
యాంకర్ శిల్పా చక్రవర్తి.. ఈ పేరు ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు గానీ 2000 ప్రారంభంలో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఒకానొక టైంలో సుమకు పోటీ అన్నట్లు నిలిచింది. మధ్యలో కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా కొన్నాళ్లు స్క్రీన్ కి దూరమైంది. రీఎంట్రీలో బిగ్ బాస్ షోలో పాల్గొంది. పలు షోలు కూడా చేసింది.
(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)
సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే శిల్పా చక్రవర్తి ప్రస్తుతం ఏం చేస్తుంది? ఎక్కడుంది? లాంటి విషయాల్ని తనే స్వయంగా బయటపెట్టింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది..
'పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీతో ఉందామని సీరియల్స్, యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాను. రీఎంట్రీ అనుకున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆ షోలో పాల్గొన్నాను. తర్వాత లైఫ్ మారింది. కానీ షోకి వెళ్లొచ్చిన తర్వాత నన్ను చాలా ట్రోల్ చేశారు. నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. కౌంటర్స్ ఇస్తే బూతులు తిట్టేవాళ్లు. ఇవన్నీ మా ఆయకు చెబితే ఆ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని అన్నారు'
(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)

'మరీ దారుణంగా ట్రోల్ చేయడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాదాపు నాలుగు నెలల పట్టింది ఆ బాధ నుంచి బయటకు రావడానికి. సరిగ్గా అదే టైంకి కరోనా వచ్చింది. మా ఆయన బిజినెస్ ఆగిపోయింది. డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది. కరోనా టైంలో సరైన చికిత్స అందక కోమాలోకి వెళ్లిన నాన్న చనిపోయారు. కరోనా తర్వాత ఆఫర్స్ వచ్చినా ఆసక్తి రాలేదు. సరే చేద్దాం అనుకునేలోపు అమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారు' అని శిల్పా చక్రవర్తి చెప్పుకొచ్చింది.
ఇలా రకరకాల కారణాలతో ఇన్నాళ్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు షోలు, సీరియల్స్ చేస్తున్నానని శిల్ప చెప్పింది. బిగ్ బాస్ 3వ సీజన్ లో ఈమె పాల్గొంది కానీ కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. అప్పటినుంచి అంటే దాదాపుగా ఏడేళ్లుగా ఏదో ఒకలా బాధపడుతున్నానని ఇప్పుడు వీడియో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!)
Comments
Please login to add a commentAdd a comment