ఇంత దారుణమా! వైరల్‌ వీడియో | ugly face of caste systemViral video | Sakshi
Sakshi News home page

ఇంత దారుణమా! వైరల్‌ వీడియో

Published Thu, Aug 22 2019 10:53 AM | Last Updated on Thu, Aug 22 2019 11:20 AM

ugly face of caste systemViral video - Sakshi

భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన కుల వివక్ష వికృత రూపానికి అద్దం పట్టిన ఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. బతికి వున్నపుడు ఎలా ఉన్నా..చనిపోయిన వారికి కనీస గౌరవాన్నివ్వడం సమాజంలో ఒక సంస్కారంగా కొనసాగుతూ వస్తోంది.  కానీ వెల్లూరులో కుప్పన్‌ అనే దళిత వ్యక్తి  చనిపోయిన సందర్భంగా  స్థానిక ఆధిపత్య  కులానికి  చెందిన కొంతమంది  పెద్దలు  దారుణంగా  ప్రవర్తించారు. తమ పొలంలోంచి అతని మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో వేరే గత్యంతరం లేని బంధువులు వంతెనపైనుంచి స్ట్రెచర్‌ ద్వారా  మృతదేహాన్ని కిందికి దించి, అక్కడనుంచి దహన వాటికకు తరలించాల్సి వచ్చింది.  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దీనికి సంబంధించిన వీడియో పలువురిని విస్మయ పరుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement