Objection
-
మాక్ పోలింగ్ వెరిఫికేషన్ ఏర్పాట్లపై బాలినేని అభ్యంతరం
-
పీఓకేలో పాక్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటన.. భారత్ తీవ్ర అభ్యంతరం
‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ లో (పీఓకే) ఇస్లామాబాద్ బ్రిటన్ రాయబారి పర్యటించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటన అత్యంత అభ్యంతరకరమని పేర్కొంది. ఇది ‘భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య’గా అభివర్ణించింది. కాగా పాకిస్థాన్‌లోని బ్రిటన్ హైకమిషనర్ జేన్ మారియట్ ఈనెల 10న పీఓకేలోని మీర్పూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. ఆమె పర్యటనపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘణపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్ అధ్యక్షుడు -
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన జవాబు
శ్రీనగర్: ఈ నెల 22–24 తేదీల మధ్య జి–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. జి–20కి సంబంధించిన ఏ విధమైన సమావేశాల్ని కూడా వివాదాస్పద ప్రాంతాల్లో జరపరాదని, అటువంటి సమావేశాలకు తాము హాజరుకాబోమని శుక్రవారం పేర్కొంది. దీనిపై భారత్ దీటుగా స్పందించింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు జరుకునే స్వేచ్ఛ మాకుంది. చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం అవసరం’అని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరు కారాదని టర్కీ ఇప్పటికే ప్రకటించగా, సౌదీ అరేబియా నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 100 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే, సుమారు 60 మంది హాజరవుతారని తాజాగా అంచనా వేస్తోంది. ఇలా ఉండగా, జి–20 సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ)ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చన్న అనుమానాల నేపథ్యంలో జి–20 సమావేశాల వేదిక, దాల్‌లేక్‌ను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. -
పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు...!
-
ఏంటమ్మా లుంగీ, ధోతికి తేడా తెల్వదా?: సల్మాన్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. ఇటీవలే ఈ సినిమా నుంచి 'ఏంటమ్మా' అనే పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్‌తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన డ్యాన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లుంగీ డ్యాన్స్ తరహాలో ముగ్గురు స్టార్ హీరోలు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఈ పాటపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాట దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆరోపించారు. వెంటనే ఈ సాంగ్‌ను బ్యాన్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. లక్ష్మణ్ శివరామకృష్ణన్ ట్వీట్లో రాస్తూ..' ఇది చాలా హాస్యాస్పదం. ఈ పాటకు హీరోలు ధరించింది లుంగీ కాదు. ధోతిని లుంగీగా చూపించారు. ఇది దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉంది. క్లాసిక్ దుస్తులను చాలా అసహ్యకరమైన రీతిలో చూపించారు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. లుంగీ, ధోతీకి తేడా ఏంటో కూడా కనీసం తెలుసుకోరు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఆలయంలో నటీనటులు షూస్ ధరించి ఎలా డ్యాన్స్ చేస్తారని ప్రశ్నించారు. కాగా.. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జోడీగా తెరకెక్కుతోన్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, పాలక్ తివారీ, జాస్సీ గిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. This is highly ridiculous and degrading our South Indian culture. This is not a LUNGI , THIS IS A DHOTI. A classical outfit which is being shown in a DISGUSTING MANNER https://t.co/c9E0T2gf2d — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023 -
రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై అనుమానాలు.. నో చెప్పిన ప్రతిపక్షాలు
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ముగిసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశం సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వీఎం నమూనాకు ప్రదర్శించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఆర్వీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. వలస ఓటర్లపై శాస్త్రీయ సర్వే లేకుండా వారికి ఎలా గుర్తిస్తారని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. దీంతో, అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. -
బీఆర్ఎస్గా టీఆర్ఎస్.. అభ్యంతరాలపై పత్రికా ప్రకటన రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా కూడా మార్చారు. ఈ క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారుస్తూ పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి తెలిపాలని పార్టీ కోరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడి పేరుతో ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. -
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక
కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్ ట్రాకింగ్ సామర్థ్యం కలిగిన యువాన్ వాంగ్ 5 రాకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఈనెల 11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది. యువాన్ వాంగ్ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్ యిన్ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థ స్విఛాన్ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం
తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది. -
భీమ్లా నాయక్ పాటపై వివాదం: ఐపీఎస్ అధికారి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’లోని పాటను విడుదల చేశారు. విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్ కల్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో పాటతో అర్ధమవుతోంది. అయితే ఆ పాటపై ఓ ఐపీఎస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్ చేశారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ భీమ్లా నాయక్ పాట విన్న అనంతరం ఓ ట్వీట్ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్ అధికారి రమేశ్ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు పాటలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నేరుగా రామజోగయ్యను ట్యాగ్ చేస్తూ చెప్పారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రామజోగయ్య స్పందించారు. ‘మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా ‘నెక్ట్స్ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్’ అని శాస్త్రి రిప్లయ్ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటను తెలంగాణ జానపద కళాకారుడు, అరుదైన కిన్నెరను వాయించే దర్శనం మొగులయ్య పాడడం ప్రత్యేకంగా ఉంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s — M. Ramesh IPS (@DCPEASTZONE) September 2, 2021 -
మమత నామినేషన్ తిరస్కరించాలంటూ బీజేపీ ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా బెనర్జీపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను ఆమె నామినేషన్లో ప్రస్తావించలేదని చెప్పారు. ఇందులో ఐదు కేసులు అస్సాంలో, ఒక కేసు బెంగాల్లో సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. ఆమె వాటిని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసు నంబర్లను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించానని సువేందు అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆయా కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సువేందు అధికారి ఫిర్యాదుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. అది ఓటర్ల ప్రాథమిక హక్కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, తమపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోతే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చని 2018 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. అభ్యర్థుల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. నామినేషన్ పత్రాల్లో కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచడం ఆ హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. -
‘రక్షణ’ కమిటీలో ప్రజ్ఞా, ఫరూక్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి వచ్చే బీజేపీ ఎంపీ సాథ్వి ప్రజ్ఞాసింగ్‌కు పార్లమెంట్ కీలక కమిటీలో ప్రభుత్వం చోటు కల్పించింది. ఈమెతోపాటు ప్రజా భద్రత చట్టం(పీఎస్ఏ)కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా(81)పేరును పార్లమెంట్ రక్షణ రంగ సంప్రదింపుల సంయుక్త కమిటీకి ప్రతిపాదించినట్లు తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్, మాజీ రక్షణ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులు ఉన్నారు. 21 మంది ఉండే ఈ కమిటీలో 12 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ కమిటీలో చోటు లభించిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు. మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తీవ్రభావ జాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఒక సభ్యురాలికి ఎంతో ముఖ్యమైన రక్షణ సంబంధ కమిటీలో స్థానం కల్పించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అదేవిధంగా, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం ఫరూక్ అబ్దుల్లాను మూడు నెలలుగా పీఎస్ఏ కింద గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా పలువురిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. -
ఇంత దారుణమా! వైరల్ వీడియో
భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన కుల వివక్ష వికృత రూపానికి అద్దం పట్టిన ఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. బతికి వున్నపుడు ఎలా ఉన్నా..చనిపోయిన వారికి కనీస గౌరవాన్నివ్వడం సమాజంలో ఒక సంస్కారంగా కొనసాగుతూ వస్తోంది. కానీ వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోయిన సందర్భంగా స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొంతమంది పెద్దలు దారుణంగా ప్రవర్తించారు. తమ పొలంలోంచి అతని మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో వేరే గత్యంతరం లేని బంధువులు వంతెనపైనుంచి స్ట్రెచర్ ద్వారా మృతదేహాన్ని కిందికి దించి, అక్కడనుంచి దహన వాటికకు తరలించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన వీడియో పలువురిని విస్మయ పరుస్తోంది. Ugly face of caste system! Everybody deserves a dignifid death! Kuppan, a dalit man died in Vellore. Some dominant caste people objected to carrying his body through their farm land. His body had to be lowered using a stretcher atop a bridge to reach the cremation ground. pic.twitter.com/MqrJGNRc6V — Vibhinna Ideas (@Vibhinnaideas) August 22, 2019 -
టర్కీ చేరిన రష్యా ఎస్–400 క్షిపణులు
ఇస్తాంబుల్: రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలు కొనరాదంటూ అగ్రరాజ్యం అమెరికా చేసిన హెచ్చరికలకు టర్కీ ప్రభుత్వం లొంగలేదు. అమెరికా హెచ్చరికలు భేఖాతరు చేస్తూ రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్–400 క్షిపణులను టర్కీ కొనుగోలు చేసింది. కొనుగోలులో భాగంగా మొదటి దశ క్షిపణులు శుక్రవారం టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నాయి. ఈ మేరకు టర్కీ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక తాజా కొనుగోలుతో అమెరికా, టర్కీల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ కొనుగోలుకు సంబంధించి టర్కీని అమెరికా ఈ వారమే హెచ్చరించింది. టర్కీ గనుక రష్యా క్షిపణులను కొనుగోలు చేస్తే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. జూలై 31లోగా కొనుగోలును రద్దు చేసుకోకుంటే ఎఫ్–35 యుద్ధ విమానాలపై టర్కీ ఆశలు వదులుకోవాల్సిందేనని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వీటిని నడపడానికి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలెట్లను వెనక్కి పంపిస్తామని పేర్కొంది. అయితే ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని టర్కీ రష్యా నుంచి కొనుగోళ్లకే మొగ్గు చూపడం అమెరికాకు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. -
ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం
ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో .. కంపెనీని మళ్లీ గట్టెక్కించేందుకు తాము అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, శాయశక్తులా కృషి చేస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇటీవలి బడ్జెట్లో కేంద్రం కంపెనీకి నామమాత్రంగా రూ. లక్ష మాత్రమే కేటాయించింది. అలాగే అక్టోబర్ లోగా విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. -
అది దురుద్దేశాల నివేదిక
న్యూఢిల్లీ/జెనీవా: కశ్మీర్లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కశ్మీర్లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అటు పాకిస్తాన్ లేదా ఇటు ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారు.. ‘భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కశ్మీర్లో మూల సమస్య అయిన సీమాతంర ఉగ్రవాదాన్ని విస్మరిస్తూ ఈ నివేదికను రూపొందించారు. పాక్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదుల వల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు. ఇండియాకు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించే పాకిస్తాన్‌కు మధ్య కృత్రిమ పోలిక తేవాలన్న ప్రయత్నం ఈ తాజా నివేదికలో కనిపిస్తోంది. దీనిపై ఐరాస మానవహక్కుల కార్యాలయానికి ఇండియా తన తీవ్ర నిరసనను తెలిపింది. నివేదికను ఇలా విడుదల చేయడం వల్ల ఐరాస విశ్వసనీయత, చిత్తశుద్ధి దెబ్బతింది. భారత విధానాలు, ఆచరణలు, విలువలను విస్మరించిన ఈ నివేదిక తన విశ్వసనీయతనే ప్రమాదంలోకి నెట్టుకుంది’ అని చెప్పారు. -
నోట్ల రద్దుపై ఆర్బీఐ అభ్యంతరాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టొచ్చన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు అంటే 2016 నవంబర్ 8న సాయంత్రం 5.30 నిమిషాలకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశానికి సంబంధించిన (మినిట్స్) వివరాలను సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ మీడియాకు విడుదల చేశారు. ‘నల్లధనం చాలా వరకు కరెన్సీ రూపంలో లేదు. రియల్ రంగంలోని ఆస్తులు, బంగారం రూపంలో ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు’అని ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పేర్కొన్నట్లు రమేశ్ తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల మాత్రమే అసలైన పెరుగుదల. అంతేకానీ చెలామణి అవుతున్న కరెన్సీ పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. నల్ల ధనం తగ్గుతుందన్న వాదన నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్దగా సమర్థించదు’అని ఆర్బీఐ వ్యాఖ్యలను ఉటంకించారు. దేశంలో చెలామణీ అవుతున్న మొత్తం కరెన్సీలో నకిలీ నోట్లు కేవలం రూ.400 కోట్లు ఉంటుందని, అది చాలా తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయమని ఆర్బీఐ తెలిపినట్లు చెప్పారు. -
‘మధ్యప్రదేశ్‌లో ఆ మూవీ విడుదల కానివ్వం’
భోపాల్ : ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీపై వివాదం ముదురుతోంది. ఈ సినిమా ట్రైలర్‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా ఈ సినిమా తమకు ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని కాంగ్రెస్ నేత సయ్యద్ జాఫర్ హెచ్చరించారు. సినిమా పేరుతో పాటు ట్రైలర్లో చూపించిన సన్నివేశాల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను చిత్ర దర్శకుడికి లేఖ రాశానని చెప్పారు. మూవీ ట్రైలర్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీలను తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. 2004 నుంచి 2008 మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో మన్మోహన్ సింగ్‌ను బలిపశువుగా చూపేలా ట్రైలర్లో చూపారని కాంగ్రెస్ మండిపడుతోంది. కాగా సంజయ్ బారు పుస్తకం ఆధారంగానే తాము సినిమా రూపొందించామని మన్మోహన్ పాత్రను పోషించిన నటుడు అనుపమ్ ఖేర్ చెబుతున్నారు. -
‘థాకరే’ బయోపిక్కు సెన్సార్ అడ్డంకులు
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు, దిగ్గజ నేత బాల్ థాకరే బయోపిక్కు కష్టాలు ఎదురయ్యాయి. బాల్ థాకరే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన థాకరే మూవీలోని కొన్ని సన్నివేశాలపై కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీలోని ఆరు డైలాగులు, రెండు సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. సీబీఎఫ్సీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించుకుంటామని చిత్ర బృందం పేర్కొంది. చట్టబద్ధంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలను ఎదుర్కొంటామని, సమస్యను పరిష్కరించుకంటామని చిత్ర నిర్మాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా చిత్ర ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం.ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృతారావు మీనా థాకరే పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 23న బాల్ థాకరే జయంతి సందర్భంగా థాకరే మూవీ విడుదలవుతోంది. -
నీటి కేటాయింపుల తీరుపై తెలంగాణ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రానికి దక్కే వాటాకన్నా తక్కువ నీటి కేటాయింపులు చేసిందని శనివారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా బోర్డు తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 33.40 టీఎంసీలు కేటాయించిందని, అయితే న్యాయంగా తెలంగాణకు 51 టీఎంసీల మేర వాటా నీరు దక్కుతుందని తేల్చిచెప్పింది. ఇక బోర్డు సాగర్ ఎడమ కాల్వ కింద ఆంధ్రప్రదేశ్ అవసరాలకు 3.43 టీఎంసీల నీరు కేటాయించిందని, నిజానికి సాగర్ ఎడమ కాల్వ కింద ప్రస్తుత రబీ సీజన్లో జోన్–1 వరకు మాత్రమే నీటిని అందించాలని తెలంగాణ భావిస్తోందని తెలిపింది. సరిపడేంత నీరు లేక తెలంగాణలోని జోన్–2 ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదని వివరించింది. అలాంటప్పుడు జోన్–3లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఆయకట్టుకు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
రైల్లో పొగతాగొద్దన్నందుకు గర్భిణీని చంపేశాడు!
షాజహాన్‌పూర్: రైలులో తోటి ప్రయాణికుడు పొగతాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుంది. పంజాబ్– బిహార్ జలియన్ వాలా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బిహార్‌కు చెందిన చినత్ దేవి(45) అనే గర్భిణీ తన కుటుంబంతో కలిసి ఛత్ పూజల్లో పాల్గొనేందుకు సొంతూరుకు వెళ్తున్నారు. వారితోపాటు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న సోనూ యాదవ్ పొగతాగుతుండటంతో చినత్ దేవి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఉన్న సోనూ చినత్ దేవి గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను షాజహాన్పూర్లో రైలు ఆపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్‌పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్‌లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్‌ను ప్రశ్నించింది. -
కశ్మీర్లో స్వతంత్ర విచారణకు మద్దతు
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ మద్దతు పలికారు. ఈ విషయంలో మానవ హక్కుల హైకమిషనర్ నిర్ణయాలు ఐరాస గొంతును ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్ ప్రతిపాదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే స్వతంత్ర విచారణ చేయాలన్న ప్రతిపాదనను భారత్ ఖండించింది. కాగా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కశ్మీర్‌లలో సాయుధులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింస వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిభద్రతకు విఘాతం కలిగించే స్థాయి లేని అంశాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
నిఘా రాజ్యంగా మారుస్తారా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ డేటాపై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పౌరులందరి కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా?’ అంటూ కేంద్రానికి కోర్టు మొట్టికాయలు వేసింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర అన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలతోపాటు వార్తా వెబ్సైట్లు, బ్లాగులలో ప్రచురితమయ్యే కథనాలను సేకరించి, విశ్లేషించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ యంత్రాంగం ఏర్పాటు కోసం ఈ ఏడాది మే నెలలో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ టెండర్ పిలిచింది. బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) అనే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ టెండర్ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు మహువా మొయిత్రా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో విషయం సుప్రీం కోర్టుకు చేరింది. రెండు వారాల్లో స్పందించండి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం మహువా పిటిషన్‌ను విచారించింది. దీనిపై 2 వారాల్లో స్పందించాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. పిటిషన్ విచారణలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ లేదా ఎవరో ఒక న్యాయాధికారి తమకు సాయంగా ఉండాలని ఆదేశించింది. మహువా తరఫున న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సోషల్ మీడియా హబ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో, ఈ–మెయిల్స్‌లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలను విశ్లేషించాలనుకుంటోందని కోర్టుకు చెప్పారు. పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతా హక్కును కాలరాయాలని ప్రభుత్వం చూస్తోందని, రాజ్యాంగంలోని అధికరణాలు 14, 19(1)(ఎ), 21ల ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు భంగంకలిగేవీలుందని వాదించారు. టెండర్‌ను ప్రభుత్వం ఆగస్టు 20న తెరవనున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో అంతకంటే ముందే, ఆగస్టు 3కు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయకుండా కేంద్రాన్ని అడ్డుకునేందుకు జూన్ 18నే అత్యవసర విచారణ జరపాల్సిందిగా మహువా కోరినా అప్పట్లో కోర్టు నిరాకరించింది. ఏ అధికారం లేకుండానే ప్రభుత్వం ప్రజల జీవితాల్లోకి చొరబడాలనుకుంటోందనీ, భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు సహా పలు ప్రాథమిక హక్కులకు దీని ద్వారా భంగం కలుగుతుందని మహువా పిటిషన్లో పేర్కొన్నారు. టెండర్లో ఏముంది? టెండర్లో తాము కోరుకుంటున్న సాఫ్ట్వేర్ యంత్రాంగం ఎలా ఉండాలో కేంద్రం వివరించింది. సామాజిక మాధ్యమాలతోపాటు, వార్తల వెబ్సైట్లు, బ్లాగులు తదితరాల్లోని డిజిటల్ సమాచారాన్నంతా ప్రాంతాల వారీగా దేశ వ్యాప్తంగా సేకరించి, ఆటోమేటిక్‌గా విశ్లేషించగలిగేలా సాఫ్ట్వేర్ ఉండాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఒక్కో జిల్లాలో కొంతమంది మీడియా వారిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకుంటారు. ఆటోమేటిక్‌గా సమాచారాన్ని వ్యూహాత్మకంగా విశ్లేషించి నివేదికలు ఇచ్చేలా సాఫ్ట్వేర్ ఉండాలి. ప్రత్యేకించిన వెబ్సైట్లో సమాచారాన్ని ప్రచురించగలగాలి. కేంద్రం చేపట్టే వివిధ పథకాల ఆన్లైన్ ప్రచార కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉండాలని టెండర్లో ప్రభుత్వం పేర్కొంది. -
కెనడా ప్రధానిపై ట్రంప్ గరం
క్యుబెక్: జీ–7 శిఖరాగ్ర సదస్సు అనంతరం సభ్య దేశాలు విడుదలచేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. సదస్సు ముగియడానికి ముందే సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందిం చారు. ట్రూడో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రకటనను నమ్మొద్దని మా ప్రతినిధులకు చెప్పాను. జీ–7 సమావేశ సమయంలో ఎంతో అణకువ, మర్యాదగా నటించిన ట్రూడో నేను వెళ్లిన తరువాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు చెప్పారు’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టారిఫ్‌ల పెంపునకు ట్రంప్ భద్రతను సాకుగా చూపడం.. క్లిష్ట సమయాల్లో అమెరికా మిత్ర దేశాలకు మద్దతుగా నిలిచిన కెనడా మాజీ నాయకులను అవమానించడమేనని జస్టిన్ ట్రూడో మీడియా ముందు వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్లపై ట్రూడో కార్యాలయం స్పందిస్తూ.. తమ ప్రధాని ఇంతకుముందు చెప్పని కొత్త విషయాలు వేటినీ చెప్పలేదని వెల్లడించింది. -
పెళ్లి బరాత్ కు అనుమతించండి...
లక్నో : ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక ముఖ్య ఘట్టం. ఆ వివాహ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. యూపీకి చెందిన ఓ యువకుడు కూడా అలానే అనుకున్నాడు. వివాహనంతరం బరాత్(పెళ్లి ఊరేగింపు) నిర్వహించాలనుకున్నాడు. అందుకోసం అనుమతివ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు. అదేంటి బరాత్ వేడుక నిర్వహించడానికి కోర్టు అనుమతి ఎందుకు, ఈ కొత్త నిబంధన ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నారా..? ఈ సంఘటన జరిగింది మన దగ్గర కాదులెండి ఉత్తరప్రదేశ్‌లో. వివాహం చేసుకోబేబొయే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో బరాత్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా కోర్టును వేడుకున్నాడు. వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ సంఘటన లక్నోలోని కస్గంజ్ గ్రామంలో చోటుచేసుకుంది. కస్గంజ్ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్‌కు వివాహం నిశ్చయం అయింది. తన వివాహ వేడుకలో సంజయ్ బరాత్ నిర్వహించలనుకున్నాడు. కానీ అందుకు గ్రామంలోని ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఠాకుర్లు ఒప్పుకోలేదు. ‘దళితులు ఊరి మధ్యలో నుంచి వెళ్లడం సంప్రాదాయనికి విరుద్ధం. మా మాట కాదని మీరు బరాత్ తీస్తే తర్వాత చాలా తీవ్ర పరిణామాలు చూడాల్సివస్తుందని’ హెచ్చరించారు. కావాలంటే మీరు ఊరి బయట ఉన్న మైదానంలో వివాహ వేడుకలు జరుపుకుని, అక్కడ నుంచే ఊరేగింపు నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమని, మీ వాదనను ఎవరూ పట్టించుకోరని ఠాకూర్లు అనటంతో... ఈ అంశం గురించి ఇరువర్గాల మధ్య ఒక నెల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. దీంతో విసిగిపోయిన సంజయ్ ఈ అంశం మీద డిస్ట్రిక్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిక్ట్ కోర్టు వధువు మైనర్ కాబట్టి, మరో రెండు నెలల తర్వాత మేజర్ అవుతుందని, అప్పటి వరకూ ఈ విషయం గురించి తీర్పు చెప్పలేమని తెలిపింది. అయితే కోర్టులో ఫిర్యాదు చేయాడానికంటే ముందే సంజయ్ కుమార్ ఈ విషయం గురించి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు... ఆయన పోర్టల్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు, పలుదఫాలు పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు ఈ విషయాన్ని స్థానిక పోలీసుల వద్ద పరిష్కరించుకోవాలంటూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయం గురించి సంజయ్ మాట్లడుతూ ‘నేను కోర్టు తీర్పును గౌరవిస్తాను. అయితే ఒకసారి రికార్డులను పరిశీలించాల్సిందిగా నేను కోర్టు వారిని కోరుతున్నాను. ఒక వేళ వధువు మైనారిటీ తీరలేదనే విషయం వాస్తవం అయితే నేను రెండు నెలలు ఆగుతాను. కానీ బరాత్ విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు’ అని చెప్పాడు. ఇదిలా ఉండగా గ్రామ పెద్ద ఓమ్ ప్రకాశ్ ఠాకుర్ మాట్లాడుతూ బరాత్ పేరుతో సంజయ్ అల్లర్లు సృష్టించాలనుకుంటున్నాడని, అందుకే ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. వివాహ వేదిక నుంచి తన ఇంటి వరకూ అతను ఊరేగింపు నిర్వహించుకుంటే సమస్యే లేదని, అయితే సంప్రదాయాన్ని కాదని దళితులు ఊరంతా తిరుగుతామంటే కుదరదని అన్నారు. -
అసెంబ్లీలో అమ్మ ఫోటో.. స్టాలిన్ ఆగ్రహం
-
‘బతికుంటే శశికళతో ఊచలు లెక్కిస్తుండేది’
సాక్షి, చెన్నై : అసెంబ్లీలో జయలలిత ఫోటో నెలకొల్పటంపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో అమ్మ ఫోటోను అన్నాడీఎంకే నెలకొల్పింది. అయితే అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి అంత సముచిత గౌరవం ఇవ్వడమేంటని? డీఎంకే ప్రశ్నలు గుప్పిస్తోంది. ‘ఒకవేళ జయలలిత ఇప్పుడు బతికి ఉంటే శశికళతోపాటు జైల్లో కూర్చుని ఊచలు లెక్కించేది. తమిళ గౌరవాన్ని చాటిన గొప్ప సీఎంల ఫోటోలు అసెంబ్లీలో ఉన్నాయి. అలాంటి వారి మధ్య నేరస్థురాలైన జయలలిత ఫోటోను ఉంచటం ఏంటి?. ఇది ముమ్మాటికీ అసెంబ్లీకి అవమానమే. తక్షణమే ఆ ఫోటోను తొలగించాలి’ అని డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక ఈ కార్యక్రమాన్ని డీఎంకేతోపాటు, కాంగ్రెస్, ఐయూఎంఎల్ కూడా బహిష్కరించాయి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. అయితే ప్రభుత్వం మాత్రం అవేం పట్టన్నట్లు స్పీకర్ ధన్పాల్ చేతుల మీదుగా ఫోటోను ఆవిష్కరించేసింది. ఏడు ఫీట్ల ఎత్తున్న జయలలిత ఫోటోను సరిగ్గా ప్రతిపక్షాల బెంచ్ వైపు చూసే విధంగా అమర్చారు. ఈ కార్యక్రమంలో సీఎం పళని సామి, పన్నీర్ సెల్వం, మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గతంలో మెరీనా బీచ్‌లో ఆమె స్మారక స్థూపం నెలకొల్పే సమయంలో కూడా సరిగ్గా ఇలాంటి విమర్శలే వినిపించాయి. అసెంబ్లీలో నెలకొల్పిన జయలలిత ఫోటో -
ఆ వ్యాపారవేత్తల పేర్లు వెల్లడించండి
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ వెంట ఉండే ప్రతినిధుల పేర్లను వెల్లడించాలని ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ) ఆర్.కె.మాధుర్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను ఆదేశించారు. ‘జాతీయభద్రత’తో ముడిపడిన అంశమైనందున పేర్లను వెల్లడించలేమంటూ పీఎంవో అభ్యంతరం వ్యక్తం చేయటాన్ని తోసిపుచ్చారు. అయితే, ప్రధాని వెంట ఉండే భద్రతా సిబ్బంది, అధికారుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. -
తల్లిదండ్రుల వద్దకు వెళ్దొదంటోందని..
సాక్షి, యలహంక : తల్లిదండ్రుల్ని చూసేందుకు వెళ్తున్న తనకు అభ్యంతరం చెప్తుండడంపై ఆగ్రహం చెందిన ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక సమీపంలోని కూడ్లులో నివాసముంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్, భాగ్యమ్మ (35) భార్యాభర్తలు. వీరికి 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సోదరుడి వద్ద ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు శ్రీనివాస్ తరచూ వెళ్తుండేవాడు. దీనిపై భాగ్యమ్మ అభ్యంతరం చెప్తుండేది. ఇదే విషయంలో శుక్రవారం ఇద్దరూ గొడవపడగా ఆవేశంతో భాగ్యమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం గుండెనొప్పి వచ్చిందని ఆస్పత్రికి తరలించాడు. అనుమానం వచ్చి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేసి అసలు విషయం రాబట్టారు. తానే హత్య చేసినట్లు అంగీకరించగా నిందితుడిని అరెస్టు చేశారు. -
‘మిడిల్ కొలాబ్’ రాష్ట్రానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిని ఒడిసిపట్టేం దుకు ఒడిశా రాష్ట్రం మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిం ది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నీటి వినియోగం మొదలు పెడితే ఇంద్రావతి దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నీటి లభ్యత తగ్గిపోతుందని గుర్తించింది. ఇంద్రావతి నీటి లభ్యత తగ్గడం మొదలు పెడితే మన రాష్ట్రం లో చేపట్టే బోఢాఘాట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం ఉంటుం దని అంచనాకు వచ్చింది. ఈ ప్రభావం దిగువన దేవాదుల ఎత్తిపోతలపైనా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మంత్రి ఆదేశాలతో నివేదిక.. ఈ నేపథ్యంలో ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ ఉన్నతాధికారులతో చర్చించారు. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టాలపై లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో నీటిపారుదల అధికారులు ఓ నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఇంద్రావతి, కొలాబ్ నది కలిసేచోట మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును 536.5 మీటర్ల నీటి మట్టంతో కొలాబ్ నదికి అడ్డంగా జోర్నాల వద్ద ఒడిశా చేపడుతోంది. కొలాబ్ దగ్గర వరద నీటిని తరలించేందుకు 35.50 కి.మీ. కాల్వ తవ్వనున్నారు. ఈ నీటిని కొలాబ్‌కు ఉపనది అయిన కెరజోడిపైన 4.19 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న డ్యామ్ కు తరలించేలా ప్రతిపాదించారు. ఇక్కడ 75 శాతం నీటి లభ్యత లెక్కన 36.88 టీఎంసీల నీరు లభ్యతగా ఉంటోంది. అలాగే డ్యామ్ వద్ద పవర్‌హౌస్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ విద్యుదుత్పత్తికి వాడిన నీరు కొలాబ్ నదికి చేరేలా 264 మీటర్ల ఎత్తుతో మరో బ్యారేజీని నిర్మించనున్నారు. దీంతో 63,117 ఎకరాలకు ఈ బ్యారేజీ కింద సాగుకు నీరివ్వవచ్చు. ఈ ప్రాజెక్టుతో దిగువకు వచ్చే నీరు గోదావరిలోకి రాకుండా శబరిలోకి వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటున్నారు. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం దీనిపై ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపింది. నదీ పరీవాహకంలో పర్యావరణ, వాతావరణ సమతు ల్యత ఉండేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించగా, ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సీడబ్ల్యూసీ, ఛత్తీస్‌గఢ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ బుధవారం ప్రభుత్వం గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఒడిశా ప్రాజెక్టుతో దిగువన తెలంగాణకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా, ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చాలని, డిజైన్లలో మార్పులు చేసి సవరించిన ప్రతిపాదనలు కోరాలని లేఖలో కోరింది. నీటి వినియోగం వివరాలు కూడా అందించేలా చూడాలని బోర్డుకు విన్నవించింది. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది. -
మీరే కోటిసార్లు సిగ్గు పడండి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలోని ఓ గురుకుల హాస్టల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో ఓ విద్యార్థి బహిర్భూమికి వెళ్లి కాలువలో పడి మృతి చెందాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి చెబుతున్నట్లుగా కెనాల్లో పడి చనిపోయిన విద్యార్థికి గురుకులాలు, హాస్టళ్లతో సంబంధం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన నిర్వాకం వల్లే ఇప్పటికీ తెలంగాణను సమస్యలు పీడిస్తున్నాయి. హాస్టళ్లు ఇట్లున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. బడుగు బలహీనవర్గాల ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది. దీనికి వారు ఒకసారి కాదు కోటిసార్లు సిగ్గుపడాలి. నల్లగొండలో ఓ విద్యార్థి కాలువలో పడి చనిపోయాడంటున్నారు కదా.. ఇక్కడి నుంచి నల్లగొండ వరకు ముక్కు నేలకు రాసుకుంటూ పోవాలి. చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి’’అని డిమాండ్ చేశారు. ‘కార్పొరేట్’కు దీటుగా.. గురుకులాల్లో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను పర్మినెంట్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, ఈలోగా ఎవరి ఒత్తిడి వల్లో వారు కోర్టుకెళ్లారని, అక్కడ తీర్పు రిజర్వ్ చేసినందున అది తేలాక చర్యలు తీసుకుంటామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కాలేజీలను తలదన్నే స్థాయిలో కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అదనపు వసతుల కోసం రూ. 347 కోట్లు, 18 బీసీ గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం, అసంపూర్తి వాటిని పూర్తి చేసేందుకు కలిపి రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు నెలలో నాలుగు పర్యాయాలు చికన్, రెండుమార్లు మటన్, ఐదుసార్లు కోడిగుడ్డు, నిత్యం పప్పు, కూర, చా రుతో పౌష్టికాహారం పెడుతున్నామన్నారు. -
మీ మనసులో ఏముందో చెప్పండి
లక్నో/న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ జోక్యం చేసుకోవడంపై ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముందు ఆయన తన ఆలోచనేమిటనేది విధిగా వెల్లడించాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదం విషయంలో షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ వాసిం రజ్వి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అవి అనవరసమంటూ మండిపడ్డాయి. ‘ఈ కేసులోని అన్నిపక్షాలతోనూ రవిశంకర్ సంప్రదింపులు జరుపుతారని చెబుతున్నారు. అయితే ఆయన ఇప్పటిదాకా తమను సంప్రదించలేదు’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) చైర్మన్ మౌలానా వలి రెహమాని బుధవారం స్పష్టం చేశారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒకసారి యత్నించారని, అయితే వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని సూచించారని గుర్తుచేశారు. ఈసారి ఆయన ఏ ఫార్ములాతో వస్తున్నారో చెప్పాలని, ఆ తర్వాత తమ ప్రతినిధి ఆయనతో సంప్రదింపులు జరుపుతారని అన్నారు. సీఎంతో రవిశంకర్ భేటీ రవిశంకర్ బుధవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వివాదాస్పద అయోధ్య స్థలాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. రవిశంకర్.. సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారని, ఈ భేటీ దాదాపు 20 నిమిషాలపాటు జరిగిందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఆదిత్యనాథ్‌తోపాటు రవిశంకర్..దిగంబర్ అఖాడాకు చెందిన సురేశ్ దాస్, జనమేజయ్ శరణ్ (రసిక్పీఠ్), రాజారాంచంద్ర ఆచార్య (నిర్మోహి అఖాడా)లతోపాటు అనేక హిందూ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇదొక ఆరంభం. నేను ఎంతో ఆశాభావంతో ఉన్నా. ఎవరూ మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం లేదు. అందరితోనూ అయోధ్య వివాదంపై సంప్రదింపులు జరుపుతా’ అని చెప్పారు. -
అరుణాచల్‌కి వెళ్తే తప్పేముంది: నిర్మల
గాంధీనగర్: అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, ఈ విషయంలో ఇతరుల అభిప్రాయాలతో పనిలేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల ఆమె అక్కడ పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై ప్రశ్నించినపుడు..‘ఇందులో సమస్యేం ఉంది? అది మన భూభాగమే. మనం అక్కడికి వెళ్తాం. దీనిపై ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించాల్సిన పనిలేదు’ అని గాంధీనగర్‌లో బదులిచ్చారు. టిబెటన్ల గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించడం వల్లే భారత్–చైనా మధ్య వివాదాలు మొదలయ్యాయా అని అడిగిన మరో ప్రశ్నకు..ప్రతి సమస్యకు ఏదో ఒక కారణం ఉంటుందని, ఏ సంబంధమైనా ఏదో ఒక దాని వల్లే దెబ్బతినదని అన్నారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. -
ఢిల్లీలో సరి–బేసి వాయిదా
న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధానిలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ‘సరి–బేసి’ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, ద్విచక్ర వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహిళల భద్రతపై రాజీపడబోమన్న కేజ్రీ సర్కారు.. సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ మినహాయింపులకు ఎన్జీటీ అంగీకరించిన తర్వాత ‘సరి–బేసి’ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. ‘మహిళల భద్రతపై రాజీపడబోం. పీఎం 2.5, పీఎం 10 అనే కాలుష్య స్థాయిలూ కాస్తంత తగ్గాయి. కానీ ఎన్జీటీ నిర్ణయాలను గౌరవిస్తున్నాం. అయితే, సోమవారం మళ్లీ ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ వేస్తాం’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాల తర్వాత సీఎం కేజ్రీవాల్, పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సర్వీసులు ఓకే.. కానీ! ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నవంబర్ 13 నుంచి 17 వరకు ఐదురోజుల పాటు సరి–బేసి విధానాన్ని అమలుచేయాలని తొలుత కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్రమైన స్మాగ్ (పొగమంచు+కాలుష్యం) కారణంగా పాఠశాలలకు కూడా ఆదివారం వరకు సెలవులిచ్చింది. దీంతో సోమవారం నుంచి స్కూలు బస్సులు, ఇతర వాహనాలతో మళ్లీ కాలుష్యం పెరగొచ్చని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇందులో మహిళల వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటుగా అంబులెన్సు, చెత్త తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ మినహాయింపులపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. అంబులెన్సు, చెత్త వాహనాలు, ఫైరింజన్లకు మినహాయింపును సమర్థించిన ఎన్జీటీ.. మహిళలు, ద్విచక్ర వాహనాలకు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ సర్కారు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. చలికాలంలో వాహనాల ద్వారానే పెద్దమొత్తంలో పీఎం2.5, పీఎం10లు మామూలు సమయం కన్నా 20–25 శాతం ఎక్కువగా వెలువడతాయని ఐఐటీ కాన్పూర్ గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టుపై ఎన్జీటీ ఆగ్రహం ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులను సరిగా నిర్వహించటం లేదని.. దీని కారణంగా ఈ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఎన్జీటీ మండిపడింది. ‘మీ బస్సులు రోడ్లపై పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. చాలావరకు బస్సుల్లో కనీసం హ్యాంగర్లు ఉండవు. బస్సులను నిర్వహించటంలో బాధ్యతగా వ్యవహరించరెందుకు?. కొన్ని సార్లు ఖాళీగా వెళ్తున్నాయి. మరికొన్ని సార్లు రద్దీగా ఉంటున్నాయి’ అని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ మండిపడ్డారు. తక్కువ ట్రాఫిక్ ఉన్న సమయాల్లో మినీ బస్సులు నడపాలని గతంలో ఎన్జీటీ సూచించింది. వీటిని పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం దేశరాజధానిలో గాలిలో విషపదార్థాలు, కాలుష్యకారకాల స్థాయి ఇంకా ప్రమాదకరస్థితిలోనే ఉంది. వరుసగా ఐదోరోజూ అదే స్థాయిలో పొల్యూషన్ కనిపించింది. కాస్త కుదురుకుంటుందనుకున్న తరుణంలో.. శనివారం సాయంత్రం పరిస్థితుల్లో మార్పు నగరాన్ని ‘కాలుష్య అత్యవసర’ దిశగా తీసుకెళ్లింది. పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే.. పరిస్థితి భిన్నంగా మారింది. వేగంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడటమే ఇందుకు కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) అధికారులు తెలిపారు. దీనివల్ల అనారోగ్య పరిస్థితులు తీవ్రమవుతాయని హెచ్చరించారు. సీపీసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వాయు నాణ్యత సూచీ 423 (మొత్తం 500) యూనిట్లుగా నమోదవగా.. పీఎం2.5 స్థాయి 422కు చేరుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో యూపీలోని ఘజియాబాద్ అత్యంత కాలుష్య ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ వాయు నాణ్యత సూచీ 484 యూనిట్లుండగా.. పీఎం 2.5 స్థాయి 869 యూనిట్లకు చేరింది. సాధారణ స్థాయికన్నా ఇది 34 రెట్లు ఎక్కువ. -
ఛస్.. ఆయన అంబాసిడర్ ఏంటి?
జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. జింబాబ్వే అధ్యక్షడు రాబర్ట్ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రకటించించినట్లు ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం ప్రకటించింది. దీంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ‘‘మానవ హక్కులను గౌరవించేవారిని ఈ స్థానంలో నియమించటం పరిపాటి. అలాంటిది ముగాబేను ఏ అర్హతతో ఎంపిక చేశారు’’ అంటూ అమెరికా ప్రశ్నలు గుప్పిస్తోంది. ఆయన పాలనలో జింబాబ్వే దారుణంగా నాశనం అయ్యింది. దీనికితోడు 93 ఏళ్ల ఆయన ఓ పెద్ద రోగిష్టి వ్యక్తి. తరచూ ఆరోగ్యం కోసం సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో సానుకూలత కూడా లేదు. ఆ లెక్కన్న ఆయన నియామకం ఆరోగ్య సంస్థ చేసిన ఓ తప్పిదం అని అమెరికా భద్రతా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క అమెరికానే కాదు.. ఐర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి సైమన్ హర్రిస్ కూడా ముగాబే నియామకాన్ని తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. గత వారం ఉరుగ్వేలో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముగాబేను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఓ ప్రకటన చేసింది. అయితే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసస్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కావటంతోనే ఈ నియామకం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1980లో జింబాబ్వే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాబర్ట్ ముగాబే.. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాడనే చెప్పుకుంటున్నారు. అయితే 37 ఏళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలు చేశాయి. అన్నిరంగాల్లో దేశం వెనకబడిపోయింది. అందుకే అమెరికాతో ఆయన సంబంధాలు ఏ మాత్రం బాగోలేవు. దీనికి తోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఆయనపై ఆంక్షలు కూడా విధించింది. కాగా, ముగాబే నియామకం గురించి జింబాబ్వే మీడియా అధికారికంగా ప్రకటించకపోయినా.. జాతీయ మీడియా జింబాబ్వే హెరాల్డ్ పత్రిక మాత్రం ముగాబే సిగలో మరో ఘనత అంటూ వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే విమర్శలు పెల్లుబిక్కుతుండటంతో ఆయన నియామకంలో డబ్ల్యూహెచ్‌వో పునరాలోచన చేస్తోందన్న సమాచారం అందుతోంది. -
కాళేశ్వరంపై ఏపీ కొత్త పేచీ..!
తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందం కుదిరిన ఏడాది తర్వాత అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రపదేశ్ కొత్త పేచీ పెడుతోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, నీటి వినియోగానికి సం బంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఏడాది తరు వాత ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తమను సంప్రదించకుండా ఒప్పందాలు ఎలా చేసుకుంటారని, ఇది తమ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టంటూ కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయా లు తెలపాలని, కేంద్రం బోర్డు నుంచి వివరణ కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిం ది. నిజానికి కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంపై గతేడాది ఆగస్టు 23న మహారాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం మేరకు బ్యారేజీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా, ఈ నెల 27న మహారాష్ట్రలో ఈ కార్యక్రమం జర గాల్సి ఉంది. ఈ సమయంలో ఈ ఒప్పందాల ను ప్రశ్నిస్తూ ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బేసిన్లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా తమకు తెలపాల్సి ఉందని, అయితే తెలంగాణ తమను సంప్రదించకుండా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుందని పేర్కొంది. గోదావరిలో ఎలాంటి నీటి వినియోగానికైనా కేంద్రం, బోర్డుతో పాటు తమ ఆమోదం తప్పనిసరైనప్పటికీ, అలాంటి దేమీ జరగలేదని వివరించింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులు పట్టకుం డా ఎగువ రాష్ట్రాలు మాట్లాడుకుంటే సరిపో తుందా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేంద్రం, బోర్డు అభిప్రాయాన్ని కోరుతూ శుక్రవారం లేఖలు రాసింది. -
ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు
జెడ్పీ చైర్మన్ ఎన్నికపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన పార్టీ శ్రేణులు కాకినాడ : డబ్బు, పదవులను ఎరవేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోన్న తీరు ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల నవీన్‌ను ఎన్నుకున్న విధానాన్ని నిరసిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపు మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. వందలాది మందితో ధర్నా చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దంటూ వారు నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులనుద్దేశించి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ప్రజాసమస్యలను గాలికి వదలి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి దుర్దినంగా పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు పదవులకు, సొమ్ములకు ఆశపడి విలవలకు తిలోదకాలిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న సమయంలో విలువలకు ప్రాధాన్యతనిచ్చే వైఎస్ తనను రాజీనామా చేసి పార్టీలోకి రావాలని సూచించడంతో ఆరు నెలల ముందే పదవిని వదులుకున్నాన్నారు. జగ్గంపేట కో–ఆర్డినేటర్ ముత్యాల సతీష్ మాట్లాడుతూ తక్షణమే జ్యోతుల నవీన్ వైఎస్సార్సీపీ ద్వారా వచ్చిన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు మాట్లాడుతూ ప్రజల తిరస్కారానికి గురైన టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి పెత్తనం చెలాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముమ్మిడివరం కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై కొరవడిందంటూ టీడీపీ తీరుపై మండిపడ్డారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలతో తమకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన స్థాయిని మరిచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.జితేంద్రను కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం చాప్టర్–5, 73 క్లాజ్ప్రకారం జ్యోతుల నవీన్ జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చల్లయ్య, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, కర్రి నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు అల్లి రాజబాబు, పాలెపు ధర్మారావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురామ్, రాష్ట్ర ఎస్సీసెల్ సహాయ కార్యదర్శి మోకా సూరిబాబు, వరసాల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు వి.సూర్యప్రకాష్, రాయప్రోలు కృష్ణమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రుసువిల
బిల్లకల్లు చెరువుకు నిర్లక్ష్యపు గండి 15ఏళ్లుగామరమ్మతుకు నోచని సాగునీటి వనరు రెండుసార్లు రూ.43లక్షలు మంజూరైనా కదలని పనులు పునరుద్ధరణ అటవీశాఖ అధికారుల అభ్యంతరం అచ్చంపేట: నల్లమలలోనే రుసువుల చెరువు అతిపెద్దది. దీనికింద అత్యధికంగా చెంచుగిరిజనుల సాగుభూములు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 545 ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. వాస్తవంగా వెయ్యి ఎకరాలకుపైగా అందిస్తోంది. ఒకసారి నిండితే మూడుపంటలకు ఢోకా ఉండదు. మొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ)ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని ఐదు టీఎంసీలకు పెంచి అచ్చంపేట, బల్మూర్ మండలాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే 15ఏళ్లుగా చెరువుకట్ట మరమ్మతుకు నోచకపోవడంతో పెద్దపెద్ద గండ్లు పడి నీరంతా బయటికి వెళ్లిపోతోంది. ఫలితంగా నీళ్లులేక చెరువు కింద ఉన్న బిల్లకల్లు, కొండనాగుల, లక్ష్మీపల్లి గ్రామాల భూములు బీళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి చేరిన నీరంతా గండిద్వారా వృథాగా చంద్రవాగులోకి వెళ్తోంది. 25 అడుగుల నీటిమట్టం ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 16అడుగులకు చేరింది. గండి దిగువన కేవలం ఏడు అడుగుల నీళ్లు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. గండి నుంచి వృథాగా పోతున్న నీళ్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి సమస్య గండిని పూడ్చి తమ పంటపొలాలకు సాగునీరు అందించాలని శనివారం రుసువుల చెరువు సందర్శించిన అచ్చంపేట గువ్వల బాలరాజు ముందు ఆయకట్టు రైతులు తమ గోడు వినిపించారు. ఈ చెరువును అభివృద్ధి చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరడంతో పాటు పులులు, చిరుతలు, ఇతర అటవీజంతువులకు తాగునీరు అందే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నీటివనరు మరమ్మతు చేపడితే రైతులు వలసలు వెళ్లకుండా ఉన్నచోటే వారికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. నిధులు మంజూరైనా నిట్టూర్పే! 2004లో అప్పటి క్రీడలశాఖ మంత్రి పి.రాములు రూ.40లక్షలు మంజూరు చేయించారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో నిధులు వెనక్కివెళ్లాయి. 2005లో రాజీవ్‌పల్లెబాటలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విజ్ఞప్తి మేరకు చెరువు మరమ్మతుకు రూ.43లక్షలు మంజూరుచేశారు. అటవీశాఖ మళ్లీ కొర్రీపెట్టడంతో పనులు ప్రారంభించలేదు. అప్పట్లో టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసుకున్నా కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. అటవీశాఖ అభ్యంతరం నల్లమల అభయారణ్యంలో చెరువు నిర్మాణం చేపడితే అటవీప్రాంతం నీటì లో మునిగి పర్యావరణానికి ముప్పుఉందని అటవీశాఖ చెబుతోంది. నిజానికి ఈ చెరువును అభివృద్ధిచేస్తే పర్యావరణానికి ముప్పు ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు. రుసువుల చెరువును అభివృద్ధి చేస్తే పంటలకు సాగునీరు అందుతుందని, అడవిలోని జంతుజాలానికి తాగునీరు లభిస్తుందని వారు సూచిస్తున్నారు. -
అభ్యంతరాలు 2738
ముకరంపుర: జిల్లాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ పోర్టల్‌కు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కరీంనగర్, పెద్దపల్లి నుంచి మొత్తంగా 2738 అభ్యంతరాలు చేసారు. అందులో జిల్లా ఏర్పాటు విషయంలో 551, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోరుతూ 1925, మండలాల విషయంలో 262 అభ్యంతరాలు ప్రజల నుంచి వెళ్లాయి. ప్రధానంగా కోరుట్ల డివిజన్ ఏర్పాటు కోరుతూనే అభ్యంతరాలు వ్యక్తమయినట్లు స్పష్టమవుతోంది. జగిత్యాల నుంచి 1818 అభ్యంతరాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోరుతూనే వ్యక్తం చేయడం విశేషం. -
అడ్డుకున్నందుకే హత్య
రహిమాన్ హత్య కేసులో నిందితులు అరెస్టు రెండు వారాల్లో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ద్వారా నిందితుల గుర్తింపు కర్నూలు: ఇంటి ముందు తోపుడుబండి నిలుపుకునే విషయంలో అడ్డు చెప్పడం, ఈ కారణంగా చోటుచేసుకున్న చిన్న గొడవ హత్యకు దారితీసింది. పాతబస్తీలోని మాసూంబాషా దర్గా దగ్గర జుబేదాబేగం ఇంటి ముందు సయ్యద్ సిరాజుద్దీన్ రిక్షా బండి నిలుపుకునే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఆమె కుమారుడు షేక్‌పుర్ఖాన్ రహిమాన్ హత్యకు కారణమైంది. రహిమాన్ పాతబస్తీలో ఈజీఎస్ మెన్స్‌వేర్ రెడిమేడ్ దుకాణం నడుపుతున్నాడు. నిందితులు సయ్యద్ సిరాజుద్దీన్, అతని సోదరుడు సయ్యద్ రియాజుద్దీన్ సమీపంలోనే ఎస్ఆర్ సప్లయర్స్, ఎన్ఎస్ఆర్ సప్లయర్స్ నడుపుతున్నారు. తోపుడు బండి నిలుపుకునే విషయంలో ఆరునెలులగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. గత నెల 29 సాయంత్రం 7 గంటల సమయంలో పుర్ఖాన్‌రహిమాన్ ఇంట్లో ఉండగా నిందితులు సిరాజుద్దీన్, రియాజుద్దీన్ బయటికి పిలిచి దాడి చేశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లి జుబేదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వారాల్లో మిస్టరీని ఛేదించారు. ఫిర్యాది ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. రాధాకష్ణ టాకీసు దగ్గర అదుపులోకి తీసుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి వివరాలను వన్‌టౌన్ స్టేషన్లో డీఎస్పీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. -
నీట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పలు రాష్ట్రాలు
హైదరాబాద్ : సుప్రీంకోర్టులో నీట్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నీట్‌పై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాల వాదనపై సమాధానం ఇవ్వాలని ఎంసీఐ, కేంద్ర ఆరోగ్యశాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రారంభంలో ఇలాంటి బాలరిష్టాలు సహజమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్‌పై అభ్యంతరాలు తెలపాలనుకుంటే పిటిషన్లు అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్నింటిపైనా గురువారం అభ్యంతరాలు వింటామని సుప్రీం స్పష్టం చేసింది. రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండటంతో కర్ణాటక వాదనలను త్రిసభ్య ధర్మాసనం వింటోంది. కర్ణాటక వాదనలతోపాటు తమిళనాడు వాదనలు త్రిసభ్య ధర్మాసనం వింటుంది. -
ఎందుకో అత్యుత్సాహం?
సాక్షి ప్రతినిధి, విజయనగరం :భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంపై ఎయిర్‌పోర్టు అథారటీ అధికారులు తొలుత ఇచ్చిన నివేదికపై సాంకేతిక సహాయ సంస్థ(కన్సల్టెన్సీ ఏజెన్సీ)అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత ప్రాం తంలో కొండలు ఉండటం వల్ల సాంకేతిక సమస్యలొస్తాయని, అలైన్మెంట్లో మార్పు చేయాలని కన్సల్టెన్సీ ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి సాంకేతిక కోణంలో అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి సర్కార్ చూసింది. దానిపై ఇంకా తుది నివేదిక రాలేదు. అయినా భూసమీకరణ పేరుతో రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. 15,200 ఎకరాలు అవసరమని అధికారుల్ని రంగంలోకి దించింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిస్తే సరే..లేదంటే భూసేకరణతోనైనా లాక్కుంటామని హెచ్చరించింది. ఇంత చేసినా సర్కార్... సాంకేతికంగా నేటికీ స్పష్టత సాధించలేకపోయింది. తుది నివేదిక వచ్చాక ఈ ప్రాంతం అనుకూలం కాదని చెబితే యూటర్న్ తీసుకోవల్సిందే. కానీ రెండు నెలలుగా గాలిలో మేడలు కట్టినట్టు వేర్వేరు ప్రకటనలు చేసి రైతుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. ప్రభుత్వం నడిపిన హైడ్రామాలో చోటు చేసుకున్న పరిణామాలివి. ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని ఆధ్వర్యంలో విజయనగరం డీఆర్డీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఎయిర్‌పోర్ట్‌కు 15వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. రాజధాని తరహా ప్యాకేజీని అమలుచేస్తామని, భూములిచ్చిన రైతులకు 16రకాల ప్రయోజలను కల్పిస్తామని ప్రకటించారు. ఈనెల 3 న ఎయిర్‌పోర్టును కేవలం ఆరు వేల ఎకరాల్లోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు. ఆ మరుసటి రోజున విశాఖపట్నంలో విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ప్రకటన చేశారు. ఈనెల 13న జిల్లాకొచ్చిన పురపాలక మంత్రి పి.నారాయణ ఎయిర్‌పోర్టుపై చేసిన సమీక్షలో ఐదువేల ఎకరాలైతే సరిపోతాయని, ఆమేరకు భూ సమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు తమకు సూచించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ఐదు వేల ఎకరాలు కావొచ్చు...నాలుగు వేలు అవ్వొచ్చు..మూడు వేలు సరిపోవచ్చు... 1000,1500ఎకరాల్లోనైనా నిర్మించొచ్చు అంటూ స్పష్టత లేని ప్రకటన చేశారు. గతంలో 15వేలు ఎకరాలని ఎందుకు ప్రకటించారని అడిగితే మిస్ ఫైర్ అయ్యిందని చెప్పారు. తాజాగా 15న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడు వేల ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా భిన్నమైన ప్రకటనలు చేసి రైతులతో మైండ్ గేమ్ ఆడుతోంది.. రైతుల నుంచి రియాక్షన్ తెలుసుకునేందుకు నాటకమాడుతోంది. రైతులు ఒప్పుకుంటే పెద్ద ఎత్తున భూసమీకరణ చేసి, వ్యాపారం చేసుకుందామని భావించింది. కానీ, రైతులు సమష్టిగా వ్యతిరేకించడంతో సర్కార్ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో సమీకరించే ఎకరాల మొత్తాన్ని దశల వారీగా తగ్గిస్తూ వచ్చింది. కానీ, దేనికీ రైతుల నుంచి సానుకూలత రాలేదు. అంత భూమి ఎందుకుని ప్రపంచంలో ఉన్న ఎయిర్‌పోర్టుల విస్తీర్ణాన్ని చెబుతూ రైతులు తిప్పికొట్టారు. చివరికీ, 3వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సర్కార్ చెప్పుకొస్తోంది. -
రాత్రంతా హోటళ్లు, రెస్టారెంట్లు
అభ్యంతరం లేదన్న పోలీసు విభాగం సాక్షి, ముంబై: నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు, కాఫీ సెంటర్లు, మందుల షాపులు తదిత అత్యవసర సేవలకు సంబంధించిన దుకాణాలు రాత్రి వేళల్లో తెరిచి ఉంచితే తమకు అభ్యంతరం లేదని ముంబై పోలీసు శాఖ స్పష్టం చేసింది. దీంతో సెకండ్, నైట్ షిప్టులో పనిచేసే ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారులకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సాధారణ ప్రజలకు ఎంతో ఊరట లభించనుంది. గడియారంలో ముల్లులాగా 24 గంటలు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు రాత్రి 10 గంటలు దాటిన తరువాత మంచి హోటళ్లు, రెస్టారెంట్లు, కనీసం కాఫీ సెంటర్లు కూడా అందుబాటులో ఉండవు. నేటి ఆధునిక, పోటీ కాలంలో అనేక ప్రైవేట కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు రాత్రి వేళల్లో కూడా పనిచేస్తున్నాయి. నైట్ షిఫ్టుల్లో పని చేసే వారికి అర్థరాత్రి సమయంలో కనీసం అల్పాహారం, టీ, కాఫీ కూడా దొరకవు. దీంతో గత్యంతరం లేక చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై లభించే అపరిశుభ్రమైన, కల్తీ తినుబండరాలు తినక తప్పడం లేదు. ముంబైకర్ల సౌకర్యార్థం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు తెరిచి ఉంచాలని గతంలో శివసేన కార్పొరేటర్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయి సమితిలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మంజూరు లభించడంతో ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ప్రభుత్వం మారిన తరువాత ఈ ప్రదిపాదనను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన బీజేపీ, శివసేన ప్రభుత్వం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనను ముంబై పోలీసు శాఖకు పంపించారు. నారిమన్‌పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), షాపింగ్ మాల్స్ లాంటి నివాసేతర ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, పాల డెయిరీలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసు శాఖ ప్రభుత్వంతో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మాత్రమే మెడికల్ షాపులు (అనుమతి పొందినవి) 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తరువాత వాటిని మూసివేస్తున్నారు. అత్యవసరం సమయంలో మందులు కావాలంటే ఆస్పత్రులున్న ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక నుంచి ఉరుకులు పరుగులు తీయనవసరం లేదు. త్వరలో ముంబై పోలీసు శాఖ నుంచి సర్క్యులర్ విడుదల కానుంది. ఆ తరువాత అత్యవసర సేవల షాపులన్నీ అందుబాటులోకి వస్తాయి. -
రోడ్డున పడమంటారా?
150 ఫీట్లు విస్తరిస్తే ఇళ్లన్నీ కోల్పోతాం కొత్త మార్కింగ్ వద్దే వద్దు కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును 100 ఫీట్లే విస్తరించాలి రోడ్డుకిరువైపులా కుటుంబాల డిమాండ్ కొలతలేస్తున్న ఆర్అండ్బీ అధికారులు రోడ్డు విస్తరణ రగడ రాజుకుంటోంది. 100 ఫీట్ల విస్తరణ కాస్త.. సీఎం ఆదేశాలతో 150 ఫీట్లకు పెరగనుంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్ల వారు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ఇష్టారీతిన మార్కింగ్‌తో ఇప్పటికే నష్టపోతున్నామని, తాజాగా 150 ఫీట్లంటే ఒప్పుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. తమ అభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని స్పష్టంచేస్తున్నారు. వరంగల్ రూరల్: కేయూసీ-పెద్దమ్మగడ్డ రహదారి విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నగరంలో రహదారులను 150ఫీట్ల మేరకు విస్తరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రోడ్లు-భవనాల శాఖ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. కేయూసీ-రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ. 8 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఇటీవల విస్తరణ పనులు ప్రారంభించారు. రోడ్డుకు ఇరుపక్కల తవ్వి బేస్గ్రావెల్ వేసి పనులు చేయిస్తున్నారు. నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ఆర్అండ్బీ అధికారులు రోడ్డు మధ్య భాగం నుంచి ఇరుపక్కల 50 ఫీట్లు ఉండేలా మార్కింగ్ చేశారు. కానీ ఇలా అన్నిచోట్ల చేయలేదని, కొందరు పలుకుబడితో తమ వైపు 35 ఫీట్ల వరకే స్థలాన్ని అప్పగిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మాజీ కార్పొరేటర్ తన స్థలం పోకుండా ఉండేందుకే అధికారులతో తప్పుడు మార్కింగ్ చేయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారికి ఇరుపక్కల ఒకే విధంగా మార్కింగ్ చేయాలని అధికారులను ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. అలా చేస్తే భవనాలకు ముప్పు.. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును 150ఫీట్ల మేరకు విస్తరిస్తే పలు భవనాలు కూల్చేసే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లుగా కేయూసీ-పెద్దమ్మగడ్డ ఉంది. అందుకే స్థానికులు తమ ఇళ్లను నిబంధనల మేరకు స్థలం విడిచిపెట్టి నిర్మించుకున్నారు. రోడ్డుకిరువైపులా 50 ఫీట్లు ఉండేలా మార్కింగ్ చేస్తే కొన్ని పాత ఇళ్లు కూల్చివేతలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇక 150ఫీట్లుగా నిర్ధారిస్తే మొత్తం గృహాలు కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. రెండు రోజులుగా ఆర్అండ్బీ అధికారులు ఇరుపక్కల 75 ఫీట్లు కొలిచి మార్కింగ్ చేస్తుండడంతో స్థానికులు ఆందోళనలకు గురవుతున్నారు. మొదట ప్రకటించిన ట్లుగా ఈ రహదారిని నాలుగు లేన్లుగా 100 ఫీట్లకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 150 ఫీట్లు వద్దేవద్దు.. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును మాస్టర్ ప్లాన్‌లోని ఆర్డీపీ(రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్)లో ఉన్నట్లుగానే అభివృద్ధి చేయాలి. అధికారంలో ఉన్నం కదా అని ఇష్టానుసారం చేస్తే ఎలా? రోడ్డును 150 ఫీట్లకు విస్తరిస్తామని అనడం సరికాదు. - దాసరి రమేష్, రెడ్డి కాలనీ ఇరుపక్కల సమానంగా విస్తరించాలి రహదారిని అభివృద్ధి చేసేందుకు ఇరు పక్కల సమానంగా మార్కింగ్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా.. కొన్ని చోట్ల ఎక్కువగా మార్కింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మొత్తం ఒకేలా ఉండేలా చూడాలి. - రవికుమార్, స్థానికుడు మార్కింగ్‌లపై ఆందోళనలు తప్పవు పెద్దమ్మగడ్డ రోడ్డును 100నుంచి 150 ఫీట్లు వెడల్పు చేసేందుకు చేస్తున్న మార్కింగ్‌లపై ఆందోళనలు నిర్వహిస్తాం. 50 ఫీట్లు పెంచడం వల్ల నివాసాలు లేకుండా పోయి పరిస్థితులు ఏర్పడుతాయి. అందరి పరిస్థితులను పరిశీలించి న్యాయం చేయాలి. - కె.రమేష్, యాదవనగర్