
భువనగిరికి చేరిన నయీం మృతదేహం
పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం
పట్టణంలో ఉద్రిక్త వాతావరణం
పోలీసుల ఆధీనంలో గ్యాంగ్‌స్టర్ ఇల్లు
మఫ్టీలో అనుమానితుల ఫొటో, వీడియోలు తీసిన పోలీసులు
భువనగిరి : మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం మరణంతో నల్లగొండ జిల్లాలోని భువనగిరి పట్టణం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన నÄæూమ్ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం భువనగిరిలోని ఖాజీమహల్‌లోగా నివాసగృహానికి తీసుకువచ్చారు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలె చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మృతదేహాన్ని చూడాలని..
మధ్యాహ్నం 3.07నిమిషాలకు నయీం మృతదేహాన్ని భువనగిరి ఎల్లమ్మగుడి వద్దకు.. 3.09నిమిషాలకు హైదరాబాద్ చౌరస్తా, 3.15 నిమిషాలకు ఇంటి వద్దకు చేరుకుంది. 3.16 నిమిషాలకు అంబులెన్స్ నుంచి ఆయన మృతదేహాన్ని బయటకి తీయడంతో ప్రజలు అంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం అక్కడి చేరుకున్నారు. 2007 తర్వాత నయీంను ఎవరూప్రత్యక్షంగా చూడకపోవడంతో ఆయన మృతదేహాన్ని చూడాలని చాల మంది అక్కడి వచ్చారు. వీరితోపాటు యువకులు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. కాగా నయీం కుటుంబ సభ్యులు ప్రత్యేక టవేరా వాహనంలో అంబులెన్స్ వెనకాలే వచ్చారు. వారంతా మృతదేహాంతో పాటు ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఇతరులను లోపలికి రాకుంండా ఇంటి షెటర్ కిందకు వేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నయీంను చూడడానికి ప్రజలు ఒక్కసారిగా లోపలికి వెళ్లే సమయంలో పోలీసులు ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నయీం ఇంటి వెనుక భాగంలో నుంచి కుటుంబసభ్యులు వచ్చి మీడియాతో మాట్లాడారు. చివరి సారిగా నయీంను అతడి భార్య, అక్క, పిల్లలు చూడాలని వెంటనే పోలీసులు వారిని తీసుకురావాలని, లేకుంటే శవాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు భీష్మించుకు కుర్చున్నారు. డీఎస్పీ మోహన్‌రెడ్డి, సీఐలు శంకర్‌గౌడ్, అర్జునయ్య, రఘువీర్‌రెడ్డిలతో పాటు గుండాల, బొమ్మలరామారం, భువనగిరిటౌన్, భువనగిరిరూరల్, ఆలేరు, బొమ్మలరామారం ఎస్‌ఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీగా పోలీస్ బందోబస్తు
భువనగిరి పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మెుహరించారు. ఖిలానగర్ నుంచి నల్లగొండ బైపాస్ రోడ్డు వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లగొండ నుంచి ప్రత్యేక పోలీసులను రప్పించారు. సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చారు. మఫ్టీలో వందల మంది పోలీసులు ప్రజల్లో కలిసిపోయారు. అవాంఛనీయ ఘటనలు ఎదురైనా ఎదుర్కోవడానికి రక్షక్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. భువనగిరి–చిట్యాల రోడ్డులో జంపుఖానగూడెం, నల్లగొండ రోడ్డు వద్ద భారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు.
వివిధ ప్రాంతాల నుంచి నయీం అనుచరుల రాక
నయీం అంత్యక్రియలు జరుగుతున్నందున్న పలువురు అనుచరులు పట్టణానికి చేరుకున్నారు. భువనగిరితో పాటు వరంగల్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, అదిలాబాద్, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పలువురు మాజీ నక్సలైట్లు, నయీం ముఠా సభ్యులు ఇక్కడి వచ్చారు. స్థానిక పోలీసులు జనంలో కలిసిపోయి అనుమానితుల ఫొటోలు, వీడియోలు తీశారు.