రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. బ్రేకప్‌కు కారణమిదే! | Bigg Boss 7 Telugu: Rathika Rose Breakup With Rahul Sipligunj - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: రతిక గుండెలో ఇంత బాధ మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్‌..

Published Fri, Sep 8 2023 10:05 AM | Last Updated on Fri, Sep 8 2023 10:28 AM

Bigg Boss 7 Telugu: Rathika Rose Breakup With Rahul Sipligunj - Sakshi

రతిక రోస్‌.. హౌస్‌లో చలాకీగా కనిపిస్తున్న ఈ బ్యూటీ గుండెలో ఎంతో బాధను మోస్తోందని నిన్నటి ఎపిసోడ్‌ చూస్తేనే అర్థమైపోతుంది. సీజన్‌ మొదలైన తొలిరోజే తన బ్రేకప్‌ గురించి ఆరా తీశాడు నాగ్‌. హార్ట్‌ బ్రేక్‌ నుంచి బయటకు వచ్చావా? అని అడిగితే హా అంటూ నవ్వుతూనే 'చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగుతున్నారో?' అని నాగ్‌నే నిలదీసింది. మధ్యలో నేనేం చేశానని నాగ్‌ అంటే.. 'మొత్తం మీరే చేశారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు హార్ట్‌ బ్రేక్‌ అయింది కదా, ఎలా ఉందని అడుగుతున్నారు' అంది.

అప్పుడు పునర్నవి కోసం.. ఇప్పుడు రతిక కోసం..
సరే, నేనేం చేశానో చెప్పు అని అడిగితే మాత్రం హౌస్‌లోకి వెళ్లాక తెలుస్తుందని మాట దాటవేసింది రతిక రోస్‌. సరే, నీ హార్ట్‌ బ్రేక్‌ చేసినవాడిని ఇమిటేట్‌ చేయు అని అడిగితే.. ఇప్పుడు పాట పాడాలా? అన్నది. అంటే తన మనసు ముక్కలు చేసిన వ్యక్తి సింగర్‌ అని అర్థమైంది. నిన్నటి ప్రోమో, ఎపిసోడ్‌తో ఆ సింగర్‌ మరెవరో కాదు రాహుల్‌ సిప్లిగంజ్‌ అని తేలిపోయింది. పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నూమూయు వేళా.. అనే పాటను ప్రోమోలో వదిలి హింటిచ్చాడు బిగ్‌బాస్‌.

అప్పుడే పరిచయం, ప్రేమ
అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ఈ పాట పాడాడు రాహుల్‌. ఇప్పుడు రతిక కోసం మరోసారి ఈ పాట ప్లే చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఈ సాంగే వేయలేదు. అయితే రాహుల్‌-రతికల రిలేషన్‌ నిజమేనంటూ సోషల్‌ మీడియాలో బోలెడన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రాహుల్‌ గతంలో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేసేవాడు. హే పిల్ల ఆల్బమ్‌ షూటింగ్‌ సమయంలో రాహుల్‌, రతికల మధ్య పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ షో వల్లే బ్రేకప్‌
అయితే రాహుల్‌.. బిగ్‌బాస్‌కు వెళ్లాక పునర్నవితో లవ్‌ ట్రాక్‌ నడపడంతో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చినట్లు కనిపిస్తోంది. చివరకు వీళ్ల బంధం బ్రేకప్‌తో ముగిసిందట! బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో రాహుల్‌- పునర్నవిల మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తున్నట్లు చెప్పింది నాగార్జునే! పదేపదే వీరి మధ్య ఏదో ఉందన్నట్లుగా కామెంట్లు చేశాడు. అందుకే ఈ సీజన్‌ ప్రీమియర్‌ ఎపిసోడ్‌లో చేసిందంతా చేసి ఇప్పుడిలా అడుగుతున్నారా? అని ముఖం మీదే అనేసింది.

చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్‌ గురించి తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement