బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా | Bigg Boss 3 Fame Ali Reza Comments On Zee Telugu Banned Him | Sakshi
Sakshi News home page

Ali Reza: రెండేళ్ల పాటు నిషేధం.. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు

Mar 1 2024 12:03 PM | Updated on Mar 1 2024 12:12 PM

 Bigg Boss 3 Fame Ali Reza Comments On Zee Telugu Banned Him   - Sakshi

తెలుగు బిగ్‌బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోతో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లో సెటిలైపోయిన వాళ్లు ఉన్నారు. అయితే మూడో సీజన్‌లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచిన అలీ రెజా కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. గతంలో బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చిన తర్వాత ఓ ఛానెల్ తనపై నిషేధం విధించిందని చెబుతూ అప్పుడు జరిగిన వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: 'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?)

'బిగ్ బాస్ షోకి వెళ్లకముందు సీరియల్ చేస్తుండేవాడిని. షోకి వెళ్లొచ్చిన తర్వాత తిరిగి మళ్లీ సీరియల్‌లో చేరాలని అనుకున్నాను. కానీ బిగ్‌బాస్ స్టేజీపై ఉన్నప్పుడే 'వైల్డ్ డాగ్' మూవీలో రోల్ గురించి నాగార్జున సర్ చెప్పారు. దర్శకుడిని కలవడంతో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఫైట్ సీన్స్ కోసం రోజూ పొద్దునే ప్రాక్టీస్ ఉండేది. రెండు రోజులు రాకపోతే సినిమాలో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ముందు చెప్పారు. సరిగ్గా అదే టైంలో సీరియల్ వాళ్లు పిలిచి క్లోజ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అన్నారు. అప్పటికీ నేను వస్తానని, కాకపోతే టైమింగ్స్ బట్టి వస్తానని చెప్పాను'

'నేను వచ్చే విషయమై డిస్కషన్ జరుగుతుండగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్లి పరిస్థితి అంతా వివరించాను. ఆ తర్వాత ఓ రోజు 'వైల్డ్ డాగ్' షూటింగ్‌లో ఉన్నాను. అప్పుడు.. కౌన్సిల్‌లో మీటింగ్ ఉంది రావాలని ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇప్పుడు రాలేను, సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పాను. ఇది జరిగిన రెండు రోజులకు నాకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను బ్యాన్ చేసినట్లు, రెండేళ్లు ఎవరూ షూటింగ్స్, షోలకు పిలవొద్దు అని అందులో ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారనిపించింది' అని అలీ రెజా చెప్పుకొచ్చాడు.

అలీ రెజాతో పాటు నటి పల్లవి గౌడని కూడా సదరు ఛానెల్ వాళ్లు పలు కారణాలతో నిషేధించారు. కానీ అలీ రెజా సినిమా నటుడిగా సెటిలైపోయాడు. పల్లవి గౌడ మాత్రం ప్రస్తుతం అదే ఛానెల్‌లో రీఎంట్రీ ఇచ్చి సీరియల్స్ చేసుకుంటోంది.

(ఇదీ చదవండి: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement