పుట్టిన ఊరు కోసం... | Ram NRI Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

పుట్టిన ఊరు కోసం...

Jul 23 2024 12:38 AM | Updated on Jul 23 2024 12:38 AM

Ram NRI Movie Pre Release Event

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ అలీ రేజా, సీతా నారాయణన్  జోడీగా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్ ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌ షిప్‌’ అనేది ఉపశీర్షిక. ఎన్‌.లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు. ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్ కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలఅవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి నిర్మాతలు ప్రసన్న కుమార్, సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామ సత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

ఎన్‌.లక్ష్మీ నందా మాట్లాడుతూ–          ‘‘పుట్టిన ఊరు కోసం ఎన్‌ఆర్‌ఐలు ఏం చేశారు? అనే కథాంశంతో ‘రామ్‌ ఎన్ ఆర్‌ఐ’ రూపొందింది’’ అన్నారు. ‘‘లక్ష్మీ నందాగారితో సోలోగా ఓ సినిమా తీస్తున్నాను’’ అన్నారు సింగులూరి మోహన్ కృష్ణ. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మువ్వా సత్యనారాయణ. నటుడు రవి వర్మ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement