
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడిలో కారణంగా ఈ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ సైనికులు ఈ ఘటనలో భాగం కావడంతో దాయాదిపై దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు చెక్ పెడుతూ.. ఎప్పటికప్పడు భారత్ బలగాలు యుద్దానికి సిద్ధమవుతున్నాయి. దీంతో, భారత్ చర్యలపై భయంతో వణికిపోతున్న పాక్.. రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో పాక్ ప్రధాని మంతనాలు జరుపుతున్నారు.
వివరాల ప్రకారం.. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులు కలిపింది. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ సర్కార్.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. సాయం చేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మంతనాలు జరుపుతున్నారు.
నేతలతో పాక్ ప్రధాని చర్చలు..
తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.
Chinese Ambassador in Pakistan, H.E Jiang Zaidong calls on Prime Minister Muhammad Shehbaz Sharif in Islamabad.
May 1, 2025. pic.twitter.com/wmJlR2b0gk— Prime Minister's Office (@PakPMO) May 2, 2025
ఈ మేరకు పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో.. పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో షహబాబ్ సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సందర్బంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారని తెలిపింది. ఇదిలా ఉండగా.. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాక్ చెప్పుకొచ్చింది.

Ambassador of UAE to Pakistan H.E. Hamad Obaid Ibrahim Salem Al-Zaabi called on Prime Minister Muhammad Shehbaz Sharif.
May 2, 2025. pic.twitter.com/c2KGCrKvbB— Prime Minister's Office (@PakPMO) May 2, 2025
పాక్‌కు మద్దతిచ్చే దేశాలు ఇవే..
ఇక, పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేస్తే.. దాయాది కొన్ని దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. చైనా, టర్కీ, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం లీగ్ దేశాలు పాక్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు టర్కీ నిలిచింది. భారత్‌తో వైరం కారణంగా చైనా.. పాక్‌కు అండగా ఉండనుంది. ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుంది.