Ex-Cricketer Laxman Sivaramakrishnan Seeks Ban On Salman Khan’s Yentamma Song, Here's Why - Sakshi
Sakshi News home page

Salman Khan Yentamma Song: ఇంత అసహ్యంగా చూపిస్తారా?.. సాంగ్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

Published Sun, Apr 9 2023 3:53 PM | Last Updated on Sun, Apr 9 2023 4:44 PM

Former cricketer Laxman Sivaramakrishnan seeks BAN on Salman Khan song - Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌'.  ఇటీవలే ఈ సినిమా నుంచి 'ఏంట‌మ్మా' అనే పాట‌ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్‌తో కలిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన డ్యాన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  లుంగీ డ్యాన్స్ తరహాలో ముగ్గురు స్టార్ హీరోలు ఈ పాటకు డ్యాన్స్ చేశారు.

అయితే ఈ పాటపై మాజీ క్రికెటర్ లక్ష‍్మణ్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాట దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆరోపించారు.  వెంటనే ఈ సాంగ్‌ను బ్యాన్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. 

లక్ష్మణ్ శివరామకృష్ణన్ ట్వీట్‌లో  రాస్తూ..' ఇది చాలా హాస్యాస్పదం. ఈ పాటకు హీరోలు ధరించింది లుంగీ కాదు. ధోతిని లుంగీగా  చూపించారు. ఇది దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉంది.  క్లాసిక్ దుస్తులను చాలా  అసహ్యకరమైన రీతిలో చూపించారు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. లుంగీ, ధోతీకి తేడా ఏంటో కూడా కనీసం తెలుసుకోరు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఆలయంలో నటీనటులు షూస్ ధరించి ఎలా డ్యాన్స్ చేస్తారని ప్రశ్నించారు.

కాగా.. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జోడీగా తెరకెక్కుతోన్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'  ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, పాలక్ తివారీ, జాస్సీ గిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement