గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెల్దుర్తి రూరల్: కర్నూలు రైల్వే పరిధిలోని వెల్దుర్తి మండలం మదార్‌పురం – బింగిదొడ్డి రైల్వేలైన్ మధ్యన శనివారం 30 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు రైల్వే ఎస్‌ఐ జగన్ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతునికి సంబంధించి వివరాలు లభించలేదన్నారు. మృతుడు నడుస్తున్న రైల్లోంచి కింద పడ్డాడా, లేక మరే ఇతర కారణమా అనే అనుమానంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని కర్నూలు మార్చురీలో ఉంచన్నుట్లు 72 గంటలలో ఎవరైనా సంబంధీకులు రాకపోతే పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.