చిరు, సల్మాన్‌ల తార్‌మార్‌.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది | Thaar Maar Thakkar Maar Full Video Song From God Father Is Out | Sakshi
Sakshi News home page

God Father: చిరు, సల్మాన్‌ల తార్‌మార్‌.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Published Thu, Oct 13 2022 10:15 AM | Last Updated on Thu, Oct 13 2022 10:16 AM

Thaar Maar Thakkar Maar Full Video Song From God Father Is Out - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'.దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన ‘తార్‌మార్‌ తక్కర్‌మార్‌’(Thaar Maar Thakkar Maar) సాంగ్‌ ప్రేక్షక్షకులను ఉర్రూతలూగించింది. చిరు, సల్మాన్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియో ఇప్పుడు వచ్చేసింది. ఈ మాస్‌ సాంగ్‌కి అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా, శ్రేయా ఘోషల్‌ అద్భుతంగా ఆలపించారు . తమన్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement