Ali Reza
-
అలీరెజా కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. బర్త్‌డే పిక్స్ వైరల్
-
పుట్టిన ఊరు కోసం...
‘బిగ్‌బాస్’ ఫేమ్ అలీ రేజా, సీతా నారాయణన్ జోడీగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఉపశీర్షిక. ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు. ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్ కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలఅవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాతలు ప్రసన్న కుమార్, సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామ సత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ– ‘‘పుట్టిన ఊరు కోసం ఎన్ఆర్ఐలు ఏం చేశారు? అనే కథాంశంతో ‘రామ్ ఎన్ ఆర్ఐ’ రూపొందింది’’ అన్నారు. ‘‘లక్ష్మీ నందాగారితో సోలోగా ఓ సినిమా తీస్తున్నాను’’ అన్నారు సింగులూరి మోహన్ కృష్ణ. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మువ్వా సత్యనారాయణ. నటుడు రవి వర్మ మాట్లాడారు. -
బిగ్‌బాస్ ఫేమ్ హీరోగా 'రామ్ ఎన్ఆర్ఐ'.. ట్రైలర్ వచ్చేసింది!
బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా, సీతా నారాయణన్ జంటగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహిస్తున్నారు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.డైరెక్టర్ ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ.. ‘నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా థాంక్స్. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.సింగులూరి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. జూలై 26న మా చిత్రం రాబోతోంది. ఉయ్యాల జంపాల, శతమానంభవతి ఫ్లేవర్ నాకు కనిపించింది. మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నా’ అని అన్నారు. నిర్మాత మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నిర్మించాం. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. మా సినిమాను అందరూ ఆదరించండి’అని అన్నారు.నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో రిలేట్ అయ్యాను. పుట్టిన ఊరుకి ఏం చేశామని ఎంతో మంది అనుకుంటారు. అలాంటి పాయింట్‌ను తీసుకుని కథ చేయడం గొప్ప విషయం. ఈ కథ ఏ ఒక్కరికీ నచ్చినా ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అని అనిపించింది. ఇలాంటి మంచి చిత్రంలో కచ్చితంగా నటించాలని కోరుకున్నా. నిర్మాత మొవ్వా సత్యనారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అందరూ చూసి మా సినిమాను ఆదరించండి’ అని అన్నారు. -
బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా
తెలుగు బిగ్‌బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోతో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లో సెటిలైపోయిన వాళ్లు ఉన్నారు. అయితే మూడో సీజన్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచిన అలీ రెజా కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. గతంలో బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చిన తర్వాత ఓ ఛానెల్ తనపై నిషేధం విధించిందని చెబుతూ అప్పుడు జరిగిన వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?) 'బిగ్ బాస్ షోకి వెళ్లకముందు సీరియల్ చేస్తుండేవాడిని. షోకి వెళ్లొచ్చిన తర్వాత తిరిగి మళ్లీ సీరియల్లో చేరాలని అనుకున్నాను. కానీ బిగ్‌బాస్ స్టేజీపై ఉన్నప్పుడే 'వైల్డ్ డాగ్' మూవీలో రోల్ గురించి నాగార్జున సర్ చెప్పారు. దర్శకుడిని కలవడంతో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఫైట్ సీన్స్ కోసం రోజూ పొద్దునే ప్రాక్టీస్ ఉండేది. రెండు రోజులు రాకపోతే సినిమాలో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ముందు చెప్పారు. సరిగ్గా అదే టైంలో సీరియల్ వాళ్లు పిలిచి క్లోజ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అన్నారు. అప్పటికీ నేను వస్తానని, కాకపోతే టైమింగ్స్ బట్టి వస్తానని చెప్పాను' 'నేను వచ్చే విషయమై డిస్కషన్ జరుగుతుండగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్లి పరిస్థితి అంతా వివరించాను. ఆ తర్వాత ఓ రోజు 'వైల్డ్ డాగ్' షూటింగ్లో ఉన్నాను. అప్పుడు.. కౌన్సిల్లో మీటింగ్ ఉంది రావాలని ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇప్పుడు రాలేను, సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పాను. ఇది జరిగిన రెండు రోజులకు నాకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను బ్యాన్ చేసినట్లు, రెండేళ్లు ఎవరూ షూటింగ్స్, షోలకు పిలవొద్దు అని అందులో ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారనిపించింది' అని అలీ రెజా చెప్పుకొచ్చాడు. అలీ రెజాతో పాటు నటి పల్లవి గౌడని కూడా సదరు ఛానెల్ వాళ్లు పలు కారణాలతో నిషేధించారు. కానీ అలీ రెజా సినిమా నటుడిగా సెటిలైపోయాడు. పల్లవి గౌడ మాత్రం ప్రస్తుతం అదే ఛానెల్లో రీఎంట్రీ ఇచ్చి సీరియల్స్ చేసుకుంటోంది. (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ) -
బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తతో షాకయ్యా!
బాలీవుడ్లో ముఖ్బీర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన టాలీవుడ్ నటుడు అలీ రెజా. ఆ తర్వాత 'పసుపు కుంకుమ' సీరియల్‌తో బుల్లితెరపై కనిపించారు. 2014లో అమృతం చందమామలో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధృవ, మెట్రో కథలు, వైల్డ్ డాగ్, రంగమార్తాండ, గ్రే సినిమాల్లో నటించారు. అంతే కాకుండా 2019లో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్ని మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా అవికా గోర్ నటించిన వధువు వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ రెజా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. అలీ రెజా మాట్లాడుతూ.. 'నేను హోటల్లో ఉన్నప్పుడు మా పక్కనే మోడలింగ్ కంపెనీ ఉండేది. ఆ తర్వాత నాకు మోడలింగ్ వెళ్లమని కొందరు సలహా ఇచ్చారు. అలా నా జర్నీ మొదలైంది. నేను ఫేమస్ అవ్వడానికి 14 ఏళ్లు పట్టింది. నాకు పసుపు- కుంకుమ సీరియల్‌తో గుర్తింపు వచ్చింది. కానీ బిగ్‌బాస్ తర్వాతే ఎక్కువ ఫేమస్ అయ్యా. ఈ సీజన్లో ఎవరెవరు ఉన్నారో అని ఫస్ట్ ఎపిసోడ్ చూశా. ' అని అన్నారు. డబ్బు సంపాదించాలనే కోరిక సినిమాల్లోకి రావడంపై మాట్లాడుతూ.. ' నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంది. దీంతో పాటు యాక్టింగ్ చేయాలనే పిచ్చి కూడా ఉండేది. అందుకే హోటల్ వ్యాపారం నుంచి తప్పుకున్నా. అయితే కరోనా తర్వాత ఇండస్ట్రీలో మార్పులొచ్చాయి. కానీ మా నాన్నకు రెస్టారెంట్స్ ఉండటం వల్ల నాకు మేలు జరిగింది. అప్పుడే సొంతంగా బిజినెస్ చేద్దామనే ఆలోచన వచ్చింది. నాకు ఇందులో అనుభవం కూడా ఉంది. ఆర్థికంగా బలంగా ఉండాలని ఫిక్స్ అయ్యా. అందుకే రీసెంట్గా ముంబైలో రెండు రెస్టారెంట్స్ ప్రారంభించానని' తెలిపారు. డబ్బుకోసమే ఆ పాత్ర ఒప్పుకున్నా మెట్రో కథలు చిత్రం గురించి మాట్లాడుతూ.. 'చాలామంది మెట్రో కథల్లో చేసిన క్యారెక్టర్‌ను కొందరు బ్యాడ్‌గా రిసీవ్ చేసుకున్నారు. కానీ అందులో ఎక్కడా కూడా ఇంటీమసీ లేదు. అది మన ప్రస్తుత సమాజంలో జరుగుతున్నదే చూపించారు. నిజంగా నేను డబ్బుల కోసమే ఆ పాత్ర చేశా. కానీ అది ఒక మంచి మేసేజ్. చాలామంది యూట్యూబ్‌లో ఆ సీన్‌ను రాంగ్గా చూపించారు. సోషల్ మీడియాలో ఏం చేసినా నా కెరీర్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నేను వాటిని అసలు పట్టించుకోను. ప్రస్తుతం రిలీజైన వధువు వెబ్‌సిరీస్‌లో నందు అన్నతో చేయడం చాలా బాగా అనిపించింది. మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా బాగా పెరిగింది' అని అన్నారు. వరుణ్ తేజ్ పెళ్లిపై కామెంట్స్.. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలైంటెన్లో చేస్తున్నట్లు తెలిపారు. మరో కొన్ని ప్రాజెక్టులు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని అలీ రెజా వెల్లడించారు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి విన్నప్పుడు మాకు కూడా షాకింగ్‌గా అనిపించింది. అన్నతో పెళ్లికి ముందే కలిసి పనిచేశా.. సెట్స్‌లో కూడా ఎప్పుడు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదని అన్నారు. వరుణ్ అన్న మంచి వ్యక్తి.. ఆయనతో పని చేయడం సంతోషంగా అనిపించిందని తెలిపారు. పెళ్లి తర్వాత కూడా వరుణ్‌ను కలిశానని వెల్లడించారు. -
అనుమానాస్పదంగా ‘వధువు’
అవికా గోర్ ప్రధాన పాత్రలో, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కృష్ణ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 8 నుంచి హాట్‌స్టార్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఓ కుటుంబంలోని సభ్యులందరూ ఎందుకు అనుమానాస్పదంగా కనిపిస్తారు? అనే అంశం ‘వధువు’లో కొత్తగా ఉంటుంది. అవికా, నేను బెక్కెం వేణుగోపాల్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సిరీస్‌లో నా పాత్ర చాలా సెటిల్డ్‌గా ఉంటుంది’’ అన్నారు అలీ రెజా. ‘‘బెంగాలీ సిరీస్ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్ చేశాం. అయితే నేను సోల్‌ను మాత్రమే తీసుకున్నాను. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి 7వ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది’ అన్నారు దర్శకుడు పోలూరు కృష్ణ. -
Grey Movie Review: ‘గ్రే’ మూవీ రివ్యూ
టైటిల్: గ్రే నటీనటుటు: అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతేన్ తదితరులు నిర్మాణ సంస్థ: అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: వెంకట కిరణ్ కళ్లకూరి, హేమ మాధురి కాళ్లకూరి రచన- దర్శకుడు: రాజ్ మాదిరాజు సంగీతం: నాగరాజు తాళ్లూరి సినిమాటోగ్రఫీ: చేతన్ మధురాంతకం ఎడిటర్: సత్య గిడుతూరి విడుదల తేదీ: మే 26, 2023 ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మన భారతదేశానికి చెందిన అనేకమంది న్యూక్లియర్ సైంటిస్టులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి(ప్రతాప్ పోతెన్) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన నాయక్(అలీ రెజా) అనే పోలీసు ఆఫీసర్ మొదటి చూపులోనే సుదర్శన్ రెడ్డి భార్య(ఊర్వశి రాయ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా నాయక్ కి ఎట్రాక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సుదర్శన్ రెడ్డి మృతికి డాక్టర్ రఘు(అరవింద్) కారణమని తేలుతుంది. అయితే సుదర్శన్ రెడ్డిని డాక్టర్ రఘు ఎందుకు చంపాడు? ఇందులో సుదర్శన్ రెడ్డి భార్య పాత్ర ఏమిటి? చివరికి సుదర్శన్ రెడ్డి మరణానికి కారణమైన ఒక కీలకమైన వస్తువు ఏమైంది? పోలీసులు పంపకుండానే పోలీసులా వచ్చిన నాయక్ ఎవరు? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే సాధారణంగానే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక్తి వచ్చేస్తుంది. ఈ సినిమా కూడా కొంత ఆ జానర్ కి చెందిన సినిమానే. పబ్లిక్ లో పలుకుబడి ఉన్న ఒక బడా వ్యక్తి అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తే అతని కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ అతని భార్యతోనే ప్రేమలో పడటం, క్షణాల వ్యవధిలోనే వారిద్దరూ బెడ్ రూమ్ వరకు వెళ్లడం, శారీరకంగా ఒక్కటవ్వడం ఇలాంటి విషయాలన్నీ ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించవు. అయితే ఫస్ట్ అఫ్ పూర్తయి ఇంటర్వెల్ తర్వాత సినిమా మొదలయ్యాక ఒక్కొక్క విషయాన్ని చిక్కుముడిలా విడదీస్తున్నట్లు క్లారిటీ ఇచ్చుకుంటూ రావడం గమనార్హం. న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి సంబంధించిన రీసెర్చ్ చేసే సుదర్శన్ రెడ్డి అప్పటివరకు ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటూనే ఒక ప్రెస్ రిపోర్టర్ అయిన ఆరుషి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో పడిన తర్వాత తన రీసెర్చ్ అంతా పూర్తి చేసి ఆ రీసెర్చ్ కాపీ డెలివరీ ఇవ్వాల్సిన సమయంలో మరణిస్తాడు. అయితే అతని మరణానికి కారణం ఆరుషినా? ఆరుషితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రఘు అనే డాక్టరా? లేక సుదర్శన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ లేదా ఐఎస్ఐ ఏజెంట్లా అనే విషయాలను తెరమీద ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ విషయాలన్నీ సినిమా తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. కథగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ కథనం చప్పగా సాగడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని రొమాంటిక్ సీన్లు, డైలాగులు బాగా పేలుతాయి. కొద్ది రోజుల్లో అవి మీమ్స్ ద్వారా పాపులర్ అవుతాయి అనడంలో కూడా సందేహం లేదు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లు ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ స్లో నేరేషన్, ఏమాత్రం లాజిక్ లేని కొన్ని సీన్స్ ఇబ్బందిగా మారుతాయి. ఎవరు ఎలా చేశారంటే డాక్టర్ పాత్రలో అరవింద్, న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి పాత్రలో ప్రతాప్ పొథెన్ బాగా సూట్ అయ్యారు. అయితే వారి పాత్రలకు ఏ మాత్రం ఎమోషన్స్ సెట్ అవ్వలేదు. ఎప్పటిలాగే అలీ రెజా తనకి అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక హీరోయిన్ ఊర్వశిరాయ్ తన గ్లామర్ తో అందరినీ డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక మిగతా పాత్రలలో కనిపించిన వారు కూడా తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక బృందం విషయానికి వస్తే సంగీత దర్శకుడు నాగరాజు తాళ్లూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. పాటలు మాత్రం అంత క్యాచీగా లేవు కానీ సినిమా కథకు తగ్గట్టు సెట్ అయ్యాయి. చేతన్ మధురాంతకం అందించిన సినిమాటోగ్రఫీ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే కలర్ సినిమాలకు అలవాటు పడిన అందరికీ తన కెమెరా పనితనంతో గ్రే ఎఫెక్ట్ లో చూపించాడు. ఇక ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమా నిర్మాణ విలువలు అయితే సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ అయ్యాయి. రేటింగ్: 2.5 -
బ్లాక్ అండ్ వైట్ స్పై థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న 'గ్రే'
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'గ్రే: ద స్పై హూ లవ్డ్ మి'. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీని అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మించగా.. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26న విడుదల కానుంది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. 'ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్. అందులో నుంచి పుట్టిన ఐడియానే ఈ గ్రే మూవీ. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా' అని అన్నారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) మా ‘గ్రే’ చిత్రం 2022లో పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైంది. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిలిం ఫెస్టివల్ 2022 లో విన్నర్‌గా నిలిచింది. 2022 ఆసియన్ ఫిలిం ఫెస్టివల్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు గ్రే చిత్రాన్ని కొనియాడారు. -
అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్
సినీ నటి సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు ఆరు వందల సినిమాలు చేసిన ఆమె పూర్తి పేరు సనా బేగమ్. పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్‌గా, తల్లిగా డిసెంట్ రోల్స్ చేసి ఆడియన్స్ మెప్పించింది. ఇటీవలే రిలీజైన రంగమార్తాండ చిత్రంలోనూ విభిన్న పాత్ర పోషించింది. ఇక ఈ పాత్రల గురించి పక్కన పెడితే ఇంతకాలం సంప్రదాయ పాత్రలు చేసిన ఆమె రీసెంట్గా నటించిన మెట్రోల కథలు వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్లో కనిపించి షాకిచ్చింది. ఈ సిరీస్‌లో అప్పటికే పెళ్లై భర్త ఉన్న ఆమె మరో వ్యక్తితో బెడ్ షేర్ చేసుకుంటుంది. చదవండి: తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్ అయితే తాజాగా తన బోల్డ్ రోల్‌పై సనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు చెప్పడంతో నేను ఆ రోల్ చేశాను. తాగుబోతు భర్త వల్ల ఓ మిడిల్ క్లాస్ మహిళ పడే ఇబ్బందులు, కష్టాలను ఈ ‘మెట్రో కథలు’ సిరీస్‌లో చూపించారు. నా పాత్రతో చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ముఖ్యంగా ఆ వయసు మహిళలకు నా పాత్ర బాగా చేరుతుంది. ఎందుకంటే భార్యని పట్టించుకోని తాగుబోతూ భర్త వల్ల కోరికలను చంపుకుని బతుకుతారు కొందరు మహిళలు. కానీ ఆలాంటి మహిళల గురించి బయట సమాజం ఎలా మాట్లాడుకుంటుంది, భర్త చేసిన తప్పుకు ఆమెను ఎలా ట్రీట్ చేస్తుందో చూపించారు. ప్రస్తుతం బయటకు జరుగుతున్నదే సిరీస్‌లో చూపించారు. ఆ పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. మంచి మెసేజ్ ఉన్న సిరీస్, అలాగే మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా. అందుకే నేను కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నా. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు. చదవండి: చరణ్ బర్త్‌డే పార్టీలో కనిపించని తారక్.. ఎందుకు రాలేదు? అనుకోకుండా ఓ వీక్ మూమెంట్లో ఆ తప్పు జరిగిపోతుంది. ఆ తప్పు తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకుంది. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఇందులోని ఓ ఎపిసోడ్లో భర్తవల్ల చాలా ఇబ్బందిపడే గృహిణి పాత్రలో సనా నటించింది. తన తాగుబోతూ భర్తకు యాక్సెండ్ చేసిన వ్యక్తితో ఓ వీక్ మూమెంట్లో దగ్గరవుతుంది. ఆ వ్యక్తి పాత్రలో బిగ్‌బాస్ ఫేం అలీ రేజా నటించాడు. ఆలీ రేజాతో ఇంటిమేట్ సీన్ చేసిన సనా వార్తల్లో నిలిచింది. -
ఇరాన్లో మాజీ అధికారికి ఉరి
దుబాయ్: బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి. -
ప్రజ్ఞానంద సంచలనం
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అమెరికా), జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్), లియెమ్ లీ (వియత్నాం), హాన్స్ నీమెన్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. -
అలీ రెజా నటించిన 'గ్రే' మూవీ ట్రైలర్ చూశారా?
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రల్లో రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గ్రే’. ‘ద స్పై హూ లవ్డ్ మీ’ అనేది ట్యాగ్‌లైన్. కిరణ్ కాళ్లకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ టోర్నీలో రిలీజ్ చేశారు. ‘‘దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం ‘గ్రే’’ అన్నారు రాజ్ మదిరాజు. ‘‘నాకు యాక్టింగ్, బాస్కెట్‌బాల్ అంటే ఇష్టం. ఈ లీగ్‌లో నేను హైదరాబాద్ తరఫున పోటీ చేస్తున్నా. త్వరలో బాస్కెట్‌బాల్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తా’’ అన్నారు అరవింద్ కృష్ణ. ‘‘మా సినిమా రష్ చూసినవారు మధుబాబు ‘షాడో’ నవలలా అద్భుతంగా ఉందని అభినందించారు’’ అన్నారు కిరణ్. -
బిగ్‌బాస్ తర్వాత నన్ను రెండేళ్లు బ్యాన్ చేశారు: అలీ రెజా
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. అప్పటివరకు సీరియల్స్‌లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ సీజన్-3తో సంపాదించుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో తనదైన స్టైల్లో ఆడి ప్రేక్షకుల్ని మెప్పించిన అలీ బిగ్‌బాస్ అనంతరం బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అలీ తెరపై కనిపించకుండా ఉండటం వెనకున్న బలమైన కారణాన్ని బయటపెట్టాడు. ఈ మధ్య టీవీల్లో కనిపించడం లేదేంటి అని హోస్ట్ అడగ్గా.. తనను బ్యాన్ చేశారని చెప్పి షాకిచ్చాడు. అప్పట్లో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఆ టైంలో చిన్న మిస్టేక్ చేశా. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి రావాలని ఫోన్ చేశారు. నేను వెళ్లేసరకి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అన్నారు. ఆ మాట విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజా లేటెస్ట్ మూవీ
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ముఖ్య తారలుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి నిర్మించిన చిత్రం ‘గ్రే’. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం మన దేశంలో రెండేళ్ల వ్యవధిలో 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనబడకుండా పోయారు. గతంలోనూ ఇలా జరిగింది. ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వల పన్ని చేసిన ఆపరేషన్స్‌లో భాగంగానే అలా జరిగాయి. అందులో నుంచి పుట్టిన ఐడియానే ‘గ్రే’. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది’’అన్నారు. ‘‘రెండు గంటలు హ్యాపీగా చూసే చిత్రమిది’’ అన్నారు కిరణ్ కాళ్లకూరి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రాజేష్ తోరేటి, రాజా వశిష్ట, శ్రీదేవి కాళ్లకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వర్ చదలవాడ. -
స్పై థ్రిల్లర్‌గా గ్రే మూవీ, ఆలోచనలకు అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్..
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ.. ‘ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అవన్ని. అందులో నుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ..మనం సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు కలర్స్ మధ్యలో కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే గ్రే..ఒక స్పై డ్రామా. అరవింద్ కృష్ణతో రెండు సినిమాలు చేశాను. మళ్లీ అతనితో కలిసి చేయడం హ్యాపీ. ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేశారు. అలీ రెజాని బిగ్‌బాస్ తర్వాత కలిశాను. చాలా మంచి నటుడు. వీరిద్దరితో పాటు ప్రతాప్ పోతన్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఒక రకంగా సూత్రధారి క్యారెక్టర్. ఊర్వశీ రాయ్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆమెది లీడింగ్ లేడీ క్యారెక్టర్. సినిమా ఫస్ట్ కాపీ చూశాం. చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరికీ నచ్చింది. ఆడియన్స్ కి కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్ చేయడం జరిగింది’ అన్నారు. ఈ సినిమాలో ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్, రాజ్ మదిరాజు, షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు. -
యాంకర్ రవి సహా బిగ్‌బాస్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఇవే..
Bigg Boss Telugu shocking Eliminations: బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ మాత్రం యాంకర్ రవిదే అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రవి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు రవికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్స్లతో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్‌ను ఏంటో ఓసారి చూద్దాం. సీజన్-1 బిగ్‌బాస్ సీజన్-1లో నటుడు ప్రిన్సీ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న ప్రిన్సీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సీజన్-2 బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్ శ్యామల బిగ్‌బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్ కావడం షాకింగ్‌గా అనిపించింది. దీంతో ఇది అన్‌ఫెయిర్ అంటూ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేసి రీఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి పంపించారు. సీజన్-3 అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్‌బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యాడు. అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీజన్-4 బిగ్‌బాస్ సీజన్-4లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ కంటతడి పెట్టించింది. హౌస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న దేవీ మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్‌కి గురిచేసింది. దీంతో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-5 బిగ్‌బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎంట్రీ నుంచే ఆయన టాప్-5అని అంతా భావించారు. సెపరేట్ ఫ్యాన్ బేస్, ఆటతీరుతో వాడే స్ట్రాటజీస్‌తో మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్‌ను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మోస్ట్ డిసర్వింగ్ కంటెస్టెంట్‌ను బయటకు పంపించారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్ Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా? -
తండ్రి అయిన అలీ రెజా, దేవత జన్మించిందంటూ పోస్ట్
Ali Reza- Masuma Wecome Baby Girl: బుల్లితెర నటుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజా తండ్రయ్యాడు. ఆయన సతీమణి మసుమ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు అలీ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. 'అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని రాసుకొచ్చాడు. మరో పోస్ట్‌లో కూతురును ఎద్దుకుని ముద్దాడిన ఫొటోలు షేర్ చేశాడు. కానీ ఆ ఫొటోల్లో పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఈ శుభవార్త తెలిసిన సెలబ్రిటీలు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు అలీ రెజాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తెలుగు సిరీయల్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేసిన అలీ ఆ మధ్య నాగార్జునతో వైల్డ్ డాగ్ అనే సినిమా కూడా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) -
రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ చాలామందికి ఫేమ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా బిగ్‌బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అదే స్థాయిలో కొందరి పాపులారిటీ అమాంతం తగ్గిపోతుంది. షోలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొందరు డీఫేమ్తో బయటకు రావడం చూస్తుంటాం. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో అందరి కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. అయితే ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిపై నెగిటివిటి సైతం పెరిగిపోయింది. మొన్నటికి మొన్న శ్వేత సైతం రవికి దూరంగా ఉండాలంటూ హౌస్ మేట్స్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం సహా ఇతరులపై నిందలు వేస్తాడంటూ రవిని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దీనిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రవి స్నేహితుడు అలీ రెజా స్పందించాడు. షోకు వెళ్లేముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసని అలీ పేర్కొన్నాడు. ఎవరితోనైనా గొడవలు వస్తే అది పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడని, అయితే కొందరు అపార్థం చేసుకుంటున్నారన్నాడు. రవి తనకు వ్యక్తిగతంలో తెలుసని, కాబట్టి షో చూసి జడ్జ్ చేయనని రవికి కితాబిచ్చాడు. ఇక మరో కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్లా కనిపించినా తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, బయట కూడా అతను అలాగే ఉంటాడని చెప్పుకొచ్చాడు. -
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ సినిమా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ `గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్‌లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి.ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం`అన్నారు. `రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను`అన్నారు ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ..`ఈ సినిమా కోసం రాజు, రమేష్చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్‌పుట్ ఇవ్వడం కష్టం. గ్రే మంచి సినిమా అవుతుందని నమ్ము తున్నాను. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ`అన్నారు. -
వైభవంగా అలీ రెజా సతీమణి సీమంతం వేడుక
బుల్లితెర నటుడు అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న అలీ ఫిజికల్ టాస్కుల్లో మిగతావారికి గట్టిపోటీనిస్తూ తనేంటో నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏకంగా నాగార్జునతో కలిసి 'వైల్డ్‌డాగ్' సినిమాలోనూ నటించాడు. కాగా ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసుమ్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్ కపుల్‌గా అభివర్ణిస్తున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే! -
దుమ్మురేపుతున్న రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చాస్ కా గణేశ్’ పాట
సాక్షి, వెబ్‌డెస్క్: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్ కా గణేశ్’ పాటకు రాహుల్ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అయితే ఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్ చేశారు. శిరీశ్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. -
తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో అలీ భార్య బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గా రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో మూవీలో చేస్తున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) -
సోషల్ హల్చల్ : అనన్య ఆట.. అలీరెజా తిప్పలు
మల్లెశం మెమోరీస్ అంటూ.. గచ్చకాయలు ఆడుతున్న వీడియోని పంచుకుంది హీరోయిన్ అనన్య నాగళ్ల అప్పుడప్పుడు గిల్లు కోవడం అంటూ.. బుల్లితెర నటి, యాంకర్ సమీర చిందులేస్తుంది చాటుగా స్నాక్స్ తినేసిన అలీ రేజా.. అవే స్నాక్స్‌ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో కక్కలేక మింగలేక అవస్థపడ్డాడు బ్యాడ్ సెల్ఫీ అంటూ సిమ్రాత్ కౌర్ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. తుమ్మడం కరోనా లక్షణం అని కుక్క పిల్లకు కూడా తెలిపోనట్లుందంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది బిగ్‌బాస్ ఫేమ్ హిమజ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) \ View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
Ali Reza: 'గుండెల్లో దమ్ము' సినిమాతో రచ్చ..
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తన కోపం తన పతనానికి కారణమవుతుందని తెలుసుకున్న అలీ దాన్ని అదుపులో పెట్టుకుంటూ ఫినాలేకు చేరుకున్నాడు. టాప్ 5లో చోటు దక్కించుకున్న అలీ ట్రోఫీ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నిన్న(మే 24న) అలీ రెజా బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్' అంటూ G.D (G ఫర్ గుండె, D ఫర్ దమ్ము) సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈడు ఎవని అయ్యకి వినడు, దోస్తులకు తప్ప అని రాసుకొచ్చాడు. అయితే తన ప్రయాణంలో ఏం జరగబోతుందనేది ఖాజా భాయ్‌కు కూడా తెలీదు అని పేర్కొన్నాడు. గుండెల్లో దమ్మున్న దోస్తులు అందరికోసం ఈ ఫస్ట్ లుక్ అని తెలిపాడు. పోస్టర్లో అలీ రకరకాల సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా చేస్తున్నందుకు కంగ్రాట్స్ చెప్తూన్ ఫ్యాన్స్ అలీ రెజాకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) చదవండి: అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే? -
'బిగ్‌బాస్ తర్వాత అందుకే మాకు ఛాన్సులు రాలేదు'
బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత కంటెస్టెంట్లకు అప్పటి వరకు రాని గుర్తింపు వస్తుంది. కొందరికి ఏకంగా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ కూడా వస్తుంది. అయితే చాలామందికి ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవట్లేదు. షో నుంచి బయటకు రాగానే చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేక ఇబ్బందులు పడిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. బిగ్‌బాస్ తర్వాత వచ్చే క్రేజ్ వాళ్ల కెరీర్‌కు మాత్రం ఉపయోగపడటం లేదు. తాజాగా ఇదే విషయంపై సీజన్-3 ఫైనలిస్ట్ అలీ రెజా స్పందించారు. 'మేం షో నుంచి బయటకు వచ్చాక దాదాపు అందరికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మాకు హైప్ ఉన్న ఆ నాలుగు నెలల్లోనే కరోనా వచ్చింది. లాక్డౌన్ మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసింది. దీంతో బయటకు వెళ్లి ఏదైనా చేసుకునే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వెంటనే సీజన్ 4 కూడా వచ్చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. బిగ్‌బాస్ షోలో అర్జున్ రెడ్డిలా గుర్తింపు పొందిన అలా రెజా ఫైనలిస్ట్‌గా మిగిలాడు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లోనూ కనిపించాడు. రీసెంట్గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలోనూ నటించాడు. నిజానికి బిగ్‌బాస్ సీజన్-3తో పోలిస్తే ఆ తర్వాత పాల్గొన్న కంటెస్టెంట్లు వర్క్ పరంగా బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖిల్, సోహైల్ తాము చేస్తున్న సినిమాలను ప్రకటించి దూకుడు పెంచారు. ఇక యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చిన లాస్య సైతం బిగ్‌బాస్ తర్వాత బిజీ అయ్యింది. చదవండి : 'షో వల్ల కెరీర్ నాశనమైంది.. అదే నేను చేసిన తప్పు' ‘బిగ్‌బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ