ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ముఖ్య తారలుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి నిర్మించిన చిత్రం ‘గ్రే’. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం మన దేశంలో రెండేళ్ల వ్యవధిలో 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనబడకుండా పోయారు. గతంలోనూ ఇలా జరిగింది. ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వల పన్ని చేసిన ఆపరేషన్స్‌లో భాగంగానే అలా జరిగాయి.
అందులో నుంచి పుట్టిన ఐడియానే ‘గ్రే’. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది’’అన్నారు. ‘‘రెండు గంటలు హ్యాపీగా చూసే చిత్రమిది’’ అన్నారు కిరణ్ కాళ్లకూరి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రాజేష్ తోరేటి, రాజా వశిష్ట, శ్రీదేవి కాళ్లకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వర్ చదలవాడ.
Comments
Please login to add a commentAdd a comment