గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత
Published Mon, Aug 1 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
ధర్మసాగర్ : ధర్మసాగర్ రిజర్వాయర్‌లో గల్లంతైన ఇద్దరిలో కానిస్టేబుల్ పొలుమారి సృజన్(25) మృతదేహం సోమవారం ఉద యం లభ్యమైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ లో ఆదివారం ఇద్దరు గల్లంతు కాగా అందులో పీఈటీ మాచర్ల సునీల్ మృతదేహాన్ని ఆదివా రం రాత్రి వెలికితీశారు. అయితే, చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక జాలర్ల గాలింపు లో సృజన్ మృతదేహం బయటపడగా పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మృత్యువులోనూ కలిసే..
ఉజ్వల భవిష్యత్ ఉన్న సృజన్, సునీల్ ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాత పడడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎంజీఎంలో యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక సోమవారం మధ్యాహ్నం వారి స్వగృహాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుండి కలిసి చదువుకుని, మృత్యువులో సైతం వీడిపోని తమ స్నేహితుల మృతదేహాలను చూసిన సహచరులు గుండెలవిసేలా రోదించారు. ఇక జీవిత చరమాంకంలో తమకు అండగా ఉంటారనుకున్న తమ కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. కాగా, కానిస్టేబుల్ పొలిమారి సృజన్ మృతదేహానికి పోలీస్ సిబ్బంది, స్థానిక సెయింట్ మా«థ్యూస్ స్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్న మాచర్ల సునీల్ మృతదేహానికి పాఠశాల సిబ్బంది నివాళులర్పించారు. ఈ మేరకు సాయంత్రం యువకుల మృతదేహాలకు స్థానిక రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement
Advertisement