‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ లో (పీఓకే) ఇస్లామాబాద్ బ్రిటన్ రాయబారి పర్యటించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటన అత్యంత అభ్యంతరకరమని పేర్కొంది. ఇది ‘భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య’గా అభివర్ణించింది.
కాగా పాకిస్థాన్‌లోని బ్రిటన్ హైకమిషనర్ జేన్ మారియట్ ఈనెల 10న పీఓకేలోని మీర్పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. ఆమె పర్యటనపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.
కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘణపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment