అభ్యంతరాలు 2738
Published Mon, Aug 29 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ముకరంపుర: జిల్లాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ పోర్టల్‌కు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కరీంనగర్, పెద్దపల్లి నుంచి మొత్తంగా 2738 అభ్యంతరాలు చేసారు. అందులో జిల్లా ఏర్పాటు విషయంలో 551, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోరుతూ 1925, మండలాల విషయంలో 262 అభ్యంతరాలు ప్రజల నుంచి వెళ్లాయి. ప్రధానంగా కోరుట్ల డివిజన్ ఏర్పాటు కోరుతూనే అభ్యంతరాలు వ్యక్తమయినట్లు స్పష్టమవుతోంది. జగిత్యాల నుంచి 1818 అభ్యంతరాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోరుతూనే వ్యక్తం చేయడం విశేషం.
Advertisement
Advertisement