గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస‍్తున్న పవర్‌పుల్ డైలాగ్స్ | Megastar Chiranjeevi God father Trailer Released At Pre Release Event In Anantapur | Sakshi
Sakshi News home page

God father Trailer Release: గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్‌.. మెగాస్టార్ డైలాగ్స్ అదుర్స్

Published Wed, Sep 28 2022 8:09 PM | Last Updated on Wed, Sep 28 2022 9:13 PM

Megastar Chiranjeevi God father Trailer Released At Pre Release Event In Anantapur - Sakshi

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' ‍అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్‌లో చిరంజీవి యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ‘గాడ్‌ ఫాదర్‌’ ట్రైలర్‌ మీరూ చూసేయండి.

  మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌ ఈ చిత్రం.  అనంతపురంలో భారీస్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. 

(చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్‌బంప్స్‌ ఖాయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement