Rahul Sipligunj About Punarnavi Bhupalam - Sakshi
Sakshi News home page

Rahul Sipligunj: పునర్నవి తన లైఫ్‌లో తను బిజీగా ఉంది, అషూ ఎంత మంచిదంటే..

Published Wed, Apr 5 2023 5:32 PM | Last Updated on Wed, Apr 5 2023 6:03 PM

Rahul Sipligunj About Punarnavi Bhupalam - Sakshi

ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్‌బాస్‌ తర్వాత ఎన్నో హిట్‌ పాటలు పాడా. బిజినెస్‌ మొదలుపెట్టా. తన కెరీర్‌లో తను బిజీగా ఉంది

బిగ్‌బాస్‌ షోతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పునర్నవి భూపాలం. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పున్ను ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా వర్కవుట్‌ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో అడుగుపెట్టిందో అప్పుడే యూత్‌ క్రష్‌గా మారిపోయింది. ఈ రియాలిటీ షోలో పునర్నవి- రాహుల్‌ సిప్లిగంజ్‌ లవ్‌ ట్రాక్‌ బాగా క్లిక్కయింది. కానీ బయటకు వచ్చాక మాత్రం ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. 


పునర్నవితో రాహుల్‌

ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పునర్నవి గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పున్నూ ఘాటుగా స్పందిస్తూ పిచ్చిరాతలు రాయకండి. నేను ప్రెగ్నెంట్‌ ఏంటి? అని సీరియస్‌గానే కౌంటరిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.


అషూ రెడ్డితో రాహుల్‌

ఈ విషయంపై రాహుల్‌ మాట్లాడుతూ.. 'ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్‌బాస్‌ తర్వాత ఎన్నో హిట్‌ పాటలు పాడా. బిజినెస్‌ మొదలుపెట్టా. తన కెరీర్‌లో తను బిజీగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటామంతే! అషూ విషయానికి వస్తే తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తను ఎంత మంచిదంటే.. చుట్టూ ఉన్న ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement