Chiranjeevi God Father Najabhaja Jajara Lyrical Song Out - Sakshi
Sakshi News home page

Chiranjeevi God Father: గాడ్‌ ఫాదర్ నుంచి మరో సాంగ్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఖాయం

Published Tue, Sep 27 2022 5:22 PM | Last Updated on Tue, Sep 27 2022 6:37 PM

Chiranjeevi God Father Najabhaja Jajara Lyrical Song Out  - Sakshi

మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటించింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.  'నజబజ జజర.. గజగజ వణికించే గజరాజు అడిగోరా' అంటూ సాగే సాంగ్‌తో అభిమానులకు గూస్ బంప్స్‌ తెప్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement