Prabhu Deva Choreography In Chiranjeevi Godfather Movie: కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి చేతిలో ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మంగళవారం (మే 3) రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారని మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇదివరకే తెలిపాడు.
దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించాడు తమన్. చిరు-సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్‌ను ఇండియన్ మైఖేల్ డ్యాన్సర్‌గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇదివరకు అనేక చిరంజీవి చిత్రాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చిందేయడం, దీనికి తమన్ సంగీతం అందించడంతోపాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్ కావడంతో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.
చదవండి: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి..
టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
Yayyyy !! ❤️
— thaman S (@MusicThaman) May 3, 2022
THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather
This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6
Comments
Please login to add a commentAdd a comment