ఆ వ్యక్తి ఆదివారం రాత్రి కృష్ణానదిలో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన కిషోర్‌బాబు(48)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఖమ్మంలోని పొట్టిశ్రీరాములు రోడ్డులో ఇండూరు రాము అనే వ్యక్తితో కలిసి పురుగుమందులు, విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు. గతనెల 31వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కిషోర్ బజారుకు వెళుతున్నానని భార్య ఉషకు చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుమారుడు వినయ్ పలుచోట్ల గాలించాడు. కిషోర్ ద్విచక్రవాహనం జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమీపంలో కనిపించింది. కిషోర్ బాబు జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. అదేరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వినయ్‌కు తండ్రి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘బాబూ.. నన్ను కిడ్నాప్ చేశారు. విజయవాడకు తీసుకుని వెళుతున్నారు. నన్ను కృష్ణానదిలో పడవేయాలని అనుకుంటున్నారు.. బహుశా ఇవేనా నా చివరి మాటలు కావచ్చు’ అని ఆయన కుమారుడికి చెప్పాడు. దీంతో వినయ్ ఆందోళనకు గురై తల్లితో కలిసి ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కృష్ణానదిలో 38 వ ఖానా వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపిం చింది. స్థానికులు అందించిన సమాచారంతో స్థానిక స్టేషన్ సిబ్బందితోపాటు ఖమ్మం పో లీసులు, కిషోర్ బంధువులు అక్కడకు వెళ్లారు. మృతదేహాన్ని చూసి కిషోర్‌దిగా బంధువులు గుర్తించారు. ఎలా జరిగిందంటే.. కిషోర్ బజారులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి కొందరితో మాట్లాడేందుకు అని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. అతడితోపాటు మరికొందరు కిషోర్ కాళ్లను తాళ్లతో కట్టివేసి కారులో పడవేసి విజయవాడకు బయలుదేరారు. నగరంలో పోలీసుల తనిఖీలు జరుగుతుండడంతో వాహనాన్ని కనకదుర్గమ్మ గుడికి సమీపంలో నిలిపారు. కిడ్నాపర్లు కారులోనుంచి దిగి పక్కకు వెళ్లారు. దీంతో కిషోర్ అప్రమత్తమై తన మొబైల్ నుంచి కుమారుడికి ఫోన్ చేయడంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో గొడవలతోనే.. తన భర్తకు వ్యాపారానికి సంబంధించి భాగస్వామి అయిన ఇండూరు రాముతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కిషోర్ భార్య ఉష పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. రాము బంధువైన ప్రభుత్వోద్యోగి పోటు శ్రీను కిడ్నాప్ ఇందులో ప్రధాన పాత్ర పోషించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
‘సింధురక్షక్’లో ఆరో మృతదేహం లభ్యం
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్‌యార్డ్‌లో ప్రమాదానికి గుైరె న ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి నుంచి శనివారం రాత్రి మరో మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నేవీ గజ ఈతగాళ్లు శుక్రవారం ఐదుగురి మృతదేహాలను వెలికితీయగా.. శనివారం నాలుగో రోజు గాలింపుల్లో ఒక శవాన్ని బయటికి తీశారు. మరో 12 మంది నావికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. జలాంతర్గామి లోపలికి వెళ్లేందుకు గజ ఈతగాళ్లు వెనకవైపున గల మరో మార్గాన్ని తెరవగలిగారని, వేడికి కరిగిపోయి బిగుసుకుపోయిన ముందువైపు మార్గాన్నీ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారని శనివారం రక్షణ శాఖ పీఆర్ఓ నరేంద్రకుమార్ విస్‌పుతే తెలిపారు. చమురు కలిసిన నీరు, బురద, చిమ్మ చీకటి కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అయినా.. గజ ఈతగాళ్లు అణువణువూ తడుముతూ గాలిస్తున్నారన్నారు. కాలినగాయాలతో మునగడం వల్లే మృతి... కాలినగాయాలు కావడం, పొగను పీల్చడంతోపాటు నీటిలో మునగడం వల్లే ఐదుగురు నేవీ సిబ్బంది మరణించారని ఇక్కడి జేజే హాస్పిటల్ వైద్యులు శవపరీక్షలో నిర్ధారించారు. వారి శరీరంలోకి మేకుల్లాంటి ఎలాంటి వస్తువులూ చొచ్చుకుపోలేదని ఎక్స్‌రేల్లో తేలిందని వారు తెలిపారు. ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చాకే అవి ఎవరివన్న విషయం తేలనుందని అధికారులు పేర్కొన్నారు. ఉక్కు కరిగించే వేడికి భస్మమయ్యారా..? మూడు పేలుళ్లతోపాటు భారీ అగ్నిప్రమాదం కారణంగా జలాంతర్గామిలోని ఉక్కు నిర్మాణమే కరిగిపోయి రూపుమారిపోయింది. అంత వేడిని మానవ శరీరాలు త ట్టుకోవడం అసాధ్యమని, సిబ్బంది మృతదేహాలు భస్మమైపోయి కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. లభించిన మృతదేహాలు గుర్తుపట్టలేని రీతిలో ఉండటంతో మిగతావారూ బతికే అవకాశం లేదని అంటున్నారు. కాగా, జలాంతర్గామిలో బ్యాటరీలను చార్జింగ్ చేసే చోటే తొలుత పేలుడు జరగడాన్ని బట్టి.. కీలకమైన ఆ కంపార్ట్మెంట్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని రష్యా ఉపప్రధాని దిమిత్రీ రోగోజిన్ అన్నారు. జలాంతర్గామి పరికరాల తయారీలో లోపం కన్నా.. భద్రత పాటించకపోవడమే కారణమై ఉంటుందని పేర్కొన్నారు. -
చిన్నారి మాన్వీ.. విషాదాంతం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కన్నతండ్రి చేతుల్లోంచి జారి మూసీ నదిలో పడి గల్లంతైన చిన్నారి మాన్వీ విగతజీవిగా లభించింది. ఆమె మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం లభించింది. దీంతో 24 గంటల నిరీక్షణకు తెరపడింది. ఇక్కడి హయత్‌నగర్ మండలం మర్రిపల్లి వద్ద నదిలోని చెట్ల పొదల్లో మృతదేహం ఇరుక్కుని ఉండగా నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సహకారంతో పోలీసులు గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. తీవ్ర మనోవేదన మధ్య బంధువులు మాన్వీ మృతదేహానికి మన్సూరాబాద్‌లోని పెద్దచెరువు స్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ సహారా ఎస్టేట్‌కు చెందిన ప్రవాస భారతీయ వైద్యుడు మేఘశ్యామరెడ్డి గురువారం ఉదయం తన కుమారుడు ప్రమోద్‌రెడ్డి, కుమార్తె మాన్వీతో కలిసి మూసీ నదిని చూసేందుకు నాగోలు వద్దకు వెళ్లగా.. తండ్రి భుజాలపై ఉన్న చిన్నారి మాన్వీ మూసీలో పడిపోవడం తెలిసిందే. చిన్నారికోసం ఎల్బీనగర్ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గురువారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో దుర్గంచెరువులో ఉండే పర్యాటకశాఖ బోట్లను తీసుకొచ్చి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో పోలీసులు శుక్రవారం ఉదయం ఆరుగంటలకే గాలింపు చేపట్టారు. మాన్వీ మేనమామతో కలిసి మూసీ దిగువకు 8 కిలోమీటర్ల వరకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హయత్‌నగర్ మండలం మర్రిపల్లి గ్రామం సమీపంలోని చెక్‌డ్యామ్ వరకు గాలిస్తూ వెళ్లారు. డ్యామ్ సమీపంలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ ఎగువ వరకు గాలించాలనే ఉద్దేశంతో తిరిగి వెతకడం మొదలుపెట్టారు. ఆ సమీపంలోని చెట్ల పొదల్లో తీవ్రగాయాలతో ఉన్న మాన్వీ మృతదేహం లభించింది. వెంటనే మృతదేహాన్ని బోటులో నాగోలు బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి అక్కడ్నుంచి ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టంకోసం తరలించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినందున నదిలోని రాళ్లు, ముళ్లకంచెల కారణంగా గాయాలయ్యాయని నిర్ధారించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించగా.. సహారా ఎస్టేట్‌కు తరలించారు. మాన్వీ మరణవార్తతో సహారా ఎస్టేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వేదనలో మాన్వీ కుటుంబం.. మాన్వీ గల్లంతు వార్త తెలియడంతో అనేకమంది శుక్రవారం ఉదయం నాగోలు మూసీ నది వంతెన, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చేరుకుని తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూశారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే మాన్వీ మరణవార్త తెలుసుకున్న ప్రజలు తీవ్ర ఆవేదన, చెమర్చిన కళ్లతో తిరిగివెళ్లారు. మరోవైపు మాన్వీ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కాలనీవాసులు, బంధువులు సహారా ఎస్టేట్‌కు తరలివచ్చారు. మాన్వీ తాత బాల్‌రెడ్డి సహారా ఎస్టేట్ సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అందరితో కలివిడిగా వ్యవహరించే ఆయన ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం సహారా ఎస్టేట్వాసులను కలచివేసింది. సెలవుల్ని సరదాగా గడపటానికి మాతృదేశం వస్తే... కుమార్తెను పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ గుండెపగిలేలా రోదిస్తున్న తండ్రి మేఘశ్యామరెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.